బ్రిటీష్ హయాంలో నాటి ప్రధానిగా ఉన్న సర్ విన్ స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో మాట్లాడు తూ, “భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వకూడదు, ఒక వేళ ఇస్తే, అధికారం, జులాయిలు, పోకిరీలు, ఇతరుల పై ఆధారపడి బతికేవాళ్లకు దక్కుతుంది” అనిచెప్పడమేగాక, “తక్కువ సమర్థత కలిగిన గడ్డిపోచల్లాంటి వాళ్లు, అధికారం దక్కించుకోవడం కోసం తియ్యటిమాటలు చెబుతూ, వెర్రి హృదయాలతో ప్రవర్తిస్తారని, అలాంటివారివల్ల దేశం ముక్కలుముక్కలుగా విడిపోతుంది” అని చెప్పడం జరిగిందని, ఆయన మాటలు చదివాక, చర్చిల్ కి ఎంత జా-త్యా-హాం-కా-ర-మ-ని తాను ఆవేశపడ్డానని టీడీపీనేత, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మరో ఎమ్మెల్సీ సత్యనారాయణరాజుతో కలిసి మంగళగిరిలోనిపార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నేడున్న పరిస్థితులు, నాయకుల పాలన చూస్తుంటే వందేళ్ల క్రితం విన్ స్టన్ చర్చిల్ చెప్పింది నిజమేననే అభిప్రాయం తనకు కలుగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అ-త్యా-చా-రం చేస్తున్నారని, ఇటువంటి దా-రు-ణ పరిస్థితుల్లో ప్రజలంతా మేల్కొని, కలిసికట్టుగా పోరాడాలని దీపక్ రెడ్డి పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న దా-రు-ణా-ల-కు సంబంధించి, ఎన్నికల సంఘానికి లెక్కకు మిక్కిలి ఫిర్యాదులు చేశామని, అయినా కూడా ఈసీ నుంచి స్పందనలేదన్నారు. నామినేషన్ల వ్యవహారంలో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోలను తాను ప్రజలముందుంచుతున్నానని ఎమ్మెల్సీ చెప్పారు.

10వ తేదీన, రేపల్లెలో 11న శ్రీకాళహస్తిలో, మరోచోట టీడీపీఅభ్యర్థుల ఇళ్లల్లో మందుసీసా లుపెట్టి, వారిపై తప్పుడు కేసలు పెట్టడం జరిగిందన్నారు. నిన్నటికి నిన్న తెనాలిలోకూడా టీడీపీ అభ్యర్థి ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద మద్యంసీసాల కేసుని పెట్టడం జరిగిందన్నారు. వారింట్లో ఉన్నసీసీకెమెరాలో ఈదృశ్యాలన్నీ నమోదయ్యాయని, ముఖాని కి బట్ట కట్టుకొని, గోడదూకి మరీ ఆఇంటిలోకి వెళ్లి, వైసీపీకి చెందిన వ్యక్తి ఆ పనికి పాల్పడ్డాడని దీపక్ రెడ్డి తెలిపారు. వైసీపీవారే మందుసీసాలు పెట్టి, పోలీసులకు ఫిర్యాదుచేశారని, దాంతోపోలీసులు నేరుగా వచ్చి, ఇంట్లో మందుసీసాలున్న ప్రాంతానికే వెళ్లారన్నారు. పుంగనూరులో ఎస్టీమహిళను నామినేషన్ వేయకుండా దా-డి చేశారని, ఆమె బురఖా ధరించి వెళ్లినాకూడా అడ్డుకొని, సదరుమహిళతోపాటు, ఆమె భర్తపై కూడా దా-డి-కి పాల్పడ్డారని, 20 మంది వ్యక్తులు మూకుమ్మడిగా దా-డి చేసి, భార్యను ఒకచోట, భర్తను ఒకచోట ఉంచి దు-ర్భా-ష-లా-డు-తూ, ఈ-డ్చు-కుం-టూ, కాళ్లతో తన్నడం జరిగిందని దీపక్ రెడ్డి వివరించారు. (భార్యాభర్తలు మాట్లాడిన వీడియోను ఈసందర్భంగా ఆయన విలేకరులకు ప్రదర్శించారు)

రాయచోటిలో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి నామినేషన్లు లాక్కొని చించేశారన్నా రు. నేడు చిత్తూరుజిల్లా పుంగనూరులో నామినేషన్ వేయడానికి వెళుతున్న మహిళను అడ్డుకొని ఆమె పై వైసీపీ కార్యకర్తలు దా-డి-కి పాల్పడ్డారన్నారు. ఆ నియోజకవర్గంలో జరిగిన దా-రు-ణా-ల గురించి ఈసీకి కొన్ని వందల ఫిర్యాదులిచ్చామని, తానే అనేక సార్లు విలేకరుల సమావేశాలు నిర్వహించి, ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న వాటిని ఆధారాలతో సహా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పారు. ఈ విధంగా వరుస సఘంటనలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అ-త్యా-చా-రా-ని-కి గురవుతుంటే, స్పందించాల్సిన ఎన్నికల సంఘం చోద్యం చూస్తోందన్నారు. స్థానిక ఎన్నికలు పెట్టాలనుకున్న ప్రభుత్వం, దానికి రెండు నెలల ముందే రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో టీడీపీవారి ఓట్లను తొలగించిందని, కొన్నిచోట్ల డీలిమిటేషన్ పేరుతో గ్రామాలు, వార్డులను మార్చడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లకు అవసరమైన ధృవీకరణ పత్రాలు అందకుండా అధికారులను బె-ది-రిం-చ-డం వంటివి జరిగాయన్నారు. ఈ విధంగా జరిగిన దా-రు-ణా-ల-కు సంబంధించి 189 ఫిర్యాదులను ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళితే, వాటన్నింటిపై చర్యలు తీసుకునే సమయం తమకు లేదంటూ, హాస్యాస్పదంగా మాట్లాడడన్నారు.

ప్రతిపక్షం ఇచ్చే ఫిర్యాదులన్నింటి పై చర్యలు తీసుకునే సమయం తమకు ఉండదన్న ఎన్నికల కమిషనర్, స్థానిక రిటర్నింగ్ అధికారులు తమదృష్టికి తీసుకొచ్చిన అంశాలపైనే స్పందిస్తామని చెప్పడం జరిగిందన్నారు. సంఘటనలపై చర్యలు తీసుకోవడానికి సమయం లేనప్పడు ఎన్నికలు వాయిదా వేయడంగానీ, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడం గానీ చేయకుండా, రాష్ట్ర ఎన్నికలప్రధానాధికారి ఏ విధంగా ముందుకెళుతున్నాడో సమాధానం చెప్పాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం అ-త్యా-చా-రా-ని-కి గురయ్యేలా, తన విధులు తాను సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు, రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే తప్పుకొని, కేంద్రఎన్నికల సంఘానికి రాష్ట్రంలో జరుగుతున్న అంశాలన్నింటినీ తెలియచేయాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల క్రతువుకు సంబంధించి ప్రతి అడుగులో టీడీపీ అభ్యర్థులు పోరాడారని, అంతచేసినప్పటికీ చాలాచోట్ల వారిని ఏదో ఒక వంకతో, అధికారపార్టీ అడ్డుకుందన్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక, తాజాగా టీడీపీలోని కీలకనేతలకు ఫోన్లుచేసి బె-ది-రి-స్తూ, వారిని తమదారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారన్నారు.ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది, నిజాయితీ ఉంటే తామిచ్చిన సాక్ష్యాలను ఆధారం చేసుకొని, వైసీపీనేతలు, కార్యకర్తల దౌ-ర్జ-న్యా-ల పై చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవస్థలను కుప్పకూల్చి, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన వారి నుంచి, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న కారు పై క-ర్ర-ల-తో దా-డి చేసి, వారిని చం-పా-లి అని అనుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దా-డి చేసిన వీడియో బయటకు రావటం, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆందోళన చెయ్యటంతో, దా-డిలో పాల్గున్న, వైఎస్‌ఆర్‌సిపి పట్టణ సంఘం అధ్యక్షుడు తురకా కిషోర్ ను పోలీసులు పట్టుకుని, హ-త్యా-య-త్నం-కేసు పెట్టారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. తెలుగుదేశం నేతలు కూడా, పోలీసులు హ-త్యా-య-త్నం కేసు పెట్టినందుకు పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. అయితే, మరుసటి రోజే, కిషోర్ స్టేషన్ బెయిలు పై విడుదల కావటంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు మరో వార్త వెలుగులోకి వచ్చింది. స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చిన తురకా కిషోర్ పారిపోయాడని తెలుస్తుంది. అతను పరారు అయ్యాడు అంటూ, ఒక ప్రముఖ వార్తా సంస్థ ప్రసారం చేసింది. ఇదే విషయం పై తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చెయ్యటంతో, ఈ వదనకు బలం చేకూరుస్తుంది.

turaka 130362020 2

ముందు స్టేషన్ బెయిల్ ఇచ్చారు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఒక హ-త్యా-య-త్నం కింద అరెస్ట్ చేసిన కేసులో, ఇంత తేలికగా స్టేషన్ బెయిల్ ఎలా వస్తుంది అని, తెలుగుదేశం పార్టీ నిలదీసింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో, నాన్ బైలబుల్ కేసులు పెట్టమని పోలీసులు అంటున్నారు. ఇప్పుడు తురకా కిషోర్ పరారు అయ్యాడు అంటూ ప్రచారం చేస్తున్నారు అంటూ, ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో వార్త రావటం సంచలనంగా మారింది. https://youtu.be/0emBvvljq5E . నిందుతుడు స్వేచ్చగా తిరుగుతున్నారు అంటూ, తెలుగుదేశం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. "హ-త్యా-య-త్నం చేసిన తురకా కిషోర్ కు బెయిల్ ఏవరైనా ఇస్తారా?, ఐసీ ప్రభాకర్ గారు ముద్దాయిపై 3-0-7 సెక్షన్ కింద నాన్ బెయిల్ కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు"

turaka 130362020 3

"ఇప్పుడు మాచర్ల సీఐ భక్తవత్సల రెడ్డి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఐజీ ప్రభాకర్ పవర్ ఫుల్లా, మాచర్ల సీఐ భక్తవత్సల రెడ్డి పవర్ ఫుల్లా ? స్టేషన్ బెయిల్ తీసుకున్న తురకా కిషోర్ కాలర్ ఎగరేస్తూ బయట తిరుగుతున్నాడు. హ-త్యా-య-త్నం కేసు పెట్టితే 24గంటలు స్టేషన్ కోర్టులో హజరు పర్చాలి.. 14రోజులు రిమాండ్ లో ఉండాలి కాదా?" అంటూ తెలుగుదేశం నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన పై నారా లోకేష్ కూడా విమర్శలు చేసారు. "వ్యవస్థల్ని బ్రష్టు పట్టించడంలో YS Jagan Mohan Reddy గారు నెంబర్ 1. తండ్రి హయాంలో తప్పుడు పనులు చేసి ఐఏఎస్ అధికారులను జైలుకి పంపారు. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను కోర్టు మెట్లు ఎక్కించి చివాట్లు పెట్టిస్తున్నారు. సోషల్ మీడియా లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించినందుకు టీడీపీ కార్యకర్తని 14 రోజులు రిమాండ్ కి పంపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులపై హ-త్యా-య-త్నం చేసిన వైకాపా నాయకుడికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చాం అని ఒకసారి తూచ్ అతను పారిపోయాడు అని మరోసారి చెబుతారా. పొలిసు వ్యవస్థని ఇంత నిస్సిగ్గుగా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టే ఈ రాష్ట్రంలో చట్టం అమలు అవుతుందా అని కోర్టులు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది." అంటూ ట్వీట్ చేసారు.

తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉ-ద్రి-క్త పరిస్థితులు నెలకొన్నాయి. జేసీ దివాకర్‌రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడి మధ్య వా-గ్వా-దం చోటు చేసుకుంది. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన దివాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయంలో హర్షవర్ధన్‌ ఉన్నందున తర్వాత పంపిస్తామని పోలీసులు అన్నారు. ఇరువర్గాల మధ్య వా-గ్వా-దం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అందరినీ అక్కడినుంచి పంపించి వేశారు. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ వెయ్యటానికి జేసీ వర్గం వెళ్తున్న సందర్భంలో, ఉ-ద్రి-క్త-త చోటు చేసుకుంది. ఈ సందర్భంగా, తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయం దగ్గర, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌ మధ్య గొ-డ-వ జరిగింది. రెండు వర్గాలు భారీగా అక్కడకు చేరుకోవటంతో, ఏమి జరుగుతుందో అని పోలీసులు కంగారు పడ్డారు. పరిస్థితి చేయి దాటి పోతుంది అని అర్ధమై పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపుచేశారు.

tadipatri 13032020 2

వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్‌ వేస్తున్నవారిని అడ్డుకుని బెదిరిస్తున్నారని 36వ వార్డు తెలుగుదేశం అభ్యర్థిని జింక లక్ష్మీదేవి ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళుతుండగా, ఆయన్ను పోలీసులు వెళ్ళనివ్వలేదు. కార్యాలయం లోపల, వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌ ఉన్నారని, తర్వాత పంపిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులు మాట్లాడుతుండగా వైసీపీ నాయకులు ఒక్కసారిగా దివాకర్‌రెడ్డి వైపు దూసుకుని వచ్చారు. దివాకర్‌రెడ్డి పై దా-డి-కి ప్రయత్నం చేసారు. పోలీసులు అడ్డుకుని జేసీని సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు. అయినా కార్యాలయం వెలుపల ఇరువర్గాలు గుమిగూడాయి.

tadipatri 13032020 3

జేసీ కుటుంబానికి పదవులు ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యమని ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో తాను బరిలో వున్నట్లు తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు.గతంలో జేసీ దివాకర్ రెడ్డి మేము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పడం అందరికీ తెలిసిందే. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొనడంతో మంగళవారం జేసీ పవన్ రెడ్డి, బుధవారం జేసీ ప్రభాకర్ రెడ్డిలు తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టీడీపీకి మెజార్టీ స్థానాలు ఇస్తే ప్రజలే తాడిపత్రి చైర్మనను నిర్ణయిస్తారన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తాము పదవులను ఆశించి పోటీ చేయడం లేదన్నారు. రాష్ట్రంలోనే తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండేదని, అలాంటి మున్సిపాలిటీని పందుల స్వైరవిహారంతోను, చెత్తతోనూ నింపేశారన్నారు. .జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చుకున్న తాడిపత్రి మున్సిపాలిటీలో ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. తాడిప త్రి అభివృద్ధి కోసం తాము కొంచెం కఠినంగా ఉండాల్సి వచ్చిందని, ఎవరిపైన ద్వేషం లేదన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి దోహదపడతామన్నారు.

రాజధాని అమరావతి ప్రాంతం లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సంద ర్భంగా అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం సేకరించిన స్థలాలను ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేస్తూ జీవో నంబర్ 107 జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని అమరావతి పరిరక్షణ సమితి, రైతుల తరఫు న్యాయవాది అశోక్ భాన్ ధర్మాసనానికి వివరించారు. ప్రభుత్వం స్థలాలను పంపిణీ చేస్తామంటూ జీవో జారీ చేయడం చట్ట విరుద్ధమని వాదించారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన పేదలకు సీఆర్‌డీఏ చట్టం ప్రకారం ఆ ప్రాంతంలో రిజర్వ్ చేసిన ఐదు శాతం భూముల్లోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉందని వివరించారు. పేదలకు నివాస స్థలాలు కేటాయించాలని చట్టంలో ఎక్కడా లేదని, కేవలం నివాసయోగ్యమైన ఇల్లు మాత్రమే ఇవ్వాలని ఉందని న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించారు.

court 13032020 2

మరోవైపు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని సీఆర్‌డీఏ చట్టంలో ఎక్కడా పేర్కొనలేదన్నారు. భూకేటాయింపుల నిబంధనలు ప్రకారం ప్రభుత్వం పేదవారికి నివాస స్థలాలు కేటాయించవచ్చని తెలిపారు. సీఆర్ డీఏ చట్టంలో పేర్కొన్న సామాజిక అభివృద్ధిలో భాగంగానే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. గత ప్రభుత్వం పేదలకు అపార్ట్మెంట్లు నిర్మించి ఇచ్చిందని, ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇరువైపు న్యాయవాదుల సుదీర్ఘ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం, పలు సందర్భాల్లో, ప్రభుత్వాన్ని, పోలీసులని, అక్కడే ఉన్న డీజీపీని కూడా కడిగిపారేసింది.

గతంలో పేదలకు ఇచ్చిన భూములు, మళ్ళీ వారి దగ్గర తీసుకుని, వేరే వారికి ఇవ్వటమా, ఇదేమి పధ్ధతి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ భూములు లాక్కోవద్దు అని ఆందోళన చేస్తున్న పేదల పై, ఎస్సీ, ఎస్టీలపై కేసులు పెడతారా? మీ తీరు సరి కాదు అంటూ కోర్ట్ తీవ్రంగా వ్యాఖ్యానించింది. పంటలను ధ్వంసం చేస్తూ, జేసీబీలతో దున్నేస్తూ, ఉన్న ఫోటోలు మేము చూసాం, పోలీసులు సహకారంతో, భూములు తీసుకుంటున్నట్టు అర్ధం అవుతుంది, అక్కడ జరిగేది వేరు, మీరు కోర్ట్ కు చెప్పేది వేరు, పోలీసులు తీరు ఇలాగే ఉంటే, కేంద్ర హోం శాఖను జోక్యం చేసుకోమని, వారికి రాస్తాం, కేంద్ర హోం శాఖ తదుపరి చర్యలు తీసుకుంటుంది అంటూ, హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారులు రికార్డులు తారు మారు చేస్తూ, పోలీసులు భూములు లాక్కోవటానికి వెళ్తూ, ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అంటూ హైకోర్ట్ ఆగహ్రం వ్యక్తం చేసింది.

Advertisements

Latest Articles

Most Read