కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు తెలిపినా ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్..జిల్లాల కలెక్టర్లను ఎలా తొలగిస్తారని సీఎం జగన్ ప్రశ్నించారు. కనీసం సీఎస్‌తో గానీ వైద్యశాఖ కార్యదర్శితో మాట్లాడకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌పై ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రమేశ్‌కుమార్ చంద్రబాబు ప్రభుత్వం నియమించిన వ్యక్తి అని అన్నారు. ఆయన సామాజికవర్గం అని అన్నారు. ఆయన ఇష్టానుసారంగా ఆదేశాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. మాచర్ల సిఐని ఎలా తప్పిస్తారు, ఆశ్చర్యం వేస్తుంది అంటూ, మాచర్ల ఘటన చిన్నదిగా చేసి చుపించారు. ప్రతోడు విచక్షణాధికారం అంటాడు, ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపొయింది అంటూ, జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఎవడో చెప్పాడు.. ఇంకెవడో రాశాడు అంటూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల పై, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మేమంతా ఎందుకు, ఎలక్షన్ కమిషన్ ఎవడైతే ఉంటాడో, వాళ్ళనే ముఖ్యమంత్రిగా పెట్టుకోండి అంటూ జగన్ వ్యాఖ్యలు చేసారు.
ప్రజలు ఓట్లేసి 151 స్థానాలు తమకు ఇస్తే, అధికారంలో ఉన్నామని, అధికారం జగన్ మోహన్‌రెడ్డిదా లేదా రమేశ్ కుమార్‌దా? అంటూ ఏకంగా ఎలక్షన్ కమిషన్ ఎవరు అనే విధంగా జగన్ స్పందించారు. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ఈరోజు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా బాధాకారంగా ఉన్నాయని, విచక్షణ కోల్పోయి మాట్లాడారని, కులాలు, మతాలకు అతీతంగా పని చేయాలని, కానీ రమేశ్ కుమార్ కరోనా వైరస్ పేరుతో ఎన్నికలు వాయిదా వేశారని అన్నారు. అదే సమయంలో గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తూ ప్రకటన చేశారని, కరోనా సాకు చెప్పి అలా ఎలా చేస్తారు..? ప్రజలు ఓట్లు వేస్తే వైకాపా 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది, అధికారం వైఎస్ జగన్‌దా, రమేశ్ కుమార్‌దా? ఏమైనా అంటే విచక్షణాధికారం అంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేసారు.
కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జగన్ అన్నారు. కరోనా మాత్రమే కాదు.. ఏ జబ్బులు వచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా సమావేశం పెట్టాల్సి వస్తుందని అనుకోలేదని వ్యాఖ్యానించారు. కరోనా గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 60 ఏళ్లు పైబడిన వారిపైనే కరోనా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెప్పారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు లేనివారు కరోనా విషయంలో భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా పెద్ద రోగం కాదని, పేరాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుందని జగన్ అన్నారు. మొత్తానికి ప్రపంచం మొత్తం వణికిపోతుంటే, జగన్ మాత్రం కరోనా అనేది పెద్ద విషయం కాదని అన్నారు.