రాజకీయ నాయకులు ఏదైనా పర్యటన చెయ్యాలి అంటే, ముందుగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకుంటారు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, పర్మిషన్ ఇస్తారు పోలీసులు. ఒక్కోసారి, షరతులు కూడా పెడతారు. ఒకసారి పర్మిషన్ ఇచ్చారు అంటే, ఆ పర్యటన బాధ్యత పోలీసులే తీసుకువాలి. ఈ రోజు చంద్రబాబు విశాఖ, విజయనగరం జిల్లాలో ప్రజాచైతన్య యాత్ర కోసం, టిడిపి శ్రేణులు, పోలీసులను కలవటం, షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. 50 మంది నాయకులు మాత్రమే ఉండాలని షరతు పెట్టారు. ఆ అనుమతి ప్రకారం, చంద్రబాబు గారు, ఈ రోజు వైజాగ్ వచ్చారు. అయితే అనూహ్యంగా అక్కడ వైసీపీ అల్లరి మూకలు వచ్చి, వీరంగం సృష్టించాయి. గుడ్లు, రాళ్ళు, టమాటాలు, చెప్పులు వేసి వీరంగం సృష్టించారు. 50 మందిని మాత్రమే అనుమతి ఇస్తాం అని చెప్పిన పోలీసులు, మరి అంత మంది వైసీపీ నాయకులను ఎలా అనుమతి ఇచ్చారు అంటే, ఇప్పటికీ ఆ ప్రశ్నకు సమాధానం లేదు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న నాయకుడు పట్ల పోలీసులు ఇలా ఎందుకు ప్రవర్తించారో అర్ధం కావటం లేదు.

ఇక తరువాత, నాలుగు గంటల పాటు, వైసీపీ మూకలు, చంద్రబాబుని నిర్బందిచాయి. అయితే అనూహ్యంగా పోలీసులు మాత్రం చోద్యం చేస్తూ కూర్చున్నారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తిని నాలుగు గంటల పాటు రోడ్డు పై, వైసీపీ మూకలు అడ్డుకుంటే, వారిని ఏమి అనకుండా, పోలీసులు వచ్చి చంద్రబాబుని అరెస్ట్ చేసారు. దీంతో తెలుగుదేశం నేతలు ఆశ్చర్య పోయారు. పర్మిషన్ ఇచ్చి, ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చేలా చేసి, రోడ్డు మీద అడ్డుకునేలా ప్లాన్ చేస్తే, చంద్రబాబుని అడ్డుకున్న వారిని, అరెస్ట్ చెయ్యకుండా, చంద్రబాబుని ఎదురు ఆరెస్ట్ చెయ్యటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అమరావతిలో రోజాని అడ్డుకున్నారని, ప్రజల పై లాఠీ చార్జ్ చేసి, 400 మంది పై కేసులు పెట్టిన పోలీసులు, చంద్రబాబు విషయంలో రివర్స్ లో చేసారు. మరి ఎవరి ఒత్తిడితో ఇలా చేసారో ?

అంతకు ముందు తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు వాహనం నుంచి కిందకు దించారు. విమానాశ్రయంలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా నిరాకరించారు. వాహనం దిగిన తర్వాత చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎలా తనను అడ్డుకుంటారని ప్రశ్నించారు. విశాఖ పర్యటనకు వస్తే.. తమపై దారుణంగా ప్రవరిస్తున్నారని తెదేపా అదినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు అనుమతి తీసుకున్నామని గుర్తు చేశారు. విశాఖ పర్యటనలో తమపై వైకాపా శ్రేణులు దాడి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గంట, రెండు గంటలు ఆగితే పంపిస్తామని పోలీసులు చెప్పారని... ఇప్పుడేమో వెనక్కి వెళ్లాలని చెబుతున్నారని పేర్కొన్నారు. ఏ చట్టం కింద వెనక్కి వెళ్లాలని చెబుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తాను చట్టాన్ని ఉల్లంఘించనని.. పూర్తిగా సహకరిస్తానని అన్నారు. న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. విశాఖలో భూకబ్జాలు జరిగాయన్న చంద్రబాబు.. నిజమో? కాదో? ప్రజలే తేలుస్తారన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. చంద్రబాబును ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఆయన వాహన శ్రేణిపై కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరారు. విశాఖ విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విమానాశ్రయం వద్ద వైకాపా కార్యకర్తల తీరుతో ప్రజలు భీతిల్లారు. చంద్రబాబును అడ్డుకునేందుకు పలుచోట్ల నుంచి కార్యకర్తలను వైకాపా సమీకరించింది. మాజీ సీఎం చంద్రబాబు వాహనశ్రేణిపై వైకాపా కార్యకర్తలు దాడికి యత్నించారు. కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరారు. విమానాశ్రయం నుంచి బయటకు రానీయకుండా అడ్డుకునేందుకు వైకాపా కార్యకర్తలు విశ్వ ప్రయత్నం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ ఎదుట బైఠాయించి వైకాపా శ్రేణుల నినాదాలు చేశారు. ఫలితంగా, విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రయాణికులను వేరే వాహనాల్లో పోలీసులు తరలిస్తున్నారు. విశాఖ ఎన్‌ఏడీ కూడలి నుంచి ఎయిర్‌పోర్టు మార్గంలో ప్రజల అవస్థలు పడుతున్నారు.

"వైకాపా కార్యకర్తల నిరసన కారణంగా విశాఖలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తెదేపా కార్యకర్తలను విమానాశ్రయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. "విశాఖలో జగన్ భూకబ్జాలు బైటకు వస్తాయనే వైసిపి భయం. అందుకే చంద్రబాబు విశాఖ పర్యటనకు వైసిపి అడ్డంకులు. మాజీ సిఎం చంద్రబాబు కాన్వాయ్ పై వైసిపి దాడికి పాల్పడటం హేయం. ప్రజాస్వామ్యాన్ని ఫాక్షన్ రాజ్యంగా చేస్తారా..? మీ అరాచకాల కోసం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తారా..? వైసిపి నేతల స్వార్ధానికి పోలీసులను వాడుకోవడం అతిహేయం. ఫాక్షన్ బుద్దులున్నవాళ్లు పాలకులైతే ఇలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిది తొలినుంచి ఫాక్షన్ బుద్దులే. ఫాక్షన్ కుటుంబం కాబట్టే ప్రత్యర్ధులపై దాడులు, దౌర్జన్యాలు. రాష్ట్రంలో పోలీస్ రాజ్ నెలకొల్పారు. వైసిపి ఇష్టారాజ్యంగా పోలీసు వ్యవస్థ దుర్వినియోగం. "

"టిడిపి ప్రభుత్వం ఇలాగే చేసివుంటే 2003లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసేవారా..? 2017లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవారా..? గృహ నిర్బంధాలు టిడిపి నాయకులకేనా..? వైసిపి నేతలకు గృహ నిర్బంధాలు ఉండవా..? గంటల తరబడి మాజీ సిఎంను ఎయిర్ పోర్టు వద్దే నిలిపేస్తారా..? ఆయన కాన్వాయ్ పై కోడిగుడ్లు, టమాటాలు విసురుతారా..? టిడిపి కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడతారా..? చోద్యం చూడటానికా పోలీసులు ఉన్నది..? ఏపిలో ప్రభుత్వమే శాంతిభద్రతలను భగ్నం చేస్తోంది." అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అయితే, నాలుగు గంటలుగా వైసీపీ శ్రేణులు, అడ్డుకుంటే, ఇప్పుడు పోలీసులు చంద్రబాబుని అరెస్ట్ చెయ్యటానికి చూడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

చంద్రబాబు ట్రాప్‌లో వైసీపీ భలే ఇరుక్కుంది. వైజాగ్‌లో చంద్రబాబు తన పర్యటనను పెట్టుకోవటం, బాబును ఎలాగైనా వైజాగ్‌లో అడుగు పెట్టనివ్వం అని వైకాపా ప్రకటించటంతో చంద్రబాబు ప్లాన్ ఊహించిన రీతిలో క్లిక్ అయింది. వైజాగ్ వాసులకు వైకాపా వాళ్లు ఎంత దౌర్జన్యపరులు, ఎంత దాదాగిరి చేస్తారు, ఎలా దాడులు చేస్తారు, ఎలా పేట్రేగిపోతారో చంద్రబాబు వాళ్లతోనే ఈవాళ లోకల్ ప్రజలకు ఒక డెమో ఇప్పించారు. ఇంతకాలం రాజకీయ ఆరోపణగానే ఉన్న వైకాపా రౌడీయిజం చేస్తుంది, వైకాపా వస్తే అరాచకం ప్రబలుతుంది అని తెలుగుదేశం, జనసేన, బీజేపీ చాలాసార్లు రాజకీయంగా ఆరోపించాయి. ఇప్పుడు వాళ్లతో అదే పని చేయించి చంద్రబాబు విశాఖ వాసుల దృష్టిలో వైకాపాను ఎక్స్‌పోజ్ చేశారు. వైజాగ్ వీధుల్లో, విమానాశ్రయానికి వెళ్లే రహదారుల్లో కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు పట్టుకుని నడిరోడ్డు మీద వైకాపా కార్యకర్తలు భీభత్సం చూస్తుంటే వైజాగ్ జనం బిర్ర బిగుసుకుపోయారు. ఆనాడు జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కి తిరగ్గొట్టినట్టే చంద్రబాబును కూడా రిటర్న్ పంపాలని వైసీపీ ప్లాన్ వేసింది.

బాబు టూరును ఎవరో తమ సత్తా చూపుతారో వాళ్లకి పార్టీలో గుర్తింపును ఇస్తామని లోకల్‌గా ఆధిపత్యం వహిస్తున్న ఓ ప్రముఖ నేత నిన్నటి వైకాపా కేడర్ మీటింగ్‌లో వాగ్దానం కూడా చేశారు. దాంతో భారీ ఎత్తున వాహనాల్లో జనాలను తీసుకుని వచ్చి విశాఖ నగరంలో వైకాపా చేసిన అల్లరి జనంలో అధికారపార్టీని బ్యాడ్ చేసిందే తప్ప వాళ్లు ఇందులో పాముకునేదేం లేదు. సున్నిత మనస్కులు, సహృదయులు, శాంతికాముకులు అయిన వైజాగ్ సిటిజన్స్‌కు ఈరోజు వైసీపీ ఇచ్చిన డెమో ప్రభావం వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో ఖాయంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న వైజాగ్ పై, పులివెందుల ముఠా కన్ను పడింది అంటూ, తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు చేసిన ప్రచారం, నిజం అనే విధంగా, ఈ రోజు వైజాగ్ ప్రజలు లైవ్ లో చూసారు.

ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. తెదేపా, వైకాపా కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకే చోట గుమిగూడిన పరిస్థితుల్లో.. విమానాశ్రయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం, వైకాపా వర్గీయుల పోటాపోటీ మోహరింపుతో విశాఖ విమానాశ్రయం అట్టుడికింది. తెదేపా అధినేత చంద్రబాబు విమానాశ్రయానికి చేరుకునే సమయానికి ఇరు పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలోనే విమానాశ్రయం నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. అప్పటికే అక్కడ మోహరించి ఉన్న వైకాపా శ్రేణులు.... ఆయన వాహనశ్రేణిని చుట్టుముట్టారు.

వైకాపా శ్రేణుల వీరంగంతో విశాఖ ఉడుకుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాకను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పరిస్థితి రణరంగమైంది. వేలాదిగా తరలివచ్చిన అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి... కొన్ని గంటలుగా చంద్రబాబు వాహనశ్రేణి ముందుకు కదలకుండా స్తంభింపజేశారు. ఈ క్రమంలో వాహనం దిగి నడుస్తూ చంద్రబాబు ముందుకు కదిలారు. అయితే ఈ పరిణామంతో పోలీసులు ఖంగుతిన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా తిరిగి వాహనంలోకి వెళ్ళాలని, సహకరించాలి అని చెప్పటంతో, చంద్రబాబు వెనక్కు వచ్చారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా పోలీసులు అవాక్కయ్యారు. పొరపాటున చంద్రబాబు పై, ఒక్క రాయి పడినా, అది దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. టిడిపి శ్రేణులు అదుపు తప్పే ప్రమాదం ఉందని గ్రహించి, వెంటనే చంద్రబాబుని కోరటంతో, చంద్రబాబు కూడా వారికి సహకరించి వెనక్కు వెళ్లారు. విశాఖ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చంద్రబాబు కాన్వాయ్‌ను వైకాపా వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు.

vizzag 27022020 2

అత్యంత ఉద్రిక్త పరిస్థితులే మధ్యే చాలాసేపు వాహనంలో వేచిచూసిన చంద్రబాబు.... పరిస్థితి ఎంతకీ సద్దుమణకపోవడంతో ఇక లాభం లేదనుకుని కిందకు దిగారు. అత్యంత ఉద్రిక్త పరిస్థితులే మధ్యే చాలాసేపు వాహనంలో వేచిచూసిన చంద్రబాబు.... పరిస్థితి ఎంతకీ సద్దుమణకపోవడంతో ఇక లాభం లేదనుకుని కిందకు దిగారు. పాదయాత్రగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. భద్రతా కారణాల దృష్ట్యా మళ్లీ వాహనం ఎక్కారు చంద్రబాబు. వాహనంలో ఉన్న చంద్రబాబుతో పోలీసులు మాట్లాడారు. తెదేపా, వైకాపా కార్యకర్తల పోటాపోటీ నినాదాలు, తోపులాట కొనసాగుతోంది. కాన్వాయ్‌ ఎదుట బైఠాయించేందుకు వైకాపా నేత కె.కె.రాజు యత్నించారు. చంద్రబాబు కాన్వాయ్‌ను కదలనీయకుండా వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ‌వాహనం ఎదుట నల్లజెండాల ప్రదర్శనతో నినాదాలు చేశారు.

vizzag 27022020 3

తెదేపా నేతలు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. రౌడీలు, గూండాలను పంపించి దాడి చేయిస్తారా అని నిలదీశారు. బయటికి ఎలాగైనా వెళ్తామని స్పష్టం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి ఇచ్చిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఇలా ఆందోళనలు చేయిస్తారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆ పార్టీ నేత చినరాజప్ప ప్రశ్నించారు. విమానాశ్రయంలో చంద్రబాబును వైకాపా కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పేందుకే చంద్రబాబు విశాఖ పర్యటన చేస్తున్నారని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read