ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు, ఏపి హైకోర్ట్, షాక్ ఇచ్చింది. గుంటూరు జిల్లా, అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, పై సిబిఐ విచారణ చెయ్యాలి అంటూ, హైకోర్ట్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ మధ్య కాలంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల పై పలు విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ ఒత్తిడితో, కొంత మంది పై పోలీసులు కావాలని టార్గెట్ చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపిస్తూ వస్తుంది. పలు సందర్భాల్లో చంద్రబాబు, వారిని హెచ్చరించారు కూడా. పోలీసులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, వారి పై ప్రైవేటు కేసులు పెడతాం అని చంద్రబాబు హెచ్చరించారు కూడా. అధికార పార్టీ నేతల ఒత్తిడికి లొంగకుండా, చట్ట ప్రకారం నడుచుకోవాలని హెచ్చరించారు. అయినా, పోలీసులు మాత్రం ఎక్కడ మారటం లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ చెప్పిన వారి పై కేసులు పెడుతున్నారు కాని, ప్రతిపక్షం కేసు పెడితే, కనీసం ఆక్షన్ కూడా తీసుకువటం లేదు అని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా కేసులు పెడుతూ, తెలుగుదేశం పార్టీ శ్రేణులను టార్గెట్ చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.
అయితే కొంత మందిని పోలీసులు అకారణంగా తీసుకు వస్తూ, అరెస్ట్ కూడా చూపించకపోవటం పై, ఇప్పటికే, పోలీసుల పై పలు చోట్ల, హెబియస్ కార్పస్ పిటిషన్ లు వేసి, కోర్ట్ లను ఆశ్రయిస్తున్నారు బాధితులు. ఈ నేపధ్యంలో, తాజాగా ఒక కేసులో, పోలీసులకు షాక్ ఇచ్చింది, హై కోర్ట్. ఇక కేసు వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లాలో ముగ్గురు యువకులు అదృశ్యం అయిన కేసులో, హైకోర్ట్ ఈ ఆదేశాలు ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం, గుంటూరులో ముగ్గురు కనిపించకకుండా పోయారు. అయితే వారిని పోలీసులే ఎట్టుకువెళ్ళారని, కుటుంబ సభ్యులు, ఆరోపించారు. వారు ఇంట్లో ఉన్నప్పుడు, పోలీసులు మఫ్టీలో వచ్చి, వారిని దాడి చేసి, తీసుకు వెళ్ళారని ఆరోపించారు. వారిని అరెస్ట్ కూడా చూపించకుండా, చిత్ర హింసలు పెట్టారని ఆరోపించారు.
అయితే వారు ఎంత కోరినా పోలీసులు ఆచూకీ చెప్పక పోవటంతో, కుటుంబ సభ్యులు, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఆ తరువాత, వారిని క్రికెట్ బెట్టింగ్ కేసులో అరెస్ట్ చేసామని పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే, వారిని అరెస్ట్ చూపించకుండా హింస పెట్టటం పై, హైకోర్ట్, జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. కాని, పోలీసులు విచారణకు, జ్యుడీషియల్ విచారణకు తేడా ఉండటంతో, అసలు విషయం ఏమిటో తెలుసుకునేందుకు, హైకోర్ట్ సిబిఐ విచారణకు ఆదేశించింది. న్యాయవిచారణకు పోలీసులు స్పందించక పోవటంతో, గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ పై సిబిఐ విచారణకు ఆదేశించటం, సంచలనంగా మారింది. వారం రోజుల ముందు ఇలాంటి కేసులోనే, హైకోర్ట్ డీజీపీని పిలిపించి మరీ, వివరణ కోరిన సంగతి తెలిసిందే.