కుప్పం నియోజకవర్గంలోనూ గెలిచేస్తాం. 175 నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యమంటోన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గాలి తీసేసింది ఇండియా టుడే సీ ఓటర్ సర్వే. గతంలో ఇదే సంస్థ చేసిన సర్వేలో ప్రజాదరణలో నెంబర్ వన్ అంటూ ఊదరగొట్టుకున్నారు వైసీపీ వాళ్లు. లేటెస్ట్ సర్వేతో ఒక్కసారి అగ్రస్థానం నుంచి అథఃపాతాళానికి పడిపోయారు ఏపీ సీఎం. జగన్ మోహన్ రెడ్డికి ప్రజాదరణ అమాంతం తగ్గిపోయిందని సర్వే వెల్లడిస్తోంది. ఆరు నెలల్లో జగన్‍కు 20 శాతం ప్రజాదరణ తగ్గడం ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకత స్పష్టం అవుతోంది. మూడేళ్లు పూర్తయ్యేసరికే జగన్ అంటే జనానికి మొహం మొత్తేయడంతో వైసీపీ కేడర్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆరు నెలల క్రితం ఇండియాటుడే సీ ఓటర్ సర్వేలో 56.5 శాతంగా ఉన్న జగన్ పాపులారిటీ సూపర్ స్పీడుతో తగ్గి 39.7 శాతంకి పడిపోయింది. బాగా పేరు సంపాదించిన మొదటి పది మంది ముఖ్యమంత్రులలో పదో స్థానంలో నిలిచిన జగన్ లాస్ట్ ప్లేసుతో సరిపెట్టుకున్నారు. పాలనలో పారదర్శకత లేకపోవడం, అరాచకాలు, విధ్వంసాలు, అవినీతి, అభివృద్ధి లేకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో అన్నివర్గాలు జగన్ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
news
లోకేష్ పాదయాత్రలో ఎల్లో డ్రెస్ పోలీసులు ? ఎందుకో మరి ?
ఎన్ని అడ్డంకులు సృష్టించినా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఆరంభమైపోయింది. తారకరత్న గుండెపోటు ఘటనని విషప్రచారానికి వాడుకోవాలనుకున్నారు. అయితే లైవ్ విజువల్ ఉండడంతోపాటు తారకరత్న వైద్యం నుంచి అన్నీ తానై బాబాయ్ బాలయ్య చూసుకుంటున్నాడు. లోకేష్, చంద్రబాబు, పురందేశ్వరి మొత్తం కుటుంబం తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తోంది. బాబాయ్ ని గొడ్డలితో వేసేసిన అబ్బాయిలు మీరైతే, అబ్బాయ్ ని బతికించుకోవడం కోసం బాబాయ్ నిద్రాహారాలు మానిన చరిత్ర మాదంటూ టిడిపి గట్టిగానే వైసీపీ బ్యాచులకు కౌంటర్లు ఇస్తోంది. మరోవైపు టిడిపి యువగళం పాదయాత్రలో లోకేష్ కి దూరంగా సామాన్య జనంలో పసుపు టీ షర్ట్ వేసుకుని, టిడిపి క్యాప్ పెట్టుకుని ఒకతను ఉన్నాడని టిడిపి నేతలు ఆసక్తికర విషయం చెప్పారు. ఆయన బాగా తెలిసిన యువనేత మీరేంటండి ఇక్కడ, ఈ డ్రెస్సులో అని ఆరా తీసారట. తన పేరు బయటకు చెప్పొద్దని ఆ నేతని వేడుకున్న ఆ పోలీసు మాకు ఓ స్పెషల్ టాస్క్ అప్పగించారని చెప్పేశాడు. ఏంటా టాస్క్ అంటే, పాదయాత్రకి-టిడిపికి వ్యతిరేకంగా కొందరు మనుషుల్ని పెట్టుకుని పాదయాత్రలోనే వీడియోలు, బైట్లు ఓ బ్యాచు షూట్ చేస్తుంది. వారికి రక్షణ కల్పించే బాధ్యత ఈ పసుపు షర్ట్ వేసుకున్న పోలీసులే చూడాలట. వారిని టిడిపి వాళ్లు అడ్డుకున్నా, దాడిచేసినా వారిని తప్పించాల్సిన బాధ్యత ఈ ఎల్లో షర్టుల్లో ఉన్న పోలీసులదేనట. ఇలా ఓ పదిమంది అమరావతి నుంచి కుప్పం చేరారట. గతంలోనూ టిడిపి కేంద్ర కార్యాలయంపై దా-డి చేసేందుకు వచ్చిన వారికి రక్షణగా పోలీసులు వచ్చి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ యువగళంలో కూడా ఇదిగో ఇలా ఖాకీ డ్రెస్సులు విప్పేసి ఎల్లో షర్టుల్లో పోలీసులు దూరుతున్నారని టిడిపి ఆరోపిస్తుంది..
ఐ ప్యాక్ సర్వే ఫేక్ అయితే, ఆంధ్రజ్యోతి మీద లీగల్ చర్యలు తీసుకోవచ్చుగా ?
ఐ ప్యాక్ సర్వే పేరుతో సోషల్మీడియాలో సర్కులేట్ అవుతున్న దానిపై ఆంధ్రజ్యోతి ఓ కథనం రాసింది. ఐ ప్యాక్ పేరిట సోషల్ మీడియాలో వైరల్‍గా మారిన సర్వే ఆంధ్రజ్యోతి స్టోరీ అయ్యింది. అయితే దీనిని ఐ ప్యాక్ విచిత్రంగా ఖండించింది. ఫేక్ సర్వేలు వేసిన మీరు మీ పాపాన మీరే పోతారన్నట్టు శాపనార్థాలు పెట్టడం ఏంటో? అంతుబట్టటంలేదు. దేశవ్యాప్తంగా కార్పొరేట్ రేంజులో విస్తరించిన ఐప్యాక్ తమ పేరుతో ఫేక్ సర్వేని ప్రచురిస్తే లీగల్ చర్యలు తీసుకోకుండా ట్వీట్ ద్వారా ఖండించి ఎందుకు వదిలేసిందనేది చర్చనీయాంశం అవుతోంది. అంటే సర్వేని వారే లీక్ చేశారా? సర్వేని వారే చేశారా? అనేది తేలాల్సి ఉంది. ఈ సర్వే ప్రకారం ఏపీ కేబినెట్‍లో మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, అంజాద్ బాషా, విశ్వరూప్, దాడిశెట్టి రాజాలు మాత్రమే గెలుస్తారనే నివేదిక ఉంది. మాజీ మంత్రుల్లో ధర్మాన కృష్ణదాస్, కొడాలి నాని గెలవొచ్చని, మిగిలిన తాజా..మాజీ మంత్రులంతా ఓడిపోతారని సర్వే వెల్లడించింది.
ఆదానీకి జగన్ ఏపిలో విపరీతంగా కట్టబెట్టిన ప్రాజెక్ట్ ల సంగతి ఏంటి ?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అన్నీ ఎదురుదెబ్బలే. అయినా కేంద్రంలో పెద్దల ఆశీస్సులతో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ అండాదండ అందిస్తూ, కేంద్రంతో లాబీయింగ్ కి స్నేహహస్తం అందించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ అదానీ చీటి హిండెన్ బర్గ్ నివేదిక చింపేసింది. ఒక్క దెబ్బకి ప్రపంచ కుబేరుల్లో నెంబర్ వన్ అయిన అదానీ ఏడవ స్థానానికి పడిపోయాడు. షేర్ మార్కెట్ కుప్పకూలిపోయింది. లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. అదానీ పతనంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బ్యాడ్ టైమ్ స్టార్టయ్యింది. ఏపీలో పోర్టులు, భూములు, ఎయిర్ పోర్టులన్నీ కారుచౌకగా అదానీకి కట్టబెట్టేస్తున్న ఏపీ సర్కారు ప్రతిఫలంగా కేంద్రంతో లాబీయింగ్ కోసం అదానీని వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఏపీలో వనరులన్నీ అదానీ కట్టబెట్టడం, కేంద్రంలో ఏపీకి కావాల్సినవన్నీ అదానీ అందించడం క్విడ్ ప్రోకో నడిచిందని టిడిపి అనేక సార్లు ప్రెస్ మీట్లు కూడా పెట్టింది. ఏ అదానీ అండ చూసుకుని వైసీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందో ఆ అదానీ సామ్రాజ్యమే కుప్పకూలిపోయింది. అదానీనే ఇప్పుడు ఎవరో ఒకరు ఆదుకోవాలి. ఈ దుస్థితిలో కేంద్రం వద్ద పనులు చేసే పెట్టేందుకు జగన్ కి మరో గాడ్ ఫాదర్ అవసరం పడింది. రిలయన్స్ వాళ్లకి రాజ్యసభ ఇచ్చాడు కాబట్టి, ఇక అటువైపు నుంచి సిఫారసులతో కేంద్రంతో బేరాలు నడపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.