జగన్మోహన్‌రెడ్డి తనకు తానుగా ఢిల్లీవెళ్లాడా.. లేక కేంద్రపెద్దలే ఆయన్ని పిలిపించా రా అనేదానిపై ఆయనే రాష్ట్రప్రజలకు వివరణివ్వాలని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ రాజ్యసభసభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ డిమాండ్‌చేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మ్లాడారు. అధికారంలోకి వచ్చినప్పి నుంచీ స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకుండా, అస్తవ్యస్త విధానాలతో ఏపీ ప్రజల్ని గందరగోళ పరిస్థితుల్లోకి న్టెిన ముఖ్యమంత్రి, ఆయన భజనబృందం ఇప్పుడు ఢిల్లీపెద్దలకు సంజాయిషీ ఇచ్చుకునే స్థితికి దిగజారారని కనకమేడల దుయ్యబ్టారు. ముఖ్యమంత్రయినప్పినుంచీ ఇప్పివరకు 9సార్లు ఢిల్లీవెళ్లొచ్చిన జగన్‌, ఒక్కసారికూడా ఎందుకు మీడియా ముందుకొచ్చి తనపర్యటనల్లోని వివరాలను వెల్లడించలేదన్నారు. రాష్ట్రప్రయోజనాలకోసమే ముఖ్యమంత్రి ఢిల్లీవెళితే, ఆయన అడిగిన అంశాలపై కేంద్రం స్పందించలేదుకాబ్టి, ఏమీచెప్పలేదా.. లేక తాను తీసుకుంటున్న అస్పష్ట నిర్ణయాలపై కేంద్రపెద్దలు మందలించారన్న అవమానభారంతో ముఖ్యమంత్రి మీడియాకు ముఖం చాటేశారా అని కనకమేడల నిలదీశారు. గతంలో రాష్ట్రానికి ఏవిధమైన న్యాయం చేయలేని టీడీపీ, ఎన్డీఏలోఉండానికి వీల్లేదని, వారుబయటకు వచ్చేయాలని డిమాండ్‌ చేసిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు రాష్ట్రానికి తానేంవెలగబ్టెట్టాడని ఎన్డీఏలో దూరడానికి సిద్ధమయ్యాడో చెప్పాలని కనకమేడల డిమాండ్‌ చేశారు.

ఢిల్లీవెళ్లి, కేంద్రపెద్దలతో తానేం చర్చించాడో, ఎవరిప్రయోజనాలగురించి.. ఎవరెవరితో చర్చించాడో జగన్మోహన్‌ రెడ్డి తక్షణమే స్పష్టంచేయాలన్నారు. ప్రజలకోసం, రాష్ట్రప్రయోజనాలకోసమే ఆయన ఢిల్లీవెళ్లి ఉంటే, అధికారులు, మంత్రులు లేకుండా రహస్యంగా మంతనాలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఇప్పికే కేంద్రంలో వైసీపీకి ఇద్దరు రాజ్యసభసభ్యులు న్నారని, త్వరలోనే మరో ముగ్గురు రానున్నారని, ఈనేపథ్యంలో కేంద్రంతో ఏంబేరసా రాలు నడపానికి ముఖ్యమంత్రి హస్తిన కు వెళ్లాడన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తమపర్యటన వివరాలుసకాలంలో వెల్లడించనప్పుడే ప్రజలందరికీ అనుమా నాలు వస్తాయన్నారు. ఇప్పివరకు కేంద్రప్రభుత్వాన్ని మభ్య పెడుతూ, వెర్రిమొర్రి నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్‌రెడ్డికి, ఇకనుంచీ అలాసాగదని కేంద్రవర్గాలు స్పష్టం చేసినట్లు రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయని, వాికి తెరదించాల్సిన బాధ్యత సీఎంపైనే ఉందని, అలాచేయకుంటే ఊహాగానాలను ఆయన సమ్మతించినట్టే భావించాల్సి వస్తుందన్నారు.

60 రోజులుగా రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనలుసహా, మండలిరద్దు, ప్రత్యేకహోదా, విభజనహామీలు, పోలవరం, ఇతరేతర అంశాలపై కేంద్రంతో ఫలవంత మైన చర్చలు జరగలేదని జగన్‌ వైఖరితోనే స్పష్టమైందన్నారు. సుస్థిరంగా ఉన్న రాష్ట్రాన్ని అస్థిరపరిచి, లేనిసమస్యలను సృష్టించి, అన్నివర్గాలవారిని రోడ్డునపడేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని, ఈ వివరాలన్నీ ఇప్పికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చర్యలు అంతర్జాతీయస్థాయిలో కూడా చర్చకొచ్చాయని, దావోస్‌లో పలువురు పారిశ్రామికవేత్తలు, ఏపీ పరిణామాలను కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. జగన్‌ ప్రధానంగా మూడు అజెండాల తో ఢిల్లీకి వెళ్లాడని, సీబీఐకేసుల విచారణ, తాను తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు, శాసనమండలి రద్దు అంశాలున్నాయన్నారు. సీబీఐ కోర్టులో వేసిన పిషన్లలో, జగన్‌ ఆర్థికనేరగాడని, ఆయన విచారణకు గైర్హాజరువుతున్నాడని, ఆయనకున్న పదవితో సాకక్షులను ప్రభావితంచేస్తాడని, అటువిం వ్యక్తికి కోర్టుహాజరు నుంచి మినహాయింపు లివ్వడం సరికాదని స్పష్టంగా పేర్కొన్నదన్నారు. ఈనేపథ్యంలో తనపైఉన్న కేసులనుంచి బయటపడాలన్నదే జగన్‌ తొలి ఎజెండా అన్నారు.

అమరావతి తరలింపుద్వారా సమస్యలను సృష్టించిన ముఖ్యమంత్రి, ప్రజలను లెక్కచేయ కుండా ముందుకెళ్లాడని, అస్తవ్యస్త విధానాలతో ప్రజల్ని రోడ్లపైకి వచ్చేలాచేయడం, జగన్‌ నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టడం, ప్రజలను సంతృప్తిపరచలేక, చేసేదిలేక ఢిల్లీకి వెళ్లడం రెండో అజెండా అని కనకమేడల తెలిపారు. మూడో అజెండాగా శాసనమండలరద్దు, ఆనిర్ణయంద్వారా శాసనమండలి ఛైర్మన్‌ ఆదేశాలను ధిక్కరించేలా మండలికార్యదర్శిని రెచ్చగొట్టడం, కేంద్రప్రమేయం లేకుండా తాననుకున్నది చేయాలని చూసి భంగపడటంతో ఢిల్లీ గుర్తొచ్చిందన్నారు. కేంద్రంతో పనిలేకుండా శాననమండలని రద్దుచేయాలని చూడటంద్వారా, రాజ్యాంగ సంస్థలపట్ల జగన్‌కు ఉన్న గౌరవమేమిటో కేంద్రానికి స్పష్టంగా అర్థమైందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నిప్రయత్నాలుచేసినా, ఢిల్లీనుంచి సానుకూలస్పందన రాలేదని కూడా స్పష్టమైందన్నారు. రాజ్యసభఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ ఇచ్చిన ఆదేశాలను కార్యదర్శులు కాదన్న దాఖలాలు ఎన్నడూ జరగలేదన్నారు.

జపాన్ పరిశ్రమల కోసం ప్రత్యేక సింగిల్ డెస్క్ విధానాన్ని తీసుకురానున్నట్టు రాష్ట్ర పరిశ్రమల, ఐటీ, వాణిజ్యం, నైపుణ్య శిక్షణ శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు. శ్రీసిటీలోని జపాన్ కు చెందిన ప్రముఖ టోరే ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ టోరే ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమ శుక్రవారం ఉదయం రాష్ట్ర పరిశ్రమల, ఐటీ, వాణిజ్యం, నైపుణ్య శిక్షణ శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు వచ్చేందుకు త్వరలో రాష్ట్రంలో నూతన పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామన్నారు. ఈ పాలసీలో నైపుణ్య శిక్షణాభివృద్ధికి పెద్ద పీట వేస్తామని మంత్రి తెలిపారు. ప్రతిపార్లమెంటరీ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం, దానికి అనుబంధంగా పలు కళాశాలలను ప్రారంభించడం ద్వారా నాణ్యమైన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చాలా ఆసక్తిగా వుందన్నారు. శ్రీ సిటీ యాజమాన్యం కోరిక మేరకు శ్రీ సిటీ నుంచే ఈ పాలసీని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

1000 కోట్లుతో ఏర్పాటైన టోరె పరిశ్రమ, రాష్ట్రంలో పారిశ్రామిక స్థిరత్వాన్ని సూచిస్తోందన్నారు. ఇంజనీరింగ్ ప్యాబ్రిక్స్, టెక్స్ టైల్స్ తయారు చేసే ఈ తరహా పరిశ్రమ దేశంలోనే ఇదే మొదటిదని ఆయన తెలిపారు. స్నేహపూర్వక పారిశ్రామిక విధానం వలన పలు జపనీస్ కంపెనీలు ఆంధ్రప్రదేశకు, ప్రత్యేకించి శ్రీసిటీకి రావడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. తమ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్రాన్ని ఎంచుకోవడం పట్ల టోరే యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామన్నారు. 29 దేశాలకు చెందిన 187 పరిశ్రమలతో 50 వేలకు పైగా ఉపాధి కల్పించి, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్న శ్రీసిటీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.

అయితే ఇది ఇలా ఉంటే, టోరే కంపెనీ, చంద్రబాబు హయంలో వచ్చింది. అప్పట్లోనే ఒప్పందం చేసుకుని, భూమి ఇచ్చి, భూమి పూజ చేసి, కంపెనీ నిర్మాణం ప్రారంభించారు. ఈ కంపెనీని జగన్ తెచ్చినట్టు, వైసీపీ చెప్పటం పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. జరగాలి పెళ్లి... మళ్ళీ మళ్ళీ.. అనే వ్యంగ్య సామెతనుజగన్​ను చూసే పెట్టారేమో అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. కియా మోటార్స్ విషయంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి బుర్రకథ వినిపించారని.. అలాగే తెదేపా హయాంలో వచ్చిన టీసీఎల్​ని తమ ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. తాజాగా 'టోరే' వంతు వచ్చిందన్న లోకేశ్.. ఈ కంపెనీని ఎంతో కష్టపడి చంద్రబాబు తీసుకొచ్చారని గుర్తు చేశారు. తెదేపా హయాంలో 'టోరే' కంపెనీ రాష్ట్రంలో భూమిపూజ చేసిందని... భవనాలూ సిద్ధం అయిపోయన కంపెనీని తామే తెచ్చినట్లు వైకాపా ప్రభుత్వం హడావిడి చేస్తోందన్నారు. కియా మోటార్స్​ను బెదిరించినట్లు టోరేను కూడా బెదరగొట్టి ఏపీ నుంచి తరిమివేయొద్దని కోరారు.

ముఖ్యమంత్రి జగ న్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సాధించిందేమిటని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, అభివృద్ధి నిధులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర వాటి గురించి ఏమీ మాట్లాడనపుడు ఆయన ఢిల్లీ వెళ్లడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఆయన వద్ద 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన వేల కోట్ల నిధు లను అడిగే దమ్ము, ధైర్యం ఆయనకు లేవా అని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో బీజేపీని ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. దేశాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కాగా, దేశంలో బీజేపీని నిలదీసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కళ్యాణ్ అంటూ చమత్కరించారు. జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ఢిల్లీ ముందు సరెండర్ అయ్యారని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న విజయన గరం జిల్లాకు బుందేల్‌ఖండ్ మాదిరిగా కేంద్రం రూ.5వేల కోట్లు ప్యాకేజీ ఇస్తే పక్క జిల్లాల మాదిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింద న్నారు. ఉపాధి హామీ పథకం కింద ఇక్కడ వలసలు నిరోధించగలిగామన్నారు. దళిత మైనార్టీలను కాపాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో వైసీపీ నిలదీస్తే, కాంగ్రెస్ మీకు సహకరిస్తుందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ పాటిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్నార్సీల మీద సుప్రీం కోర్టు తీర్పును పునఃపరిశీలన చేయాలని కేంద్రానికి లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆనాడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే దివంగత వైఎస్ రాజు శేఖరరెడ్డి అంతిమ లక్ష్యమని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి, 42 ఎంపీ సీట్లు గెలిచి, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని చెప్తూ ఉండే వారని గుర్తు చేసారు. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి కూడా, ఈ ఆశయం కోసం పని చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. ఇప్పుడు మాత్రం, జగన్ పూర్తీ భిన్నంగా ఉన్నారని అన్నారు. అలాంటి నాయన పేరు చెప్పుకొని నేడు కాంగ్రెస్ కు బద్ద శత్రువులుగా ఉండే బీజేపీ ముందు జగ న్మోహన్ రెడ్డి తన అధికారం కోసం ప్రధాని మోదీ, అమిత్ షాలకు వంగి వంగి దండాలు పెడుతున్నాడని వ్యంగ్యంగా అన్నారు. రెండు రోజుల నుంచి వస్తున్న ఫోటోలు చూసి, వైఎస్ఆర్ ఆత్మ క్షోబిస్తుందని, శైలజానాథ్ అన్నారు.

క్రైస్తవ మత ప్రబోధకుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ అయిన బ్రదర్ అనిల్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. బ్రదర్ అనిల్, తన పనుల మీద, హైదరాబాద్ నుంచి విజయవాడ కార్ లో వస్తున్న సందర్భంలో, అనిల్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి, రోడ్డు పక్క ఉన్న పొలాల్లోకి దూసుకు వెళ్ళింది. అయితే ఆయన ప్రయాణిస్తున్న కారులో, ఎయిర్ బలూన్స్ ఓపెన్ అవ్వటంతో, బ్రదర్ అనిల్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వాహనం అతి వేగంతో రావాతమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. వాహనాన్ని నియంత్రించే క్రమంలో, వాహనం అదుపు తప్పటంతో, వాహనం పొలాల్లోకి వెళ్ళిపోయింది. అయితే, బ్రదర్ అనిల్ సురక్షితంగా బయట పడటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలంలో, కారు చూసిన ఎవరైనా, పెద్ద ప్రమాదం నుంచి అనిల్ బయట పడినట్టే చెప్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి, విజయవాడ వస్తున్న క్రమంలో, ఈ ఆక్సిడెంట్ అయ్యింది. ఆయనతో పాటుగా, డ్రైవర్, గన్ మెన్ కూడా ఉన్నారని సమాచారం.

న్ మేన్, డ్రైవర్‌కు పలు గాయాలు కావడంతో, వారికీ చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. జరిగిన ప్రమాద విషయాన్ని తెలుసుకున్న, స్థానిక జగ్గయ్య పేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సాధినేని ఉదయభాను వెంటనే అక్కడకి చేరుకున్నారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్టు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం బ్రదర్ అనిల్ అక్కడ నుంచి, విజయవాడ వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అతి వేగమే కారణమా, లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read