తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఈ రోజు సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో, రేపు జరిగే అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని తెలుగుదేశం పార్టీ కీలకనిర్ణయం తీసుకుంది. రేపు మండలి రద్దు చేస్తూ అసెంబ్లీలో చర్చ చేస్తాం అంటూ, ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే, మండలిలో జరిగే విషయాల పై, శాసనసభలో చర్చ చెయ్యటం, రాజ్యంగ విరుద్ధమని, తెలుగుదేశం పార్టీ అభిప్రాయ పడింది. ఏకంగా మండలి చైర్మెన్ ను కించ పరుస్తూ, జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ఆయన ప్రసంగం అసెంబ్లీలో వేసి, ఆయన్ను అవమానించిన తీరుని తెలుగుదేశం పార్టీ ఖండించింది. అలాగే బయట మంత్రులు, మండలి చైర్మెన్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టటం పై కూడా తెలుగుదేశం పార్టీ అభిప్రాయం పడింది. దీంతో ఈ రోజు సమావేశం అయిన తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ, రేపు జరిగే మండలి మీద చర్చకు, అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు. అక్కడకు వెళ్ళినా, మాట్లాడే అవకాసం ఇవ్వరని, అడిగితే సస్పెండ్ చేస్తారని, అక్కడకు వెళ్ళిన ఉపయోగం లేదని, అందుకే రేపు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఎమ్మెల్సీలు ఎవరూ, ప్రభుత్వం పెట్టిన ప్రలోభాలకు లొంగకపోవటం పై, చంద్రబాబు, అందరినీ అభినందించారు. మీ పోరాటం రాష్ట్ర చరిత్రలో నిలిచి పోతుందని అన్నారు. ఎన్ని ప్రలోభాలు, బెదిరింపులు చేసినా, ఎవరూ లొంగ లేదని, అందుకే జగన్ మోహన్ రెడ్డి, ఈ సమావేశానికి అందరూ వచ్చారని తెలుసుకుని, ఇక మండలి రద్దుకే మొగ్గు చూపారని, అందుకే రేపు ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశ పెట్టి, అక్కడ తీర్మానం పెట్టి, ఆ బిల్ ను, రేపు అసెంబ్లీలో పెట్టటానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే, తమ అభ్యర్ధులు ఎవరూ, ఈ మూడు రోజోల్లో లొంగలేదని, అందుకే , జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఒక తప్పు కోసం, పది తప్పులు చేస్తున్నారు, ఈ క్రమంలో రాష్ట్రం నష్టపోతుంది అంటూ, తెలుగుదేశం నేతలు అభిప్రాయ పడుతున్నారు.
అయితే ఈ సమావేశంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జగన్ మోహన్ రెడ్డి పరిపలన చూసిన మొదట్లోనే, తెలుగుదేశం పార్టీ, జగన్ ను తుగ్లక్ తో పోలుస్తూ వచ్చింది. జగన్ నిర్ణయాలు అన్నీ రివర్స్ లో ఉన్నాయని, అప్పటి తుగ్లక్ పాలన గుర్తు చేస్తుంది అంటూ, టిడిపి ఆరోపిస్తుంది వస్తుంది. ఈ నేపధ్యంలోనే, తుగ్లక్, హింసించే 23వ రాజు పులికేసి సినిమాలోని కొన్ని సీన్లు, ఈ రోజు టీడీఎల్పీలో, టిడిపి సిబ్బంది వేసి, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చూపించింది. ఆ సినిమాల్లోని సన్నివేశాలు, ఇప్పటి జగన్ పాలన లాగే ఉన్నాయని నవ్వుకున్నారు. ముఖ్యంగా తుగ్లక్ సినిమాలో, రాజధానిని ఒకసారి మార్చటం, మళ్ళీ వెంటనే వేరే చోటుకి మార్చటం, అదేమిటి అంటే, నా ఇష్టం అంటూ, తుగ్లక్ చెప్పిన సీన్ చూసి, అందరూ నవ్వుకున్నారు. సినిమాలు చూసి నవ్వుకున్నా, మన రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే బాధ వేస్తుందని అంటున్నారు.