అంతా అనుకున్నదే జరిగింది. 33 రోజుల పాటు, అమరావతి రైతులు చేసిన ఆందోళన అరణ్య రోదనే అయ్యింది. రైతులు కన్నీళ్ళు మధ్యే, ఈ రోజు భేటీ అయిన క్యాబినెట్, అమరావతి రైతుల నెత్తిన పిడుగు పడే నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుపై మంత్రివర్గం చర్చించింది. హైపవర్‌ కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం ఏడు అంశాల అజెండాగా మంత్రివర్గ సమావేశం కొనసాగింది. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలివి.. హైవపర్‌ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుకు ఆమోదం. సీఆర్‌డీఏ రద్దుకు కేబినెట్‌ ఆమోదం. పులివెందుల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం. ఏఎంఆర్డీఏ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం.

jagan 200122020 1

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి లోకాయుక్త విచారణకు ఆమోదం. రైతులకు 15 ఏళ్లపాటు కౌలు చెల్లించేందుకు నిర్ణయం. క్యాబినెట్ నిర్ణయం తరువాత, అసెంబ్లీ బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన బీఏసీ హాజరైన సీఎం జగన్ ,శ్రీకాంత్ రెడ్డి
, మంత్రులు బుగ్గన,కన్నబాబ,అనీల్ కుమార్ . టీడీపీ నుండి హాజరైన అచ్చెన్నాయుడు. బీఏసీ సమావేశం తరువాత, వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు 2020ను సభలో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. AP సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టిన మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. తరువాత వికేంద్రీకరణ బిల్లు పై అసెంబ్లీలో, చర్చను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు.

jagan 200122020 1

ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ, "కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని. కర్నూలులోనే న్యాయపరమైన అన్ని శాఖలు. హైకోర్టు అనుమతి తర్వాత ఇవి ఏర్పాటు చేస్తాం. ఇది చారిత్రాత్మక బిల్లు. అమరావతిలోనే లెజిస్లేటివ్ రాజధాని, విశాఖలో రాజ్‌భవన్‌, సచివాలయం. పన్ను కట్టే ప్రతివారికి న్యాయం చేయాలి. పరిపాలన అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ బిల్లు. సమ్మిళిత అభివృద్ధి మన లక్ష్యం" అని బుగ్గన తెలిపారు.

అమరావతిలో అసెంబ్లీ ముట్టడి ఉండటంతో, భారీ బందోబస్తు ఉన్న సంగతి తెలిసిందే. ఒక్క పురుగుని కూడా మేము బయటకు వదలం అంటూ, పోలీసులు ప్రకటనలు చేసారు. అడుగడుగునా ఒక పోలీసుని పెట్టరు. మొత్తం 8 వేల మంది పోలీసులని కాపలా పెట్టారు. కొద్ది సేపటి క్రితమే, అటు వైపు నుంచి జగన్ మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు, మందడం మీదుగా అసెంబ్లీకి వెళ్లారు. అయితే, ఉన్నట్టు ఉండి, అమరావతి ప్రజలు వ్యూహం మార్చారు. ఒకేసారి దాదాపుగా 3 వేల మంది, బయటకు వచ్చారు. తుళ్ళూరు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకేసారి అంత మంది రావటంతో, పోలీసులు కూడా షాక్ అయ్యారు. ముఖ్యంగా మహిళలు అధికంగా ఉండటంతో, పోలీసులకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. క్షణాల్లోనే, పోలీసుల నిర్బంధాలు దాటుకుని, రైతులు, మహిళలు అసెంబ్లీ వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో పోలీసులు ఖంగు తిన్నారు. అంతా కంట్రోల్ లో ఉంది అని భావించిన టైంలో, ఇలా జరగటంతో, ఒక్కసారిగా పోలీసులు అవాక్కయ్యారు.

asembly 20012020 2

అయితే ఇక్కడ రైతులు ఎంచుకున్న వ్యూహం చూసి పోలీసులు కూడా షాక్ తిన్నారు. రైతులు, మహిళలు ఒక్కసారిగా బయటకు రావటంతో, పోలీసులు మూడంచెల బధ్రత కూడా పని చెయ్యలేదు. అదే విధంగా, రైతులు అడ్డ దారిలో, ప్రయాణం అవ్వటంతో, పోలీసులకి కూడా ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదు. దాదాపుగా 3 వేల మంది, ఇప్పటికే నేలపాడులో ఉన్న హైకోర్ట్ దాకా చేరుకున్నారు. నేలపాడు పొలాలల్లో నుంచి, వెలగపూడికి చాలా తేలికగా చేరుకోవచ్చు. అన్నీ పొలాలు కావటంతో, పోలేసులకు కూడా ఎటు వైపు నుంచి రావాలో అర్ధం కావటం లేదు. పరిస్థితి ఒక్కసారిగా మారిపోవటంతో, పోలీసులు మిగతా ప్రాంతాల నుంచి, బలగాలను ఇక్కడకు తెప్పిస్తున్నారు.

asembly 20012020 3

ఎలాగైనా అసెంబ్లీకి చేరుకొని, రైతుల దమ్ము ఏమిటో జగన్ మోహన్ రెడ్డికి చూపిస్తామని రైతులు అంటుంటే, పోలీసులు మాత్రం, ఎలా అయినా, అడ్డుకుని తీరుతామని అంటున్నారు. ఇక మరో పక్క, ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం సమావేశంలో ఏడు బిల్లు లకు ఆమోదం తెలిపిన క్యాబినెట్ .హై పవార్ కమిటీ నివేదిక కు ఆమోదం తెలిపిన క్యాబినెట్. వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.  ఈ బిల్లుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి మద్దతు తెలిపేలా అధికార పక్షం కసరత్తు పూర్తి చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నుంచి నలుగురు ఎమ్మెల్యేల చొప్పున బిల్లుపై సభలో మాట్లాడనున్నారు.

అమరావతిలో, ఈ రోజు అసెంబ్లీ ముట్టడి ఉండటంతో, ఈ రోజు విజయవాడలో కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఈ రోజు ప్రకాశం బ్యారేజి పూర్తిగా మూసేస్తారు. ఇది పోలీస్ వారి ప్రెస్ నోట్... "తేది.19-01-2020. అమరావతి నుండి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కారణంగా ప్రకాశం బ్యారేజ్ప వాహనాల రాకపోకలు నిషేధం. ప్రకాశం బ్యారేజ్ మీదుగా ప్రయాణించే వాహనాల ట్రాఫిక్ మళ్ళింపు ది. 20.01.2020న అమరావతి పరిరక్షణ సమితి, జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఇతర రాజకీయ పార్టీలతో కలసి తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ప్రకాశం బ్యారేజీపై అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధిస్తూ, బందరురోడ్డు, ఏలూరు రోడ్డు, కృష్ణలంక (సీతమ్మవారి పాదాలు), కుమ్మరిపాలెం మరియు ఒటౌన్ ప్రాంతాల వైపు నుండి మరియు తాడేపల్లి మరియు సీతానగరం వైపు నుండి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు సాగించే అన్ని రకాల వాహనాలను ఈ క్రింది విధంగా మళ్లించడం జరుగుతుంది. అలాగే ప్రకాశం బ్యారేజ్ పై పాదాచారుల రాకపోకలను కూడా నిషేధించడం జరుగుతుంది.

ట్రాఫిక్ మళ్ళింపు చర్యలు : - గొల్లపూడి, కుమ్మరిపాలెం మరియు ఒటౌన్ ప్రాంతాల నుండి వచ్చే అన్ని రకాల వాహనాలు గొల్లపూడి వద్ద నుండి సితార సెంటర్, సి.వి.ఆర్, ప్లైఓవర్, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్ మీదుగా పంజా సెంటర్, రైల్వే వెుకింగ్, ఆర్.టి.సి. టెర్మినల్, లోబ్రిడ్జి, ప్రకాశం బొమ్మ, పోలీస్ కంట్రోల్ రూమ్, బందరు లాకులు మీదుగా 9వ నెంబరు జాతీయ రహదారికి చేరుకుని అక్కడ నుండి కనకదుర్గ వారధి మీదుగా ప్రయాణించాలి మరియు భవానీపురం, ఆర్టీసీ వర్క్ షాపు రోడ్లు, భవతీకాటా, సితార, సి.వి.ఆర్. ఫ్లైఓవర్ మీదుగా ప్రయాణించాలి. ఏలూరు రోడ్డు మరియు బందరు రోడ్డు వైపు నుండి వచ్చే అన్ని రకాల వాహనాలు బందర్ లాకుల మీదుగా 9వ నెంబరు జాతీయ రహదారికి చేరుకుని అక్కడి నుండి కనకదుర్గ వారిధి మీదుగా ప్రయాణించాలి. గుంటూరు, తాడేపల్లి, సీతానగరం వైపు నుండి వచ్చే వాహనాలను మరియు పాదచారులను ప్రకాశం బ్యారేజీపై రాకపోకలను అనుమతించబడవు. హైదరాబాద్ నుండి వచ్చు లారీలు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా ప్రయాణించాలి. అదే విధంగా ది.20.01.2020 నుండి ది. 23.01.2020 వరకు ఎటువంటి భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం వైపు నుండి విజయవాడ నగరంలోకి అనుమతించబడవు.

పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి భవానీపురం వెళ్ళు వారు సీతమ్మ వారి పాదాలు, వినాయక టెంపుల్, కాళేశ్వరరావు మార్కెట్, పంజా సెంటర్, వి.జి. చౌక్, చిట్టినగర్, సితార మీదుగా భవానీపురం ప్రయాణించాలి. హనుమాన్ జంక్షన్ నుండి ఎటువంటి భారీ వాహనాలను విజయవాడ నగరంలోనికి అనుమతించబడవు. మచిలీపట్నం నుండి చెన్నై వెళ్ళు వారు పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ, బాపట్ల, ఒంగోలు మీదుగా ప్రయాణించవలెను. చెన్నై నుండి మచిలీపట్నం వెళ్ళు ఒంగోలు, బాపట్ల, అవనిగడ్డ, చల్లపల్లి, పామర్రు మీదుగా ప్రయాణించవలెను. గుంటూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, మిరియాలగూడ, నార్కెట్పల్లి మీదుగా ప్రయాణించవలెను. హైదరాబాద్ నుండి గుంటూరు వైపు వెళ్ళు వాహనాలు నార్కెట్పల్లి, మిరియాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా ప్రయాణించవలెను. మచిలీపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు వాహనాలు మచిలీపట్నం, పామర్రు, హనుమాన్ జంక్షన్, నూజివీడు, విస్సన్నపేట, కల్లూరు, వైరా, ఖమ్మం , సూర్యాపేట మీదుగా ప్రయాణించవలెను. హైదరాబాద్ నుండి మచిలీపట్నం వైపు వెళ్ళు వాహనాలు హైదరాబాద్, ఖమ్మం, వైరా, కల్లూరు, విస్సన్నపేట, నూజివీడు, హనుమాన్‌జంక్షన్, పామర్రు మీదుగా ప్రయాణించవలెను. కావున పైన పేర్కొన్న ట్రాఫిక్ మళ్ళింపు చర్యలను ప్రజలు మరియు వాహన చోదకులు గమనించి ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు, యథావిధిగా అమరావతిలో అభివృద్ధి పనులు తదితరంశాలే కీలకంగా ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి శాసనసభా సమావేశాలు జరుగను న్నాయి. ఈ సమావేశాల్లో అనుకున్నది అనుకున్నట్లు జరిగి తీరా ల్సిందేనని వైఎస్ జగన్మోహనరెడ్డి పార్టీ ఎమ్మల్యేలకు, మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి వ్యుహత్మక మార్గదర్శకాలను ఆయన పార్టీ ఎమ్మల్యేలకు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం ఉదయం సైతం ముఖ్యమంత్రి కీలకనేతలతో సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి పిల్లిసుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో ఆయన పలు అంశాలపై చర్చించి, పలు సూచనలు చేసారు. అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ బిల్లును సమావేశం ప్రారంభమై, సభా సంప్రదాయక అంశాలు ముగిసిన వెంటనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్, వురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి బోత్సా సత్య నారాయణలు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. అంతకు ముందు ఈ బిల్లు, ఇతరంశాలపై బీఎసిలోను ప్రస్తావిస్తారు. నిజానికి సమావేశంలో ఆర్థిక బిల్లుగా సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టే అంశాల గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి శాసనసభా వ్యవహరాల మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న మంత్రి బుగ్గన, చీప్ శ్రీకాంతరెడ్డితో ఇప్పటికే క్షుణంగా, సుదీర్ఘంగా చర్చించారు.

ఈ చర్చల్లో భాగంగా సీఆర్డీఎ చట్టం రద్దును ఆర్థిక బిల్లుగా ప్రవేశపెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే! వికేంద్రీ కరణ బిల్లుకు సంబంధించి హైపవర్ కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదికను సిఎంకు సమర్పించింది. ఈ కమిటీ పూర్తి నివేదికను ఆదివారం రాత్రిలోపు, లేదా మంత్రి వర్గ సమావేశానికి కొద్దిగంటల ముందు ముఖ్యమంత్రికి సమర్పిస్తుంది. నివేదికలోని అంశాలు ఇతర సూచనలు సాంకేతిక, చట్టపరమైన దిశలో రూపొందించి ప్రభు త్వానికి హైపవర్ కమిటీ అందజేసింది. ఈ నివేదికకు అనుగుణంగా ఉదయం తొమ్మిదిగంటలకు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేయడం, ఆ వెంటనే గవర్నరు అనుమతిని తీసుకోవడం, 11 గంటలకు ఆరంభమయ్యే శాసనసభా సమావేశంలో బిల్లుగా ప్రవేశపెట్టడం జరిగిపోతుంది. శాసన మండలిలోను బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింవచేసేందుకు వీలుగా వ్యుహన్ని ప్రభుత్వం సిద్ధం చేసిందంటున్నారు. శాసనమండలి 21న ఆరంభమవుతుంది. శాసనసభా సమావే శాలు మూడు రోజులు జరిగితే, మండలి సమావేశం ఒక్క రోజు మాత్రమే జరిగే అవకాశం ఉంది.

అందువలన 21న ఉభయ సభల ఉమ్మడి సమావేశం నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఇదంతా ఒక ఎత్తు కాగా శాసనసభ ప్రత్యేక సమావేశాల ఆరంభమగుతున్న సందర్భంలో ప్రతిపక్షం తెలుగుదేశం కీలక వ్యుహన్ని చేయనున్నదంటున్నారు. ఇప్పటికే టిడిఎల్పీ సమావేశాన్ని నిర్వహించి, ఆ పార్టీ ఎంఎలకు విప్ జారీ చేసింది. అదే సందర్భంలో అసెంబ్లీ ముట్టడికి విపక్షనేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వీటన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కోనే దిశలో సిఎం జగన్ ఎంఎలకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి అనుమతి లేదని గుంటూరు రేంజీ ఐజి విని లాల్ ప్రకటించారు. ఆ ప్రాంత గ్రామాల రైతులకు అసెంబ్లీ సమా వేశాలకు ఆటంక కలిగిస్తే చర్యలుంటాయని పోలీసులు నోటీసులు జారీ చేసారు. ఇదే సందర్భంలో టిడిపి కుడా సీఆర్టీఏ, అమరావతి అంశాలపై ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ బిల్లు ప్రవేశాన్ని తీవ్రంగా అడ్డు కోవాలని జగన్ ఎమ్మల్యేలకు ఆదేశించారు. ఇక జగన్ అసెంబ్లీకి వచ్చే దారుల్లో పోలీసులు మూడం చెల పోలీసు భద్రతను, విస్తారంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పలు ప్రాంతాల్లో జెఎసి నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read