జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మఓడి పధకం పై ప్రజల్లో కూడా ఆసక్తి ఉంది. ఒకేసారి 15 వేలు ఇస్తారు అని చెప్పటంతో, పెద్ద ఎత్తున అప్లై చేసారు. అయితే జగన్ పాదయాత్రలో, ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మ ఓడి ఇసం అని చెప్పి, కేవలం ఒక్కరికే అని అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పారు. ఇక తరువాత కేవలం ప్రభుత్వం స్కూల్స్ కే అని, తరువాత కాదు, ప్రైవేటు స్కూల్స్ కి కూడా అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త జీవో వచ్చింది. దీని ప్రకారం, రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల్లో రూ. 12 వేలపైబడి జీతాలు అందుకుంటున్న వారి పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తించదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నష్టపోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, అనుబంధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఈ పేస్కేల్ ఉన్నవారే.

ammavodi 03012020 2

గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. లక్షా 20 వేలు, పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. లక్షా 44 వేల కన్నా ఎక్కువ జీతాలు అందుకునే వారి కుటుంబాలన్నింటినీ అమ్మ ఒడికి అనర్హు లుగా పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు చేసుకుంటున్న లక్షలాది మంది అనర్హులుగా మారనున్నా రు. ఈ ఉద్యోగుల్లో ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చదివిస్తున్న వారైతే మరింత ఇబ్బంది పడనున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు అమ్మఒడిని అందిస్తామని ప్రకటించడంతో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఆర్థికంగా భారమైనా కూడా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్చారు. ఇప్పుడు తాజాగా వెలువడిన ఉత్తర్వులతో వారందరిపైనా భారం పడనుంది. మరో వారం రోజుల్లో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనుండగా.. అన్ని పాఠశాలల్లో అర్హుల జాబితాలు సిద్ధమైన తర్వాత ఈ ఆదేశాలు వెలువడటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ammavodi 03012020 3

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన తుది జాబితాలు సిద్ధమవుతున్నాయి. మరో వారం రోజుల్లో పథకాన్ని ప్రారంభించాల్సి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఐదు రోజుల కార్యక్రమాల షెడ్యూల్ విడుదల చేశారు. మరోవైపు అన్ని అర్హతలు ఉండి, ఏవేని కారణాలతో అనర్హులుగా గుర్తించిన వారిని అర్హులుగా గుర్తించే అవకాశాన్ని డీఈవోలకు కల్పించారు. డీఈవోలు కార్యక్రమాన్ని ప్రారంభించే రోజు వరకు అర్హులకు సంబంధించిన మార్పులు చేయొచ్చు. ఐదు రోజుల ప్రణాళికలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, అన్ని జూనియర్ కళాశాలల్లో పండుగ వాతావరణంలో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు గురువారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమ్మ ఒడిని ప్రారంభించే రోజైన 9వ తేదీన అర్హులైన తల్లులు, సంరక్షకులను, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులను ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆహ్వానించాలని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జగన్ మోహన్ రెడ్డి అహంభావం, అనుభవ లేని, అజ్ఞానంతో, రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టుతున్నారని, రాష్ట్ర ప్రజలు ఆందోళనలో ఉన్నారని, తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కే.ఎస్‌.జవహర్‌ అన్నారు. నిన్న ఆత్మకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డే అనుకుంటే, ఆయన మంత్రులు కూడా, ఇలాగే ఉన్నారని, వీరితో రాష్ట్ర ప్రజలకు అయోమయం నెలకొందని అన్నారు. ఆ బొత్స ఏమి మాట్లాడతారో, ఆయనకే తెలియదు, ఆయన అయోమయంలో ఉంటాడు, అందరినీ అయోమయానికి గురి చేస్తాడు, ఇలాంటి వ్యక్తి, భువనేశ్వరి గారిపై విమర్శలు చేస్తుంటే, ఇంకా ఏమి చెప్పాలని అన్నారు. కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్ళినా పెడ అర్ధాలు తీస్తున్నారని, దాన్ని కూడా తప్పుబడుతున్నారని అన్నారు. రాజధానిలో రైతులు, ముఖ్యంగా ఎప్పుడు బయటకు రాని ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చెయ్యటంతో, ఆమె చేలించి, వారికి మద్దతు పలకటానికి వచ్చారని, వారి ఆవేదనకు, ఆమె బంగారు గాజు ఇచ్చారని, ఈ విషయాన్ని కూడా బొత్సా వంకరగా మాట్లాడుతున్నారని జవహర్‌ మండిపడ్డారు.

jawahar 03012020 2

రైతుల కోసం, ఆందోళన చేస్తున్న మహిళలు కోసం, ఆమె సంఘీభావంగా గాజులు ఇస్తే, అలాంటి ఆడపడుచూ పై, నోరుపారేసుకున్న బొత్సా, ముందుగా తన నోటిని ఫినాయిల్‌తో కడుక్కోవాలని అన్నారు. ఆయన అలా తన నోటిని ఫినాయిల్‌తో కడుక్కోవాలని, అందుకోసం ఒక ఫినాయిల్‌ బాటిల్‌ ను, బొత్సకి గిఫ్ట్ గా పంపిస్తున్నానని అన్నారు. బొత్సాకు అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. ముందుగా ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి, వైసీపీ మంత్రులు తెలుసుకోవాలని అన్నారు. అమరావతిలో, 5 ఏళ్ళలో జరిగిన భూక్రయవిక్రయాల గురించి, రిజిస్ట్రేషన్‌ల గురించి, కనీస అవగాహన లేకుండా, నోటికి వచ్చిన లెక్క చెప్పటం, బొత్సాకే చెల్లింది అన్నారు. నోటికి వచ్చింది కాకుండా, ఆధారాలు చూపించాలని కోరారు.

jawahar 03012020 3

విశాఖపట్నంలో, ఈ ఏడు నెలల్లో 55 వేల ఎకరాల కొనుగోళ్ళు, అమ్మకాలు జరిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాల పై, ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలని అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో భూములు కొన్న వారి పేర్లు చెప్పాలని అన్నారు. అమరావతి ప్రాంతంలో 50 శాతం పైగా ఎస్సీలు ఉంటే, అది ఒక సామాజికవర్గం కోసం అంటూ బొత్సా ప్రతి రోజు మాట్లాడుతున్నారని అన్నారు. అసలు వీళ్ళకు అమరావతి అంటే ఎందుకు ఇంత మంట అనేది చెప్పాలని అనంరు. కులాల మధ్య ఎన్నికల ముందే చిచ్చు పెట్టారని, ఇప్పుడు ప్రాంతాల మధ్య పెట్టారని, రేపు మతాల మధ్య చిచ్చు పెడతారని, ప్రజలు వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండక పొతే, నష్టపోతామని అన్నారు. టిక్ టాక్ లు చేసుకునే మంత్రి కూడా, మమ్మల్ని విమర్శిస్తున్నారని అన్నారు.

అమరావతిని ఇక్కడ నుంచి తరలించటానికి వైసీపీ ప్రభుత్వం, ప్రజలను ఒప్పించటానికి రాజకీయ వ్యూహాన్నే అమలు చేస్తుంది. ముందుగా ఇక్కడ వరదలు వస్తాయి, మొత్తం ప్రాంతం మునిగిపోతుంది అనే విషయం ప్రజల్లోకి తీసుకు వెళ్ళటానికి చూసారు, కాని ఇది వర్క్ అవుట్ అవ్వలేదు. ఎందుకంటే, అమరావతి రాజధాని ప్రాంతం, ఎంత పెద్ద రికార్డు వరద వచ్చినా మునిగింది లేదు. 2009 అతి పెద్ద వరద వచ్చినా, కర్నూల్ మునిగింది కాని, అమరావతి మునగలేదు. అమరావతికి వరద ముప్పులేదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన విషయం కూడా తెలిసిందే. ఆ తరువాత, అమరావతి ప్రాంతం పై కుల ముద్ర వేసారు. అయితే కుల ముద్ర కూడా వర్క్ అవ్వలేదు. ఎందుకంటే అమరావతి ప్రాంతం, తాడికొండ నియోజకవర్గంలో ఉంది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అలాగే పక్కనే ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ కూడా ఓడిపోయారు అంటే, వైసీపీ వేసిన కుల ముద్ర తప్పు అని ప్రజలకు అర్ధమైంది. అందుకే వైసీపీ ప్లాన్ మార్చింది.

ambati 02012020 2

అమరావతిలో మొత్తం చంద్రబాబు బినామీలే కొన్నారని, అమరావతి ప్రకటనకు ముందే అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇక్కడ అమరావతి రాజధాని అయితే, చంద్రబాబుకే లబ్ది అని, అక్కడ రైతులకు ఏమి ఉపయోగం లేదు అంటూ ప్రచారం మొదలు పెట్టరు. అసెంబ్లీలో కూడా 4070 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ ప్రచారం చేసారు. ఏవేవో లెక్కలు చెప్పారు, కాని ఎక్కాడ డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు. గత మూడేళ్ళుగా సాక్షిలో రాసిందే, అసెంబ్లీలో చెప్పారు. అయితే అమరావతి ప్రాంతంలో అసలు, చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి, అమరావతి ప్రకటన వచ్చేంత వరకు, 150 ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ అవ్వనట్టు లెక్కలు ఉన్నాయని టిటిపి చూపిస్తుంది.

ambati 02012020 3

అయితే, ఈ రోజు వైసీపీ ప్రెస్ ను పిలిచింది. అన్ని ఆధారాలతో ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి బయట పెడుతున్నాం, రమ్మని మీడియాకు చెప్పింది. మీడియా మొత్తం లైవ్ లు ఇచ్చారు. తీరా అక్కడ చూస్తే, అసెంబ్లీలో బుగ్గన మాట్లాడిన దాన్ని, వేరే ఎవరితోనే వాయిస్ ఓవర్ చెప్పించి, ఇదే ఆధారాలు అంటూ అంబటి మీడియాకు చెప్పారు. ఇంత హడావిడి చేసి, ఆధారాలు చూపించకుండా, అవే ఆరోపణలు చెయ్యటంతో, అసలు వైసీపీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని అర్ధమైంది. ప్రభుత్వంలో ఉండి కూడా, వైసీపీ కేవలం పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి, ఏదో జరిగిపోయింది అంటూ, గతంలో చెప్పిందే చెప్పింది అంటే, అక్కడ ఏమి జరగలేదని అర్ధమవుతుందని అంటున్నారు. ఇలా ఈ రోజు వైసీపీ ఏదో బయట పెడుతుంది అనుకుంటే, ఏదో జరిగింది.

గతంలో అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన చెప్పిన తప్పుడుమాటలనే, వైసీపీ ఎమ్మెల్యే అంబటి మరింత అందంగా వల్లెవేశాడని, కట్టుకథలకు, అబద్ధాలకు, అసత్యా లను నిజం చేయడానికి ప్రయత్నించాడని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే బొండా ఉమామ హేశ్వరరావు ఎద్దేవాచేశారు. గురువారం సాయంత్రం మాజీమంత్రి జవహర్‌తో కలిసి, ఆత్మకూరులోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఒకటిచెబితే, సాక్షిపేపర్‌లో, వాళ్ల ఛానల్‌లో గతంలో వండివార్చిన కట్టుకథలు, కాకమ్మ కథలకు మరింతమెరుగులద్ది, అమరావతి ప్రాంతంలో 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు జరిగిన ప్రతి కొనుగోలుని, భూక్రయవిక్రయాలను టీడీపీకే అంటగట్టడానికి వైసీపీనేతలు అంబటిరాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తమశక్తి మేరకు కృషిచేశారన్నారు. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ అని పదేపదేమాట్లాడే అంబటి, ఇతరనేతలకు ఆ పదానికి అర్థం తెలుసా అని బొండా ప్రశ్నించారు. గతంలో తెలుగుదేశంపార్టీ నేతలు ఎక్కడెక్కడ ఎంతెంతభూములుకొన్నారు.. ఎప్పుడు కొన్నారనే వివరాలు పత్రాలతో సహా తమవద్ద ఉన్నాయని, ఈవివరాలన్నింటిపై చర్చించడానికి వైసీపీనేతలుగానీ, ముఖ్యమంత్రి గానీ సిద్ధమేనా అని బొండా ప్రశ్నించా రు. అమరావతి రైతుల సమక్షంలోనైనా, తాడేపల్లి వైసీపీ కార్యాలయంలోనైనా మీడియా సమక్షంలో చర్చకు తాము సిద్ధమని ఆయన స్పష్టంచేశారు.

ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరు భూములుకొన్నారు... ఎన్‌ఆర్‌ఐ, ప్రముఖ వైద్యుడైన వేమూరి రవి 2004-2005లోనే 6ఎకరాలు కొన్నారని, ఆ తరువాత 2014లో రాష్ట్రవిభజన తర్వాత మరో 7 ఎకరాలు కొంటే, ఆయన్ని లోకేశ్‌బినామీ అనడం బురదజల్లడం కాదా అని ఉమానిలదీశారు. 2013లో కాంగ్రెస్‌ హయాంలో, ఎమ్‌.ఎన్‌.సీ. రామారావు (బాలకృష్ణ వియ్యంకుడు) పరిశ్రమ ఏర్పాటుకు భూమికావాలని దరఖాస్తు చేసుకుంటే, 28-09-2013న జగ్గయ్యపేటలోని జయంతిపురంలో భూకేటాయింపు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక భూముల ధరలు పెరగడంతో ఆ ధర ప్రకారం సదరు కంపెనీనుంచి మిగిలినసొమ్ముని వసూలు చేయడమైందన్నారు. ఆభూమిని ఇప్పటికీ తమకు అప్పగించలేదని, మాకు ఆభూమి అవసరంలేదని రామారావు గారి కుమారుడు భరత్‌ చెప్పాడని, తమడబ్బులు తమకు తిరిగివ్వాలని కూడా కోరాడన్నారు. దాన్నికూడా ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ అని ప్రచారం చేయ డం వైసీపీకే చెల్లిందన్నారు. వై.ఎస్‌., కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్యల హయాంలో చేసి న భూకేటాయింపుల్ని టీడీపీకి ఎలా అంటగడతారని బొండా నిలదీశారు.

పబ్లిక్‌లిమిటె డ్‌ కంపెనీ అయిన హెరిటేజ్‌ సంస్థ, చిల్లింగ్‌ కేంద్రాలఏర్పాటుకోసం కంతేరులో 2013లో 5చోట్ల భూములు కొనడం జరిగిందన్నారు. ఈకొనుగోళ్లు కూడా ఆసంస్థ బోర్డు డైరెక్టర్ల అనుమతితోనే జరిగిందన్నారు. మాజీమంత్రి నారాయణపై కూడా ఇలానే తప్పుడు ఆరోపణలుచేస్తే, ఆయన కోర్టులో పరువునష్టం దావా వేశాడన్నారు. అలానే పయ్యావుల కేశవ్‌, ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, పుట్టా సుధీర్‌లపై కూడా ఆరోపణలు చేశారన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర తనకూతురి పేరుతో ఇల్లు కట్టుకోవడానికి ఈప్రాంతవాసిగా ఒకగజం కొంటే దానిపై రాద్ధాంతం చేస్తారా.. అని బొండా మండిపడ్డారు. 4096 ఎకరాలు కొట్టేశారంటున్న వైసీపీ నేతలు వాటికి సంబంధించిన ఆధారాలను పూర్తివివరాలతో మీడియాకు చూపాలన్నారు. వైసీపీనేతలు ఇచ్చిన జాబితాలో2004 నుంచి చూసినా, మొత్తం కలిపినా 50ఎకరాలుకూడా లేదని, లేనిదాన్ని ఉన్నట్లుగా చూపుతూ 4వేలఎకరాలని చెప్పడం వక్రబుద్ధులున్న వైసీపీకే చెల్లిందన్నారు. ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ చట్టంపరిధిలోకి రాని అంశాన్ని దానిపేరుతో ఎలా దుష్ప్రచారం చేస్తారన్నారు. క్విడ్‌ప్రోకో ద్వారా లక్షలకోట్లు కొట్టేసిన అనుభవాన్ని ఇలా ఉపయోగించారని మాజీఎమ్మెల్యే ఎద్దేవాచేశారు.

టీడీపీవాళ్లు కొంటే దోపిడీనా... వైసీపీవాళ్లు చేస్తేనేమో దేశంకోసమా...? టీడీపీపై విషప్రచారం చేయడానికి లేనిదాన్ని ఉన్నట్లుగా చూపిన అంబటి రాంబాబు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతరనేతలుకొన్న భూముల వివరాలపై ఎందుకు నోరెత్తలేదన్నారు? మంత్రి కొడాలినాని నరుకుళ్లపాడులో 8ఎకరాలు కొన్నారని, ఆళ్ల రామకృష్ణారెడ్డి నీరుకొండలో తనభార్యపేరుతో 5ఎకరాలు కొన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లోనే పేర్కొన్నా డన్నారు. పెదకూరపాడు వైసీపీఎమ్మల్యే నంబూరు శంకరరావు 5ఎకరాలు కొన్నాడని, గుంటూరుపశ్చిమ వైసీపీఇన్‌ఛార్జ్‌ చంద్రగిరి ఏసురత్నానికి భూములున్నాయని, వినుకొండ వైసీపీఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి 34ఎకరాలున్నాయని, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భర్తపేరుమీద 2ఎకరాలు ఉందని, వీళ్లందరూ అంబటికి, వైసీపీనేతలకు కనిపించలేదా అని బొండా ఆగ్రహంవ్యక్తంచేశారు. 4096 ఎకరాలు టీడీపీనేతలు కాజేశారంటు న్న వైసీపీనేతలు, వాటికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలన్నారు.

పవన్‌కల్యాణ్‌ చంద్రబాబుకి దత్తపుత్రుడనేంతస్థాయి, సత్తా అంబటికి లేదన్నారు. పవన్‌, చంద్రబాబుకి దత్తపుత్రుడైతే, అంబటి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, నోటికేదొస్తే, అది మాట్లాడే వైసీపీనేతలు జగన్మోహన్‌రెడ్డి పెంపుడుకుక్కలా అని బొండా నిగ్గదీశారు. పెంపుడుకుక్కల్లా, పెయిడ్‌ ఆర్టిస్ట్‌ల్లా వైసీపీనేతలు మాట్లాడుతున్నారన్నారు. పవన్‌ కల్యాణ్‌ని, పవన్‌నాయుడంటున్న వాళ్లకు మీసంమీద చెయ్యేసిమరీ, ఆయన పాలకొల్లు పవన్‌నాయుడని చెబుతున్నామన్నారు. ఇష్టమొచ్చినట్లుగా ఆయనగురించి, చంద్రబాబు గురించి మాట్లాడేవారెవరైనా సరే, వారికి తాముఎవరనే సందేహముంటే, డీ.ఎన్‌.ఏ పరీక్షలు చేయించుకోవాలని బొండా తేల్చిచెప్పారు. పదవులకోసం అమ్ముడుపోయారు కాబట్టే, రాజధానిని చంపేస్తున్నా వైసీపీవాళ్లు నోరెత్తడం లేదన్నారు. గతంలో అసెంబ్లీలో బుగ్గన 6 నుంచి 700 ఎకరాలంటే, ఇప్పుడేమో 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు కృష్ణా, గుంటూరుజిల్లాల్లో జరిగిన భూముల క్రయవిక్రయాలన్నింటినీ టీడీపీకి అంటగట్టి 4096ఎకరాలుగా లెక్కతేల్చార న్నారు.

రైతులకోసం వచ్చిన భువనేశ్వరిపై కూడా పిచ్చికూతలుకూయడం వారికే చెల్లిందన్నా రు. మహిళల బాధలు చూసి, తనచేతిగాజులిస్తే, సిగ్గులేకుండా మాట్లాడతున్నారన్నా రు. అధికారంలోకి వచ్చి ఏడునెలలైనా గతప్రభుత్వం చేయకపోయినా, చేశారంటున్న అక్రమాలపై, అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఉమా నిలదీశారు. వాస్తవానికి ఏమీజరగలేదు కాబట్టే ఏడునెల్లనుంచీ గడ్డిపీకుతున్నారని ఆయన మండిపడ్డా రు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25వేల ఎకరాలు కాజేశారని, పుస్తకాలేసి తప్పుడుప్రచారం చేసిందిచాలక, ఇప్పుడు కొత్తగా 4వేల ఎకరాలంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు. ఉధృతమవుతున్న అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చడానికే పాతపాటను మళ్లీ పాడుతు న్నారన్నారు. గ్రాఫిక్స్‌లో తెలుగుదేశంనేతల ఫొటోలు చూపినంతమాత్రాన, వైసీపీనేతల బాగోతం నిజమైపోదన్నారు.

Advertisements

Latest Articles

Most Read