రాజధాని అమరావతిగా కాకుండా, ముదుర్ రాజధానులు చేస్తాం, సెక్రటేరియట్ వైజాగ్ లో పెడతాం, కర్నూల్ లో హైకోర్ట్ పెడతాం, అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుంది అంటూ, ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీని కోసం, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హై పవర్ కమిటీ అంటు ప్రభుత్వం మూడు కమిటీలు వేసింది. అయితే, ప్రభుత్వం తెసుకున్న ఈ నిర్ణయం పై, రాజధాని రైతులు హైకోర్ట్ కు వెళ్లారు. అసలు జీఎన్ రావు కమిటీకి చట్టబద్దత లేదని వాదనలు వినిపించారు. అలాగే బోస్టన్ కమిటీ పై కూడా హైకోర్ట్ ద్రుష్టికి తీసుకు వచ్చారు. నిజానికి, జీఎన్ రావు కమిటీకి, అలాగే హై పవర్ కమిటీకి ఉత్తర్వులు ఉన్నాయని కాని, బోస్టన్ కమిటీకి మాత్రం, ఎక్కడా ఉత్తర్వులు లేవు. ఎక్కడా ఈ కమిటీ పై వార్తలు కూడా రాలేదు. ఒక ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ గ్రూప్‌ కు, ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినప్పుడు, జీవో కాని, ఉత్తర్వులు కాని ఉంటాయి. అలాంటిది ఏమి లేదు అంటూ, రాజధాని రైతులు హైకోర్ట్ కు తెలిపారు.

highcourt 31112019 2

నిన్న ఈ పిటీషన్ పై, హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. దీని పై స్పందించిన హైకోర్ట్, జీఎన్‌ రావు, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ నివేదికలను తమ ముందు పెట్టాలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు ఏమిటి, అవి తమ ముందు ఉంచండి అంటూ హైకోర్ట్ ఆదేశించింది. దీని పై స్పందించిన ప్రభుత్వ లాయర్, ఆ వివరాలు తమ దగ్గర లేవని, వచ్చే వాయిదా నాటికి, పూర్తీ వివరాలతో వస్తామని చెప్పారు. దీని పై స్పందించిన హైకోర్ట్, పిటిషనర్‌ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ల పై జనవరి 21లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని పై తదుపరి విచారణను 23కు వాయిదా వేసింది.

highcourt 31112019 3

ప్రభుత్వం కూడా కౌంటర్ అఫిడవిట్ ఇచ్చిన తరువాత, తాము పరిశీలించి చెప్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.వెంకటరమణతో కూడిన ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం తాము ఏ నిర్ణయం ప్రకటించలేమని పెర్కుంది. ప్రభుత్వాన్ని అమరావతిలో నిర్మాణాలు కొనసాగించేలా ఆదేశించాలని, జీఎన్‌ రావు కమిటీ నివేదికను అమలు చేయకుండా ఆదేశించాలని, అనుబంధ వ్యాజ్యం వేశారు. అయితే ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసేంతవరకు వేచి చూద్దామని పిటిషనర్‌తో ధర్మాసనం పేర్కొంది. మరో పక్క, కొంత మంది నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వారు, జీఎన్‌రావు కమిటీ సిఫార్సులను సమర్థిస్తూ ఇంప్లీడ్‌ పిటిషన్లు వేశారు. మొత్తానికి ఈ కేసు జనవరి 23 కు వాయిదా పడింది.

రాష్ట్రపతి కోవింద్‌కు రాజధాని రైతులు లేఖలు రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రైతులు లేఖలో పేర్కొన్నారు. రాజధాని విషయంలో మోసపోయినందున చనిపోయే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు రాసిన ఈ లేఖ చూస్తే, కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇది లేఖ... "గౌరవనీయులు, భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారికి... విషయం: కారుణ్య మరణం కొరకు కన్నీటి ధారల విన్నపం.. నమస్కారములు.. అయ్యా .. మేము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో మేమంతా ఉన్నపళంగా రోడ్డున పడ్డాం. రాష్ట్ర విభజనతో రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం కోసం మేమంతా ముందుకొచ్చి 33 వేల ఎకరాల భూమిని నాటి తెలుగుదేశం ప్రభుత్వానికి అప్పగించాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సెప్టెంబర్ 2014న అమరావతిని రాజధానిగా చేస్తూ అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా అమరావతి నిర్మాణానికి మా పొలాలను ప్రభుత్వానికి ఆనందంగా అందించాం. "

ramnath 31122019 2

"2019 ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి భూములిచ్చిన మమ్మల్ని అభినందించారు. అమరావతే రాజధాని అని మాటిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. కేవలం ముఖ్యమంత్రి , పలువురు వ్యక్తుల స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారు. రాజధాని మార్చవద్దంటూ మా కుటుంబాలతో కలిసి 14 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా మమ్మల్ని పట్టించుకున్నవారు లేరు. మా గోడు వినిపించుకున్న వారు లేరు. పైగా అధికార పార్టీ నేతలు మా త్యాగాన్ని హేళన చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న శాసన సభాపతి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజధాని స్మశానం అని ఒకరు, ఎడారి అని ఇంకొకరు, ఆందోళన చేస్తున్న రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అని మరొకరు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు... ఇదేమిటని ప్రశ్నిస్తే మాపై దాడులకు దిగుతున్నారు."

ramnath 31122019 3

"అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి మమ్మల్ని జైళ్లలో పెడుతున్నారు. అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంతో మా బతుకులు రోడ్డున పడ్డాయి. మా పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టింది.. ఒక మంచి కార్యం కోసం మేం చేసిన త్యాగాలకు దక్కిన ఫలితమిది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న అవివేక నిర్ణయంతో భవిష్యత్ లో ప్రభుత్వాలకు భూములిచ్చేందుకు ఎవరైనా ముందుకొస్తారా. రాజధాని తరలిపోతే మేము జీవచ్ఛవాలుగా మిగిలిపోతాం. ఈ బతుకులు మాకొద్దు. ఇక మాకు మరణమే శరణ్యం. మాయందు దయ ఉంచి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి సారూ.... ఇట్లు అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు"

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఈ రోజు అమరావతిలో పర్యటించారు. రాజధాని ఇక్కడ నుంచి తరలించ వద్దు అని ఆందోళన చేస్తున్న రైతుల నిరసనకు మద్దతు పలికారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు అడుగడుగునా పోలీసులు అడ్డు చెప్పారు. జగన్ కాన్వాయ వెళ్తుందని, అరగంట ఆగాలని కోరారు. అరగంట అయినా పోలీసులు పర్మిషన్ ఇవ్వక పోవటంతో, పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ, వెళ్లారు. ఈ సందర్భంగా, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ సందర్బంగా పవన్ మందడంలో పర్యటించారు. అక్కడ రాజధాని రైతులని ఉద్దేశిస్తూ పవన్ మాట్లాడారు. రాజధాని ప్రాంత రైతులకు అండగా ఉంటామని, ఇక్కడ నుంచి రాజధానిని మార్చే ప్రసక్తే లేదని అన్నారు. రైతులను పోలీసులు ఇబ్బంది పెట్టవద్దని, వారి పై కేసులు పెట్టి బెబిరించ వద్దని, పవన్ అన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, రైతులు ఎవరికీ భయ పడరని, వారి ఉద్యమాన్ని అణిచి వేయలేరని, ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి పవన్ అన్నారు.

pavan 31122019 2

ఒక ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చారని, ఇక్కడ రాజధానికి ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేసారనే విషయం, జగన్ మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని అన్నారు. రాజధాని ఇక్కడే పెట్టాలని, అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేసారని, ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నారని, రాజ్యాంగానికి అందరూ కట్టుబడి ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ముందు కనుక జగన్ మోహన్ రెడ్డి, తాను ఇక్కడ నుంచి రాజధాని మారుస్తా అని చెప్తే, ఇప్పుడు జగన్ వాదనకు బలం ఉండేదని, రాజధాని మార్చాలి అంటే, ఏకాభిప్రాయం కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారం మారిన ప్రతి సారి, వచ్చే ప్రతి ముఖ్యమంత్రి, రాజధాని మారుస్తూ వెళ్తారా అని పవన్ కళ్యాణ్ అన్నారు.

pavan 31122019 3

151 సీట్లు ఉన్నాయని విర్రవీగకండి, ఎప్పుడైనా మీ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతును కన్నీళ్లు పెట్టించిన ప్రభుత్వాలు నిలబడిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యకం చేసారు. అమరావతిలో కూడా వైసీపీని గెలిపించారని, కాని ఇక్కడ వైసీపీ నేతలు, అమరావతి ప్రజలు రోడ్డున పడితే, వీరిని పైడ్ ఆర్టిస్ట్ లు అంటున్నారని, పవన్ అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, పబ్బం గడుపుకుంటున్నారని, అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలను కూడా రెచ్చగొడుతున్నారని అన్నారు. తమ రాజధాని కోసం, తమ భూముల కోసం రైతులు ఆందోళన చేస్తున్నారని, వారిని అడ్డుకోవద్దని పవన్ పోలీసులుని కోరారు.

 

నూతన సంవత్సర వేడుకలకు, దేశంలోని ప్రజలందరూ సిద్ధం అవుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మాత్రం, అందుకు భిన్నంగా ఉంది. అమరావతిలో రైతులు గత 14 రోజులుగా రోడ్డు ఎక్కారు. తమ ప్రాంతం నుంచి రాజధానిని తరలించ వద్దు అంటూ, ఆందోళన చేస్తున్నారు. తమకు ప్రాణ సమానమైన భూమిని, రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చామని, తమ బిడ్డల భవిషత్తుతో పాటుగా, రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందని భావించామని, అయితే ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో, తాము రోడ్డున పడ్డామని ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు బయటకు రాని ఆడవాళ్ళు, చంటి పిల్లలు కూడా రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ స్థితిలోనే కొత్త సంవత్సర వేడుకులు చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితిలో, మన మధ్య తిరుగుతున్న రాజకీయ నాయకులు, ప్రజల కోసమే రాజకీయాలు చేసే పాలక పక్షం, ప్రతి పక్షం, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రజలు కష్టాల్లో ఉన్నారని, అందుకే మేము వేడుకలకు దూరం అని తెలుగుదేశం ప్రకటించింది.

newyear 31122019 2

"గత కొంతకాలంగా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యల పరిష్కారానికి బదులు వాటికన్నా పెద్ద సమస్యలు సృష్టించడం ద్వారా ప్రజలను అనేక ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. 3 రాజధానుల ప్రకటనతో రాష్ట్రం అంతటా అనిశ్చితి నెలకొంది. వేలాది రైతులు, రైతు కూలీలు, మహిళలు, అన్నివర్గాల ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం గతంలో లేదు. రాజధానికి వేలాది ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం జరగరాదు. పనులు కోల్పోయిన రైతు కూలీలకు న్యాయం జరగాలి. మహిళల కన్నీళ్లు రాష్ట్రానికి శుభకరం కాదు. భూములు త్యాగం చేసిన రైతుల కోసం, రైతు కూలీల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, ఆయా కుటుంబాలకు మనం అందరం సంఘీభావంగా ఉండాలి. రోడ్లపై వేలాది కుటుంబాల ఆందోళనల దృష్ట్యా వేడుకలు చేసుకునే స్థితిలో లేము. అందుకే నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపు ఇచ్చాము. ఆ వేడుకలకు అయ్యే ఖర్చులను, బాధిత కుటుంబాల కోసం పోరాడే అమరావతి పరిరక్షణ సమితి జెఎసిలకు విరాళంగా ఇవ్వాలి. రాజధాని అమరావతి పరిరక్షణ రాష్ట్రంలో అందరి సంకల్పం కావాలి. " అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు.

newyear 31122019 3

ఇక జగన్ మోహన్ రెడ్డి మాత్రం, చంద్రబాబు కంటే భిన్నంగా, ఇదే అమరావతి ప్రాంతంలో, ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోనున్నారు. అధికారులతో కలిసి కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా, ఈ రోజు రాత్రికి, విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున బెరం పార్క్ లో, జగన్ కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గుంటారు. ఒక పక్క కూత వేటు దూరంలో, అంటే కృష్ణా నది ఒడ్డున ఇటు జగన్ వేడుకులు చేసుకుంటుంటే, కృష్ణా నదికి అటు పక్క, అమరావతి ప్రాంత రైతులు తమ భవిష్యత్తు ఏంటి అనే ఆందోళనలో గడపనున్నారు. మొత్తానికి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వేడుకలు రద్దు చేసుకుంటే, ప్రభుత్వంలో ఉన్న జగన్, కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గుననున్నారు.

Advertisements

Latest Articles

Most Read