రాష్ట్రంలో ఉల్లి కష్టాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ఈ కష్టాల భారిన పడింది. అయితే ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కావటంతో, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ, ఈ అంశం పై అసెంబ్లీలో లేవనెత్తింది. అయితే మేము ఈ రోజు కేవలం మహిళల సమస్యల పైనే చర్చ చేస్తామని, ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పింది. ఈ సమయంలో వాగ్వాదం జరిగింది. ఒక పక్క గుడివాడలో, ఈ రోజు ఉల్లిపాయల కోసం, మార్కెట్ లో నిలబడి నిలబడి, ఒక వ్యక్తీ చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీ, మాకు మహిళల సమస్యల పై కూడా చిత్తశుద్ధి ఉందని, కాని రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఎదుర్కుంటున్న, ఉల్లి సమస్య పై చర్చించాలని తెలుగుదేశం పట్టుబట్టింది. ఈ సందర్భంలో, వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. మహిళలు ఎదురుకుంటున్న సమస్యల పై, చర్చించకుండా, తెలుగుదేశం ఉల్లి ఉల్లి అంటూ గొడవ చేస్తున్నారని రోజా అన్నారు.

roja 09122019 2

ఆవిడ మాట్లాడుతూ, ఉల్లి లేకపోతే చచ్చిపోతారు అనే విధంగా మాట్లాడుతున్నారు అంటూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఒక పక్క ప్రజలు ఉల్లిపాయల కోసం, అల్లాడి పోతూ, రోజులకు రోజులు లైన్ లో నుంచుని నుంచుని ప్రజలు ఇబ్బంది పడుతుంటే, రోజా ఇలా మాట్లాడటం కరెక్ట్ కదాని తెలుగుదేశం అంటుంది. నిజంగానే, ఈ రోజు ఉల్లి కోసమే ఒక వ్యక్తీ చనిపోయిన విషయం, రోజా గారికి తెలియదా అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఒక పక్క మనుషులు చనిపోతుంటే, ఇలా హేళనగా ఎలా మాట్లాడతారు అంటూ ఆరోపిస్తూ, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది టిడిపి. "ఉల్లి లేకపోతే ప్రాణం పోతుందా అన్నట్టు మాట్లాడుతున్నారు రోజాగారు. ఇదే మాట వెళ్ళి రైతుబజార్ల దగ్గర క్యూ లైన్లో ఉన్నవాళ్ళతో అనగలరా మేడమ్? ఉల్లి కోసం లైన్లో పడిగాపులు కాసి ప్రాణాలు పోగొట్టుకున్న ఈ నిరుపేదపట్ల మీరు చూపించే మానవత్వం ఇదేనా?" అంటూ పోస్ట్ చేసారు.

roja 09122019 3

రైతుబజార్ల ద్వారా ప్రభుత్వం 25 రూపాయలకు కిలో ఉల్లి సరఫరా చేస్తున్నప్పు టికీ, ధర దిగిరాకపోగా మరింతగా పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో మహారాష్ట్ర రకం ఉల్లి కిలో 190 రూపాయల ధర పలుకుతోంది. కర్నూలు జిల్లాలో గత ఏడాది 84వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేయగా ఈ ఏడాది 32వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. గతంలో ఎకరాకు 70బస్తాల (50కిలోలు) వరకూ దిగుబడి రాగా, ప్రస్తుం 20బస్తాల మేర మాత్రమే దిగుబడి వస్తోంది. వి ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించినప్పటికీ, ఇతర రాష్ట్రాలకు ఎగు మతులు ఎక్కువ కావడం వల్ల ధర గణనీయంగా పెరుగుతోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా శుక్రవారం ఉల్లి క్వింటాలు 13,010 రూపాయల ధర పలికింది. ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా 25 రూపాయలకే కిలో ఉల్లి సరఫరా అంటూ ప్రచారంతో ఊదరగొట్టేస్తోంది. వాస్తవానికి వివిధ పట్టణాలు, నగరాల్లో డిమాండ్లో దాదాపు సగం మేరకే ఉల్లిని సరఫరా చేస్తోంది. దీంతో గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ క్యూలో ఉన్న అందరికీ ఉల్లి దక్కుతుందన్న గ్యారంటీ లేకుండాపోతోంది. డిమాండ్ కు అనుగుణంగా ఉల్లి సరఫరా చేయకపోవడంతో బహిరంగ మార్కెట్లో ధర పెరుగుతోంది. జనవరి ప్రారంభం వరకూ ఇదే పరిస్థితి ఉండవచ్చని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.

మహిళలపై అత్యా-చార, వేధింపుల కేసు-ల్లో ముద్దాయిలుగా ఉన్న వారికి టికెట్లు ఇచ్చి వైసీపీ...మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ....ఎస్సీ మహిళపై అత్యా-చార కేసులో ముద్దాయిగా ఉండి రెండు నెలల జైలు శిక్ష అనుభవించిన గోరంట్ల మాధవ్‌కి హిందూపురం ఎంపీ టికెట్‌, వర-కట్న వేధింపుల కేసులో ముద్దాయిగాఉన్న మార్గాని భరత్‌కి జగన్‌ రాజమండ్రి ఎంపీ టికెట్‌ ఇచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మద్యం సేవించి మహిళా ఎంపీడీవో ఇంట్లోకి వెళ్లి ఆమె కుటుంసభ్యులను బెదిరించారు. ఆయనపై ఆ మహిళా అధికారి కేసు పెడితే గంటలో బయటకు వచ్చారు. ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? దాచేపల్లిలో కాసుమహేష్‌రెడ్డి అనుచరుడు నరేందర్‌రెడ్డి మైనర్‌ బాలికపై అత్యా-చారాం చేస్తే చంద్రబాబు గారు స్పందించేవరకు అతనిపై కేసు నమోదు చేయలేదు. ఇప్పటికి అతనిపై చార్జ్‌సీట్‌ ఎందుకు వేయలేదు. ఒంగోలులో వైసీపీ కార్యకర్త మై-నర్‌ బాలికపై అత్యా-చారం చేస్తే హోంమంత్రి కనీసం పరామర్శించలేదు.

anuradha 09122019 2

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మహిళలపై అత్యా-చారాలు, వేదింపు-లకు సంబందించి 12,653 కేసులు నమోదయ్యాయి. రాయలసీమ ముద్దుబిడ్డను ముఖ్యమంత్రి జగన్‌ అని చెప్పుకుంటున్నారు. కానీ రాయలసీమల్లోనే 9 అత్యా-చారాలు జరిగితే జగన్‌ ఏం చేస్తున్నారు. మద్యాహ్న బోజన మహిళా కార్మికులను వైసీపీ నేతలు వేధిస్తున్నారు. వైయస్‌. రాజశేఖర్‌రెడ్డి అయేషా-మీరా కేసు ను పక్కదారి పట్టించి నిందితులను కాపాడేందుకు ప్రయత్నించలేదా? ఈ కేసుల్లో వెనక్కి తగ్గితే నాకు 25 లక్షలు ఇస్తామని వైయస్‌ చెప్పారని అయేషా మీరా తల్లే స్వయంగా కోర్టులో కోర్టులో సాక్ష్యం చెప్పింది. వాకపల్లి గిరిజనులపై అత్యా-చారం జరిగితే రాజశేఖర్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు. ఇసుక కొరతతో 40 వేల మంది మహిళలు రోడ్డునపడితే ఏ రోజైనా వైసీపీ నేతలు వారిని పరామర్శించారా? ఎమ్మార్వో వనజాక్షి చింతమనేని ప్రభాకర్‌పై కేసు కూడా పెట్టలేదు. కానీ వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేశారు. అసెంబ్లీ లో బూతులు మాట్లాడి, డబుల్‌-మీనింగ్‌ డైలాగ్‌లతో అసెంబ్లీ గౌరవాన్ని కించపర్చేలా వ్యవహిరించిన రోజా మహిళల గురించి నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. మహిళా అధికారులను జైలుకి పంపిన ఘనత జగన్‌ది. జగన్‌ వల్లే తాను జైలుపాలయ్యాయని ఓ మహిళా ఐఏయస్‌ అధికారి జగన్‌ని కోర్టులోనే తిట్టంది.

anuradha 09122019 3

మహిళా మంత్రులచేత పోర్జరీ సంతకాలు చేయించుకుని వారిని రోడ్డున పడేసిన ఘనత కూడా జగన్‌దే. అలాంటి వ్యక్తి, ఆ పార్టీ నేతలు మహిళల గురించి మాట్లాడుతారా? టీడీపీ హయాంలో దాచేపల్లిలో బాలికపై అత్యా-చారం జరిగితే చంద్రబాబు నాయుగు గారు నిందితుడు పారిపోకుండా 24 గంటల్లోనే ఉ-రి వేసికునేలా చర్యలు తీసుకున్నారు. మహిళల భద్రతపై జగన్‌కి ఎమ్మెల్యే రజనీ సెల్యూట్‌ చేయటం విడ్డూరంగా ఉంది. చిలకలూరిపేట ని.యోవర్గంలోనే ఎమ్యెల్యే రజనీ వల్ల ఓ దళిత కుటుంబం ఆత్మ-హ-త్యకు పాల్పడింది. ముందు ఆమె ముందు ఆమె తన నియోజకర్గంలో పరిస్థితి చక్కదిద్దుకుని తర్వాత మహిళల గురించి మాట్లాడాలి. సోషల్‌మీడియాలో మహిళపై అసభ్యకంగా రాసేవాటిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు. వైసీపీ కార్యకర్తలు నాపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఫించన్‌ పెంపు, అమ్మఒడిపై మాయమాటలు చెప్పి మహిళలను మోసం చేసిన చరిత్ర జగన్‌ది. ముఖ్యమంత్రి చీఫ్‌ కెమెరామెన్‌ భార్యను చంపిన కేసులో నిందుతుడు. జగన్‌ అలాంటి వ్యక్తికి ఉద్యోగమిచ్చి లక్షలు రూపాయలు జీతాలిస్తున్నారు. మహిళల గురించి వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో అసత్యాలు మాట్లాడినట్లు ప్రజల్లో మాట్లాడితే ప్రజలు వారి నాలుక తెగకోస్తారని అనురాధ హెచ్చరించారు.

నిన్న సాయంత్రం నుంచి, ఏపి బీజేపీ సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీకి అత్యంత దగ్గర వారు అయిన, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేపీ పార్టీ మారి, వైసీపీలోకి వెళ్తున్నారు అంటూ, పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అన్ని ప్రముఖ మీడియాలో ఈ వార్తలు రావటంతో, అందరూ నిజమే అని నమ్మరు కూడా. ఇది ఏపి బీజేపీకి పెద్ద దెబ్బ అని, అందరూ భావించారు, గోకరాజు లాంటి వారు కూడా బీజేపీ సిద్ధాంతాలు పక్కన పెట్టి, వైసీపీలోకి వెళ్ళటం పై ఆశ్చర్యపోయారు. అయితే, తన పై నిన్నటి నుంచి వచ్చిన వార్తల పై, ఈ రోజు గోకరాజు గంగరాజు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నాను అంటూ, నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఎటువంటి వాస్తవం లేదని, గోకరాజు చెప్పారు. తన గురించి వార్తలు రాస్తూ, తన అభిప్రాయం తీసుకోకుండా, మీడియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పై, ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

gokaraju 09122019 1

తాను బీజేపీ ఎంపీ చేసిన తరువాత, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నాని, బీజేపీ పార్టీలోనే ఉన్నానని, ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వను అంటూ, చెప్పుకొచ్చారు. తనకు ముందు నుంచి రాజకీయాల పై పెద్దగా ఆసక్తి లేదని, తాను వీహెచ్‌పీలో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో, 2014 ఎన్నికల సమయంలో అశోక్ సింఘాల్ తన పై ఒత్తిడి తెచ్చి, నరసాపురం ఎంపీగా పోటీ చేపించారని, అప్పుడు గెలిచానని చెప్పారు. రాజకీయాలు అంటే ఆసక్తి లేకపోయినా, ప్రజలకు సేవ చేయొచ్చు అనే భావంతో ఆ రోజు ఎంపీగా పోటీ చేసానని, అప్పట్లో నరసాపురం నుంచి పార్టీలు మారుతూ వచ్చిన రఘురామకృష్ణం‌రాజు టికెట్ అడగ్గా, బీజేపీ అధిష్టానం, పార్టీలు మారే వారికి, టికెట్ ఇవ్వం అని చెప్పటంతో, తాను పోటీ చెయ్యాల్సి వచ్చిందని అన్నారు.

gokaraju 09122019 1

అశోక్ సింఘాల్ నాకు‌ గాడ్ ఫాదర్ వంటి‌వారని, ఆయన మాట ప్రకారమే ఆ రోజు ఎంపీగా సేవ చేసానని, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా, మళ్ళీ వీహెచ్‌పీ ద్వారా సేవ చేస్తున్నానని అన్నారు. అయితే, ఇక్కడ మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు గోకరాజు. తాను చేరటం లేదని, తన కుమారుడు, సోదరులు వైసీపీలోకి వెళ్తున్నారని అన్నారు. తన కుమారుడు రంగరాజు, వైఎస్‌ జగన్‌కు మిత్రుడని అన్నారు. గతంలోనే ఎంపీ సీటు ఆఫర్ చేసారని చెప్పారు. అయితే, తన కుమారుడు వైసీపీలో చేరుతున్నాను అని చెప్పగా, అలోచించి నిర్ణయం తీసుకోమన్నాని ఆయన అన్నారు. గతంలో కూడా, సోదరులు గోకరాజు రామరాజు, నరసింహరాజులు కాంగ్రెస్ తోనే పని చేసారని, ఆ పరిచాయలతో, ఇప్పుడు వాళ్ళు వైసీపీలోకి వెళ్తున్నారని, తనకు మాత్రం, ఆ పార్టీలో చేరే ఉద్దేశం లేదని అన్నారు.

గన్నవరం ఎమ్మేల్యే వల్లభనేని వంశీ పై, తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. వల్లభనేని వంశీ గత రెండు నెలలుగా వార్తలో ఉంటున్నారు. దీపావళి పండుగకు ముందు, వంశీ పై, అక్రమ పట్టాలు ఇచ్చారు అంటూ, పోలీస్ కేసు పెట్టటం, వైసీపీ నన్ను వేధిస్తుంది అంటూ వంశీ చెప్పటం, వారం రోజులకే జగన్ మోహన్ రెడ్డిని కలవటం, తరువాత వాట్స్ అప్ లో చంద్రబాబుకి లేఖ రాసి, తన పై వేధింపులు ఎక్కువ అయ్యాయని, అందుకే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పటం, మళ్ళీ ఒక నెల రోజులకి, చంద్రబాబు పై విరుచుకు పడుతూ ప్రెస్ మీట్ పెట్టటం తెలిసిందే. అయితే, చంద్రబాబు పై ఇష్టం వచ్చినట్టు పరుష పద జాలంతో మాట్లాడటంతో, తెలుగుదేశం పార్టీ వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, షోకాజ్ నోటీసు ఇచ్చింది. గతంలో 2007లో కూడా ఒకసారి ఇలాగే వంశీకి షోకాజ్ నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావటంతో, వంశీ పై ఆసక్తి నెలకొంది.

vamsi 09122019 2

అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం, వంశీ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. వంశీ పై ఎలా అయినా అనర్హత వేటు వేసే ప్లాన్ లో, తన వైపు నుంచి ఏ తప్పు లేకుండా అడుగులు వేస్తుంది. ముందుగా వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, ఆ విషయాన్ని అధికారికంగా స్పీకర్ కార్యాలయానికి చెప్పలేదు. దీంతో, వంశీకి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉండే అవకాసం పోయింది. ఆయన టెక్నికల్ గా తెలుగుదేశం ఎమ్మెల్యేగానే ఉన్నారు. అయితే తాము సస్పెండ్ మాత్రమే చేసామని, బర్తరఫ్ చేస్తేనే వంశీకి స్వతంత్ర ఎమ్మల్యేగా ఉండే అవకాసం ఉంటుందని టిడిపి వాదిస్తుంది. అయితే మరో పక్క, ఈ రోజు వంశీ టిడిపి కూర్చునే స్థానాల్లోనే కూర్చున్నారు. టిడిపి ఎమ్మెల్యేల వెనుక విడిగా కూర్చున్నారు.

vamsi 09122019 3

ఇక మరో పక్క, తెలుగుదేశం పార్టీ ఈ రోజు జరిగే తెలుగుదేశం పార్టీ ఎమ్మేల్యేలతో చంద్రబాబు అధ్యక్షతన మీటింగ్ పెట్టుకుంది. దీనికి రావాల్సిందిగా పార్టీ నుండి వంశీకి ఆహ్వానం వచ్చింది. అయితే వంశీ మాత్రం రాలేదు. కాని ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మికంగా తన తప్పు లేకుండా, వంశీకి అవకాసం ఇవ్వకుండా, ప్రతి టెక్నికల్ అంశంలో జాగ్రత్తగా వెళ్తుంది. ఈ నేపధ్యంలో వంశీ పై అనర్హత వేటు వెయ్యటానికి, ఈ అసెంబ్లీ సమావేశాల్లో, తెలుగుదేశం పార్టీ ఒక విప్ ఇవ్వనుంది. ఈ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల పై, అప్పుడు అనర్హత వేటు వెయ్యమని స్పీకర్ ను కోరనుంది. ఈ విధంగా, వంశీ ఎపిసోడ్ లో, పై చేయి సాధించాలని తెలుగుదేశం పార్టీ చూస్తుంది. మరి అటు వైపు నుంచి ఎలా వ్యూహాలు ఉంటాయో చూడాలి మరి.

Advertisements

Latest Articles

Most Read