నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. చంద్రబాబు, ఎమ్మెల్యేలతో కలిసి లోపలకు వస్తూ ఉండగా, చంద్రబాబుతో పాటు ఇతర ఎమ్మెల్యేలను గేటు ముందు ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే దీని పై నిన్నటి నుంచి రచ్చ జరుగుతూనే ఉంది. చంద్రబాబుని లోపలకు రానివ్వకుండా, చీఫ్ మార్షల్ గేటుకు తాళం వేస్తె, అక్కడ స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో చంద్రబాబు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తూ, మామ్మల్ని అసెంబ్లీలోకి ఎందుకు రానివ్వరు అంటూ, చీఫ్ మార్షల్ పై తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. అయితే ఈ సమయంలో చంద్రబాబు చీఫ్ మార్షల్ ను, ‘బాస్టర్డ్’ అని దుర్భాషలాడారని జగన్ ఈ రోజు అసెంబ్లీలో ఆరోపించారు. దీనికి సంబంధించి, వీడియోను అసెంబ్లీలో ప్లే చేసి చూపించారు. అయితే చంద్రబాబు దీని పై వివరణ ఇస్తూ, నేను ‘బాస్టర్డ్’ అని ఎక్కడా దుర్భాషలాడ లేదని, ‘నో క్వశ్చన్’ అని చెప్పిన దానికి, ‘బాస్టర్డ్’ అన్నాను అంటూ, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
తాను అనని మాటలకు క్షమాపణ కోరుతున్నారని అన్నారు. అసలు ముందు తనను ఎందుకు లోపలకు రానివ్వకుండా, ఆపారో చెప్పాలని చంద్రబాబు కోరారు. ఈ సభలో నన్ను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారని, అయినా అన్నీ ప్రజల కోసం పడుతున్నానని, ముందు దానికి క్షమాపణ చెప్పాలని చంద్రబాబు కోరారు. ఇది ఇలా ఉండగా, జగన మోహన్ రెడ్డి చంద్రబాబు అనని మాటను, అన్నట్టుగా, ప్రజలను నమ్మించి మభ్యపెడుతున్నారని చెప్తూ, జగన్ పై, తెలుగుదేశం పార్టీ ప్రివిలైజ్ నోటీస్ ఇచ్చింది. అచ్చెంనాయుడు నేతృత్వంలో, స్పీకర్ ను కలిసి, ఈ ప్రివిలైజ్ నోటీస్ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి కావాలని, ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరో వైపు చంద్రబాబు కూడా, ఈ విషయం పై సోషల్ మీడియాలో స్పందించారు. జరిగిన విషయం పై, వీడియో రూపంలో చూపించారు. "ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడమనే అప్రజాస్వామిక చర్యలకు పాల్పడింది వైసీపీ వాళ్లే. తిరిగి వాళ్ళే నేను అనని పదాన్ని అన్నట్టుగా సభలో సృష్టించారు. ఎంత కోపంలోనైనా వైసీపీ వాళ్ళలాగా నాకు సంస్కారహీనమైన భాష ఉపయోగించడం, అమర్యాదకరంగా ప్రవర్తించడం రాదు. అలాంటి నా మీద ఇలాంటి కుట్రలు, ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదు. సీఎంపై ప్రివిలీజ్ మోషన్ ఇస్తాం. 6 నెలల పాలనలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, నన్ను అసెంబ్లీలోకి రానివ్వకుండా చేసేందుకే ఈ కుట్రలు. నామీద, తెలుగుదేశంపై చేసే వైసీపీ కుట్రలను ప్రజలే తిప్పికొడతారు." అంటూ చంద్రబాబు పోస్ట్ చేసారు. ఈ వీడియో ఇక్కడ చూడొచ్చు.. https://www.facebook.com/tdp.ncbn.official/videos/658257777911590/