వైసీపీలో ఏదో జరుగుతుంది అంటూ, గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి, ముందుగా బహిరంగ పరుస్తూ, మీడియా ముందుకు వచ్చి బాంబు పేల్చారు, నెల్లూరు పెద్దా రెడ్లలో ఒకరిగా పేరున్న, వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో, ఆయనకు అత్యంత సన్నిహితంగా, ఆనం బ్రదర్స్ ఉండేవారు. అయితే జగన్ విషయంలో మాత్రం, ఎందుకో కాని, ముందు నుంచి, ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. సీనియర్ అయినా ఆనంకు, మంత్రి పదవి వస్తుందని, అందరూ భావించినా, జగన్ మాత్రం ఆనంకు షాక్ ఇచ్చారు. అలాగే నెల్లూరులో హవా మొత్తం, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డిది అవ్వటంతో, ఆనంను లెక్క చేసే వారు లేకుండా పోయే పరిస్థితి తీసుకువచ్చారు. ఇవన్నీ మనసులో ఉంచుకోనో ఏమో కాని, నిన్న ఆనం , మీడియా సమావేశం పెట్టి మరీ, సొంత ప్రభుత్వ తీరు పైనే విమర్శలు గుప్పిస్తూ, నెల్లూరులో లేని మాఫియా అంటూ లేదని, ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని అన్నారు.
ఆనం చేసిన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా, అనిల్ కుమార్ యాదవ్ పై గురి పెట్టి చేసినవిగా ఇట్టే అర్ధం అవుతున్నాయి. అయితే ఆనం ఈ వ్యాఖ్యలు చేయటం వెనుక, ఇంకా ఏదో పెద్ద స్కెచ్ ఉందని, వైసీపీ అధిష్టానం భావిస్తుంది. అందుకే ఇలాంటి చిన్న సంఘటనకు కూడా, అబధ్రతా భావంతో, ఓవర్ రియాక్ట్ అయ్యింది, వైసీపీ అధిష్టానం. ఆనం రాంనారాయణ రెడ్డికి, వెంటనే షోకాజ్ నోటీసు ఇవ్వాలని, జగన్ ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. షోకాజ్ నోటీస్ కు కనుక, ఆనం సంతృప్తికర సమాధానం చెప్పకపోతే, వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని, సీనియర్ కూడా చూడవద్దు అంటూ జగన్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, జగన్ చెప్పినట్టు తెలుస్తుంది.
అయితే ఇంత చిన్న విషయానికి కూడా, అంత సీనియర్ నేతకు షోకాజ్ ఇవ్వటం, అలాగే అవసరం అయితే సస్పెండ్ చెయ్యాలి అని చెప్పటం వెనుక, వ్యూహం ఏమిటో , దాని వెనుక ఉన్నది ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఆనం కూడా, తన లాంటి సీనియర్ నేతకు షోకాజ్ ఇవ్వటం పై, అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తుంది. మొత్తానికి, ఒక్క ప్రెస్ మీట్ తో, వైసీపీలో కుదుపు మొదలైంది. ఆనం లాంటి సీనియర్ నేతను టచ్ చెయ్యటం అంటే, వైసీపీలో అంతర్గతంగా ఏదో జరుగుతుందని అంటున్నారు. ఈ పరిణామంతో, ఎంపీ రఘురమకృష్ణం రాజు కూడా, కంట్రోల్ లో కు వస్తారని, వైసీపీ అధిష్టానం భావిస్తుంది. మరి, ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాలి.