వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత సహాయం చేశారో అందరికీ తెలిసిన విషయమే. దీనికి ప్రతిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే కోట్ల రూపాయల ఆస్తులు ఏపీ తెలంగాణకి వదులుకుంది. దీంతోపాటు చాలా విషయాల్లో కేసీఆర్ ఆదేశించడం, జగన్ పాటించడం తెలుగు ప్రజలంతా చూస్తున్నారు. తాజాగా కేసీఆర్ తెరాసాని భారాసాగా మార్చారు. దీనికి సంబంధించిన సభని ఖమ్మంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఆహ్వానించారు. జగన్ రెడ్డినీ ఆహ్వానించినా, బీజేపీ భయంతో ఖమ్మం సభకు హాజరు కాలేదు. అటు బీజేపీతోనూ, ఇటు కేసీఆర్తోనూ స్నేహం కొనసాగిస్తూ అధికారాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు జగన్. ఖమ్మం సభకి తాను వెళ్లకపోయినా ఏపీ నుంచి బస్సులు, జనాలను జగనే అరేంజ్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి బస్సులను భారాస పేరుతో అద్దెకు తీసుకున్నారు. విజయవాడ జోన్ ఎన్టీఆర్ జిల్లాలో 105, ఏలూరు జిల్లాలో 45, విజయవాడ నుంచి మరో 70 బస్సులను ఖమ్మం సభకు కేటాయించారు. అలాగే జనాన్ని కూడా తరలించే బాధ్యతను వైసీపీ నేతలే చూశారని ప్రచారం సాగుతోంది. ఖమ్మంకి దగ్గరగా ఉండే జగ్గయ్యపేట, తిరువూరు, ఏ.కొండూరు, గంపలగూడెం, మైలవరం, జి.కొండూరు, కంచికచర్ల, నందిగామ, ఏలూరు జిల్లా నూజివీడు నుంచి భారీగా జనాన్ని తరలించారు. వందలాది బస్సులు ఖమ్మం సభకు వెళ్లిపోవడంతో ఏపీలో పండగ సెలవుల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గవర్నరు పేట, విద్యాదరపురం, ఇబ్రహీంపట్నం డిపోల బస్సులు ఖమ్మం వెళ్లడంతో విజయవాడ సిటీలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
news
కేశినేని నాని ఎందుకిలా ? పార్టీ ప్రక్షాళన కోసం అయితే, చెప్పే విధానం ఇదా ?
టిడిపి ఎంపీగా కేశినేని నాని నిత్యమూ వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు. కేశినేని నాని ఎందుకో ఈ మధ్య తరుచూ టిడిపి అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది పార్టీలో వ్యవహారం. ఇక కుటుంబంలో అయితే తన తమ్ముడు చిన్నీ అంటే పడదు అనేది ఆయన మాటల్లో తెలుస్తుంది. ఇక నియోజకవర్గంలో ఉన్న సొంత పార్టీ ప్రత్యర్థులు ఎలాగూ ఉన్నారు. కృష్ణా జిల్లా టిడిపిలో ఉన్న అన్ని నియోజకవర్గాల నేతలతోనూ కేశినేని నానికి సఖ్యత లేదు. ఆ నేతలు తనకు సమాన హోదా కాదని, తనది ఢిల్లీ రేంజ్ అని కేశినేని నానినే చెప్పారు. మొత్తానికి ఈ మధ్య చూస్తున్న ప్రెస్ మీట్లు నిత్య అసంతృప్తివాదిగా కేశినేని నాని ముద్రపడ్డారు. కేశినేని ట్రావెల్స్ పేరుతో వ్యాపారరంగంలో ఉన్న నాని 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. అక్కడ విధానాలు నచ్చలేదని, ఏడాది కూడా పార్టీలో లేకుండా 2009 లో టిడిపి గూటికి వచ్చాడు. తెలుగుదేశం పార్టీలో వచ్చిన నుంచీ నిత్యమూ పార్టీలో నేతలపై ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య టిడిపి అధినేత చంద్రబాబుకి బొకే ఇవ్వనంటూ నానీ హావభావాలు వైరల్ అయ్యాయి. విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కుమార్తెని టిడిపి అభ్యర్థిగా ప్రకటింపజేసుకున్న నాని...పార్టీలో నేతలను కలుపుకుని వెళ్లకుండా ఉండే ధోరణికి విసుగు చెంది, చాలా మంది నేతలు పనిచేయలేదు.
మొత్తానికి టిడిపి నేతలు అందరూ కలిసి, గెలవాల్సిన విజయవాడ కార్పొరేషన్ చేజార్చుకున్నారు. అయితే అదే సందర్భంలో నాని, తానే విజయవాడ అధిష్టానం అని ప్రకటించటం కూడా అప్పట్లో వివాదస్పదం అయ్యింది. ఇక విజయవాడలో అనేక అరాచకాలు జరిగినా, అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే నాని స్పందించారు. ఒక పక్క కార్యకర్తలు ప్రాణాలు ఒడ్డి, అటు వైసీపీతో పోరాడుతుంటే, కేశినేని నాని మాత్రం, వైసీపీకి అవకాసం ఇచ్చే విధంగా ప్రకటనలు చేస్తూ ఉండటంతో, టిడిపికి ఇబ్బందిగా మారింది. ఏదైనా ఉంటే చంద్రబాబుతో తేల్చుకోవాలి కానీ, ఇలా రచ్చ చేసుకుని, నాని ఏమి సాధిస్తారు అంటూ, సోషల్ మీడియాలో టిడిపి శ్రేనులు నిలదీస్తున్నాయి. పార్టీ అన్నాక, అన్ని రకాల మనుషులు ఉంటారు, అందరినీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. కేశినేని నాని అన్నారని, బుద్దా వెంకన్న రియాక్ట్ అవ్వటం, ఇలా పార్టీ నేతలు బహిరంగంగా విమర్శించుకుంటుంటే, పార్టీ అధికారంలోకి రావాలని పోరాడుతున్న కార్యకర్తలు నీరసం అయిపోతున్నారు. రెండు సార్లు ఎంపీగా చేసిన నాని, అందరినీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలని, ముఖ్యంగా అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని, మన పోరాటాలు వైసీపీ పై ఉండాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కేశినేని నాని ఎలాంటి సంచలనాలకి తెర లేపుతారో చూడాలి మరి.
సాయంత్రం వరకు కోర్టులో నిలబడండి... ఇద్దరు సీనియర్ అధికారులకు ఏపి హైకోర్టు షాక్...
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన ఆరంభం విధ్వంసంతో మొదలైంది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన పాలన అడ్డగోలు జీవోలు, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలతో కోర్టులకెక్కుతోంది. ప్రభుత్వం నిర్ణయాలకు సంబంధితశాఖ ఉన్నతాధికారులు బాధ్యులవుతున్నారు. కోర్టు విచారణలో తరచూ ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు కోర్టు ముందు దోషులుగా నిలబడాల్సి వస్తోంది. ప్రభుత్వ పాలనా అధికార యంత్రాంగానికి బాస్ అయిన చీఫ్ సెక్రటరీ ఇటీవల కోర్టు బోనులోకి వచ్చి నిలుచున్నారు.. తాజాగా మరో ఇద్దరు సీనియర్ అధికారులు ఐఏఎస్ బుడితి రాజశేఖర్, ఐఆర్‍ఎస్ రామకృష్ణ బోనులో దోషులుగా నిలిచారు. సర్వీస్ అంశాలలో కోర్టు ధిక్కరణ పిటిషన్‍లో హైకోర్టుకు వచ్చి ఇద్దరు అధికారులు క్షమాపణలు చెప్పారు. అధికారులు క్షమాపణ చెప్పడంతో తీర్పును హైకోర్టు సవరించింది. ఇద్దరు అధికారులు సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని హైకోర్టు ఆదేశించింది.
సుప్రీం కోర్టులో ఏమి జరగబోతుంది ? రాష్ట్రమంతా వైటింగ్...
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చట్టాలు, రాజ్యాంగం, వ్యవస్థలకు తాను అతీతుడినని భావిస్తూ ఉంటారని చంద్రబాబు అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తూ ఉంటారు. కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమేమో అనిపిస్తుంది. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అవినీతి కేసులు పీకల వరకూ జగన్ మునిగి ఉన్నారు. ఈ కేసుల విచారణ సాగకుండా రకరకాలుగా న్యాయవ్యవస్థలోని మార్గాలను అనుసరిస్తున్నారని న్యాయకోవిదులు చాలా సందర్భాలలో చెప్పారు. అధికారంలోకి వచ్చాక కూడా కోర్టులు అభిశంసించినా పై కోర్టుకెళ్లి అక్షింతలు వేయించుకోవడం షరామామూలైపోయింది. జగన్ సర్కారు పెడధోరణికి నిదర్శనం దేశంలోనే అతి ఎక్కువ కోర్టు ధిక్కరణ కేసుల రికార్డు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, జీవోలు ఎంత అడ్డగోలుగా ఉంటున్నాయంటే, కోర్టులు మారినా తీర్పులు మారడంలేదు. రోజూ ఏదో ఒక శాఖకి చెందిన ఉన్నతాధికారి కోర్టు బోనులో నిలుచోవాల్సి వస్తోంది. తాజాగా బ్రిటిష్ కాలం నాటి చట్టం దుమ్ము దులిపి తెచ్చిన జీవో 1ని హైకోర్టు సస్పెండ్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇదివరకూ హైకోర్టు తీర్పులపై సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం ఒక్క కేసులోనూ విజయం సాధించలేదు. అతడు సినిమాలో బ్రహ్మానందం మహేష్ బాబుని కమాన్ హిట్ మీ అని ప్రొవోక్ చేస్తాడు. మహేష్‌బాబు కొట్టడానికి జంకుతాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం పార్థు కొడితే కానీ వదలడు కొట్టవయ్యా అంటాడు. సేమ్ ఇలాగే జగన్ సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తే గానీ తనవి తప్పుడు నిర్ణయాలని ఒప్పుకోరేమో మరి. తాజాగా ఏపీ హైకోర్టు తమ తీర్పుని అమలు చేయని ఉన్నత విద్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణలకు జైలుశిక్ష, జరిమానా విధించింది. ఈ తీర్పులు ఏపీ సర్కారుకి నిరంతర ప్రక్రియగా మారింది.