ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన కక్ష రాజకీయం, కేసులు, అరెస్ట్ లు దాకా సాగుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ పై కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది. ప్రజా వేదిక కూల్చేసి, అది చంద్రబాబు ఆఫీస్ గా ఇవ్వకుండా చేసారు. అయితే, అది అక్రమ భవనం అని అందుకే అలా చేసామని అన్నారు. తరువాత, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ని కూల్చేస్తాం అంటూ నోటీస్ ఇచ్చి రాత్రికి రాత్రి వస్తే, కోర్ట్ నుంచి స్టే తెచ్చి ఆపారు. ఇప్పుడు గుంటూరులో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి ఎసరు వచ్చింది. డిసెంబర్ 6 న, తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం కానుంది. అయితే, ఆ నిర్మాణం అక్రమంగా జరిగింది అంటూ, వైసీపీ దాని పై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసింది. నిబంధనలు విరుద్ధంగా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కు స్థలం కేటాయింపు జరిగింది అని, ఆ ఉత్తర్వులు రద్దు చేసి, కార్యాలయం సంగతి చూడాలి అంటూ, ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసారు.

tdp 30112019 2

దీంతో గుంటూరు కలెక్టర్, రెవిన్యూ డిపార్టుమెంటు ని అలెర్ట్ చేసారు. తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన స్థలం, సంగతి తేల్చాలని, ఆ భూమి పూర్వాపరాలు, తదితర అంశాల పై, రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ కోరారు. మరో పక్క ఆ భూమి పై తనకు హక్కు ఉంది అంటూ, షేక్‌ భాషా అనే వ్యక్తి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల పై తగిన చర్యలు తీసుకోవాలని, విచారణ జరపాలని, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా, రెవెన్యూ శాఖను ఆదేశించింది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై, అయుదు ఫిర్యాదులు వచ్చాయి. అయితే, ఇప్పుడు కలెక్టర్ ఏమి తేలుస్తారు ? అంతా నిబంధనలు ప్రకారమే ఉందా ? ప్రభుత్వం తదుపరి చర్య ఎలా ఉంటుంది, అనే విషయం ఆసక్తిగా ఉంది. అయితే, తెలుగుదేశం పార్టీ మాత్రం, అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయని, కోర్ట్ లో తేల్చుకుంటాం అంటుంది

tdp 30112019 3

ఇది ఇలా కొనసాగుతూ ఉండగానే, కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయం కోసం గుణదలలో కేటాయించిన 92 సెంట్ల భూమి తమది అని, ఆ స్థలంతో మాకు అవసరం ఉందని, తిరిగి ఇచ్చేయాలని, జలవనరుల శాఖ, రెవిన్యూ శాఖను కోరింది. గతంలో అన్ని పార్టీలకు, ఇలా భూములు కేటాయించారు. అయితే అవన్నీ ఎక్కువగా నిరుపయోగంగా ఉన్న భూములు. అయితే జలవనరుల శాఖ మాత్రం, టిడిపికి కృష్ణా జిల్లాలో ఇచ్చిన భూమి, రద్దు చెయ్యాలని కోరింది. ఇప్పటికే, ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ ఆఫీసుకు కేటాయించిన భూమి, ఇలాగే జలవనరుల శాఖ వెనక్కు తీసుకుంది. అలాగే, గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు, కడప, విజయనగరం తదితర జిల్లాల్లో టిడిపికి ఇచ్చిన భూమిని కూడా వెనక్కు తీసుకునే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి, తెలుగుదేశం పార్టీకి అన్ని వైపుల నుంచి, ఇబ్బంది పెడుతూనే ఉంది వైసీపీ ప్రభుత్వం.

ఒక పక్క ఈ రోజుతో, జగన్ మొహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆరు నెలలు పూర్తీ చేసుకుని, ముందుకు సాగుతున్న వేళ, మా ప్రభుత్వం అద్భుతంగ పని చేస్తుంది, దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అంటూ, వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. మరో పక్క, ఈ ఆరు నెలల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రద్దులు, కుల్చివేతలు, రివెర్స్ పాలనతో, నెగటివ్ దృక్పదంలో, దేశం మొత్తం మన వైపు చూస్తుంది అంటూ, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఆరు నెలలకు సంబంధించి, మంచి సియం కాదు, ముంచే సియం అంటూ తెలుగుదేశం, ఒక పుస్తకం కూడా విడుదల చేసింది. మరో వైపు పడిపోతున్న ఆర్ధిక పరిస్థితి, ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆరు నెలల్లో జగన్ మంచి సియంగా ఉన్నారా, ముంచే సియంగా ఉన్నారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కాని, కేంద్రప్రభుత్వం మాత్రం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై, ఆందోళనతో ఉంది. వారు మునిగేది కాక, మమ్మల్ని కూడా ముంచేస్తున్నారు అంటూ, కేంద్ర ప్రభుత్వం అంటుంది.

rksingh 30112019 2

జగన మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే, గతంలో చంద్రబాబు నాయుడు హయంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు అక్రమం అని, అవినీతి జరిగింది అని, ఆ ఒప్పందాల పై సమీక్ష జరుపుతాం అంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇలా చేస్తే, మాకు రుణాలు ఇచ్చే వారు ఉండరు అని, మా క్రెడిబిలిటీ పడిపోతుంది అంటూ, ఆ కంపెనీలు కోర్ట్ కు వెళ్ళాయి. అలాగే విదేశీ పెట్టుబడులు కూడా అందులో ఉండటం, జపాన్ ప్రభుత్వం సీరియస్ అవ్వటంతో, కేంద్ర ప్రభుత్వం కూడా, ఈ చర్యలు తప్పు అని రాష్ట్రాన్ని హెచ్చరించింది. అయితే ఇదే విషయం పై నిన్న పార్లిమెంట్ లో, కేంద్ర విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌, రాష్ట్ర ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసారు.

rksingh 30112019 3

ఆంధ్రప్రదేశ్‌ లాంటి కొన్ని రాష్ట్రాల వైఖరి వల్ల, మన దేశంలో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు టెండర్లు వేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయిందని ఆర్‌కే సింగ్‌ పార్లమెంట్ లో తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పారు. గతంలో అధికంగా టెండర్లు వచ్చేవని, కానీ కొంతకాలంగా టెండర్లు వేసే వారు తగ్గిపోయరని అన్నారు. కొన్ని రాష్ట్రాల సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, విద్యుత్తు నియంత్రణ సంస్థలు టారిఫ్‌ల నిర్ధారణలో జాప్యం చేయడం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పీపీఏలను పునఃసమీక్షించడానికి సిద్ధమవడం లాంటివి ఇందుకు ముఖ్య కారణాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న చర్యలతో, పెట్టుబడిదారుల విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపింది అన్నారు. అందుకే పీపీఏలకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని, అవినీతి జరిగిందని సమాచారం ఉంటేనే, సమీక్ష చేసుకోవాలని చెప్పినట్టు కేంద్ర మంత్రి అన్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అంటే, ఎందుకో కాని వైసీపీకి ముందు నుంచి టార్గెట్. లోకేష్ క్యారక్టర్ అసాసినేషన్ కోసం చెయ్యని ప్రయత్నం లేదు. అయితే అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ, ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టటంలో ఫెయిల్ అవ్వటంతో, లోకేష్ అంటే పప్పు అనే అభిప్రాయం పెంచటంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. దీంతో లోకేష్ పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా, 25 వేల కిమీ సీసీ రోడ్లు వేసినా, డ్రైనేజి వ్యవస్థ మెరుగుపరిచినా, తాగు నీరు అవసరం తీర్చే ప్రయత్నం చేసినా, ఐటి మంత్రిగా హెచ్సీఎల్, ఆదనీ డేటా సెంటర్ లాంటి పరిశ్రమలు తెచ్చినా, ప్రజలకు మాత్రం, వైసీపీ చేసిన ప్రచారమే ఎక్కింది. అయితే అధికారం పోయిన తరువాత, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా కూడా, వైసీపీ, లోకేష్ నే టార్గెట్ చేస్తుంది. మంత్రులు కొడాలి నాని లాంటి వాళ్ళు కాని, పార్టీ మారే వంశీ లాంటి వాళ్ళు కాని, లోకేష్ నే ఇంకా ఇంకా టార్గెట్ చేస్తున్నారు.

lokesh 29112019 2

ఒక పక్క లోకేష్ ని ఫెయిల్యూర్ గా చూపిస్తూనే, లోకేష్ అంటే ఎందుకో భయపడుతున్నారు. అందుకే లోకేష్ ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మొన్నటి మొన్న డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటి నుంచి లోకేష్ ని సస్పెండ్ చేసారు. అలాగే, స్పీకర్ తమ్మినేని తన పై చేసిన వ్యక్తిగత ఆరోపణలకు స్పందించినందుకు, లోకేష్ పై అసెంబ్లీ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చారు. తాజాగా లోకేష్, మా మంత్రులను టార్గెట్ చేసాడు, మా మంత్రులు, ముఖ్యమంత్రి పై కుట్ర పన్నాడు అంటూ, లోకేష్ పై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. నిన్న చంద్రబాబు, అమరావతి పర్యటనలో భాగంగా, అక్కడ జరుగిన నిర్మాణాలు, ఆగిపోయిన నిర్మాణ పరిస్థితి అంతా చూడటానికి, డ్రోన్ ద్వారా చిత్రీకరణ జరిగింది. ఆ విజువల్స్ బయటకు కూడా వచ్చాయి.

lokesh 29112019 3

అయితే, డ్రోన్ లో ఎగరేసింది, అసెంబ్లీ, సెక్రటేరియట్ మీద అని, అక్కడ మా మంత్రులు, సియం కార్యాలయం ఉందని, దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని, ఈ కుట్ర మొత్తం నారా లోకేష్ ఆధ్వరంలో జరిగింది అని, దీని వెనుక అసలు ఏమి కుట్ర లోకేష్ పన్నాడు, అసలు విషయం ఏమిటి, మొత్తం తెలుసుకుని, తక్షణం చర్యలు తీసుకోవాలని, వైసీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు, లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు జిల్లా డీఎస్పీకి ఫిర్యాదు చేసారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి, కుట్ర అంతా బయట పెట్టాలి అంటూ, లేఖలో పేర్కొన్నారు. అయితే, దీని విషయం పై ఇప్పటి వరకు, తెలుగుదేశం పార్టీ స్పందించలేదు. మరి పోలీసులు, నిజంగానే, ఈ లేఖను సీరియస్ గా తీసుకుని, కేసు పెడతారా, లేదో చూడాలి మరి.

నిన్న చంద్రబాబు అమరావతి పర్యటనలో, ఆయన కాన్వాయ్ పై రాళ్ళతో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు స్థాయి నేత, జెడ్ ప్లస్ బద్రత ఉన్న నేత పై, రాళ్ళ దాడి కావాలని జరిగితే, రాష్ట్ర డీజీపీ మాత్రం, ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ఏమి చేస్తారో చూద్దాం అని వదిలాం అంటూ చెప్పటం పై, తెలుగుదేశం పార్టీ సీరియస్ అయ్యింది. ఢిల్లీ స్థాయిలో చెక్ పెట్టే వ్యూహం పన్నింది. డీజీపీ వ్యాఖ్యలపై కేంద్రహోమ్ సెక్రటరీకి ఫిర్యాదు చెయ్యాలని, పార్లమెంట్ లో కూడా విషయం లేవనెత్తాలని, హోం మంత్రి అమిత్ షా కు కూడా ఫిర్యాదు చెయ్యాలని, టీడీపీ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‍లో కూడా బస్సు పై దాడి అంశాన్ని ప్రస్తావించాలని ఎంపీలకు సూచన చేసారు. దాడి పై తుళ్లూరు పీఎస్‍లో కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుచేసింది. ఈ రోజు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. రాజధాని పర్యటన, బస్సుపై దాడి, డీజీపీ వ్యాఖ్యలపై చర్చ చేసారు.

sawang 29112019 2

వర్ల రామయ్య మాట్లాడుతూ, పోలీస్‌వ్యవస్థలో డీజీపీ సుప్రీం అయినప్పటికీ, ఆయనతోపాటుగా ఆరుగురు అడిషనల్‌ డైర్టెర్స్‌ ఆఫ్‌ జనరల్‌పోలీసులు ఉన్నారని, చంద్రబాబు పర్యటనలో పోలీస్‌శాఖ వ్యవహరించిన తీరు సరిగా ఉందో లేదో వారే సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్‌చేశారు. ప్రతిపక్షనేతపై జరిగిన దాడికి సంబంధించి సమాధానం చెప్పే, అర్హతను తన దృష్టిలో డీజీపీ కోల్పోయాడని వర్ల తెలిపారు. మాజీముఖ్యమంత్రి, జెడ్‌ప్లస్‌ భద్రత ఉన్నవ్యక్తి పర్యటిస్తుంటే, సెక్షన్‌-30 అమలుచేయకుండా నిరసనలకు ఎలా అనుమతించారో ఆరుగు రు అడిషనల్‌ డీజీపీలు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుపై దాడిచేయడానికే వైసీపీవారికి పోలీసులు అనుమతి ఇచ్చారా అని వర్ల నిలదీశారు. డీజీపీ చర్యపై ఢిల్లీస్థాయి లో నిలదీస్తామని, ఆయనకు పైనున్నవ్యవస్థ తలుపుతడతామని రామయ్య స్పష్టంచేశారు.

sawang 29112019 3

రైతులకు, రైతుకూలీలకు న్యాయం చేయడానికి, అమరావతి నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వానికి ఉన్న చులకనభావాన్ని తొలగించడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజధాని పర్యటనకు వెళ్లడం జరిగిందని ఆపార్టీ ఎమ్మెల్యే నిమ్మలరామానాయుడు చెప్పారు.
చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై, రాళ్లు, చెప్పులేయడాన్ని సమర్థిస్తూ డీజీపీ మాట్లాడటం దారుణమన్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా నిరసన వ్యక్తంచేయడానికి వైసీపీ వారికి అనుమతిచ్చామని చెబుతున్న డీజీపీ, ప్రతిపక్షనేత వాహనంపై చెప్పులు, రాళ్లు, కర్రలు వేయడాన్ని సమర్థిస్తున్నారా అని నిమ్మల ప్రశ్నించారు. పోలీసుల చేతిలో ఉండాల్సిన లాఠీ వైసీపీ కార్యకర్తల చేతికెలా వచ్చిందో డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. భావప్రకటన స్వేచ్ఛ అనేది వైసీపీవారికి మాత్రమే ఉండదని, రాష్ట్రప్రభుత్వం చేతిలో దగాపడిన వారికి కూడా ఉంటుందనే విషయాన్ని పోలీస్‌బాస్‌ తెలుసుకోవాలన్నారు.

Advertisements

Latest Articles

Most Read