2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఎన్నికల్లో తనకు సహకరించిన అందరికీ పదవులు కేటాయింపులు చేస్తూ, ఇష్టం వచ్చినట్టు పదవులు ఇచ్చేసారు. చివరకు లక్ష్మీపార్వతికి కూడా పదవి కట్టబెట్టారు. అయితే ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకొని ఉన్న మంచు మోహన్ బాబుకి అన్నిటి కన్నా పెద్ద పదవిని, గౌరవమైనది, కీలకమైన పదవిని ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయం అట. అందుకే ఎంత లేట్ అయినా అలంటి పదవి ఏముందా అని వెతుకుతూ ఉన్నారు. వచ్చే సంవత్సరంకి అతి ముఖ్యమైన పదవి అయిన రాజ్యసభ ఎంపీ పదవి ఖాళీ అవుతుంది. ఆ పదవి ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు గారికి ఇవ్వాలనేది వైసీపీ ప్రభుత్వం అభిప్రాయం అని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని పదవులకు నేతలను ఎన్నుకుని పదవి భాద్యతలను వారికి అప్పగించారు. మరికొంత మందికి కూడా త్వరలో పదవులు ఇచ్చే అంశం పై లీకులు ఇస్తున్నారు.

mohan 10112019 2

ఇప్పటి వరకు పదవులు వచ్చిన ప్రముఖులు నటుడు పృథ్వి కి ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ పదవిని , ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ పదవి కి చైర్మన్ గా విజయ్ చందన్ ని (ఇంకా నియమించలేదు), తెలుగు అకాడమీ చైర్మన్ గా లక్ష్మి పార్వతిని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అయితే, తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచింది అన్నట్టు మోహన్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ లోనే ఏదైనా పదవి లో చేయాలనీ ఉందని, కానీ వైసీపీ అధినేత ఢిల్లీ రాజకీయాలు చూసుకోవాలిసిందిగా కోరుతున్నట్లు అయనకు సూచించినట్టు సమాచారం. అంతకముందు ఎన్టీఆర్ ప్రభత్వం లో మంచు మోహన్ బాబు గారికి రాజ్య సభ లో పదవిలో అనుభవం ఉందని అందుకే అయన ని ఆ పదవికి ఎంపిక చేస్తారని వైసిపీ వర్గాలు అంటున్నాయి.

mohan 10112019 3

మోహన్ బాబుకి రాజ్యసభ పదవి ఇచ్చి, ఢిల్లీ రాజకీయాలకు ఆయన్ను పరిమితం చెయ్యాలని జగన్ ఎత్తుగడగా తెలుస్తుంది. మోహన్ బాబుకి, బీజేపీలోని నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సంబంధాలు ఉండటంతో, ఆయన్ను అక్కడ ఉంచితే, బీజేపీని ఇంకా కొంచెం మచ్చిక చేసుకునే ప్రయత్నం చెయ్యొచ్చని, అందుట్లో మోహన్ బాబు వాక్ చాతుర్యంతో, అందరినీ ఆకట్టుకుంటారు కాబట్టి, ఢిల్లీ లాబీయింగ్ కి తేలిక అవుతుందని జగన్ అభిప్రాయంగా తెలుస్తుంది. మరో పక్క, మోహన్ బాబుకి రాజ్యసభ లాంటి పెద్ద పదవి ఇచ్చి, కమ్మ సామాజిక వర్గాన్ని కూడా దగ్గరకు తీసుకునట్టు అవుతుందని, వైసిపీ అధిష్టానం ఎత్తుగడగా తెలుస్తుంది. మొత్తానికి అందరికీ పదవి ఇస్తున్న జగన్, మోహన్ బాబుకి కూడా ఊహించని పెద్ద పదవి అయిన రాజ్యసభ ఇస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు సంకెళ్ళు వేస్తూ, జారీ చేసిన జీవో 2430 పై, దేశ వ్యాప్తంగా జరనలిస్ట్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. జీవో 2430 ప్రకారం, ఎవరైనా ప్రభుత్వ ప్రతిష్టితను దిగజారుస్తూ కధనాలు రాస్తే, వారి పై కోర్ట్ లో కేసు వేసే అధికారం, అధికారులకు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఏ ప్రభుత్వం అయినా తప్పుని ఎత్తి చూపితే, తప్పు అని ఒప్పుకోదు. మరి ఏది ఎలాంటి వార్త అని, ప్రభుత్వం ఎలా నిర్ణయించి, చర్యలు తీసుకుంటుంది, అంటే సమాధానం లేని ప్రశ్న. అయితే, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాల పై, ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా, ఘాటుగా స్పందించింది. జీవో 2430 పై, తమకు వివరణ ఇవ్వాలంటూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సమాచార శాఖ ముఖ్య కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. కలానికి కళ్లెం వేసే ఇలాంటి జీవోను సుమోటోగా తీసుకుంటునట్టు ప్రకటించి, సమస్య తీవ్రతను తెలియ చేసింది. అయితే ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియాకి, ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుందో తరువాత విషయం కాని, ఇప్పుడు ఏకంగా ప్రెస్ కౌన్సిల్ కే జర్క్ ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

jagan 102112019 2

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆవిర్భావం సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్‌ 16న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుతారు. అయితే, ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో జరిగే ఈ వేడుకులు, ఈ ఏడు, మన ఆంధ్రప్రదేశ్ లో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే జరుగుతున్న పరిణామాల వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కాని, ఈ వేడుకులు మేము జరపలేం అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. అసలు అయితే, ఈ వేడుకులు, ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరగాల్సి ఉండగా, ఐజేయూ అధ్యక్షుడుగా ఉన్న దేవులపల్లి అమర్‌, ప్రెస్ కౌన్సిల్ ను ఒప్పించి, విజయవాడలో జరిగేలా ఒప్పించారు. విజయవాడలో ఈ వేడుకులు పెద్ద ఎత్తున చెయ్యాలని, జాతీయ ప్రెస్ డే నిర్వహించాలని అనుకున్నారు. ఈ వేడుకుల్లో జాతీయ, అంతర్జాతీయ జరనలిస్ట్ లు పాల్గుంటారని, ముఖ్య అతిధిగా జగన్ ను పలిచి, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చెయ్యాలని అనుకున్నారు.

jagan 102112019 3

అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తరుపున, ఐ & పీఆర్ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి టి.విజయకుమార్‌ రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ లేఖ రాసి, మా సియం బిజీగా ఉన్నారని, ఫోర్త్ ఎస్టేట్ గా పిలిచే మీడియా పట్ల మాకు ఎంతో గౌరవం ఉందని, అయితే ఈ సారికి మరో చోటు చూసుకోండి అంటూ లేఖ రాసారు. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల అవాక్కవటం, సీనియర్ జర్నలిస్ట్ ల వంతు అయ్యింది. ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అని, దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రతినిధులకు చెప్పామని, ఇప్పుడు వారికి మళ్ళీ ఢిల్లీలోని, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన జరుగుతుందని చెప్పాల్సి వచ్చిందని, చివరి నిమిషంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా చెయ్యటం సమంజసం కాదని విమర్శించారు. అయితే, రాష్ట్రంలో మీడియాని కట్టడి చేసే జీవో పై ఆందోళనలు జరుగుతూ ఉండటంతో, వేడుకలకు వచ్చే జర్నలిస్ట్ లు, రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తారేమో అని, ప్రభుత్వం ముందుగానే ఈ నిర్ణయం తీసుకుందా అనే అనుమానం కలుగుతుంది.

తెలుగు భాషను కాపాడుకునే ప్రయత్నంలో, ఎవరు పోరాటం చేసినా, కలుపుకు పోవాల్సిందే. అయితే, మన తెలుగు తల్లిని, మన సంస్కృతిని తిట్టిన వారిని మాత్రం, దూరం పెట్టి ఈ పోరాటం చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో, తెలుగు మీడియంను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు పై, అందరూ భగ్గు మంటున్నారు. ఈ ఉత్తర్వులు వచ్చి నాలుగు రోజులు అయ్యింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, ఈ విషయం పై పోరాడుతుంది. గతంలో చంద్రబాబు, తెలుగు మీడియంతో పాటు, ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారని, ఎవరికి కావలసిన ఆప్షన్ వారు సెలెక్ట్ చేసుకునే అవకాసం ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం మాత్రం, ఒకేసారి అసలు తెలుగు మీడియం అనేది లేదు అని చెప్పటం పై, తెలుగుదేశం తప్పుబడుతుంది. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎలా నేర్చుకుంటారని, టీచర్స్ కి ఆ అనుభవం ఉండాలి కదా అని ప్రశ్నిస్తుంది. అదీ కాకా, మన తెలుగు భాషను పరిరక్షించుకోవాలని, ఇలా పూర్తిగా ఎత్తేయటం సరైన విధానం కాదని, టిడిపి వాదిస్తుంది.

pk 10112019 2

అయితే ఈ సమస్య పై ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా, పవన్ కళ్యాణ్, ఈ విషయం పై, వైసిపీ ప్రభుత్వం పై, విమర్శలు గుప్పించారు. తెలుగు మీడియం ఆపెస్తుంటే, ఇంకా అధికార భాషాసంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తెలుగు భాష గొప్పదనం అర్థమైతే పాఠశాలల్లో నిషేధం విధించరని చెప్తూ, కొన్ని పద్యాలు, పుస్తకాలు గురించి ట్వీట్ చేసారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, పవన్ కళ్యాణ్ చేసిన ఓక ట్వీట్ మాత్రం, అభ్యంతరకరంగా ఉంది. తెలుగు భాషను ఎలా పరిరక్షించుకోవాలో, మన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి అంటూ, పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ మాత్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభ్యంతరం చెప్తున్నారు.

pk 10112019 3

పవన్ కళ్యాణ్ , కేసీఆర్ ను పొగిడే సందర్భం ఇది కాదని, ఆయన పొగడాలి అనుకుంటే, వేరే సందర్భంలో కేసిఆర్ ని పొగడలాని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను, కవులను, సంస్కృతిని , చివరకు మన తెలుగు తల్లిని, కేసిఆర్ మాట్లాడిన విషయాలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఆంధ్రా వాళ్ళ సంస్కృతి ఒక సంస్కృతా, వాళ్ళది రికార్డింగ్ డాన్స్ ల సంస్కృతీ అని కేసిఆర్ మాట్లాడిన మాటలు, ఏ ఆంధ్రుడు మర్చిపోడు. అలాగే అయన మన ఆది కవి నన్నయ్య పై చేసిన వ్యాఖ్యలు, తెలుగు తల్లిని దెయ్యం అంటూ చేసిన వ్యాఖ్యలు కాని, ఏ ఆంధ్రుడు హర్షించరు. తెలుగు మహా సభలు అని పెట్టి, సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవని వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటి ? ఈ విషయంలో జగన్, కేసిఆర్ రెండూ రెండే. ఎవరూ తక్కువ కాదు. పవన్ కళ్యాణ్, ఈ విషయంలో మాత్రం, కేసిఆర్ ను ప్రస్తావించటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించరు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన చిచ్చు, వేరే రాష్ట్రాలకు అంటుకోకుండా, పెట్టుబడిదారులకు భరోసా ఇస్తూ, అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు పంపింది. సోలార్, విండ్ ఎనర్జీ విషయంలో కుదుర్చుకున్న పీపీఏల విషయంలో, చంద్రబాబుని ఇబ్బంది పెడుతూ, ఆ ఒప్పందాల పై మళ్ళీ సమీక్ష చేస్తాం అంటూ, అందప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రకటన అప్పట్లో సంచలనంగా మారింది. అటు కోర్ట్ లు, ఇటు కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని త్పపుబట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చర్యతో, దేశ వ్యాప్తంగా పెట్టుబడి పెట్టిన, పెట్టుబడి దారులు కొంత, అబధ్రతాభావానికి లోనవవ్వటంతో, కేంద్రం వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా, టెక్నికల్ అంశాలు సాకుగా చూపిస్తూ, సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసే సంస్థలను ఇబ్బంది పెట్టటానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను కంట్రోల్ చేస్తూ, కేంద్రం ప్రభుత్వం, ఒక అడ్వైజరీ జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు పెట్టుబడి దారులను ఇబ్బంది పెట్టటం కుదరదు.

power 10112019 2

కేంద్రం జరీ చేసిన ఉత్తర్వులు ప్రకారం, రాష్ట్రాలు, కేవలం విద్యుత్ కొనుగోళ్ళు వరుకే పరిమితం అవ్వాలని, అలా కాకుండా ఆ ఉత్పత్తి దారుల ప్లాంట్లు జోలికి వెళ్తే కుదరదు అంటూ ఆదేశాలు ఇచ్చింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల ప్రకారం, ఆయా కంపెనీలు, విద్యుత్ ఉత్పత్తి చేసుకుని, సరఫరా చేసే విధంగా, వారికి వీలుగా, డైరెక్టు కరెంటు (డీసీ) విద్యుత్తు సామర్థ్యం పెంచుకోనే క్రమంలో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అడ్డు పడుతున్నాయని, అలా చెయ్యకూడదు అంటూ ఆ చర్యలను కేంద్రం తప్పుబట్టింది. సోలార్ కంపెనీలు, వాటి సామర్ధ్యాన్ని పెంచుకుంటూ, వారికి కేటాయించిన ప్లాంట్లలో, అదనపు డైరెక్ట్‌ కరెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకొనే స్వేచ్ఛను ఆ కంపెనీలకు వదిలి పెట్టాలని, రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

power 10112019 3

రాష్ట్ర ప్రభుత్వాలతో కుదుర్చుకున్న విధ్యుత్ ఒప్పందాలు ప్రకారం, వాటికి లోబడి, ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని ఎంత పెంచుకున్నా, రాష్ట్రాలు అడ్డుపడడానికి వీల్లేదని పేర్కొంది. దీని కోసం, అదనపు లైసెన్సులు అవసరం లేదని, ఎవరైనా ఇష్టం వచ్చినంత సామర్ధ్యం ఉన్న విద్యుత్ ఉత్పత్తి చేసుకుని, ఎవరికైనా విక్రయించే స్వేఛ్చ ఉంది అంటూ, కేంద్రం తెలిపింది. కేంద్రం ఇచ్చిన సర్కులర్ మేరకు, ఒప్పందాల ప్రకారం, విద్యుత్ ఉత్పతి చెయ్యకపోతే, వారు ప్రభుత్వానికి జరిమానా కట్టాల్సి ఉంటుంది కాబట్టి, ప్రభుత్వాలు వారికి అడ్డు పడటానికి వీలు లేదు, ఇలా ఎక్కువ విద్యుత్ ని ఉత్పత్తి చేసుకోవటం, ఒప్పంద ఉల్లంఘన కిందకు రాదు, దీని వల్ల కొనుగోలుదారుల పై కూడా అదనపు భారం ఉండదు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో జోక్యం చేసుకోకూడదు అంటూ కేంద్రం తెలిపింది.

Advertisements

Latest Articles

Most Read