మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, జగన్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం తీవ్ర వివాదస్పదం అయ్యింది. ఆప్షన్ అనేది లేకుండా, ప్రతి ప్రభుత్వ స్కూల్ లో, ఇంగ్లీష్ మీడియం మాత్రమే చదవాలి అంటూ, ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులు, తీవ్ర దుమారాన్ని రేపాయి. గతంలో చంద్రబాబు ఇచ్చినట్టుగా, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆప్షన్స్ ఇచ్చి, ఎవరికీ కావల్సింది వారిని ఎంపిక చేసుకునేలా చెయ్యాలని వాదనలు వినిపిస్తున్నాయి. మన మాతృభాషని పూర్తిగా తీసేయటం పై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం, మాకు సమాజనం నుంచి ఒత్తిడి ఉంది, అందుకే నిర్ణయం తీసుకున్నాం అని చెప్తుంది. అయితే, తెలుగు భాష ప్రేమికులు మాత్రం, ఇలా బలవతంగా రుద్దు కూడదు అని, ఎవరి అభిప్రాయాన్ని వారికి వదిలేయాలని అంటున్నారు. గతంలో ఆందోళన చేసిన లక్ష్మీప్రసాద్, లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు మాత్రం, కనీసం కూడా ఈ విషయం పై స్పందించక పోగా, ఎదురు అద్భుతమైన నిర్ణయం అంటూ, భజన చేస్తున్నారు.

venkaiah 10112019 2

అయితే, వీరి సంగతి ఇలా ఉంచితే, ఈ రోజు ఈనాడు దినపత్రికలో, భారత ఉప రాష్ట్రపతి, వెంకయ్య నాయుడు రాసిన ఆర్టికల్ మాత్రం, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు అనే చెప్పాలి. డైరెక్ట్ గా తెలుగు భాష పై రాసి, వివాదాస్పదం చెయ్యకుండా, ఆయన భారత దేశంలో ఉన్న అన్ని భాషల గురించి ప్రస్తావిస్తూ, మాతృభాష గొప్పదనాన్ని వివరిస్తూ, నేటి కాలంలో ఎలా నిర్వీర్యం చేస్తున్నారో చెప్తూ, ఆర్టికల్ రాసారు. దీనిలో ప్రభుత్వాల బాధ్యత చెప్తూ, "బోధన మాధ్యమానికి సంబంధించి మరీ ముఖ్యంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయుల్లో విద్యను ఏ భాషలో నేర్పించాలన్న విషయమై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. " అంటూ రాసిన వ్యఖ్యం చూస్తుంటే, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా తీసుకున్న నిర్ణయానికి కూడా ఇది వర్తించేలా ఉంది.

venkaiah 10112019 3

మాతృభాషలో అయితేనే పిల్లలు, మేధాసంపన్నతను వెల్లడించడానికి, భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి అవకాసం ఉంటుందని చెప్పారు. "పెద్దలనుంచి ఘనమైన వారసత్వంగా పొందిన భాష, సంస్కృతి, సంప్రదాయాలపట్ల మన పిల్లల్లో ప్రేమను ఇనుమడింపజేయాలి. ఈ కర్తవ్య నిర్వహణలో ఏ మాత్రం తొట్రుపడినా భారతీయ విలక్షణ సాంస్కృతిక అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది. భావ వ్యక్తీకరణకు అమ్మభాషే ఆత్మ! మాతృభాషను గుర్తించి, గౌరవించి, కాపాడుకునేందుకు యావద్దేశమూ కంకణబద్ధం కావాల్సిన తరుణమిది!" అంటూ వెంకయ్య నాయుడు తన వ్యాసాన్ని ముగించారు. ఆయన రాసింది, జనరల్ గా అయినా, మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, రాష్ట్రంలో జరుగుతున్న చర్చకు మాత్రం, ఈ ఆర్టికల్ దోహదపడుతుంది. ఇందులోని మంచిని, మన ప్రభుత్వం కూడా తీసుకుంటే, అటు ఉపరాష్ట్రపతి చెప్పింది గౌరవించినట్టు ఉంటుంది, ఇటు ఈ వివాదానికి కూడా తెర దించినట్టు అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఇసుక. దాదపుగా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క రవాణా వ్యవస్థ అయిన లారీలు, టిప్పర్లు కూడా, పనులు లేక, నెలవారీ కిస్తీలు కట్ట లేక, నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క, నిర్మాణాలు మొదలు పెట్టిన వారు, నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆపేసారు. మరో పక్క, నిర్మాణ కాంట్రాక్టులు చేసే వారు, ముందు చెప్పిన రేటుకు పనులు చెయ్యలేము అని, మరింతగా కాంట్రాక్టు విలువ పెంచాలి అంటూ, ఆందోళన చేస్తున్నారు. ఇలా కూలీల దగ్గర నుంచి, కాంట్రాక్టర్ల దాకా, అందరికీ గడ్డు పరిస్థితి నడుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి గద్దెను ఎక్కగానే, చంద్రబాబు ఇసుక పాలసీతో దోపిడీ చేస్తున్నారని, చెప్పి, ఆ పాలసీని రద్దు చేసారు. దీంతో అసలు ఇసుక బయటకు రాకుండా, ఎక్కడికక్కడ ఆగిపోయింది. అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అంటూ, సెప్టెంబర్ 5 కొత్త పాలసీ ఓపెనింగ్ అన్నారు.

botsa 10112019 2

సెప్టెంబర్ 5 వచ్చింది, కొత్త పాలసీ వచ్చింది కాని, ఇసుక మాత్రం రాలేదు. జగన్ మోహన్ రెడ్డి, ఇసుక వారోత్సవాలు అన్నారు. అవి ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇసుక ఏది అని అడిగితే, వరదలు వచ్చాయి, వరదలు తగ్గే దాకా ఇంతే అని చెప్తున్నారు. ఒక పక్క తెలుగుదేస్, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇసుక కొరత పై ఆందోళన చేస్తూ, ఇసుకను బ్లాక్ లో అమ్ముకుని, వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారని, చెప్తుంటే, అదేమీ లేదు, ఎక్కడా ఇసుక బయటకు వెళ్ళటం లేదు, వరదల ఉన్నాయని తెలియదా అంటూ, ప్రభుత్వం సమర్ధించుకుంటూ, ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతుంది. సరిగ్గా ఇలాంటి టైంలో, మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలతో, ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. దీంతో, ఇప్పుడు ప్రభుత్వమే, ఇసుక బ్లాక్ లో వెళ్ళిపోతుంది అని ఒప్పుకునే పరిస్థితి. శుక్రవారం విజయనగరం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వంలో కలకలం ఏర్పడింది.

botsa 10112019 3

మీడియా ఉందని చూసుకోకుండా ఆయన చేసిన వ్యాఖ్యలతో, వైసిపీ తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. బొత్సా మాట్లాడుతూ, అక్కడ ఉన్న ఎస్పీని ఉద్దేశించి, హైవేలో రాజమార్గంలో అక్రమంగా ఇసుక వేరే రాష్ట్రాలకు తరలిపోతుంటే, పోలీసులు ఏమి చేస్తున్నారు అంటూ ఎస్పీని ప్రశ్నించారు. పోలీసులు దీని పై స్పందించక పొతే, మేమే చూసుకుంటాం అని వ్యాఖ్యలు చేసారు. లారీకి ఇంతని తీసుకుని, మీరే పోలీసులే, ఇసుక అక్రమ రవాణా అయ్యేలా చేస్తున్నారు. సిసిటీవీలు చూస్తే, మీ బండారం మొత్తం బయట పడుతుంది, అంటూ ఎస్పీ పై ఫైర్ అయ్యారు. అయితే, ఈ వ్యాఖ్యలు మీడియాలో రావటంతో అందరూ అవాక్కయ్యారు. ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఇద్దరు మంత్రులు, డిప్యూటీ సీఎం పాల్గున్న సమావేశంలోనే, ప్రభుత్వమే, ఇసుక అక్రమ రవాణా అయిపోయి, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది అని చెప్తుంటే, పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

2014లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు పనిపై మాత్రమే శ్రద్ధపెట్టారు. దానితో ఎవరిని కలవడానికి సమయం దొరికేది కాదు. ఇప్పుడు సమయం దొరకడంతో అందరి వద్దకెళ్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆహ్వానించిందే తడవుగా వివాహాది శుభకార్యాలలో పాల్గొంటున్నారు. . కొన్ని వివాహాలకు చంద్రబాబు వెళ్తే... ఆ కుటుంబాలు మురిసిపోతున్నాయి. తాజాగా తెలంగాణలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు పాల్గొనడం,చినజీయర్ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.దాని గురించి తెలుసుకోవాలంటే ఈ కధనం చదవలిసిందే. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు, ఒకసారి పుష్కరాల్లో, తరువాత ఒకసారి సియంఓ లో తప్పితే, 2019 వరకు గుంటూరు దగ్గర ఉన్న సీతానగరంలో ఉన్న త్రిదండి చినజీయర్ ఆశ్రమాన్ని సందర్శించలేదు. ఇదిలావుంటే... 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చినజీయర్ స్వామివారి ఆశ్రమానికి రావాలని చంద్రబాబునాయుడుకి ఆహ్వానం అందింది. 

jeeyar 09112019 2

చినజీయర్ స్వామివారికి, చంద్రబాబుకు మధ్య అనుసంధానకర్తగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యవహరించారు . ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న చినజీయర్ స్వామి కి గొప్ప భక్తుడు. గుంటూరులోని సీతానగరం, తెలంగాణాలో ఉన్న ముచ్చింతల ఆశ్రమాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో చంద్రబాబుని చినజీయర్ పుట్టిన రోజు ఉండటంతో ఆ వేడుకలకు హాజరు కావలిసిందిగా ఆశ్రమ సభ్యులు చంద్రబాబు నాయుడుని కలిసి ఆహ్వానం అందించారు. ఆ విధానంగా దాదాపుగా 5సం" తరవాత మళ్ళీ చంద్రబాబు త్రిదండి చినజీయర్ స్వామి గారిని కలిశారు. ఈ వేడుకల్లో పాల్గొని నారా చంద్రబాబు నాయుడు, చినజీయర స్వామి వారికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. చినజీయర్ స్వామి కూడా చంద్రబాబు గారిని ఆశీర్వదించారు.

jeeyar 09112019 3

ఆ సందర్భంగా చంద్రబాబు అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేసారు. పెద్దజీయర్, చినజీయర్ స్వాములు లోకకళ్యాణం కోసం చేసిన పనులను కొనియాడారు. ఆరోజు ఆశ్రమంలో చంద్రబాబునాయుడు దాదాపుగా రెండున్నర గంటలసేపు గడిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు బయలుదేరే సమయంలో సెల్ఫీలు కోసం జనాలు పోటీపడ్డారు. అయితే 5 ఏళ్ళ తరువాత చంద్రబాబు, జీయర్ కలియిక పై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ సాగుతుంది. దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదని, ఇది కేవలం చంద్రబాబు వ్యక్తిగత ప్రకటన అనే వాదన తెలుగుదేశం వైపు నుంచి వస్తుంది. గత 5 ఏళ్ళలో అధికారంలో ఉండగా అందరికీ దూరం అయ్యారని, ఇప్పుడు అన్ని వర్గాలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారని, టిడిపి వైపు నుంచి వినిపించే వాదన. మరో పక్క వైసీపీ మాత్రం, జరిగిన విషయాల పై ఆరా తీస్తుంది. చంద్రబాబు ఎందుకు జీయర్ కు దగ్గర అవుతున్నారు, ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందా ? లాంటి అంశాల పై కూపీ లాగుతుంది.

గత వారం రోజుల నుంచి వార్తల్లో వ్యక్తిగా ఉన్న సియం ప్రిన్సిపాల్ సెక్రటరీ, ప్రవీణ్ ప్రకాష్, ఈ రోజు కూడా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే వారం రోజులుగా, చీఫ్ సెక్రటరీతో గొడవ, బిజినెస్ రూల్స్ మార్చటం వంటి వివాదస్పద అంశాలతో వార్తల్లో నిలిచిన ప్రవీణ్ ప్రకాష్, ఇప్పుడు మాత్రం, ఒక మంచి పని చేసి, వార్తల్లో నిలిచారు. ఆయాన రాసిన లేఖ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా, ఐఏఎస్ ఆఫీసర్లలో కూడా ఆలోచింప చేసేలాగా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ, ఠంచనుగా నెల మొదటి రోజే జీతాలు పడుతూ ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఫస్ట్, సెకండ్ గ్రేడ్ ఉద్యోగులకు, జీతాలు మొదటి ప్రాధాన్యతగా ఇస్తూ ఉంటారు. మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ఎంతో ఇబ్బంది కరంగా ఉన్నా, ఫస్ట్, సెకండ్ గ్రేడ్ ఉద్యోగులకు మాత్రం, జీతాలు మొదటి తారీఖునే పడిపోతూ ఉంటాయి. అయితే, థర్డ్, ఫోర్త్ క్లాస్ ఉద్యోగలకు మాత్రం, ఇందుకు భిన్నంగా వ్యవహారం ఉంటుంది.

praveen 09112019 2

ముఖ్యంగా థర్డ్, ఫోర్త్ క్లాస్ ఉద్యోగల్లో ఎక్కువ మంది, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలే ఉంటారు. అయితే, వీరికి జీతాలు మాత్రం, తక్కువుగానే ఉన్నాయి. అయినా వీరికి అధికారులు లాగా, మొదటి ప్రాధాన్యతలో జీతాలు పడవు. ముఖ్యంగా మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తారుమారు అవుతూ ఉండటంతో, వీరికి జీతాలు టైంకి ఇవ్వటం గగనంగా మారింది. కొన్ని శాఖల్లో అయితే, రెండు, మూడు నెలలుగా కూడా జీతాలు రాని ఉద్యోగులు ఉన్నారు. అయితే, వీరి కష్టాలు ఇలాగే కొనసాగుతున్నా ప్రభుత్వం పెద్దగ పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితిని గమనించిన, ఐఏఎస్ ఆఫీసర్, సియం ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన, ప్రవీణ్ ప్రకాష్, వీరి పట్ల సానుభూతి చూపిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

praveen 09112019 3

ప్రతి నెలా, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తరువాతే తనకు, జీతం ఇవ్వాలి అంటూ, ప్రభుత్వానికి లేఖ రాసారు అంటే కాదు దీనికి సంబంధించి, సెల్ఫ్ డిక్లరేషన్ కూడా సమర్పించారు. తన లాంటి ఐఏఎస్ ఆఫీసర్లకు, ప్రతి నెలా టైంకి జీతాలు వస్తాయని, కాని ప్రభుత్వ నిర్ణయాలను అమలు పరిచి, ప్రజలకు దగ్గరగా ఉండే, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యొగులకు మాత్రం, టైంకి జీతాలు అందటం లేదని, వారికి రెండు మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారని, వారికి టైంకి జీతాలు ఇవ్వకపోతే, వారికి ఎన్నో కష్టాలు ఉంటాయని, అందుకే, వారికి జీతాలు ఇచ్చిన తరువాతే తనకు ఇవ్వాలని, ప్రవీణ్ ప్రకాష్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు. అయితే ప్రవీణ్ ప్రకాష్ నిర్ణయం ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఈ నిర్ణయంతో, ఒక వేళ ప్రభుత్వం కనుకు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యొగులకు టైంకి జీతాలు ఇస్తే, అంతకంటే ఏమి కావాలి.

Advertisements

Latest Articles

Most Read