నిన్న చంద్రబాబు పై, లోకేష్ పై స్పీకర్ చేసిన వ్యాఖ్యలకు, నారా లోకేష్ బహిరంగ లేఖ రాస్తూ, తమ్మినేనికి సవాల్ విసిరారు. ఇది లేఖ "బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు చెందిన త‌మ‌రు అత్యున్న‌త‌మైన శాస‌న‌స‌భాప‌తి స్థానం అలంక‌రించ‌డం చాలా అరుదైన అవ‌కాశం. మీ విద్యార్హ‌త‌లు, రాజ‌కీయానుభ‌వం స్పీక‌ర్ ప‌ద‌వికే వ‌న్నె తెస్తాయని ఆశించాను. విలువలతో సభని హుందాగా నడిపిస్తా అని మీరు మాట్లాడిన మాటలు నన్నెంతో ఆక‌ట్టుకున్నాయి. విలువలతో సభ నడిపించి ట్రెండ్ సెట్ చేస్తా అన్న మీరు స్పీకర్ పదవిలో ఉండి అసభ్య పదజాలంతో మాట్లాడే ట్రెండ్ సెట్ చేస్తారని అనుకోలేదు. ఆరుసార్లు ఇదే స‌భ‌లో స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించిన మీరు అదే స‌భ‌కు అధ్య‌క్షులుగా ప్ర‌స్తుతం ఉన్నార‌నే విష‌యాన్ని ఒక్క‌సారి గుర్తు చేస్తున్నాను. స‌భాప‌తిగా ప్ర‌తిప‌క్ష‌నేత‌పై మీరు చేసిన వ్యాఖ్య‌లు ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన‌వేనా అనే అనుమానం క‌లుగుతోంది. ఎనిమిదిసార్లు శాస‌న‌స‌భ‌కు ఎన్నికై, ముఖ్య‌మంత్రిగా, ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ప‌నిచేసి విజ‌న‌రీ లీడ‌ర్‌గా ప్ర‌స్తుతించ‌బ‌డిన చంద్ర‌బాబుగారి గురించి 'గుడ్డలూడ‌దీయిస్తా' అంటూ మీరు చేసిన వ్యాఖ్య‌లు మీ స్పీక‌ర్ స్థానాన్ని చిన్న‌బుచ్చేలా ఉన్నాయ‌ని నాక‌నిపిస్తోంది. స‌భామ‌ర్యాద‌లు మంట‌గ‌లిసిపోకుండా కాపాడే గౌర‌వ‌స్థానంలో ఉండి..ప్ర‌తిప‌క్ష‌నేత‌ను అవమానిస్తూ మీరు చేసిన వ్యాఖ్య‌లు చాలా మంది చంద్ర‌బాబుగారి అభిమానుల్లాగే న‌న్నూ బాధించాయి. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల పార్టీ అయిన తెలుగుదేశం శాస‌న‌సభాప‌క్ష నేతని మీరు ఎన్నో మెట్లు దిగ‌జారి దూషించి..దానినే 'నేనొక ప్ర‌జాప్ర‌తినిధిగా మాట్లాడుతున్నా'నంటూ స‌మ‌ర్థించుకోవ‌డం హర్షణీయం కాదు. మీరు చేసిన వ్యాఖ్యలే సభలో సభ్యులెవరన్నా చేస్తే మీరెలా స్పందిస్తారు? వాటిని అన్‌పార్లమెంటరీ పదాలు అని తొలగిస్తారా లేక సభలో హుందాగా మాట్లాడాలి, బయట ఎలా మాట్లాడినా ఫర్వాలేదని సూచిస్తారా?"

"వైఎస్ హ‌యాంలో అగ్రిగోల్డ్ మోసాలు వెలుగుచూశాయి. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో డిపాజిట్‌దారుల వివ‌రాలు సేక‌రించాం. న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించి అగ్రిగోల్డ్ ఆస్తుల‌ను కాపాడాం. ఈ రోజు అగ్రిగోల్డ్‌కి సంబంధించి ఒక్క సెంటుభూమి కూడా యాజ‌మాన్యానికి, ఇత‌రుల‌కు ద‌క్క‌కుండా కాపాడింది తెలుగుదేశం ప్ర‌భుత్వం మాత్ర‌మే. బాధితుల‌కు న్యాయం చేయాల‌ని రూ.336 కోట్లు సిద్ధంచేస్తే.. అగ్రిగోల్డ్ ఆస్తుల‌పై క‌న్నేసిన వైకాపా నేత‌లే కోర్టులో కేసులు వేసి మ‌రీ అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ నిధుల నుండే రూ.264 కోట్లను పంపిణీ చేసి మిగతా రూ.72 కోట్లు మింగేశారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకునేందుకు బ‌డ్జెట్‌లో కేటాయించిన రూ.1150 కోట్లు ఏమ‌య్యాయో తెలియ‌డంలేదు. మీరు ఇటీవ‌ల ఉగాండా వెళ్లారు. మిమ్మ‌ల్ని కుటుంబ‌స‌మేతంగా తాడేప‌ల్లి ఇంటికి పిలిపించుకున్న జ‌గ‌న్ గారు మీ విదేశీ ప‌ర్య‌ట‌న చాలా చ‌క్క‌గా సాగాల‌ని అభిల‌షిస్తూ పుష్ప‌గుచ్ఛం అంద‌జేశారు కూడా. అక్క‌డి స‌ద‌స్సులో మీరు తెలుసుకున్న విలువ‌లు, స‌భామ‌ర్యాద‌లు మ‌న రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి అనుకున్నాం. అలాంటిది అట్నుంచి వ‌చ్చాక మీరు ఇలా ప్ర‌తిప‌క్ష‌నేత‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మ‌మేంటో చెప్ప‌గ‌ల‌రా?"

"అలాగే అగ్రిగోల్డ్‌తో నాకు సంబంధం ఉంద‌ని కూడా మీరు వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వంలో ఉన్న‌ది మీరే క‌దా!అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా నాపై చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు.గౌర‌వ‌నీయ స‌భాప‌తి స్థానం నుంచి ప్ర‌తిప‌క్ష‌నేత‌పైనా, మండలి స‌భ్యుడినైన నాపైనా నిందారోప‌ణ‌లు చేయడం మీ స్పీక‌ర్ స్థానానికి స‌ముచితం కాదు. అగ్రిగోల్డ్ బాధితుల‌కు టీడీపీ హ‌యాంలో అందించే సాయాన్ని వైకాపా నేత‌లు అడ్డుకోకుండా ఉండి ఉంటే.. ఇప్ప‌టిక‌న్నా ఎక్కువ సాయమే అందేది. మీరు చేసిన ఆరోప‌ణ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటాను అంటే నాదొక స‌వాల్‌. అగ్రిగోల్డ్‌కి సంబంధించి ఏ ఒక్క అంశంలోనైనా నాకు సంబంధం ఉంద‌ని నిరూపిస్తే నా ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాను. ఒక‌వేళ మీరు చేసిన ఆరోప‌ణ‌లు అన్నీ అవాస్త‌వాల‌ని తేలితే..మీరేం చేస్తారో కూడా చెప్పాల‌ని ఈ బ‌హిరంగ లేఖ ద్వారా స‌వాల్ విసురుతున్నాను. ఇటువంటి బురద జల్లే ఆలోచనలన్నిటి వెనుకా మీ పార్టీ అధ్యక్షులవారి ప్రోద్భలం, ప్రోత్సాహం ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మీ ఆరోపణలకు కూడా అదే కారణమై ఉంటుంది. కాబట్టి మీ ఆరోపణలు అవాస్తవమని తేలితే, మీరన్నట్టే ఒక ప్రజా ప్రతినిధిగా మీ పార్టీ అధ్యక్షుడి గుడ్డలూడదీసి, రాజకీయాల నుండి తప్పించేలా సవాల్ స్వీకరిస్తారని ఆశిస్తూ"... ఇట్లు.. నారా లోకేశ్‌.. ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

ఈ మధ్య కాలంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు, దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. పోజిటివ్ స్టొరీలు కాదు, నెగటివ్ స్టొరీలతో పరువు పోతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పనుల పై, జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురిస్తుంది. ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో ట్రెండ్ అయినవి, ఇసుక కష్టాలు/మరణాలు. జాతీయ జెండా ఉన్న చోట, అది తీసి వైసిపీ రంగులు పూయటం. అబ్దుల కలాం పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టటం. మీడియా పై కేసులు పెట్టే జీవో తీసుకు రావటం. వీటిలో కొన్నిటి పై వచ్చిన వ్యతిరేకత చూసి ప్రభుత్వం వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జగన్ మోహన్ రెడ్డి ఇంటి కోసం, ఖర్చు పెట్టిన వివరాలు, మరీ ముఖ్యంగా 73 లక్షలతో, జగన్ ఇంటికి పెట్టిన అల్యూమినియం కిటికీల గురించి, జాతీయ మీడియా ఒక రేంజ్ లో విరుచుకు పడింది. అసలు ఆరు నెలలు క్రితం అంగరంగ వైభవంగా కట్టిన ఇంటికి, 73 లక్షల ప్రజా ధనంతో, కిటికీలు ఏంటి అంటూ, జాతీయ మీడియా విరుచుకు పడింది.

media 08112019 2

ఒక టీవీ కాదు, ఒక పేపర్ కాదు, దాదపుగా అన్ని ప్రముఖ ఛానెల్స్ మరియు పేపర్లలో, ఈ విషయం ప్రముఖంగా ప్రస్తావించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత, ఇప్పటి వరకు, దాదాపుగా 15.50 కోట్లు ఆయన ఇంటికి ఖర్చు పెట్టారని, అయితే సొంత ఇంటి కోసం, ప్రజా ధనం ఎందుకు వృధా చేస్తున్నారు అంటూ జాతీయ మీడియా ప్రశ్నించింది. అదీ కాక, జగన్ మోహన్ రెడ్డి, తన ఎన్నికల అఫిడవిట్ లో, తన ఆస్తి 510 కోట్లుగా చూపించారని, ఇది కేవలం వైట్ అని, మరి ఇన్ని వందల కోట్లు ఆస్తి ఉన్న వ్యక్తీ, కేవలం 15 కోట్లు కోసం, ప్రజా ధనం ఎందుకు వృధా చేస్తున్నారు, ఆయన సొంతగా ఖర్చులు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ప్రభుత్వ సొమ్ము తీసుకోవటం, అంటూ జాతీయ మీడియాలో కధనాలు వచ్చాయి.

media 08112019 3

జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు, 15 కోట్లు దాకా ఖర్చు పెట్టరు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జగన్‌ నివాసం వద్ద 1.33 కిలోమీటర్లు పొడువు ఉన్న రహదారి విస్తరణకు, రూ.5 కోట్లు. జగన్ ఇంటి పరిసరాల్లో రక్షణ అవసరాలు కోసం, 1.89 కోట్లు. ఇంటి వద్దే ప్రత్యేకంగా హెలిప్యాడ్‌, దానికి ఫెన్సింగ్‌, కోసం రూ.40 లక్షలు. హెలిపాడ్‌ వద్ద సదుపాయాల కోసం రూ. 13.50 లక్షలు. జగన్ ఇంటి వద్ద, బారికేడింగ్‌ కోసం రూ. 75 లక్షలు. జగన్ ఇంటి, నిరంతరం విద్యుత్తు సరఫరా, నిర్వహణ కోసం, ఎలక్ట్రీషియన్ కు, రూ.8.50 లక్షలు. అత్యాధునిక విద్యుత్‌ వ్యవస్థ, లైట్స్‌, సీసీటీవీ సదుపాయం కోసం 3.63 కోట్లు. విద్యుత్‌ టాన్స్‌ఫార్మర్‌, హెచ్‌టీ లైన్‌, ఆధునిక లైటింగ్‌ సిస్టమ్‌కు రూ.97 లక్షలు. సీసీటీవీ, సోలార్‌ ఫెన్సింగ్‌ కోసం రూ. 1.25 కోట్లు. ఆధునిక ఏసీల ఏర్పాటుకు రూ.80 లక్షలు. క్యాంపు ఆఫీసు బయట లైటింగ్‌ కోసం రూ. 11.50 లక్షలు. జగన్ ఇంట్లో, వ్యూకట్టర్‌ ఏర్పాటు కోసం రూ.3.25 కోట్లు. తాజాగా, ఆల్యూమినియం తలుపులు, కిటికీలు కోసం, రూ. 73 లక్షలు. ఇలా మొత్తం, ఇప్పటి వరకు, దాదాపుగా, 15.65 కోట్లు ఖర్చు పెట్టారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పోలవరం విషయంలో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. పోలవరం పనులు సాఫీగా, ఫాస్ట్ గా సాగుతున్నాయి, మీరు కాంట్రాక్టర్ ను మార్చకండి, మా మీద కక్షతో కాంట్రాక్టర్ ని మార్చితే, ఇది న్యాయ పరంగా కేసు అవుతుంది, అలా జరిగింది అంటే, న్యాయస్థానాల్లో కేసు తేలేదాకా, పనులు ముందుకు సాగవు, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, అంటూ చంద్రబాబు చెప్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం వినిపించుకోకుండా, అందులో అవినీతి జరిగిపోయింది అంటూ, అవినీతిని ఇప్పటి వరకు నిరూపించకుండా, రివర్స్ టెండరింగ్ అంటూ, పోలవరం ప్రాజెక్ట్ లో మిగిలిపోయిన హెడ్ వర్క్స్ తో పాటుగా, పోలవరం హైడెల్ ప్రాజెక్ట్ తో కలిపి, టెండర్ ను పిలిచింది. అప్పటికే ఉన్న నవయుగతో ఒప్పందం రద్దు చేసుకుంది. అయితే టెండరింగ్ లో, కేవలం మేఘా ఒక్కటే పాల్గుని, ఆ పనులను మేఘా సంస్థ దక్కించుకుంది.

polavaram 08112019 2

అయితే హైడల్ ప్రాజెక్ట్ విషయం పై నవయుగ సంస్థ తీవ్రంగా స్పందిస్తూ, ఒప్పందం రద్దుకు గల కారణాలు చెప్పలేదంటూ, కోర్ట్ కు వెళ్ళింది. ఆగష్టు నెలలో కోర్ట్ కు వెళ్ళగా, అక్కడ జడ్జి నవయుగకు అనుకూలంగా తీర్పు ఇస్తూ, పనుల పై స్టే విధించారు. అయితే దీని పై ప్రభుత్వం, మళ్ళీ అప్పీల్ చెయ్యటంతో, హైకోర్ట్ సింగల్ బెంచ్, ప్రభుత్వానికి అనుకూలంగా స్టే ఎత్తివేసింది. అయితే దీని పై మరోసారి, నవయుగ హైకోర్ట్ ఫుల్ బెంచ్ ముందుకు వెళ్ళింది. మొన్న హైకోర్ట్ లో, సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ, మరో పిటీషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం మమ్మల్ని అకారణంగా తప్పించిందని, ఒప్పందం మొత్తం పరిగణలోకి తీసుకోకుండా, సింగల్ బెంచ్ తీర్పు ఇచ్చిందని, దాని పై స్టే ఇవ్వాలంటూ, హైకోర్ట్ లో పిటీషన్ వేసింది.

polavaram 08112019 3

అయితే, దీని పై, ఈ రోజు హైకోర్ట్ లో విచారణ జరిగింది. పోలవరం హైడల్‌ ప్రాజెక్ట్‌ పనులు, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులు అందరికీ హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. అయితే, ఇది ప్రభుత్వానికి షాక్ అనే చెప్పాలి. మొన్న సింగల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలతో మా విజయం అని చెప్పిన ప్రభుత్వం, మరి ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక మరో పక్క ఈ ఆదేశాలు హైడల్ ప్రాజెక్ట్ వే అయినా, మేఘా సంస్థ టెండర్ మాత్రం, హెడ్ వర్క్స్ తో పాటుగా హైడల్ ప్రాజెక్ట్ కూడా కాబట్టి, మరి మేఘా సంస్థ హెడ్ వర్క్స్ పనులు చేస్తుందో, తడుపరి ఆదేశాలు వచ్చేదాకా ఆగుతుందో చూడాలి.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడుకి, విజయవాడ పోలీసులు షాక్ ఇచ్చారు. ఒక ప్రతిపక్ష నాయకుడు నిరసన తెలపటానికి కూడా అవకాసం లేకుండా, ఆంక్షలు విధిస్తున్నారు. ఇసుక కొరతతో, పనులు లేక, రోడ్డున పడ్డ 40 లక్షల మంది కార్మికులకు అండగా, ఈ నెల 14 వ తేదీన, విజయావాడలో చంద్రబాబు దీక్షకు దిగుతాను అంటూ, చెప్పిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, దీక్ష చెయ్యాలని, భవన నిర్మాణ కార్మికుల తరుపున పోరాడాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు వచ్చే ఈ సభ కోసం, విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించాలాని, తెలుగుదేశం పార్టీ భావించింది. ఇందు కోసం, ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని తెలుగుదేశం నేతలు పోలీసులను గురువారం విజయవాడ పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావును మున్సిపల్‌ కమిషనర్‌ను కోరారు.

cbn 08112019 2

రాష్ట్ర మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పార్టీ నాయకుడు ఆళ్ల గోపాలకృష్ణ తదితరులు విజయవాడ పోలీస్ కమీషనర్ ను స్వయంగా కలిసి అనుమతి కోరుతూ, వినతిపత్రం ఇచ్చారు. దీని పై అలోచించి నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అందరూ అనుమతి వస్తుందని భావించిన తరుణంలో, ప్రభుత్వం షాక్ ఇచ్చింది. చంద్రబాబు ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వం అని తేల్చి చెప్పింది. స్టేడియంలో ప్రభుత్వానికి సంబందించిన కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇస్తామని, ఇతర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వము అంటూ అధికారులు తేల్చి చెప్పారు.

cbn 08112019 3

అయితే ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ నేతలు మండి పడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం తరువాత, బహారింగ సభ ఇక్కడే పెట్టుకున్నారని, ఇది ప్రభుత్వ కార్యక్రమమా అని నిలదీసారు. మేము అధికారంలో ఉండగా, ఇలాగే ఆలోచిస్తే, జగన్ మొహన్ రెడ్డి, పాదయాత్ర చేసే వారా అని ప్రశ్నించారు. అయితే, ఎక్కడ దీక్ష చేసిన, ప్రభుత్వం అనుమతి ఇవ్వదు అని గ్రహించిన తెలుగుదేశం నేతలు, తెలివిగా, విజయవాడ ధర్నా చౌక్ వద్ద చేస్తే ఎలా ఉంటుంది అనే అంశం పై ఆలోచిస్తున్నారు. ఇక్కడ అయితే సిటీ మధ్యలో ఉంటుందని, ఇక్కడ నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, అందుకే ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పై తెలుగుదేశం నేతలు ఆలోచనలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు పిలుపుఇచ్చిన ఇసుక పోరాటానికి, ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేసారు. అలాగే చలో ఆత్మకూరు విషయంలో కూడా, ఇలాగే హౌస్ అరెస్ట్ లు చేసారు. మరి ఈసారి, ప్రభుత్వం అనుమతి ఇస్తుందా, ఇది కూడా అడ్డుకుంటుందా అనేది చూడాలి.

Advertisements

Latest Articles

Most Read