తెలుగుదేశం పార్టీ సరికొత్త సమీకరణాలు ప్రత్యర్థి వైసీపీకి అంతుబట్టటం లేదు. ఏపీలో సినీ పరిశ్రమ లేదు. ఏపీలోనైనా, తెలంగాణలోనైనా ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. మరి టిడిపితో స్టార్ హీరోలకు పనేంటి అనేది ఇప్పుడు వైసీపీ వ్యూహకర్తలు చిక్కు ప్రశ్నగా మారింది. చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి వరించగా సినిమాటోగ్రఫీ శాఖ ఇచ్చారు. అప్పటి నుంచే సినీ పరిశ్రమతో సత్సంబంధాలున్నాయి. ఎన్టీఆర్ అల్లుడు అయ్యాక మరింత బలపడ్డాయి. బాలయ్య వియ్యంకుడు కావడం సినీ పరిశ్రమతో విడదీయలేని బంధమైంది. అలాగే ముఖ్యమంత్రి చేసిన 14 ఏళ్లు, ప్రతిపక్షనేతగా దాదాపు 20 ఏళ్లు సినీ పరిశ్రమతో స్నేహసంబంధాలు కొనసాగించిన ఘనచరిత్ర చంద్రబాబుది. ఈ నేపథ్యంలో ఆయన ఓడిపోయినా ఆయనని తమ గురువుగా, స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా చాలా మంది భావిస్తారు. ఇటీవల బెంగళూరు టూర్కి వెళ్లిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని కేజీఎఫ్ హీరో యష్ వచ్చి కలిసి వెళ్లారు. కన్నడనాట టాప్ హీరో అయిన యష్ లోకేష్ ని కలవడం కలకలం రేపింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎదురులేని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ కలిశారు. ఈ భేటీ దెబ్బకి ఇప్పటికీ చాలా మంది వైసీపీ నేతలకు నిద్రపట్టటంలేదు. తమిళ్ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ చంద్రబాబుని కలిసి తన ఫ్రెండ్ విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. కొద్ది రోజుల తేడాలోనే తెలుగుదేశం పార్టీ అధినేత, ఆయన తనయుడిని కన్నడ తెలుగు తమిళ్ సూపర్ స్టార్లు కలవడం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలకు గుండెల్లో గుబులు రేపుతోంది.
news
చంద్రబాబుని మామయ్యా అంటూ ఎన్టీఆర్ వేసిన ట్వీట్, వైసీపీకి గట్టిగా దిగిందిగా...
నాటు నాటు పాట మేనల్లుడిని మామయ్య రూటు పట్టించిందా? మావయ్య చంద్రబాబుకి మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ రిప్లయి ట్వీటు ఇప్పుడు సినీ ఇండస్ట్రీతోపాటు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్. జూనియర్ ఎన్టీఆర్ చాలా ఏళ్లుగా టిడిపికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగని టిడిపిపై ఎటువంటి అసంతృప్తి వ్యాఖ్యలూ చేయలేదు. ఈ సందుని వాడుకుని వైసీపీ కుతంత్రాలను అమలుచేసే ఐప్యాక్ టీమ్ జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలని కొన్ని రోజులు ఫేక్ అక్కౌంట్ల నుంచి గాలి పోస్టులు వేస్తుంది. ఇది ఐప్యాక్ డిమాండ్ అని అందరికీ తెలిసిపోవడంతో మరొక విషపు ప్రచారం సర్కులేట్ చేసింది. లోకేష్-ఎన్టీఆర్ మధ్య గొడవలు అంటూ సృష్టించిన ఈ పోస్టులూ ఎక్స్ పెయిర్ అయిపోయాయి. ఇలా లాభం లేదనుకుని మళ్లీ చంద్రబాబు-ఎన్టీఆర్ భేటీ అంటూ మరో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఇది సేలబుల్ కాలేదు. గ్యాప్ పెంచాలనుకున్నా సాధ్యం కావడంలేదు. విభేదాలు పెంచుదామనుకున్నా వర్కవుట్ అవ్వలేదు. RRR సినిమాలో నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ వంటి విశిష్ట అవార్డు రావడం ఆనందంగా ఉందని, తెలుగువారికి ఇది గర్వకారణమని, కీరవాణి, రాజమౌళి, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన రిప్లయి ఒక్కసారిగా చర్చనీయాంశం అయ్యింది. ప్రేమగా థ్యాంక్యూ మావయ్య అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీటుతో టిడిపిలోనూ, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లోనూ సంతోషం నింపింది. ఇటీవలే చంద్రబాబు లోకేష్‌లను కన్నడ స్టార్ యష్, తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్, పవర్ స్టార్ పవన్ కల్యాన్ కలిశారు. ఇప్పుడు ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఎన్టీఆర్ మావయ్యకి కృతజ్ఞతలు తెలపడం విశేషం.
నిన్నటి వరకు బలంగా ఉన్న నెల్లూరులో, పతనం దిశగా వైసీపీ..
నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గపోరు తీవ్రం అయ్యింది. గ్రామస్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకూ వైసీపీ మూడు గ్రూపు..ఆరు తగాదాలుగా రోడ్డున పడుతున్నాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్‌తో సరిపడడంలేదు. ఇదే సీటు కోసం పోటీపడుతున్న వైసీపీ నేతలు కూడా అనిల్ కి దూరంగానే ఉంటున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సీటు ఆశిస్తున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డిని సీఎం జగన్ మోహన్ రెడ్డి చేరదీస్తుండడంతో కోటంరెడ్డి అలకబూనారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సందర్భం దొరికితే జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. ఆనంకి చెక్ పెట్టడానికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దీంతో వర్గపోరు మరింత తీవ్రమైంది. గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్ కి టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ అసమ్మతివర్గం భీష్మించుకు కూర్చుంది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి వర్గం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ నేతల తీరుతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దోపిడీ, దౌర్జన్యాలను సొంత పార్టీ వారే అసహ్యించుకుంటున్నారు. ఓ రాజ్యసభ సభ్యుడు తన వారసుడిని ఇక్కడి నుంచి పోటీకి దింపాలని వైసీపీ పెద్దల వద్ద ప్రతిపాదన ఉంచారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆ రాజ్యసభ సభ్యుడి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎన్నికలు వచ్చేనాటికి నియోజకవర్గాల్లో అసమ్మతి సద్దుమణగకపోతే వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
బాలయ్య, చిరులపై వైసీపీ కుట్ర..నారా లోకేష్ హెచ్చరిక
సంక్రాంతి బరిలోకి దిగిన సినిమా పందెంకోళ్లు కాళ్లకు కులపు విషపు కత్తులు కట్టాలని చూస్తోంది వైసీపీ. ఐప్యాక్ ఆధ్వర్యంలో వేలాది ఫేక్ ఖాతాలతో హీరోల పేరుతోనూ, కులాల పేరుతో విద్వేషం చిమ్మటానికి సిద్ధమవుతోంది. ఈ కుట్రపై తెలుగు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వస్తున్న బాల మావయ్య, వాల్తేరు వీరయ్యగా వస్తున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు లోకేష్. మాస్ ఎంటర్టైన్మెంట్ అందించే ఈ మూవీస్ ని ప్రేక్షకులతోపాటు చూసేందుకు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నానన్నారు. బాలయ్య, చిరు పేరుతో, కేస్ట్ పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమైందని హెచ్చరించారు. సోషల్మీడియాలో ఫేక్ ఖాతాల ద్వారా ఒక కులం పేరుతో మరో కులంపై విషం చిమ్మాలని కుట్రలు పన్నారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విషప్రచారాలు చేసి కుల,మత,ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చిన దుష్ట చరిత్ర గలిగినవారి ట్రాప్‌లో ఎవరూ పడొద్దని విన్నవించారు. సినిమాలు అంటే వినోదమని, సినిమాలను వివాదాలకు వాడుకోవాలనే అధికార పార్టీ కుతంత్రాలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. మనమంతా ఒక్కటే. కులం, మతం, ప్రాంతం ఏవీ మనల్ని విడదీయలేవని నారా లోకేష్ ట్వీటులో పేర్కొన్నారు.