స్వామి కార్యం స్వకారం ఒకేసారి పూర్తి చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు. భోగి పండగ రోజు కూడా జగన్ రెడ్డి పాలనని ఎత్తి చూపే అవకాశంగా వాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ``ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి`` కార్యక్రమం తలపెట్టిన నుంచి ఎలా అడ్డుకోవాలో తెలియని వైసీపీ ఏకంగా జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాన్ని ప్రధాన ప్రతిపక్షం టిడిపితోపాటు విపక్షాలన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. సీపీఐ రామక్రిష్ణ వేసిన పిల్ ని విచారించిన హైకోర్టు ఈ జీవోని సస్పెండ్ చేసింది. జీవోని సస్పెండ్ చేసినా, నిరంకుశ పాలకుడి తెచ్చిన జీవో గురించి మరింత అవగాహన పెంచేందుకు టిడిపి నిర్ణయించుకుంది. పాత వస్తువులు, ఉపయోగించనివి భోగీ మంటల్లో వేయడం ఆనవాయితీ. జగన్ రెడ్డి ఆదేశాలతో తెచ్చిన జీవో1ని భోగీ మంటల్లో వేసి నిరసన తెలపాలని టిడిపి అధినేత పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలలోనూ టిడిపి నేతలు భోగి మంటలు వేదికగా వైసీపీ సర్కారు నియంత నిర్ణయాలను ధిక్కరిస్తున్నామని చాటిచెబుతూ, జీవో 1 ప్రతులను మంటల్లో వేశారు. నారావారి పల్లెలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా చీకటి జీవోని భోగి మంటల్లో వేశారు.
news
ఏపీలో జగన్ పాలన పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఎమర్జెన్సీ పాలన సాగుతోందని నందమూరి నటసింహం బాలయ్య ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పరిస్థితులు ఏమీ బాగాలేవన్నారు. ఈ విషయాలు నేను హిందూపురం ఎమ్మెల్యేగా, టిడిపి నేతగా చెప్పడం లేదని సామాన్య పౌరుడిగా చెప్తున్నానన్నారు. ప్రభుత్వం ఎన్ని అవాస్తవాలు ప్రచారంచేసినా వాస్తవాలు ప్రజలకు బాగా తెలుసు అని పేర్కొన్నారు. కరోనా వల్ల మూడేళ్లుగా నారావారిపల్లెకు రాలేకపోయాయని, సంక్రాంతి సందర్భంగా రావడం నారావారిపల్లెకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆకలిగా ఉన్న ప్రేక్షకులకు మంచి సినిమాను అందించామని, వీరసింహారెడ్డి భారీ విజయం సాధించిందని బాలకృష్ణ తెలిపారు. సినిమాకు ఘనవిజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువు చేశారని బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.
ఆ సీన్ లు కట్ చేయాలని ఆదేశించారా ? వీరసింహారెడ్డి సినిమా పై వైసీపీ వార్నింగ్ లు పని చేస్తాయా ?
నందమూరి నటసింహం సినిమా వీరసింహారెడ్డి దెబ్బకి పులివెందుల పులి అని పిలిపించుకునే వైసీపీ ప్రభుత్వం గజగజ వణికారని వార్తలు వస్తున్నాయి. సినిమాని ఆపడానికి ఏమైనా చేయగలమా? అనే ఆలోచనతో కొందరు పోలీసు అధికారులు సినిమా విడుదలైన రోజే అర్ధరాత్రి స్పెషల్ షో చూశారని వార్తలు వచ్చాయి. తన పరిపాలనని టార్గెట్ చేసుకుని క్యారెక్టర్, డైలాగులు పేలిన వీరసింహారెడ్డి సినిమా బలంగా ప్రజల్లోకి వెళ్తే వైసీపీకి డ్యామేజ్ అవుతుందని ఆందోళనలో ఉన్నారట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుర్రాడిగా వున్నప్పుడు కడప జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అని ప్రచారం ఉంది. మీడియా వార్తలను బట్టి చూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరసింహారెడ్డి సినిమాని తీశారని, మొత్తం డైలాగులు, సన్నివేశాలు వైసీపీని డ్యామేజ్ చేసేలా ఉన్నాయని, ఈ సినిమాని అడ్డుకునే మార్గాలు పరిశీలించాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. దీంతో కొందరు ఉన్నతాధికారులు సినిమా చూశారు. అభివృద్ధి ఏమీ లేదని, అరాచకాలు పెరిగిపోయాయని బాలయ్య పేల్చిన డైలాగులు జగన్ సర్కారుని ఉద్దేశించినవేనని తేల్చేసిన నివేదిక అందజేశారని తెలుస్తోంది. ఈ డైలాగులు సినిమా నుంచి కట్ చేసుకుని సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు. సినిమాలో ఆ డైలాగులు తొలగించాలని నిర్మాతలకు ఆదేశించాలని అనుకుంటున్నారని సమాచారం. లేదంటే వీరసింహారెడ్డి ప్రదర్శనకు అడ్డంకులు తప్పవని అధికారుల ద్వారా హెచ్చరికలు పంపారని ప్రచారం సాగుతోంది.
పెద్దిరెడ్డి రెచ్చిపోతుంటే, నువ్వు చంద్రబాబుని ఆపుతావా ? డీజీపీ పై అచ్చెన్నాయుడు ఫైర్
ప్రతిపక్షనేత పర్యటనను అడ్డుకోవడం అధికార దుర్వినియోగం చేస్తున్నారని, మంత్రి పెద్దిరెడ్డి విపరీత పోకడల్ని డీజీపీ నివారించాలి అంటూ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వాపోయారు. ఆయన మాట్లాడుతూ, "అక్రమ కేసులతో పండుగ పూట పుంగనూరు టీడీపీ నేతల్ని మంత్రి పెద్దిరెడ్డి జైలులో పెట్టించి పెద్ద తప్పు చేశారు. పండగపూట జైలులో ఉన్నవారి కుటుంబాల ఉసురు పెద్దిరెడ్డికి తగలకమానదు. బాధితుల పరామార్శకు వెళ్తున ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి బ్యానర్లు కట్టిండం టీడీపీ బ్యానర్లు చించడం మరో తప్పు. ప్రతిపక్ష నేత పర్యటనకు వ్యతిరేకంగా పోలీసులపై ఒత్తిడి తెచ్చి సర్కిల్ ఇన్స్ పెక్టర్ చేత 30 యాక్టు నోటీసు ఇప్పించడం అధికార దుర్వినియోగమే. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో పోలీస్ యాక్టు 30 ఉన్నా.. యదేచ్ఛగా కోడి పందేలు, జూదాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ పోలీస్ యాక్టు 30 ఏమైంది? కేవలం ప్రతిపక్షాల్ని ప్రజల వద్దకు, బాధితుల వద్దకు వెళ్లకుండా నిరోధించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పెద్దిరెడ్డి తప్పు చేయకపోతే ప్రతిపక్ష నేతను ఎందుకు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు? ప్రజల్ని బయపెట్టి లాండ్, శాండ్, వైన్, మైన్, రెడ్ శాండిల్ కుంభకోణాలు యదేచ్ఛగా చేస్తున్నారు. ఇవి బయటపడతాయనే భయంతోనే ప్రజలపై, ప్రతిపక్షాలపై దా-డు-లు చేయిస్తున్నారు. ఇళ్లను ధ్వంసం చేయిస్తున్నారు. బాధితులపై అక్రమ కేసులు పెడుతున్నారు. పరాకాష్టగా ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డుకొనే కుట్ర చేస్తున్నారు. డిజిపి జోక్యం చేసుకొని ప్రతిపక్ష నేత పర్యటన సజావుగా జరిగేందుకు తగు చర్యలు తీసుకోవాలి" అంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు