బంగారం, ఇత్త‌డి ఒకేలా ఉన్నా దేని విలువ దానిదే. ప‌ద‌విలో ఉన్నా..లేకున్నా చంద్ర‌బాబు స్థాయి ఒక రేంజులో ఉంటుంది. ప‌ద‌విలో ఉన్న జ‌గ‌న్ రెడ్డి రేంజు మ‌న‌మేంటో చూశాం. ప్ర‌తిప‌క్ష‌నేత‌గా చంద్ర‌బాబుతో ఇప్పుడు ఎవ‌రికి ఏ ప‌నీలేదు. కానీ నిన్న త‌లైవా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ వ‌చ్చి చంద్ర‌బాబుని క‌లిశారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా త‌న స్నేహితుడిని క‌లిశానంటూ సంతోషం వ్య‌క్తం చేశారు. దీనికంటే ఒక రోజు ముందు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ చంద్ర‌బాబు ఇంటికెళ్లి మ‌రీ త‌న సంఘీభావం తెలిపారు. కుప్పం టూరులో చంద్ర‌బాబు ప‌ట్ల ప్ర‌భుత్వం పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు చాలా దుర్మార్గమ‌నీ, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కై క‌లిసి పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌కు ఆత్మీయ అతిథ్యం ఇచ్చారు బాబు. ఇంటి గుమ్మం వ‌ర‌కూ వ‌చ్చి అతిథుల‌కు బాబు సాద‌ర వీడ్కోలు ప‌లికారు.  ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కూడా ఇటీవ‌ల ఇద్ద‌రు క‌లిశారు. వారు ఒక‌రు క‌మెడియ‌న్ అలీ, ఇంకొక‌రు వోడ్కా వ‌ర్మ‌. సీఎం వారినేమీ ఇంటి బ‌య‌ట వ‌ర‌కూ వ‌చ్చి సాగ‌నంప‌లేదు. వ‌చ్చాక అలీ, వ‌ర్మ‌ చేసిన ట్వీట్లు..వాడిన భాష కొడాలి నాని మీడియంలో ఉండ‌టం నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోయారు. క‌ల‌వ‌డానికి వ‌చ్చిన అతిథులు, ఆయా వ్య‌క్తులని బట్టే ఉంటార‌ని స్ప‌ష్టం అయ్యింద‌ని సోష‌ల్మీడియాలో పోస్టులు వైర‌ల‌వుతున్నాయి. విజ‌న‌రీ లీడ‌ర్ ని క‌ల‌వ‌డానికి త‌లైవా త‌మిళ సూప‌ర్ స్టార్, తెలుగు ప‌వ‌ర్ స్టార్ వ‌చ్చార‌ని ఇది సీబీఎన్ స్థాయి అని కోట్ చేస్తున్నారు. బూతు హాస్యం..వెకిలి మాట‌ల అలీ, పోర్న్ వీడియోలు చూస్తూ వోడ్కా మ‌త్తులో ఉండే వ‌ర్మ‌లని ప్రిజ‌న‌రీ స్థాయి అంటూ కంపేర్ చేస్తున్నారు సోష‌ల్మీడియా యూజ‌ర్లు.

సింహం సింగిల్గా వ‌స్తుంద‌ని ఇన్నాల్లూ వైసీపీ చేసిన చాలెంజ్ ల వెనుక ఇంత భ‌యం ఉందా అని తెలుగురాష్ట్రాల ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. టిడిపి జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుని సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో జీవో 1 పేరుతో అడ్డుకుంది వైసీపీ స‌ర్కారు. ప్ర‌చార‌ర‌థం లాక్కున్నారు. టిడిపి అభిమానుల‌పై లాఠీచార్జ్ చేశారు. జీవో1 తీసుకురాక ముందే విశాఖ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌నీ ఇలాగే అడ్డుకున్నారు. అప్పుడు ప‌వన్ని క‌లిసి చంద్ర‌బాబు సంఘీభావం తెలిపారు. ఇప్పుడు చంద్ర‌బాబుని అడ్డుకోవ‌డంతో ప‌వ‌న్ బాబుని క‌లిశారు. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కి సాగుతున్న పోరాటంలో భాగం అవుతామ‌ని ఇరువురు నేత‌లు ప్ర‌క‌టించారు. టిడిపి-జ‌న‌సేన అధినేత క‌ల‌యిక  కంటే వైసీపీ ఉలికిపాటే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. జ‌గ‌న్ సింహం అని సింగిల్ గా వ‌స్తాడ‌ని సినిమా డైలాగులు చెప్పిన వైసీపీ నేత‌లు బాబు-ప‌వ‌న్ భేటీపై పందుల్లా గుంపుగా వ‌చ్చి మాట‌ల దాడికి దిగారు. ప‌వన్-బాబు క‌లిస్తే మాకు న‌ష్టం లేదంటూనే వైసీపీ నేత‌లు గుండెలు బాదుకోవ‌డం చూస్తుంటే వైసీపీ క్యాంప్ షేక్ అవుతోంద‌ని స్ప‌ష్టం అవుతోంది. ప‌వ‌న్-బాబు భేటీపై వైసీపీలోని 10 మంది మంత్రులు, 151 మంది ఎమ్మెల్యేలూ స్పందించారు. వైసీపీ ఎంపీలూ, వైసీపీ కాపు నేత‌లు, వైసీపీ పెయిడ్ మీడియా- ఆర్టిస్టులూ రంగంలోకి దిగి విమ‌ర్శ‌లు గుప్పించ‌డం వైసీపీలో ప్ర‌కంప‌న‌ల‌కు అద్దం ప‌డుతోంది.

చిత్తూరులో వార్డు వాలంటీర్ శరవణ ఆత్మ-హ-త్య వైసీపీలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇంట్లో ఉరేసుకుని శరవణ ఆ-త్మ-హ-త్య చేసుకున్నాడు. వైసీపీ నాయకుడి వేధింపులే కారణమని శరవణ సూ-సై-డ్ నోట్ బ‌య‌ట‌ప‌డ‌టంతో ఏం చేయాలో తెలియ‌క పోలీసులు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. చిత్తూరు నగరం 11వ డివిజన్‌కి చెందిన వార్డు వాలంటీర్ శరవణ అలియాస్ జలాల్  ఆ-త్మ-హ-త్య-కు వైసీపీ నేత‌లే కార‌ణ‌మ‌ని మ‌ర‌ణ‌వాంగ్మూలం వెల్ల‌డిస్తోంది. ఆ-త్మ-హ-త్యకి ముందు రాసిన‌ సూ-సై-డ్ నోట్‌లో త‌న చావుకి రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ అంజలి,ఎమ్మెల్యే అనుచరుడు సయద్ అని పేర్కొన్నాడు. త‌న దగ్గర  డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా తిప్పుతున్నార‌ని, అడిగితే వైసీపీ ఎమ్మెల్యే మ‌నుషుల‌మంటూ బెదిరించారని లేఖ‌లో రాశాడు. తీసుకున్న డ‌బ్బు ఎగ‌వేసేందుకు నా కుటుంబాన్ని ఏమైనా చేస్తామని బెదిరించ‌డం దారుణ‌మ‌ని లేఖ‌లో ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. పోలీసులు త‌న‌కు రావాల్సిన డబ్బులు వ‌సూలు చేసి త‌న కుటుంబ‌స‌భ్యుల‌కు ఇవ్వాలంటూ వాలంటీరు సూసైడ్ నోట్లో కోరాడు. శరవణ ఆ-త్మ-హ-త్య-కు కారణమైన వైసీపీ నేత‌ల‌ను అరెస్టు చేయాలంటూ గ్రామస్థులు ధర్నాకు దిగారు.

ఒకే రోజు మ‌న రాష్ట్రంలో అత్యున్న‌త న్యాయ‌స్థానం మూడు కేసుల్లో ప్ర‌భుత్వంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. అయినా దున్న‌పోతు మీద వాన కురిసిన‌ట్టు వైసీపీ స‌ర్కారు నుంచి స్పంద‌న శూన్యం. దీనిపై ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు కూడా ఘాటుగా ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. హైకోర్టు న్యాయ‌మూర్తుల వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వాన్ని అభిశంసించిన‌ట్టే. సిగ్గు ఉన్న ప్ర‌భుత్వం అయితే ఉరేసుకుని  చ‌చ్చేది అంటూ సీబీఎన్ ట్వీట్ చేశారు. కాంట్రాక్ట‌ర్లు బిల్లులు అంద‌క దొంగలుగా మారారు. బిల్లులు చెల్లించ‌డంలేద‌ని దాఖ‌లైన వ్యాజ్యంపై విచార‌ణ సంద‌ర్భంగా కాంట్రాక్ట‌ర్ల‌ను దొంగ‌లు చేశార‌ని, పెన్ష‌న‌ర్ల‌కు పింఛ‌ను సొమ్ములు చెల్లించ‌క‌ పిక్ పాకెట్ గాళ్ల‌ను చేస్తారా అంటూ హైకోర్టు స‌ర్కారుపై మండిప‌డింది. గ్రానైట్ ప‌రిశ్ర‌మ‌కి ప‌వ‌ర్ క‌ట్ చేసిన కేసులోనూ హైకోర్టు తీవ్రంగానే స్పందించింది. బిల్లు క‌ట్ట‌లేద‌ని ప‌రిశ్ర‌మ ప‌వ‌ర్ క‌ట్ చేసిన స‌ర్కారు ఎవ్వ‌రికీ బిల్లులు చెల్లించ‌డంలేద‌ని, వీరి ప‌వ‌ర్ ఎవ‌రు క‌ట్ చేయాల‌ని ప్ర‌శ్నించింది. ఎస్సీల నిధులు మ‌ళ్లింపుని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తూ అధికారుల‌కు నోటీసులు జారీ చేసింది. ఒకే రోజు మూడు వ్యాజ్యాల‌పైనా హైకోర్టు చేసిన వ్యాఖ్య‌లు స‌ర్కారు నిర్ల‌క్ష్య తీరుకి అద్దం ప‌డుతున్నాయ‌ని న్యాయ‌వాదులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read