ఇరు తెలుగు రాష్ట్రాలకి తెలిసిన ప్రముఖ కాంట్రాక్టర్‌ మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో గత మూడు రోజులుగా ఐటి సోదాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. భారీగా అక్రమాలు చేసారనే అనుమానాలు రావడంతోనే ఐటి అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఐటి సోదాలు పూర్తిగా ఢిల్లీ నుంచి వచ్చిన ఐటి బృందాల ఆధీనంలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఢిల్లీ అధికారులు హైదరాబాద్‌ చేరుకున్న తరువాతే సోదాల విషయమై హైదరాబాద్ లో ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దగ్గరి సంబంధాలు ఉండటంతోనే, ఐటి అధికారులు వచ్చే దాకా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు ఐటి వర్గాలు చెబుతున్నాయి. మేఘా కంపెనీ చేపట్టిన కాంట్రాక్టులు, రెండు ప్రభుత్వాల నుంచి వచ్చిన కాంట్రాక్టుల్లో ఉన్న బిల్లుల వివరాలు తెలుసుకుని మరీ ఐటి రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.

megha 13102019 2

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ కాంట్రాక్టు పనులు దక్కించుకున్న మేఘా కంపెనీ, ఇతర చోట్ల కూడా కొన్ని కాంట్రాక్టు పనులు దక్కించుకుంది. ఫోర్బ్స్ మాగజైన్ ప్రచురించే కుబేరుల్లో ఒకరుగా మేఘా ఎదిగారు. అయితే, అతి తక్కువగాబ ఈ కంపెనీ, ముందస్తు పన్నులు చెల్లించింది. భారీ కాంట్రాక్టులు చేస్తున్న ఈ కంపెనీ ఇంత తక్కువగా ఎలా పన్నులు చెల్లిస్తుందనే అనుమానాలతో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో, పలు కీలక లావాదేవీల ఆధారాలు దొరకడంతో పూర్తి సమాచారం తెప్పించుకునే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మీడియా సంస్థలు, ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కంపెనీల్లో మేఘా కష్ణారెడ్డి పెట్టుబడులు పెట్టారు. టివి 9 కొనుగోలు వ్యవహారం, పోలవరం రివర్స్‌ టెండర్లు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. వీటి లావాదేవీలపైనా ఐటి అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

megha 13102019 3

మేఘా ఇంటి నుంచి పలు కీలక డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్ తదితర వస్తువులను అధికారులు బయటకు తీసుకు వెళ్లారు. ఇక మరో పక్క, ఐటి సోదాల్లో హవాలా రూపంలో వచ్చిన డబ్బులతో లావాదేవీలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తుండటంతో, రేపు ఈడీ కూడా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇక మరో పక్క, ఈ ఐటి దాడులు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి ఇంటికి రావడం సంచలనంగా మారింది. మీడియాకు కనపడకుండా మంత్రి జాగ్రత్త పడినా, మీడియా కవర్ చేసింది. ఇక మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా, అక్కడే మకాం వేసారు. కృష్ణారెడ్డి ఇంటి పక్కనే మకాం వేసి, ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితి, జరుగుతున్న విషయాల పై ఆరా తీసినట్లు తెలిసింది. మేఘా కృష్ణారెడ్డి ఇంటి వద్ద కేంద్ర బలగాలు మోహరించడం విశేషం. తెలంగాణా రాష్ట్ర పోలీసులను సైతం మేఘా ఇంట్లోకి అనుమతించలేదు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య, కరెంట్ యుద్ధం జరుగుతూనే ఉంది. కేంద్రం చెప్పినా వినకుండా, చంద్రబాబుని ఇరికిద్దాం అనుకుని, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తాను అంటూ జగన్ చేస్తున్న పని, కేంద్రానికి తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ఈ నేపధ్యంలోనే, కేంద్ర ఇంధన మంత్రి ఆర్కే సింగ్‌ మరోసారి, జగన్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు, ఎన్నికల్లో గెలుపు కంటే ఈ దేశం, మీ రాష్ట్ర భవిష్యత్‌ ముఖ్యమని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటూ వెళ్తే దేశంలో, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని, ఈ మాత్రం ఈ ప్రభుత్వానికి తేలియాదా అని ప్రశ్నించారు. విద్యుత్ కంపెనీలతో ఇప్పటికే ఒప్పందాలను చేసుకున్నారని, వాటిని ఇప్పుడు సమీక్షిస్తాం అంటే, ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెడతారా అని హెచ్చరించారు. విద్యుత్‌ ఇస్తున్న కంపెనీలకు రాష్ట్రాలు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా విద్యుత్‌ రంగానికి బ్యాంకులు రుణాలు ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

jagan 1310201 2

ఉచిత విద్యుత్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూనే, పరిశ్రమల పై అధిక విద్యుత్‌ చార్జీలు విధించడం పై అసహనం వ్యక్తం చేసారు. సకాలంలో చెల్లింపులు చేపట్టాలని, పునరుత్పాద విద్యుదుత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ రాష్ట్ర ప్రభుత్వ పీపీఏల సమీక్ష నిర్ణయాన్ని తొలి నుండి తప్పుబడుతున్నారు. ప్రధానికి, అమిత్ షా ద్రుష్టికి కూడా ఈ విషయం తీసుకువెళ్ళారు. మరో పక్క కోర్ట్ లు కూడా ఈ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఒక పక్క రాష్ట్రం, కేంద్రం మధ్య ఈ విషయంలో యుద్ధం నడుస్తున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కేంద్ర ఇంధన మంత్రి ఆర్కే సింగ్‌కు లేఖ రాసారు.

jagan 1310201 3

పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో కేంద్రం బాధ్యతను తాము తలకెత్తుకుని మోస్తున్నామని, ఇది తమకు భారంగా ఉందని, కొంత భారాన్ని కేంద్రమే భరించాలని ఆ లేఖలో కోరారు. దేశం మొత్తమ్మీద ఏటా 60 వేల మిలియన్‌ యూనిట్ల పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగిస్తుంటే, అందులో ఒక్క ఆంధ్రలోనే 15 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను మేం వినియోగిస్తున్నామని మంత్రి బాలినేని వివరించారు. ఈ లేఖ ద్వారా పునరుత్పాదక విద్యుత్‌ విషయంలో, ఆంధ్రప్రదేశ్ సుముఖంగా లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ప్రపంచం మొత్తం, పునరుత్పాదక విద్యుత్ వైపు వెళ్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, మేము ఇంకా బొగ్గు మాత్రమే వాడతాం అనే ధోరణిలో ఉండటం, నిజంగా ఆశ్చర్యం.

తన గెలుపు కోసం, చంద్రబాబు పై, తెలుగుదేశం పై విమర్శలు చేసిన వారికి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి జగన్ ఏదో ఒక పదవి ఇస్తున్నారు. ఇప్పటికే సాక్షిలో పని చేసే పెద్ద తలకయలకు, పెద్ద పెద్ద పదవులు కట్ట బెట్టారు జగన్. ఇప్పుడు తాజాగా ప్రముఖ టీవీ యాంకర్ స్వప్నకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌(ఎస్వీబీసీ) బోర్డులో డైరెక్టర్ గా, ఆమెను నియమించారు. ఆమెతో పాటుగా, సినీ రంగానికి చెందిన శ్రీనివాసరెడ్డిని కూడా ఒక డైరెక్టర్ గా నియమించారు. అయితే సినీ రంగానికి చెందినా శ్రీనివాసరెడ్డి అనగానే, అందరూ కమెడియన్ / యాకర్ట్ శ్రీనివాసరెడ్డి అని అనుకున్నారు. ప్రముఖ పత్రికలు కూడా ఆయన బొమ్మతో సహా, వేసాయి. అయితే దీని పై శ్రీనివాసరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ఆ శ్రీనివాసరెడ్డి నేను కాదు, నన్ను వదిలేయండి, "ఢమరుకం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిగారు" ఎస్వీబీసీ డైరెక్టర్ గా నియమించబడ్డారు, అంటూ పోస్ట్ చేసారు.

swapna 13102019 2

అందరూ కమెడియన్ శ్రీనివాసరెడ్డికి విషెస్ చెప్తూ ఉండటంతో, ఆయన స్పందించి, ఆ శ్రీనివాసరెడ్డి నేను కాదు, నన్ను వదిలేయండి అని చెప్పుకొచ్చారు. ఇక యాంకర్ స్వప్న విషయానికి వస్తే, మోదట్లో దూరదర్శన్ ఆ పై టీవీ9లో యాంకర్‌గా, తర్వాత సాక్షి ఛానెల్‌లో యాంకర్ గా, ఆమె తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సాక్షిలో పని చేస్తున్నప్పుడు, చంద్రబాబు పై, టిడిపి పై వ్యతిరేక కధనాలు వెయ్యటంలో, ఆమె కూడా ఒక చెయ్యి వేసారు. ఆ తర్వతా సాక్షి నుంచి బయటకు వచ్చినా, ఆ ఛానెల్‌కు కన్సల్టెంట్‌గా పనిచేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 10 టీవీలో పనిచేస్తుంది స్వప్న. అంతేకాదుతనకు ఉన్న,వెబ్‌ చానెల్‌ ద్వారా, కధనాలతో జగన్ పట్ల ఉడతా భక్తి చాటుకుంటూనే ఉంది.

swapna 13102019 3

ఇక స్వప్న తాను చేసే ఇంటర్వ్యూలలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాని ఇరుకున పెడుతూ, జగన్ కు బాగా పుష్ ఇచ్చే విధంగా ఆమె ఇంటర్వ్యూస్ ఉండేవి. జగన్ అధికారంలోకి రావటానికి, ఆమె కూడా ఒక చెయ్య వేసారు. ఇప్పుడు జగన్ రుణం తీర్చుకుంటున్నారు. అయితే ఏ పార్టీ పదవో ఇచ్చుకోవాలి కాని, ఇలా ప్రభుత్వ సొమ్ము, అంటే ప్రజల సొమ్ముతో, వారికి పదవులు, జీతాలు ఇవ్వటం ఏంటో మరి. ఇక మరో పక్క స్వప్నను ఎస్వీబీసీ డైరెక్టర్ గా నియామకం చేయటం వెనుక ఒక స్కెచ్ కూడా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే చైర్మెన్ గా ఉన్న పృథ్వి రాజ్ బాలిరెడ్డి దూకుడుకి చెక్ పెట్టే ఉద్దేశంతోనే, స్వప్నను డైరెక్టర్ చేసారని, ఇక పృథ్వి ఇష్టం వచ్చినట్టు చెయ్యటం కుదరదని, అందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. మొత్తానికి తనకి కావల్సిన వారందరికీ, ప్రభుత్వ పదవులు, వారికి జీతాలుగా ప్రజల సొమ్ముని, జగన్ కట్టబెట్టెస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని జగన్ మోహన్ రెడ్డి, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ కక్షలు ఎక్కడ దాకా వెళ్ళాయి అంటే, చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా కూల్చేస్తాం అనే దాకా వెళ్ళాయి. ప్రజా వేదికను రాత్రికి రాత్రి పడగోట్టేసారు. ప్రతిపక్ష నేతకు, ప్రభుత్వం ఇవ్వాల్సిన విధిలో భాగంగా, ప్రజావేదికను తన ఆఫీస్ గా ఇవ్వమని, చంద్రబాబు అడగటంతో, రాత్రికి రాత్రి, ప్రజా వేదిక కూల్చేసారు. దాని తరువాత, చంద్రబాబు ఇంటి పైన పడ్డారు. అదిగో కూల్చేస్తున్నాం, ఇదిగో కూల్చేస్తున్నాం అంటూ వార్నింగ్లు మీద వార్నింగ్లు ఇచ్చి, ప్రతి రోజు అది ఒక వార్తలాగా చేసి, వేరే సమస్యలకు కవరేజ్ లేకుండా చేసారు. ఇప్పుడు ఇది పాత వార్త అయిపోవటం, కోర్ట్ లో ఈ కేసు ఉండటంతో, ఇప్పుడు కొత్త వార్త కోసం, కొత్త కక్ష కోసం చూస్తూ, కొత్త టార్గెట్ ఫిక్స్ చేసారు.

tdp 13102019 1

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మంగళగిరి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర కార్యాలయం మీద కన్ను పడింది. ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి నవంబరు 3 తేదీ, ఆదివారం సాయంత్రం 7.19 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సాక్షిలో అది అక్రమా నిర్మాణం అంటూ కొత్త వాదన తెర మీదకు తెచ్చింది. భవన నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాల 65 సెంట్లను కేటాయించగా ఒక రైతుకు చెందిన భూమిని కూడా ఆక్రమించుకున్నారని, పైగా పక్కనే ఉన్న వాగును పూర్తిగా పూడ్చి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్నారని సాక్షి కధనం రాసింది. అంతే కాకుండా రెండు బేస్‌మెంట్‌లు, మూడు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని మూడు బేస్‌మెంట్‌లు, నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

tdp 13102019 1

అయితే ఇలా జగన్ గారి సాక్షిలో కధనం రావటంతో, జగన్ గారి ప్రభుత్వం స్పందించింది. ఇది అంతా అక్రమం అని తేల్చేసి, నోటీసులు కూడా ఇచ్చేసారు. గత శుక్రవారం అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. మంగళగిరి తహసీల్దార్‌ రామ్‌ప్రసాద్‌ నోటీసులు జారీ చేసిన ఏడు రోజులలోపు ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ పై ఈ రకంగా కక్ష తీర్చుకుంటున్నారు. కొసమెరపు ఏంటి అంటే, చంద్రబాబు అధికారంలో ఉండగా, ఇదే తాడేపల్లిలో జగన్, ఒక పెద్ద ఇల్లు, దాని పక్కనే ఒక పెద్ద పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. పాపం చంద్రబాబుకి, ఇలాంటి కక్షసాధింపు రాజకీయం తెలియదు కదా. ఏదో ఒక లింక్ పట్టుకుని, వేధించాలని అప్పుడు ఆయన అనుకుని ఉంటే ? చూద్దాం, ఇది ఎన్ని మలుపులు తిరిగుతుందో.

Advertisements

Latest Articles

Most Read