ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది... ఈ మాట మొన్నటి దాక బాగా వినిపించేది. ఏ రంగం చూసినా, దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉండేది.. కాని ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, అన్నీ రివర్స్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో మొన్నటి వరకు గొప్పగా చెప్పుకున్న ఎన్నో విషయాలలో ఇప్పుడు పతనం మొదలైంది. ఆదాయం తగ్గిపోవటంతో, పెట్టుబడులు రాకపోవటంతో, అన్ని విషయాల్లో మానం కిందకు పడిపోతున్నాం. ఈ నేపధ్యంలోనే, ఒక జాతీయ వార్తా పత్రికలో విచ్చిన కధనంలో, ఆంధ్రప్రదేశ్ ఆదయ పతనంలో దుకుసుకుపోతుంది. భారత దేశంలో అన్ని రాష్ట్రాల కంటే, ఏప్రిల్ – జూలై నెలల్లో ఆంధ్రప్రదేశ్ పన్నుల ఆదాయం దారుణంగా పడి పోయింది. గతంతో పోలిస్తే, 42.7 శాతం తగ్గిపోయింది. గత ఏడాది, ఇదే సమయానికి పన్నుల ఆదాయం, 5 శాతం వృద్ధి ఉంటే, ఇప్పుడు 42.7 శాతం పతనం అయ్యింది.

bugaana 09102019 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరువాత, అత్యంత ఆదాయం పడిపోతున్న రాష్ట్రాల్లో పంజాబ్ ఉంది. మనకు 42.7 శాతం పతనం ఉంటె, రెండో స్థానంలో, 12.5 శాతం తగ్గుదలతో పంజాబ్ ఉంది. ఎంత తేడా ఉందొ చూసారా ? అందుకే పతనంలో దూసుకుపోతున్నాం అంటుంది. ఇందుకు అనేక కారణాలు చెప్పచ్చు. ముందుగా ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పెద్దల నిర్ణయాలు. అలాగే అన్ని పనులు ఆపెయ్యటం, రివర్స్ కు వెళ్ళటం. ఇక అన్నిటికంటే పెద్ద సమస్య ఇసుక కొరత. దీంతో ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఖర్చు పెట్టే వారు లేరు. ఇక కొత్త పెట్టుబడులు లేవు. ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉండటంతో, ఈ పరిస్థితి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్ధిక మందగమనం కంటే, మన రాష్ట్రంలో అధికంగా ఉంది.

bugaana 09102019 3

ఈ పరిస్థితి పై, టీడీపీ ఎంపీ, గల్లా జయదేవ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకు పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో పన్ను ఆదాయ వృద్ధి దారుణంగా పడిపోవడం. గల్లా జయదేవ్ ట్విట్టర్ వేదికగా జగన్‌ నిర్ణయాలను వ్యతిరేకించారు."YCP Govt's decision to stop all #development works has resulted in AP registering the highest fall in #tax revenues in the country in first quarter. Unless the development works are taken up immediately, the exchequer of the state will further deteriorate." అంటూ ట్వీట్ చేసారు. ఇక మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు "AP records highest fall in tax revenues in first quarter of 2019-20. New govt has continued spending without working on revenue sources. This government lacks basic administrative capabilities about revenues and welfare spending. Andhra headed for disaster without prompt action." అంటూ ట్వీట్ చేసారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ మసకబార్చేలా, భక్తులమనోభావాలు దెబ్బతినేలా జగన్‌ చర్యలున్నాయని, ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారికి ఉన్న మహిమను మంటగలి పేలా వైసీపీ ప్రభుత్వం తిరుమలలో అన్యమత ప్రచారానికి పూనుకుందని టీడీపీనేత, ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం టీటీడీ ఛైర్మన్‌ పదవిని బీసీలకు, ముఖ్యంగా హిందూమత విశ్వాసకులకు అప్పగిస్తే, వైసీపీ ప్రభుత్వం అందుకు పూర్తివిరుద్ధంగా వ్యవహరించిందన్నారు. టీటీడీబోర్డులో తెలంగాణకు అధిక ప్రాముఖ్యతనిచ్చిన జగన్మోహన్‌రెడ్డి, తనకేసుల్లో దోషులుగా ఉన్నవారిని బోర్డుసభ్యులు గా నియమించారని మండిపడ్డారు. టీటీడీబోర్డు సభ్యులైన శ్రీనివాసన్‌, పరిగెల మురళీకృష్ణ లపై పలుకేసులు, నేరచరిత్ర ఉన్న విషయాన్ని ఎమ్మెల్సీ గుర్తుచేశారు. టీటీడీచైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్యమతస్తుడని, ఆయనకు కాంట్రాక్టులపై ఉన్న శ్రద్ధ, భక్తులనమ్మకాలపై లేదన్నారు.

ttd 09102019 2

తిరుమలవెళ్లే బస్సుల్లో టిక్కెట్లపై అన్యమతప్రచారం చేస్తున్నారని చెప్పారు. స్వామివారి నగలను సింగపూర్‌కు తరలించారని, పింక్‌డైమండ్‌ చంద్రబాబు ఇంట్లో ఉందని గతంలో ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకున్న విజయసాయిరెడ్డి, ఇప్పుడు తిరుమల క్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై ఎందుకు పెదవివిప్పడంలేదని శ్రీనివాసులు ప్రశ్నించారు. ఇప్పుడు జేఈవోగా ఉన్న ధర్మారెడ్డి స్వామివారి నగల్లో అసలు పింక్‌డైమండ్‌ అనేదేలేదని చెప్పడం జరిగిందని, దాన్నిబట్టే విజయసాయిరెడ్డి తిరుమలపవిత్రతపై ఎంతటి అడ్డగోలు ఆరోపణలుచేశాడో అర్థమవుతోందన్నారు. చంద్రబాబుపై, తెలుగుదేశంపై అసత్యప్రచారం చేసినందుకు, స్వామివారి నగలు, ఆభరణాలను రాజకీయ అంశాలుగా వాడుకున్నందుకు వైసీపీనేతలు, విజయసాయిరెడ్డి చంద్రబాబుగారికి బహిరక్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు.

ttd 09102019 3

ఇక మరో నేత సుజయకృష్ణ రంగారావు మీడియాతో మాట్లాడుతూ, నాలుగునెలల్లోనే రాష్ట్రప్రజల నమ్మకాన్ని కోల్పోయిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రానికి రుణమిచ్చే బ్యాంకుల నమ్మకాన్ని కూడా కోల్పోయిందని, ఏపీ ప్రభుత్వంపై తమకు నమ్మకంలేదని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రిరంగారావు వ్యాఖ్యానించారు. రూ.3000 కోట్లరుణం కావాలంటూ జగన్మోహన్‌రెడ్డి సర్కారు చేసిన విజ్ఞప్తిని ఎస్‌బీఐ తిరస్కరించడం ప్రభుత్వానికి సిగ్గచేటన్నారు. ప్రభుత్వ పనితీరు సక్రమంగా ఉండి, ఆయాప్రభుత్వాలపై బ్యాంకులకు విశ్వసనీయత ఉన్నప్పుడే అవిరుణాలు ఇవ్వడానికి మొగ్గుచూపుతాయన్నారు. వైసీపీ ప్రభుత్వం గ్యారంటీలు ఇవ్వచూపినా కూడా తామురుణం ఇవ్వలేమని ఎస్‌బీఐ చెప్పిందంటే, ఆ సంస్థకు ప్రభుత్వం పై ఎంతవిశ్వసనీయత ఉందో అర్థమవుతోందన్నారు. గతప్రభుత్వ విధానాలను, నిర్ణయా లను తప్పుపడుతూ, జగన్మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న పద్ధతులను తప్పుపడుతూ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివన్నారు. జగన్‌ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలవల్లే మొన్న ప్రపంచబ్యాంక్‌, నిన్న ఏసియన్‌ డెవలప్‌మె ంట్‌ బ్యాంక్‌, (ఏడీబీ), నేడు ఎస్‌బీఐ నిధులివ్వకుండా ముఖంచాటేశాయన్నారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే, అప్పటికే ఉన్న పాత కాంట్రాక్టుర్లకు పనులు ఆపేసి, కొత్త కాంట్రాక్టుర్లకు పనులు అప్పగించే పనులు మొదలు పెట్టారు. దీని కోసం రివెర్స్ టెండరింగ్ అనే విధానం తెచ్చారు. అయితే, ఇప్పుడు ఈ రివర్స్ టెండరింగ్ విధానం బ్యాంకులను కూడా ఇబ్బంది పెడుతుంది. బ్యాంకులకు, రివర్స్ టెండరింగ్ తో ఇబ్బంది ఏంటి అనుకుంటున్నారా ? ఏ బ్యాంక్ అయినా ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే దానికి రుణాలు ఇవ్వటం సహజం. ఆ కంపెనీకు ఉన్న హిస్టరీ, సామర్ధ్యం, చేస్తున్న ప్రాజెక్ట్, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని లోన్ ఇస్తారు. అదే ప్రభుత్వ ప్రాజెక్ట్ అయితే, ఎలాంటి ఆలోచన చెయ్యకుండా రుణం ఇస్తారు. ఎందుకంటే, ఈ కాంట్రాక్టుర్ చేసేది ప్రభుత్వ పని కాబట్టి, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అనే ధీమా, బ్యాంకులకు ఉంటుంది. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, ప్రవేశపెట్టిన రివెర్స్ టెండరింగ్ తో, బ్యాంకులకు కూడా కొత్త కష్టాలు వచ్చాయి.

bank 09102019 2

ఇది వరకు ప్రభుత్వంలో, కాంట్రాక్టర్ లకు పనులు ఇచ్చి ఉన్నారు. ఆయా ప్రాజెక్ట్ లకు బ్యాంకులు రుణాలు ఇచ్చి ఉన్నాయి. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ విధానంతో, కొత్త వారికి పనులు అప్ప చెప్పుతూ, పాత కాంట్రాక్టుర్లను రద్దు చేస్తున్న నేపధ్యంలో, ఇప్పటికే పాత కాంట్రాక్టుర్లకు, ఈ ప్రాజెక్ట్ ఉంది అనే ధీమాతో రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఇచ్చిన రుణం ఎలా తిరిగి వస్తుందా అని, ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో, స్టేట్‌బ్యారకు మేనేజిరగ్‌ డైరెక్టర్‌, జగన్ మోహన్ రెడ్డిని ఇదే విషయాన్ని అడిగినట్టు సమాచారం సమాచారం. స్టేట్ బ్యాంక్ తో పాటుగా, ఇతర బ్యాంకులు కూడా, ఇదే విధంగా ఆర్ధికశాఖను వివరాలు కోరుతున్నాయి.

bank 09102019 3

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నుంచి రోడ్డు నిర్మాణాలకు, విద్యుత్‌ సంస్థలకు, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి పనులకు వివిధ బ్యాంకుల నుంచి, ఈ ప్రాజెక్ట్ లు చేసే కాంట్రాక్టుర్లు రుణాలు తీసుకున్నారు. కొంత మంది పెద్ద కాంట్రాక్టుర్లు కూడా, ఇక్కడ బ్యాంకులే కాకుండా, విదేశీ బ్యాంకుల నుంచి కూడా అప్పు తీసుకున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ కారణంగానే తాము రుణాలిచ్చామని, ఆ హామీని ప్రస్తుత ప్రభుత్వం గౌరవించడం లేదన్న అభిప్రాయం బ్యాంకర్లలో వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటి ప్రభుత్వం మాత్రం, పాత కాంట్రాక్టులు అన్నీ రద్దు చేసి కొత్త వారికి ఇస్తున్నారు. ఇదే విషయం పై, కొన్ని బ్యాంకులు, కేంద్రం ఆర్ధిక శాఖ ద్రుష్టికి కూడా తీసుకువెళ్ళాయి. ఇప్పుడు నిర్మాణ సంస్థలను మార్పు చేస్తే, ఇప్పటికే తాము ఇచ్చిన రుణాల పరిస్థితి ఏంటి అనే ఆందోళన బ్యాంకర్లలో వ్యక్తమవుతోంది.

కచ్చులూరు బోటు ప్రమాదం జరిగి 23రోజులైనా, చనిపోయినవారి మృతదేహాలు దొరక్కపోయినా, తమవాళ్ల శవాలు ఎప్పుడు తమకందుతాయో తెలియని అయోమయావస్థ లో మృతుల కుటుంబాలున్నా, అధికారయంత్రాంగం పడవను బయటకు తీయడంలో ఘోరంగా విఫలమైనా ముఖ్యమంత్రి జగన్‌ స్పందించకపోవడం దారుణమని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రఅధ్యక్షులు, మాజీమంత్రి కళావెంకట్రావు ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గోదావరిలో ఘోరదుర్ఘటన జరిగి 50మందికిపైగా చనిపోయినా, కించిత్‌కూడా పశ్చాత్తా పం, స్పందన వ్యక్తంచేయని ముఖ్యమంత్రి జగన్‌ వైఖరి, నీరోచక్రవర్తిని మించిపోయిందని ఆయన మండిపడ్డారు. మునిగిపోయిన పడవ 300అడుగులలోతులో ఉంటే, ముఖ్య మంత్రిజగన్‌ 3వేలఅడుగుల ఎత్తులో తూతూమంత్రంగా ఏరియల్‌సర్వేతో సరిపెట్టాడన్నా రు. ఆ సర్వేతర్వాత ఒక్కరోజైనా ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎందుకు సమీక్షలు చేయలేదని కళా ప్రశ్నించారు.

boat 09102019 2

ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలను ఎలా ఆదుకున్నారు... ఎంత నష్టపరిహారం అందించారు.... మృతదేహాల వెలికితీతకు ఎటువంటి చర్యలు చేపట్టారు.. బోటు బయటకుతీయడానికి సంబంధిత అధికారులు ఇన్నిరోజులు ఎందుకు కాలయాపన చేశారు.. గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేశారనే విషయాలపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడంలేదని మాజీమంత్రి నిలదీశారు. నీళ్లలోని బోటుని బయటకుతీయడం ప్రభుత్వానికి పెద్దసమస్యగా మారిందనే విషయాన్ని జగన్‌ తెలుసుకోవాలన్నారు. గతనెల 18న ప్రమాదం జరిగి, అమాయకులైన ప్రజలుచనిపోతే దానిగురించి జగన్‌గానీ, దుర్ఘటనపై ఆయనవేసిన మంత్రివర్గ కమిటీగానీ ఏమీతేల్చకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం కాదా అని వెంకట్రావు ప్రశ్నించారు. జరిగిన దుర్ఘటనపై వెంటనే న్యాయవిచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌చేశారు. ప్రజలకు తనకు ఏవిధమైన సంబంధం లేదన్నట్లుగా, వారికి ఏం జరిగినా, వారేమైనా తానేమీ స్పందించనన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రవర్తన ఉందన్నారు. జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసమీక్ష కూడా చేయనివ్యక్తి, తమవారిని కోల్పోయి పుట్టెడు దుఖంలోఉన్న మృతులకుటుంబాలకు న్యాయంచేస్తాడనుకోవడం అత్యాశే అవుతుం దన్నారు.

boat 09102019 3

వరదప్రవాహం 4లక్షలక్యూసెక్కుల లోపుంటేనే ప్రయాణాలకు అనుమతివ్వాలన్న నిబంధనను కాదని, 5.11లక్షల క్యూసెక్కుల వరద ఉధృతి ఉన్నప్పుడు, ఎవరి ఆదేశాలతో పర్యాటకుల బోటు కదిలిందో ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్యహత్యలన్నాడు.. మరి ఇప్పుడేమంటాడు: ప్రతిపక్షంలో ఉండగా మే16 2018న 'పడవప్రమాదంలో జరిగిన మరణాలన్నీ సర్కారు హత్యలనీ, ప్రభుత్వ నిర్లక్ష్యం, మంత్రులు సహా అధికారులు తీసుకున్న లంచాలు, అవినీతి పర్యవేక్షణలోపంవల్లే అమాయకులు చనిపోయారని, కాబట్టి ఆయాసంఘటనలకు ప్రభుత్వ మే బాధ్యత వహించాలని, హత్యానేరం కింద ప్రభుత్వంపై కేసునమోదుచేయాలని, చనిపోయిన వారికి ఒక్కొక్కరికీ రూ.20లక్షల పరిహారం అందించాలని' గగ్గోలుపెట్టిన జగన్‌, ఇప్పుడేమంటారని కళానిలదీశారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రమాదంపై చిలువలు పలువలుగా మాట్లాడిన వ్యక్తి అధికారంలోకి వచ్చాక కనీస స్పందన కూడా ఎందుకు తెలియచేయడ ం లేదన్నారు. జగన్‌ గతంలో చెప్పినట్లుగానే కచ్చులూరు పడవ ప్రమాదం కూడా ప్రభుత్వ అవినీతి, మంత్రుల లంచాలవల్లే జరిగిందా.. ఈ దుర్ఘటనపై కూడా వైసీపీ ప్రభుత్వంపై హత్యానేరం మోపాలా అని మాజీమంత్రి ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read