ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లలో రాజాకీయ వైరంతో, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళంలో, ఈ రాజకీయ కక్షలు చూస్తున్న ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతల పై కేసులు పెడుతున్న జగన్ ప్రభుత్వం, శ్రీకాకుళంలో కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తుంది. టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్‌ పై కేసు పెట్టి, ఆయన్ను అరెస్ట్ చెయ్యటానికి ప్రయత్నిస్తూ ఉండటంతో, కూన అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయారు. సరిగ్గా పండగ ముందు, వరుస సెలవులు చూసుకుని, ఆయనకు బెయిల్ రాకుండా, నాలుగు రోజుల పాటు జైల్లో ఉంచే స్కెచ్ వెయ్యటంతో, అది పసిగట్టిన కూన రవి కుమార్, అండర్ గ్రౌండ్ కు వెళ్లారు. రేపు ఆయన పోలీసులు ముందుకు హాజరయ్యే అవకాసం ఉంది. అయితే, ఇందులో కూన రవికుమార్‌ చేసిన తప్పు కూడా పెద్దగ ఏమి లేదు.

tammineni 02092019 2

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి వలంటీర్ల నియామకంపై అధికారులను రవికుమార్‌ ప్రశ్నించిన తీరు వివాదానికి కారణమైంది. సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు అంటూ, ఆయన పై కేసు పెట్టారు. మొత్తం 11 మంది కేసు పెట్టగా, 10 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసారు. రవికుమార్‌ అందుబాటులో లేకపోవటంతో, శ్రీకాకుళం శాంతినగర్‌ కాలనీలో రవికుమార్‌ ఇంటి ముందు పోలీసులు నిఘా పెట్టారు. అంతే కాకుండా, సెర్చ్ వారెంట్ లేకుండా తమ ఇంట్లో తనిఖీలు చేపట్టారని మహిళలమని చూడకుండా... దౌర్జన్యంగా వ్యవహరించారని, ఈ వ్యవహారం మొత్తానికి కారణం, స్పీకర్ తమ్మినేని సీతారం అంటూ, కూన రవికుమార్‌ భార్య ప్రమీల ఆరోపించారు. స్పీకర్ ఒత్తిడితోనే, ఏమి లేని చోట కూడా కేసు పెట్టి, ఇలా వేధిస్తున్నారని, పండగ పూట కూడా ఇంట్లో లేకుండా చేసారని, ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

tammineni 02092019 3

అయితే ఆమె ఆరోపణల పై స్పీకర్ తమ్మినేని ఘాటుగా స్పందించారు. ఇష్టం వచ్చినట్టు, అందరి పై నోరు పారేసుకుంటే, ఇలాగే ఉంటుంది, హద్దుల్లో ఉండాలి అంటూ మండిపడ్డారు. ఎవరో కేసు పెడితే, తనకేం సంబంధం అంటూనే, స్పీకర్ హోదాని పక్కన పెట్టి రాజకీయ విమర్శలు చేసారు కూన రవికుమార్, అచ్చెన్నాయుడుల క్రిమినల్ ట్రాక్ తీస్తే, ఎవరు ఎంతో తెలుస్తుంది అంటూ హెచ్చరించారు. అయితే స్పీకర్ వ్యాఖ్యల పై, ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించారు. స్పీకర్ గా ఉంటూ, ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. నేరజాబితా తీస్తే మొదట గుర్తొచ్చేది మీ అధినేత జగన్ పేరే అని గుర్తుంచుకోవాలని రామ్మోహన్ రాయుడు ధ్వజమెత్తారు. అధికారం ఉందని విర్రవీగొద్దని, మా మీద కక్ష తీర్చుకోవటం కాకుండా, ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, చంద్రబాబు, జగన, కేసిఆర్ అంతటి ఇమేజ్ ఉన్న మాజీ గవర్నర్ నరసింహన్, ఆయన పదవి నుంచి నిన్న బదిలీ అయిన సంగతి తెలిసిందే. నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా తిప్పిస్తే, నిన్న తెలంగాణా గవర్నర్ పదవి నుంచి కూడా కేంద్రం ఆయన్ను తప్పించింది. ఆయన స్థానంలో, తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళసై సౌందర రాజన్‌ను నియమిస్తూ, కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే సమయంలో, నరసింహన్ కు మాత్రం, ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన మోడీ, అమిత్ షాకు చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి, ఆయనకు ఎక్కడో ఒక చోట పోస్టింగ్ ఇస్తారని అందరూ భావించారు. అయితే మోడీ, షా మాత్రం, నరసింహన్ కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. తెలంగాణాతో పాటు, అయిదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చారు. దీంతో ఇక నరసింహన్ కు, ఏ విధమైన పోస్టింగ్ రాదనే విషయం స్పష్టం అయిపొయింది.

narasimhan 02092019 2

అయితే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం, నరసింహన్ ను విడిచి పెట్టటానికి ఇష్ట పడటం లేదు. నరసింహన్ సేవలు ఎలా అయినా ఉపయోగించుకోవాలని యోచిస్తున్న కేసిఆర్, నరసింహన్ ను, తెలంగాణా రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకుని, ఆయనని, తన దగ్గరే ఉంచుకోవాలని నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. నరసింహన్ కు, దాదపుగా 10 ఏళ్ళకు పైగా అనుబంధం ఉంది. తెలంగాణా రాష్ట్రంలో ఎవరు ఏంటో మొత్తం తెలుసు. రాజకీయంగా కూడా నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం ఉంది. అన్నిటికీ మించి, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. అందుకే నరసింహన్ ను, తెలంగాణా ప్రభుత్వ సలహాదారుడిగా చేసి, ఆయన సేవలు వినియోగించుకోవాలనే ఆలోచనలో కేసిఆర్ ఉన్నట్టు తెలుస్తుంది.

narasimhan 02092019 3

గవర్నర్ మార్పు వార్తలు తెలియగానే, ఆదివారం సాయంత్రం కేసీఆర్, నరసింహన్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఇంతకాలం రాష్ట్రానికి సేవలు అందించినందుకు అభినందించారు. తరువాత ఆయన మనసులో మాట, నరసింహన్ కు చెప్పినట్టు సమాచారం. దీని పై నరసింహన్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో చూడాల్సి ఉంది. నరసింహన్ తెలంగాణా ఉద్యమ సమయంలో కూడా కేసిఆర్ కు అనుకూలంగా వ్యవహరించే వారు. దానికి తగ్గట్టుగానే అప్పట్లో సోనియా గాంధీకి రిపోర్ట్ లు ఇచ్చే వారు. తరువాత మోడీతో కూడా, సన్నిహితంగా ఉంటూ, కేసీఆర్ పై పాజిటివ్ రిపోర్ట్ లు ఇచ్చే వారు. అదే సమయంలో చంద్రబాబు పై నెగటివ్ రిపోర్ట్ లు ఇచ్చేవారని, అనేకసార్లు టిడిపి కూడా ఆరోపించింది. ఇంతటి సన్నిహితంగా ఉన్న నరసింహన్ ను, కేసీఆర్ వదులుకోవటానికి సిద్ధంగా లేరని, అందుకే ఆయనకు ప్రభుత్వంలో ఏదో ఒక పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతుంది.

వైసీపీ నేతల ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయినా, ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంటారు. తెలుగుదేశం కార్యకర్తల పై దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే పోలీసులకు అనేక ఫిర్యాదులు చేసారు టిడిపి నేతలు. అయినా ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా కాంట్రాక్టర్ ల పై కూడా దాడులు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఎస్సార్ కన్ స్ట్రక్షన్ సంస్థ క్యాంపు కార్యాలయం పై వైసీపీ కార్యకర్తలు దాడికి చేసి, భయబ్రాంతులకు గురి చేసారు. ఆత్మకూరు మండలం కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఎస్సార్ కన్ స్ట్రక్షన్ క్యాంపు కార్యాలయంపై దాడికి దిగాయి వైసీపీ శ్రేణులు. అక్కడ ఉన్న వాహనాలు, టిప్పర్ల అద్దాలు పగులగొట్టి భయబ్రాంతులకు గురి చేసారు. అక్కడ కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న సామగ్రి ధ్వంసం చేశారు.

atp 01092019 2

ఈ దాడి చేసింది, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులు. ఎన్నికల ఫలితాల అనంతరం రోడ్డు నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ ఎస్ఆర్ కాంట్రాక్టర్ ఎస్ఆర్ కన్స్ట్రాక్షన్ ను హుకుం జారీ చేసారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులు. నేషనల్ హైవే అధికారుల వత్తిడితో మళ్ళీ పనులను మొదలు పెట్టారు ఎస్సార్ కన్ స్ట్రక్షన్ సిబ్బంది. దీంతో మాకు చెప్పకుండా, ఎందుకు పనులు చేస్తున్నారు అంటూ, అక్కడ పనులు చేస్తున్న వర్కర్ల పై దాడి చేసారు. ఐదు మందికి గాయాలు అయ్యాయి. రోడ్డు పనులు చేస్తున్న యంత్రాలను ఆపి తాళాలు లాక్కున్నారు ఎమ్మెల్యే అనుచరులు. ఈ ఘటనపై ఎస్సార్ కన్ స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో అక్కడ పని చేస్తున్న సిబ్బంది ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పరిగెత్తారు.

atp 01092019 3

అయితే వైసిపీ అధికారంలోకి వచ్చిన తరువాత, ఇలాంటి అరాచకాలు ఎన్నో జరిగాయి. కర్నూల్ సోలార్ పార్క్ విషయంలో కూడా ఇలాగే బెదిరించారు. తరువాత కొన్ని రోజులకు సోలార్ ప్యానెల్స్ పగలగొట్టారు. అలాగే కియా కంపెనీ పై, అందరూ చూస్తూ ఉండగానే అక్కడ ఎంపీ బెదిరించిన సంగతి చూసాం. ఇప్పుడు ఈ వార్త వింటున్నాం. ఇలా కంపెనీలను బెదిరిస్తే, పెట్టుబడులు ఎలా వస్తాయి ? ఒక కంపెనీ మన దగ్గర పని చేస్తే, నాలుగు ఉద్యోగాలు వస్తాయి. అలాంటిది ఒక కంపెనీ మన దగ్గరకు రావాలి అంటే, ఎంతో కష్టపడితే కాని రాడు. అలా వచ్చిన కంపెనీలను, ఇలా బెదిరించి వెళ్ళగోడితే, తరువాత ఎవరూ కొత్తగా పెట్టుబడులకు రారు. ఉన్న కంపెనీలు పోయి, కొత్తవి రాక, రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఏ రాజకీయ నాయకుడు అయినా, ఇలా రాష్ట్రానికి నష్టం అయ్యే పనులు మాత్రం చెయ్యకూడదు.

రాష్ట్రంలో సరి కొత్త వ్యవస్థ అయిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు, జగన మోహన్ రెడ్డి ప్రభుత్వం అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే. ఆగష్టు 15 నుంచి ఈ వ్యవస్థను అధికారికంగా ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్ళకు ఒక గ్రామ వాలంటీర్ను పెడుతున్నాం అని జగన్ ప్రభుత్వం చెప్పింది. అందుకు తగ్గట్టుగానే, ప్రస్తుతానికి 2 లక్షల మంది వరకు నియమాకాలు అయ్యాయి. అయితే ఇంకా దాదపుగా 10 వేల మంది, ఈ ఉద్యోగానికి రాలేదు. వీరికి 5 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. ఇందులో మళ్ళీ ఖర్చులకు అని చెప్పి, 500 వెనక్కు తీసుకున్నారు. అయితే ఈ గ్రామ వాలంటీర్లు మొత్తం వైసీపీ వారే ఉంటున్నారని, ప్రత్యర్ధి పార్టీలు ఆరోపిస్తున్నాయి. విజయసాయి రెడ్డి దీనికి సంబంధించి, అంతరంగిక సమావేశంలో మాటలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ గ్రామ వాలంటీర్లు ఏమి చేసారో కాని, ఇప్పుడు మాత్రం, జగన్ ప్రభుత్వం వారికి కొత్త టాస్క్ ఇచ్చింది.

gram 01092019 2

ఆగష్టు 27వ తారీఖున, మైనారిటీ డిపార్టుమెంటు నుంచి , అన్ని జిల్లాల కలెక్టర్లకు ఒక లేఖతో కూడిన ఆదేశాలు వెళ్ళాయి. అన్ని జిల్లా కలెక్టర్లను ఆ ఆదేశాలు పాటించమని ఆ లేఖలో ఉన్నాయి. ఆ ఆదేశాల ప్రకారం, "ప్రభుత్వం, ప్రతి ఊరిలో ఉన్న పాస్టర్లకు, నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వటానికి రెడీ అయ్యింది. ఇది జగన్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశం. దీని ప్రకారం, ప్రతి పాస్టర్ కు 5 వేల రూపాయల గౌరవ వేతానం ఇవ్వటానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. అయితే, దీనికి సంబంధించి రాష్ట్రంలో ఎంత మంది పాస్టర్లు ఉన్నారు అనే విషయం పై ప్రభుత్వానికి సమాచారం లేదు. అందుకే అన్ని జిల్లాల కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ మజిస్త్రేట్ లు, మీ పరిధిలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో, ఎంత మంది పాస్టర్లు ఉన్నారో సర్వే చెయ్యాలి."

gram 01092019 3

"ఈ సర్వే కోసం, కొత్తగా నియామకం అయిన గ్రామ వాలంటీర్ల సహయం తీసుకోండి. గ్రామ వాలంటీర్ల సహాయంతో, ఆ గ్రామాల్లో ఎంత మంది పాస్టర్లు ఉన్నారో, సర్వే చేసి, 15 రోజుల లోగా ప్రభుత్వానికి తెలియపరచాలి. ఇది చాలా తొందరగా చెయ్యాల్సిన పని" అంటూ ఆ లేఖలో పేర్కున్నారు. అయితే ఈ విషయం తెలిసిన బీజేపీ నేతలు, ప్రభుత్వం పై మండిపడుతున్నారు. గౌరవ వేతనం, అన్ని గ్రామాల్లో ఉన్న గుళ్ళలో ఉన్న బ్రాహ్మణలకు కూడా ఇవ్వాలని, ఇలా ఒక మతానికే పరిమితం చెయ్యటం దారుణమని అన్నారు. అంతే కాకుండా, గ్రామా వాలంటీర్లను ఈ పనులకు ఉపయోగించటం పై కూడా వారు తప్పుబడుతున్నారు. ఇంత అత్యవసరంగా ఈ వివరాలు కావాలని ప్రభుత్వం, ఎందుకు కోరుతుంది అంటూ బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. ఒక్క మతానికే అధిక ప్రాధాన్యత ఇవ్వటం మంచిది కాదని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read