ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, మొన్నటి ఎన్నికల్లో ఓటమి తరువాత, మొదటి సారి ప్రజల్లోకి రానున్నారు. గత మూడు నెలల నుంచి జగన్ ప్రభుత్వ వైఫల్యాల పై ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి, స్పందిస్తూ వచ్చారు. ముందుగా నిర్నయం తీసుకున్న ప్రకారం, జగన్ ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇవ్వాలని, ఆ తరువాతే స్పందించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ మూడు నెలల్లోనే ప్రజలు జీవితాలు తారుమారు అయ్యి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక లేక కూలీలు, విత్తనాలు లేక రైతులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క అన్న క్యాంటీన్ లు మూసివేతతో తిండి కూడా తినే పరిస్థితి పేద వాడికి లేకుండా పోయింది. ఇవన్నీ చూసిన చంద్రబాబు, మనసు మార్చుకున్నారు. ఇక ప్రభుత్వం పై క్షేత్ర స్థాయి పోరాటానికి సిద్ధం అయ్యారు.

tour 30082019 2

ఇందు కోసం, వారానికి రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటన చేయ్యనున్నారు చంద్రబాబు. ముందుగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. వినాయక చవతి పండుగ వెళ్ళిన తరువాత, సెప్టెంబర్ 5, 6 తేదీల్లో, కాకినాడ వేదిక చేసుకుని, రెండు రోజుల పాటు ప్రజా సమస్యల పై పోరాడనున్నారు. ప్రజల వద్దకు వెళ్లి, వాళ్ళ సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాటం చెయ్యనున్నారు. మరో పక్క, పార్టీ క్యాడర్ ను కూడా, బలోపేతం చెయ్యటం కోసం, ఈ పర్యటనలు వాడుకోనున్నారు. ఇప్పటికే వైసీపీ దాడులు తట్టుకోలేక, తెలుగుదేశం నేతలు గ్రామాలు విడిచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. వారికి ధైర్యం నింపి, పార్టీ అండగా ఉంటుంది అనే భరోసా ఇవ్వనున్నారు చంద్రబాబు.

tour 30082019 3

పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించడంతోపాటు ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, సమన్వయ కమిటీ సభ్యులతో భేటీలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు.వచ్చే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కోసం, ప్రజలను, పార్టీని సమాయత్తం చెయ్యనున్నారు. అలాగే మొన్నటి వరకు అన్ని సీట్లు ఇచ్చిన గోదావారి జిల్లాల ప్రజలు, మొన్నటి ఎన్నికల్లో ఎందుకు తిరస్కరించారు అనే సమీక్ష కూడా చేసి, ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు చెయ్యనున్నారు. మొత్తంగా, ఇక నుంచి మళ్ళీ ప్రజల వద్దకు వెళ్లి, ఎక్కడ కోల్పోయామో, అక్కడి తిరిగి సాధించేలా చంద్రబాబు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ పై అటు హైకోర్ట్, ఇటు కేంద్ర ప్రభుత్వం, కొత్త టెండర్ కు వెళ్ళవద్దు, నవయుగని కొనసాగించండి అని చెప్తున్నా కూడా, జగన్ ప్రభుత్వం ముందుకే వెళ్తుంది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ప్రాతిపక్షంగాలో ఉండగా పోలవరం ప్రాజెక్ట్ పై అనేక అవినీతి ఆరోపణలు చేసారు. కేంద్ర ప్రభుత్వం ఆడిటింగ్ చేసి డబ్బులు ఇస్తూ ఉండే ప్రాజెక్ట్ లో, చంద్రబాబు అవినీతి చేసారంటే ఎవరూ నమ్మరని తెలిసినా, రాజకీయ ఆరోపణలు చేసారు. ఇందుకు తగ్గట్టుగానే, ఆయన అధికారంలోకి రాగానే, ఒక కమిటీ చేసారు. ఈ కమిటీ అధ్యనయం చేసి ప్రాజెక్టులో అదనంగా రూ. 36వేల 600 కోట్లు వ్యయం చేశారని నివేదికలో సమర్పించింది. అయితే ఇంత అవినీతి జరిగితే, ఎవరైనా అరెస్ట్ లు చేసి, సిబిఐ కి ఇచ్చి విచారణ చెయ్యటం కాని, కోర్ట్ లకు వెళ్ళటం కాని చేస్తారు. నిజంగానే ఇంత అవినీతి జరిగితే చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారిని అరెస్ట్ చెయ్యాల్సిందే.

polavaram 300082019 2

కాని, ఈ నివేదిక ఆధారంగా అరెస్ట్ లు, కేసులు ఏమి పెట్టలేదు కాని, పోలవరం ప్రాజెక్ట్ లో హెడ్ వర్క్స్‌లో మిగిలిపోయిన పనులను చేపట్టొద్దని, నిర్మాణ బాధ్యత నుంచి వైదొలగాలని నవయుగకు నోటీసులు ఇచ్చి పంపించారు. అంతేకాదు హైడల్ ప్రాజెక్టు నిర్మాణం కూడా చేపట్టొద్దని ఏపీ జన్‌కో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైడల్ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ జన్‌కో జారీ చేసిన ఉత్తర్వులపై నవయుగ హైకోర్టును వెళ్ళింది. అన్నీ పరిశీలించిన హైకోర్టు ఈ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ, రివర్స్ టెండరింగ్‌ కు ముందుకెళ్లొద్దని ఆదేశిస్తూ స్టే ఇచ్చింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. కోర్టు ఈ కేసును సెప్టెంబర్ 4వ తేదికి వాయిదా వేసింది.

polavaram 300082019 3

మరో పక్క, హెడ్ వర్క్ విషయంలో కూడా నవయుగను తప్పించటం పై కేంద్రం, ఏపి ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నవయుగా వచ్చిన తరువాతే పనులు పరుగులు పెడుతున్నాయని, ఇప్పుడు కొత్త టెండర్ పిలిస్తే, ఖర్చు ఎక్కువ అవుతుంది, పనులు లేట్ అవుతాయని చెప్పింది. అయితే అటు హైకోర్ట్, ఇటు కేంద్రం వద్దు అంటున్నా, జగన్ ముందుకే అంటున్నారు. కోర్ట్ తీర్పు ఉన్నా సరే, టెండర్ పై ముందుకే వెళ్తున్నారు. టెండర్ నోటిఫికేషన్‌ను ఆగస్టు 17న జారీ చేశామని, అయితే హైకోర్టు ఆగస్టు 22వ తేదీన ఆదేశాలు ఇచ్చిందని చెప్తూ, తాజాగా నోటిఫికేషన్ షెడ్యూల్‌ సాప్ట్‌వేర్‌ను ఆన్లైన్ లో అప్‌లోడ్ చేసింది. టెండర్ ప్రక్రియ అంతా జరుగుతూ ఉంటుందని, కోర్ట్ ఆదేశాల ప్రకారం అప్పుడు చుస్తామంటూ పభుత్వం అంటుంది. అయితే, ఒక పక్క హైకోర్ట్ సింగల్ బెంచ్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నా, డివిజన్ బెంచ్‌ దగ్గర కేసు పెండింగ్ లో ఉన్న సమయంలో ఇంత దూకుడుగా ప్రభుత్వం వెళ్ళటం, కోర్ట్ ధిక్కరణ అవుతుందని, ప్రభుత్వానికి మరోసారి కోర్ట్ ద్వారా మొట్టికాయలు తప్పవని లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.

రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు, అసలు అమరావతి ఉంటుందా ఉండదా అనే సందేహాల నేపధ్యంలో, ఇప్పుడు అమరావతిలో నిర్మించ తలపెట్టిన, తిరుమల తిరుపతి దేవస్థానం పై కొత్తగా ఎన్నికైన పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ బాబాయ్ వైవి సుబ్బా రెడ్డి, టిటిడి చైర్మెన్ అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు హయంలో, అమరావతిలో నిర్మించ తలపెట్టిన శ్రీవేంకటేశ్వర దివ్యక్షేత్రం ఆలయాన్ని పెద్ద ఆలయంగా కాకుండా, చిన్నదిగా నిర్మించే అంశాన్ని ఈ కొత్త పాలకమండలి పరిశీలిస్తుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో 25 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పాటు, తిరుమల తిరుపతు దేవస్థానం నిర్ణయం తీసుకున్నారు. ఈ బాధ్యత మొత్తాన్ని టిటిడినే తీసుకుంది. ఇందుకు తగ్గట్టుగానే, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా భూకర్షణ క్రతువు పూర్తిచేసారు.

ttd 30082019 2

చంద్రబాబు హయంలోనే పనులు కూడా ప్రారంభం అయ్యాయి. రూ.150 కోట్ల ఖర్చుతో శ్రీవారి ప్రధాన ఆలయంతో పాటు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం కూడా నిర్మించటానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన ఆలయాలతో పాటుగా, నైవేద్యం తయారీకి వంటశాల, ఉత్సవ మండపం, రథ మండపం, ప్రసాద మండపాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా, స్వామివారి పుష్కరిణి, వసతి సముదాయాలు, అన్నప్రసాదం కాంప్లెక్స్‌, ఆధ్యాత్మిక గ్రంథాలయం, కార్యాలయ భవనాలు, సిబ్బందికి అవసరమైన ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటికి సంబంధించి రూ.10 కోట్ల విలువైన పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. తిరుమలలో గుడి ఎలా ఉంటుందో, అలాగే నిర్మించాలని, అనుకున్నారు.

ttd 30082019 3

అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, వారి ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. ఈ నిర్మాణానికి, ప్రభుత్వానికి సంబంధం లేదు. పూర్తిగా టిటిడి ఖర్చుతో నిర్మాణం జరుగుతుంది. అయినా సరే, ప్రభుత్వం, ఈ ఆలయం విషయంలో తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు, తిరుమలలో శ్రీవారి ఆలయంలోని వెండి వాకిలి వరకు తొలుత అంతర్గత ప్రాకారం మాత్రమే నిర్మించాలని టిటిడి పాలకమండలి నిర్ణయం తేసుకున్నారు. మిగిలిన నిర్మాణాలపై తదుపరి పాలక మండలి సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రీవారి ఆలయం ముందు అనుకున్నట్టే కట్టాలని, దేవుడి విషయంలో కూడా ఇలా నిర్ణయాలు మార్చుకోవటం సరి కాదని, శ్రీవారి భక్తులు అంటున్నారు. అనవసరమైన వాటికి వేల వేల కోట్లు ఖర్చు పెడుతూ, రాష్ట్రాన్ని చల్లగా చూసే శ్రీవారికి కంచెం పెద్దదిగా గుడి కడితే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు.

తెలుగు తల్లి... తెలంగాణా నుంచి విడిపోయినా, ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుంటారు. ముఖ్యంగా, ‘‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు..’’ అనే పాట వింటే రోమాలు నిక్కబొడుచుకోని ఆంధ్రుడు ఉండడు అంటే ఆశ్చర్యం కాదు. అయితే ఏమైందో ఏమో కాని, ‘‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు..’’ అనే పాట, ఈ మధ్య ఏ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలోనూ వినపడటం లేదు. ఇంతకు ముందు ఎవరు అధికారంలో ఉన్నా సరే, ఏ అధికారిక కార్యక్రమం అయినా, ఈ పాటతోనే మొదలయ్యేది. మరి ఏమైందో ఏమో కాని, జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఈ పాట మరుగున పడిపోయింది. ఈ మధ్య చంద్రబాబు కూడా ఈ విషయం పై ట్వీట్ చేస్తూ ఆయన అభిప్రాయన్ని చెప్పినా, ఈ విషయం పై పట్టించుకునే వారే లేరు. ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందా అనే భాషా ప్రేమికులు అంటున్నూర్.

telugutalli 30082019 2

ఈ నేపధ్యంలోనే నిన్న తెలుగు భాషా దినోత్సవం రోజు వచ్చింది. అయితే విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి కనీసం పూలమాల వేసేవారు కనిపించలేదు. తెలుగు భాషా దినోత్సవం రోజు కూడా, తెలుగు తల్లిని అలంకరించలేదు. రాజధాని ప్రాంతం కావడంతో పాటు అధికార భాషాసంఘం, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యాలయాలూ ఇక్కడే ఉన్నా, తెలుగు తల్లి విగ్రహాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు, తెలుగుతల్లి విగ్రహం ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలోనే జాతీయ క్రీడాదినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అధికార యంత్రాంగమంతా పాల్గొంది. వారిలో ఒక్కరికీ తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేయాలన్న ఆలోచన రాకపోవడం విచారకరం.

telugutalli 30082019 3

ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, తెలుగు భాషా దినోత్సవం కోసం అంటూ, ప్రభుత్వం 18 లక్షలు విడుదల చేసి, ఒక జీవో ఇచ్చింది. మరి ఈ 18 లక్షల్లో కనీసం, తెలుగు తల్లికి ఒక పూల మాల వెయ్యాలనే సోయ, ఎవరికీ లేకుండా పోయింది. మొన్నీ మధ్యే జగన్ ప్రభుత్వం, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా కూడా చేసారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మొన్నటి దాక, చంద్రబాబు ప్రభుత్వం పై నిప్పులు చెరిగే వారు. చంద్రబాబు ప్రభుత్వం తెలుగు భాషకు సరైన గుర్తింపు ఇవ్వటం లేదని విమర్శలు చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఆయన రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా ఉంటూ, విజయవాడలో తెలుగు తల్లి విగ్రహానికి జరిగిన అవమానం గురించి ఎవరిని విమర్శ చేస్తారో మరి ?

Advertisements

Latest Articles

Most Read