చంద్రబాబు అధికారంలో ఉండగా, ఏపి అంటే చెప్పిన నిర్వచనం, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని. ఆయన దానికి తగ్గట్టే పని చేసారు. అమరావతిని ప్రపంచంలో మేటి నగరాల్లో పెట్టేందుకు, ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. అలాగే పోలవరం గురించి కూడా, ఆయన ఎలా పని చేసారో అందరికీ తెలుసు. ఏమి లేని ప్రాజెక్ట్ ని, 73 శాతానికి తీసుకొచ్చారు. ప్రతి సోమవారం, పోలవరం గురించి సమీక్షలు చేస్తూ, పనులు పరుగులు పెట్టించారు. ప్రభుత్వం మారింది, జగన్ వచ్చారు. అమరావతి ఆగిపోయింది, పోలవరం ఆగిపోయింది. మరి ఈ రెండు, రెండు కళ్ళుగా చూసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది ? ఒకసారి ఊహించుకోండి. కళ్ళ ముందే అమరావతి శిధిల నగరం అయిపోతుంది. ఇప్పుడు ఏకంగా అమరావతినే మార్చేస్తున్నాం అని లీకులు ఇస్తున్నారు.
ఇక పోలవరం విషయంలో కూడా ఇదే పరిస్థితి. చంద్రబాబు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి, పోలవరం పనులు ఆగిపోయాయి. ఇప్పుడు ఏకంగా కాంట్రాక్టర్ ని మార్చే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నవయుగ ని తప్పించింది. అలాగే రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది. దీని పై నవయుగ కోర్ట్ కు వెళ్ళింది. దీంతో హైకోర్ట్, ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, రివర్స్ టెండరింగ్ పై ఇచ్చిన నోటిఫికేషన్ ను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ సంగతి ఏమి అవుతుందో, ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. చంద్రబాబు ఉంటే, ఈ ఏడాది చివరకు పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు, ఆ పరిస్థితి లేదు. అయితే హైకోర్ట్, తీర్పు రాగానే, చంద్రబాబు స్పందించారు. అందుబాటులో ఉన్న మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
పోలవరం రీటెండరింగ్ ని హైకోర్ట్ సస్పెండ్ చేసింది. ఇది ఇంతటితో ఆగదు. ఈ జాప్యం, పోలవరం ప్రాజెక్ట్ పై పడుతుంది. ఎప్పటికి ప్రాజెక్ట్ పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఈ జగన్ ప్రభుత్వానిది పిచ్చి అనుకోవాలో ? లేక రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్ధం కావటం లేదని చంద్రబాబు అన్నారు. పోలవరం లాంటి ప్రాజెక్ట్ లతో ప్రయోగాలు వద్దని, ఎంత మంది చెప్పినా, వీళ్ళు వినే స్టేజ్ లో లేరని చంద్రబాబు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఈ నిర్ణయాల వల్ల ఆయనకు ఏమి కాదని, రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని, భవిష్యత్తుని నాశనం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. పోలవరంలో లేని అవినీతి కోసం ఆరాట పడుతున్నారని, కేంద్రం ఎన్ని సార్లు చెప్పినా, వీరికి అర్ధం కావటం లేదని చంద్రబాబు అన్నారు. ఒక్కసారి న్యాయ వివాదం మొదలైతే, ఎన్ని ఏళ్ళు పడుతుందో, ఈ ప్రభుత్వానికి తెలుసా అని చంద్రబాబు అన్నారు.