మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్, జనసేన పార్టీ సభ్యుడు, విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన గత కొంత కాలంగా పార్టీ మారుతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఆయన వ్యవహార శైలి, జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూర్చాయి. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత, జేడీలక్ష్మీనారాయణ ఒకే ఒకసారి, జనసేన సమీక్ష కార్యక్రమంలో పాల్గున్నారు. తరువాత నుంచి ఆయన పార్టీలో ఎక్కడా కనిపించలేదు. అయితే మొన్న ప్రకటించిన జనసేన పార్టీ కమిటీల్లో, ఎక్కడా లక్ష్మీనారయణకు, పవన్ చోటు ఇవ్వలేదు. లక్ష్మీనారాయణ లాంటి నేతకు ఎందుకు చోటు ఇవ్వలేదో ఎవరికీ అర్ధం కాలేదు. దీంతో, ఆయన పార్టీ మారతారనే సమాచారం ఉండాబట్టె, పవన్ కళ్యాణ్ ఆయనకు ఏ కమిటిలో కూడా చోటు ఇవ్వలేదని ప్రచారం జరిగింది.

jd 10082019 2

మరో పక్క పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సొంత కార్యక్రమాలకు, సొంత ఇమేజ్ లకు పార్టీని వాడుకుంటే చూస్తూ కూర్చును అంటూ చేసిన వ్యాఖ్యల పై కూడా ఊహగానాలు వచ్చాయి. లక్ష్మీనారయణ పార్టీ కార్యక్రమాలు కాకుండా, తన సొంత కార్యక్రమాలు చేసుకుంటూ, జనసేన కార్యకర్తలను వాడుకుని ఇమేజ్ పెంచుకుంటున్నారు అంటూ ప్రచారం జరిగి, అందుకే పవన్ అలా అన్నారనే వాదన నడిచింది. ఈ పరిణామాలు అన్నిటి నేపధ్యంలో, నిన్నటి నుంచి, లక్ష్మీనారయణ పార్టీ మారుతున్నారు అంటూ, అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్ లో ప్రచారం మొదలైంది. అటు జనసేన వర్గాలు కాని, లక్ష్మీనారాయణ కాని ఖండించకపోవటంతో, ఈ వార్తలకు మరింత బలం వచ్చింది. ఈ నేపధ్యంలోనే, లక్ష్మీనారయణ ఈ విషయం పై ఘాటుగా స్పందించారు.

jd 10082019 3

తన ట్విట్టర్ లో దీనికి సంబంధించి, ఘాటు వ్యాఖ్యలు చేసారు. వ్యక్తిరేకులు ఇలాంటి వార్తలు పుట్టిస్తే, ఫూల్స్ ఇలాంటి వాటిని ప్రచారం చేస్తారని, ఇడియట్స్ ఇలాంటివి నిజమే అని నమ్ముతారని, ఘాటుగా బదులిచ్చారు. నా అవసరం పవన్ కళ్యాణ్ కు ఉన్నది అన్నంత వరకు, నేను పవన్ కళ్యాణ్ తోనే ఉంటానని, లక్ష్మీనారాయణ అన్నారు. ఇలాంటి వార్తల పై కాకుండా, వరద సహాయం చెయ్యటం, చెట్లు నాటటం, యువతను తీర్చిదిద్దటం వంటి పనులు చెయ్యాలని కోరుకుంటున్నా , జై హింద్ అంటూ లక్ష్మీనారయణ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. దీంతో, ఆయన అన్ని వార్తలకు ఒక్క దెబ్బతో ఫుల్ స్టాప్ పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు చాలా అవసరం. అయితే జగన్ మోహన్ రెడ్డి కొత్తగా అధికారంలోకి రావటంతో, కార్పోరేట్ ప్రపంచంలో చాలా అనుమానాలు ఉన్నాయి. అతని పై ఉన్న కేసులు చూసి సహజంగా వెనకడు వేస్తారు. అయితే జగన్ మాత్రం, తన పై ఉన్న అవినీతి ముద్ర చేరుపుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కేంద్రం కూడా ఒక చెయ్యి వేసి, రాష్ట్రానికి నాలుగు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తన వంతు సాయంగా డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ అనే కార్యక్రమంతో, వివిధ దేశాల దౌత్యవేత్తలతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కావటంతో, వివిధ దేశాల నుంచి, విదేశీ రాయబారులు, హైకమిషనర్లు, కాన్సులేట్‌ జనరల్‌లు ఈ సమావేశానికి వచ్చారు. నిజానికి వీళ్ళు ఎవరు పెట్టుబడి పెట్టె వారు కాదు. ఇక్కడ ఉన్న పరిస్థితులు అర్ధం చేసుకుని, వారి దేశాల్లో ఉండే పెట్టుబడి దారులకు, ఇక్కడ పెట్టుబడి పెడితే వచ్చే లాభాల పై సలహాలు, సూచనలు ఇచ్చే విదేశీ రాయబారులు మాత్రమే.

jagn 1008219 2

అయితే ఇంత మంచి అవకాసం అటు కేంద్రం కల్పిస్తే, జగన్ మాత్రం, ఈ అవకాశాన్ని వాడులుకున్నరనే చెప్పాలి. జగన్ ప్రసంగం ఇస్తూ, మాది పేద రాష్ట్రం, మాకు మెట్రో సిటీ లేదు, మాకు డబ్బులు లేవు అంటూ మొదలు పెట్టారు. ఎవరైనా ముందు మన బలాలని గర్వంగా చెప్పుకుంటారు. పెట్టుబడి పెట్టె వాడికి మనం చెప్పే మాటలు కాన్ఫిడెన్సు ఇవ్వాలి. అంతే కాని, బేద అరుపులు అరిస్తే, అవతలి వాడు పెట్టుబడి ఎందుకు పెడతాడు ? అలాగే విద్యుత్ ఒప్పందాల రద్దు విషయం పై కూడా జగన్ గొప్పగా చెప్పుకున్నారు. నిజానికి ఇది ఇక్కడ ఎవరూ చెప్పారు. మీరు పెట్టుబడులు పెడితే, నేను ఏ క్షణం అయినా ఆ ఒప్పందం రద్దు చేస్తాను అని బెదిరించినట్టు ఉంటుందా ఉండదా ? ఇక పొతే 75 శాతం లోకల్ రిజర్వేషన్ల గురించి కూడా జగన్ చెప్పుకున్నారు.

jagn 1008219 3

అమెరికా చేస్తుంది, మేము చేస్తే తప్పు ఏంటి అన్నట్టు మాట్లాడారు. అమెరికా అనేది ఒక దేశం, మనది ఒక రాష్ట్రం అనేది కూడా జగన్ మర్చిపోయారు. పెట్టుబడులు పెట్టె వాడికి, ఆ ఇన్సెంటివ్ ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, పెట్టుబడి పెట్టండి అని చెప్పాలి కాని, జగన్ మాత్రం, మీరు ఈ పని చేస్తేనే, మా రాష్టంలో పెట్టుబడి పెట్టండి అన్నట్టు చెప్తున్నారు. ఇలా అయితే ఎవరైనా పెట్టుబడి పెడతారా ? ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పాలి, కరువు ప్రాంతంలో కియా లాంటి కంపెనీ వచ్చింది, ఇక ఏ సంస్థ అయినా, ఈజీగా వచ్చి పెట్టుబడి పెట్టచ్చు అనే ధైర్యం ఇవ్వాలి. మనకు ఉన్న బలాలు చెప్పాలి. ఇవన్నీ చంద్రబాబు చేసారు కాబట్టి, నేను చెప్పను అంటే, మనకు పెట్టుబడులు వస్తాయా ? అది చంద్రబాబు సొంతం కాదు, ఆయన రాష్ట్రం కోసమే చేసారు. మరి జగన్ గారు ఆ రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోవాలి కాని, మాది పేద రాష్ట్రం అంటే, అవతలి వాడు పెట్టుబడి పెట్టడు, దానం చేస్తాడు.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, అందరూ వచ్చి ఆయన ముందు వాలిపోవలాని, కలలు కంటున్నారు వైసీపీ నాయకులు. మా నాయకుడు ఈ దేశంలోనే గొప్ప నేత అన్న విధంగా మాట్లాడుతూ, ఒక విధంగా జగన్ పరువు వీళ్ళే తీస్తున్నారు. సహజంగా ప్రభుత్వాలు మారినప్పుడు, ఐఏఎస్ , ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చి పరిచయం చేసుకుంటారు కాని, సినిమా ఇండస్ట్రీ రాలేదు, క్రికెటర్ లు రాలేదు, కిరాణా కొట్టు వాడు రాలేదు అంటూ, వైసీపీ నేతలు గొడవ చెయ్యటం ఎందుకో మరి. ముఖ్యంగా సినీ నటుడు, థర్టీ ఇయర్స్ పృథ్వీగా పేరు తెచ్చుకున్న పృధ్వీ, ఈ విషయం పై చేసిన వ్యాఖ్యలు కొంత చర్చకు దారి తీసీయి. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం, తెలుగు సినీ ఇండస్ట్రీ పేదలకు ఇష్టం లేనట్టుగా ఉంది అంటూ మొన్న పృధ్వీ సంచలన వ్యాఖ్యలు చేసారు.

rajendraprasad 10082019 2

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, సినీ పెద్దలకు తెలుసా ? తెలిస్తే వచ్చి జగన్ ను ఎందుకు కలవలేదు అంటూ ప్రశ్నించారు. అయితే దీని పై సినీ ఇండస్ట్రీ మాత్రం, ఘాటుగా స్పందిస్తుంది. అసలు జగన ముఖ్యమంత్రి అయితే, మేము వెళ్లి ఎందుకు కలవాలి, అనే విధంగా సినీ ఇండస్ట్రీ స్పందిస్తుంది. మూడు రోజుల క్రితం, వైసీపీ పార్టీకి చెందిన నేత, జగన్ అంటే చెవి కోసుకునే, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కూడా ఈ వ్యాఖ్యల పై స్పందించారు. పృధ్వీ మాట్లాడిన మాటలు తప్పని అన్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న వారికి జగన్ అంటే ఇష్టమే అని అన్నారు. జగన్ సియం అయితే కలవాలని రూల్ లేదు కదా, పృధ్వీ ఎదో ఫ్లో లో అని ఉంటాడులే అని సర్ది చెప్పారు. అయితే, నిన్న తిరుమల వచ్చిన ప్రముఖ హీరో రాజేంద్ర ప్రసాద్, పృధ్వీ వ్యాఖ్యల పై ఇంకా కొంచెం ఘాటుగా స్పందించారు.

rajendraprasad 10082019 3

మేము జగన్ ను ఎందుకు కలవాలి ? మేము ఏమన్నా పెట్టుబడి దారులమా ? మేము కళాకారులం అంటూ ఘాటుగా బదులిచ్చారు. జగన్ ని కలిసే అవసరం ఉంటే కలుస్తాం అని అన్నారు. కేసీఆర్ ని ఎలా గౌరవిస్తామో, జగన్ ని కూడా అలాగే గౌరవిస్తామాని అన్నారు. కాని, ఇలా కలవాలి కలవాలి అనటం ఏంటి అంటూ రాజేంద్ర ప్రసాద్ ఘాటుగా స్పందించారు. నిజానికి ఈ విషయంలో వైసీపీ నేతలది ఓవర్ ఆక్షన్ అనే చెప్పాలి. వీళ్ళ మాటలతో, జగన్ మోహన్ రెడ్డికి మరింత చెడు చేస్తున్నారు కాని, మంచి చెయ్యటం లేదు. వీళ్ళ భజన కోసం, జగన పరువు వీళ్ళే తీస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజల్లో లేని చర్చను పెట్టి, నిజంగానే వాళ్ళు ఎందుకు వెళ్లి జగన్ ను కలవలేదో, జగన్ అంటే లెక్క లేదు అనుకుంటా అని ప్రజలు అనుకునేలా వీళ్ళే అవకాసం ఇస్తున్నారు. జగన్ ఇచ్చిన పని సవ్యంగా చెయ్యకుండా, ఎక్కువ భజన చేస్తే, పర్యావసానాలు ఇలాగే ఉంటాయి.

విజయవాడలో ఫైర్ బ్రాండ్ నేతగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా, గత కొన్ని రోజులుగా పార్టీ మారుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అటు సోషల్ మీడియాలో ఈ వార్తలకు అంతు లేకుండా పోయింది. దీనికి తోడు, బొండా ఉమా పెట్టిన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ కూడా ఈ వదంతులకు బలం చేకూర్చింది. తాను న్యూజిల్యాండ్ పర్యటనలో బంగీ జంప్ చేస్తున్న ఫోటో పెట్టి, నా తరువాత రాజకీయ అడుగు ఇలా ఉంటుంది అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో అందరూ , బొండా ఉమా పార్టీ మార్పు ఖాయంగా భావించారు. దీనికి తోడు, ఎన్నికలు అయిన దగ్గర నుంచి బొండా ఉమా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం కూడా, ఈ పార్టీ మార్పు వార్తలకు బలం చేకూర్చేలా చేసింది.

bonda 10082019 2

అలాగే చంద్రబాబు విదేశాలకు వెళ్ళిన సమయంలో కాపు నాయకులు అందరూ మీటింగ్ పెట్టుకోవటం, అందులో బొండా ఉమా ప్రముఖంగా ఉండటంతో పాటు, ఆయన బీజేపీలోకి వెళ్తున్నారు అనే వార్తలు వచ్చాయి. అయితే తరువాత నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిస్థితితులతో బొండా ఉమా అలక పాన్పు ఎక్కారని చంద్రబాబుకు తెలియటంతో, పిలిచి మాట్లాడారు. అయితే, తరువాత బొండా ఉమా చాలా రోజులు విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న సమయంలోనే ఆయన వైసీపీలోకి వెళ్తున్నారని, జగన్ ఆయానకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఈ మొత్తం పరిణామాల నేపధ్యంలో, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే, బొండా ఉమా పార్టీ మార్పు ఖాయం అనే అనుకున్నారు.

bonda 10082019 3

ఈ నేపధ్యంలోనే బొండా ఉమా, విదేశాల నుంచి తరిగి విజయవాడ వచ్చారు. దీంతో విజయవాడ తెలుగుదేశం పార్టీ అర్బన్ ప్రెసిడెంట్ గా ఉన్న బుద్దా వెంకన్న, బొండా ఉమా వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. చంద్రబాబు దూతగా వచ్చానని, జరుగుతున్న ప్రచారం పై ఇరువురూ చర్చించారు. దాదపుగా గంటకు పైగా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. చర్చలు ముగిసిన తరువాత బొండా ఉమా మాట్లాడుతూ, నేను చంద్రబాబునాయుడు గారి తోనే ఉంటానని , తెలుగుదేశం పార్టీ మారే ప్రసక్తి లేదని హామీ ఇచ్చారు. అంతే కాదు, ఇదే విషయాన్నీ చెప్తూ ఫేస్బుక్ పోస్ట్ రాసి, ఐ యాం విత్ సిబిఎన్ అంటూ చంద్రబాబు ఫోటో పెట్టి, బొండా ఉమా పోస్ట్ చేసారు. దీంతో బొండా ఉమా పార్టీ మారతారు అనే ప్రచారానికి ఇక తెర పడినట్టు అయ్యింది.

Advertisements

Latest Articles

Most Read