మొన్నటి ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద మెజారిటీ సాధించి జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ అధికారంలోకి వచ్చాయి. ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా, చివరకు జగన్ మోహన్ రెడ్డే నమ్మని విధంగా, వైసీపీ పార్టీకి, ఏకంగా 151 సీట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఫలితాల పై ఎవరి అనుమానాలు వారికి ఉండగా, ఒకసారి ఫలితం వచ్చిన తరువాత, అలాంటి వాదనలు ఇక చెల్లవు. జగన్ మొహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలతో అత్యంత బలవంతుడిగా ప్రస్తుతం ఉన్నారు. బీజేపీ లాంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలకు చుక్కలు చూపిస్తున్న టైంలో, వాళ్ళు కూడా వైసీపీ జోలికి వెళ్లి, ఎమ్మెల్యేలను లాక్కునే సాహసం చెయ్యటం లేదు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఇంత బలంగా ఉంటే, ఆ పార్టీ మంత్రులు మాత్రం, బీద అరుపులు అరుస్తున్నారు.

kodalinani 09082019 2

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడేసే కుట్ర జరుగుతుంది అంటున్నారు. ఈ మాటలు కూడా అన్నది, ఫైర్ బ్రాండ్ లాంటి పేరు ఉన్న పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని. కొడాలి నాని లాంటి వారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడటంతో, సామాన్య ప్రజలే కాదు, సొంత పార్టీ నేతలు కూడా అవాకయ్యారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా ? కొడాలి నాని లాంటి వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటూ ఆరాలు తీస్తున్నారు. కొడాలి నాని నిన్న తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుని, మీడియాతో మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వాన్ని ఎదో రకంగా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. జగన్ ను ఇబ్బంది పెట్టటానికి, కొన్ని మీడియా సంస్థలు రకరకాలుగా కుట్రలు పన్నుతున్నారని, జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.

kodalinani 09082019 3

అయితే తెలుగుదేశం పార్టీ కాని, బీజేపీ కాని, నిజంగా అంత మంది ఎమ్మేల్యేలను లాక్కుని, జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చెయ్యగలదా. దాదపుగా 75 మంది ఎమ్మెల్యేలు ఇటు వస్తే కాని అది సాధ్యం కాదు. ఆ పరిస్థితి ప్రస్తుతం ఉందా ? మరి కొడాలి నాని ఆ మాటలు ఎందుకు అన్నారు ? ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదు, ఇంత మెజారిటీ ఉన్న జగన్ ను ఎన్ని కుట్రలు చేసినా ఎవరు అస్థిరపరుస్తారు ? అయితే ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పాలన అంతా గాడి తప్పి ఉంది. ఒక పక్క ప్రజలు స్వచ్చందంగా రోడ్డు ఎక్కి ప్రతి రోజు నిరసనలు చేస్తూ, జగన్ ఇంటి ముందు కూడా ధర్నాలు చేస్తున్నారు. మరో పక్క ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జగన్ ప్రభుత్వానికి చుక్కులు చూపిస్తుంది. కేంద్రం సహకరించటం లేదు. డబ్బులు లేవు, అవి పెంచే మార్గం జగన్ దగ్గర ఏమి లేదు. ఇవన్నీ చూస్తున్న నానికి, ఏమి చెయ్యాలో అర్ధం కాక, ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటారని, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

కొరియా కంపెనీ కార్ల కంపెనీ కియా, మన అనంతరపురం జిల్లాలో నెలకొల్పిన సంగాతి తెలిసిందే. నిన్న ఆ కంపెనీ నుంచి ఉత్పత్తి అయిన మోదటి కారు మార్కెట్ లోకి విడుదల అయ్యింది. ఈ సందర్భంగా, అక్కడ జరిగిన కార్యక్రమంలో వైసిపీ నేతలు పాల్గున్నారు. నిన్న జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గునాల్సి ఉన్నా, ఆయన ఎందుకో కాని వెళ్ళలేదు. నిన్న ఉదయం ఢిల్లీ నుంచి వచ్చినా, ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు. అయితే జగన్ మాత్రం, కియా కారు మార్కెట్ లోకి వస్తున్న సందర్భంలో, కియా కంపెనీ మా నాన్న వైఎస్ఆర్ కల, అది నెరవేరింది అంటూ చెప్పుకొచ్చారు. 2017లో కియా కంపెనీతో చర్చలు మొదలైన దగ్గర నుంచి, ఈ రోజు దాకా కూడా, కియా కంపెనీలో వైఎస్ఆర్ పాత్ర కాని, జగన్ పాత్ర కాని లేదు. ఈ కంపెనీ మన దేశంలో పెట్టుబడి పెడుతుంది అని తెలియగానే, అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి.

kiacbn 09082019 1

పెద్ద రాష్ట్రాలు అయిన తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయినా చంద్రబాబు చొరవతో అది మన రాష్ట్రానికి వస్తే, జగన్ మాత్రం, కియా మా నాన్న కల, ఇందులో చంద్రబాబు చేసింది ఏమి లేదు అని చెప్పుకొస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఇదే పాట పాడారు. అయితే కియా మా నాన్న కల అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల పై చంద్రబాబు స్పందించారు. అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అనంతపురం జిల్లా కరువు జిల్లా అని, నీళ్ళు కూడా లేని చోట, ఎన్నో తిప్పలు పడి కియా మోటార్స్ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేస్తే, ఇది మా నాన్న కల అని జగన్ మోహన్ రెడ్డి అంటున్నారని చంద్రబాబు అన్నారు. మీ నాన్న కల, నేను కష్టపడి నేరవేర్చానా అంటూ, జగన్ కు ఝలక్ ఇచ్చారు చంద్రబాబు.

kiacbn 09082019 1

వాళ్ళ నాన్న కల నేను నెరవేర్చటం ఏంటి అంటూ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మీ కల కోసం, మీ నాన్న కల తీర్చటం కోసం, నేను ఇక్కడ లేనని, రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ మనోభావాల కోసం, వాళ్ళ ఆశల కోసం, ఇక్కడ యువతకు ఉద్యోగాల కోసం పని చేసి, అక్కడికి కియా కంపెనీ తెచ్చానని చంద్రబాబు అన్నారు. 2017లో కియా కారు ఏపీకి వచ్చి ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమైతే.. 2009లో వైఎస్‌ మరణించిన వైఎస్‌ కారణంగా ఎలా వచ్చిందో అర్ధం కావడంలేదు. ''మా నాన్న కల నేను నెరవేర్చా'' అంటూ చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది. అధికారం ఉందని తాము చెప్పిన వారికే ఉద్యోగాలివ్వాలని, తమ మాటే వినాలంటూ అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన కియా యాజమాన్యాన్ని వైసీపీ రౌడీలు బెదిరిస్తున్నారు. అధికార పార్టీ నేతల చర్యల వల్ల పారిశ్రామిక వేత్తల్లో ఆందోళన నెలకొంటోంది. నాపై కోపంతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే ఖబడ్డార్‌'' అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

రాష్ట్ర ప్రజలకు షాకులు ఇవ్వటం ప్రభుత్వానికి అయిపోయినట్టు ఉంది. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం లాంటి ప్రాజెక్ట్ ల విషయంలో, ప్రభుత్వ వైఖరితో, ఈ రెండు ప్రాజెక్ట్ లు అవ్వవు అనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారు. అమరావతి అయితే, ఇప్పుడే అవసరం లేదని ప్రభుత్వం చెప్పేసింది కూడా. ఇక పోలవరం మళ్ళీ టెండర్ అంటూ చేస్తున్న హడావిడితో, ఇక పోలవరం ఇప్పుడే అయ్యే పని లేదు. ఇవి ఇలా ఉంటే, ఇప్పుడు రాష్ట్ర స్థాయి వదిలి, జిల్లాల స్థాయిలో అమలు అవుతున్న పెద్ద ప్రాజెక్ట్ ల పై జగన్ ప్రభుత్వానికి కన్ను పడింది. ఈ నేపధ్యంలోనే నిన్న రాత్రి వచ్చిన ఉత్తర్వులు చూసి, కృష్ణా జిల్లా వాసులు నిరాశలోకి వెళ్ళిపోయారు. కొన్ని దశాబ్దలుగా బందర్ పోర్ట్ కోసం, కృష్ణా జిల్లా ప్రజలు పోరాటాలు చేస్తున్నారు.

port 09082019 2

ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం ముందడుకు వెయ్యలేదు. అయితే మొన్న చంద్రబాబు ప్రభుత్వంలో, ఈ కల సాకారం అయ్యింది. భూసేకరణ చేసి, టెండర్లు పిలిచి, నవయుగ కంపెనీకి పనులు ఇచ్చి, పనులు ప్రారంభించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో మొత్తం తారు మారు అయ్యింది. అయితే ప్రభుత్వం మారినా, పోర్ట్ నిర్మాణ పనులు ఆపరులే అని ప్రజలు అనుకున్నారు. కాని అనూహ్యంగా, బందరు పోర్టు నిర్మాణం కోసం నవయుగ సంస్థ ‘లీడ్‌ ప్రమోటర్‌’గా మచిలీపట్నం పోర్టు లిమిటెడ్‌ తో కుదుర్చుకున్న ఒప్పందాన్నినిన్న రాత్రి ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కృష్ణా జిల్లా ప్రజలు షాక్ అయ్యారు. ఎన్నో ఏళ్ళ తరువాత పనులు మొదలయ్యాయి అనే సంతోషం వారికి కొన్ని నెలలు మాత్రమే ఉంది.

port 09082019 3

చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో కష్టాలు పడి, ప్రజలను ఒప్పించి భూమి సమీకరణ చేసారు. 2017 మార్చి నెలలో 3010 ఎకరాలప్రభుత్వ భూమిని సమీకరించి కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించారు. తరువాత, మరింత భూమి కోసం, 2016లో మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేసి, ముడా ఆధ్వర్యంలో భూసమీకరణ, సేకరణ ప్రక్రియ చేపట్టారు. పోర్టుకు అవసరమైన ప్రైవేటు భూమిని పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతంలో ఎకరం 25 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. నవయుగ పెద్ద పెద్ద మిషనరీ అంతా తీసుకువచ్చి పనులు మొదలు పెట్టింది. అయితే ఎన్నికల ఫలితాలు రావటంతోనే, మొత్తం రివర్స్ అయ్యింది. పనులు నేమ్మదించాయి. ఇప్పుడు ఏకంగా, ఒప్పందమే రద్దు అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండర్ కు వెళ్తాం అంటున్నారు. ఇది ఎప్పటికి అయ్యేనో, ప్రజల కల ఎప్పటికి ఫలించేనో..

తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పై సమీక్షలు చేసుకుంటుంది. అంత బాగా పని చేసినా, ఎందుకు ఇలా ఓడిపోయామనే విషయం పై అన్ని వర్గాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వివిధ వర్గాలతో సమీక్షలు జరుపుతున్నారు. ఈ నేపధ్యంలోనే, ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మొదటి సారి సమావేశం అయ్యింది. ఎన్నికల్లో ఓటమి, ఓటింగ్ సరళి పై ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వంలో ఉండగా చేసిన తప్పులు, పార్టీలో వచ్చిన గ్యాప్, అలాగే జగన్ కు కలిసి వచ్చిన అంశాలు, దూరమైన వివిధ వర్గాల గురించి సమగ్రంగా చర్చించారు. అలాగే కొంత మంది నేతలు సరిగ్గా పని చెయ్యలేదని, చాలా మంది చంద్రబాబు ఇమేజ్ తో, అభివృద్ధి, సంక్షేమంతో గెలిచి పోతాం అనే ఓవర్ కాన్ఫిడెన్సు తో పోల్ మ్యానేజ్మెంట్ సరిగ్గా చెయ్యలేదని అభిప్రాయపడ్డారు.

polit 09082019 2

ఇది ఇలా ఉంటే, సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పదే పదే కంటతడి పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ హయంలో ఎన్నో కార్యక్రమాలు చేసామని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా, చంద్రబాబు ఎలా కష్టపడ్డారో, మాకు ఇంకా కళ్ళ ముందు తిరుగుతూనే ఉందని, ఈ కష్టం అంతా ఏమైపోయిందో, ప్రజలు ఎందుకు గుర్తించలేదో అంటూ కంటతడి పెట్టుకున్నారు. 23 సీట్లు వచ్చేంతగా మనం పని చేసామా ? చంద్రబాబు ఎంత కష్టపడ్డారో చూసాం కదా, ప్రజలల్లోకి మనం ఎందుకు తీసుకువెళ్ళలేకపోయం అని ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే మరో సందర్భంలో, టిడిపి మూల సిద్ధాంతం అయిన, పేదవాడికి కూడు, గూడు, బట్ట కోసమని, 5 రూపాయాలకే కడుపు నిండా భోజనం పెట్టె అన్నా క్యాంటీన్లు పెడితే, అది కూడా ముసేసారని, అది తెలియక అక్కడకి వచ్చిన వారు ఉసూరుమంటూ వెనక్కి వెళ్తున్నారని, మరో సందర్భంగలో అయ్యన్నపాత్రుడు బాధపడ్డారు.

polit 09082019 3

మరో వైపు, పార్టీ ప్రక్షాళన చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవలాని కొంత మంది సభ్యులు కోరారు. సోమిరెడ్డి మాట్లాడుతూ, ప్రక్షాళణ పోలిట్ బ్యూరో నుంచే జరగాలని అభిప్రాయపడ్డారు. మొన్న ఎన్నికల్లో ఎన్నో దెబ్బ తీశాయని, వైసిపీలా డబ్బులు ఖర్చు పెట్టలేక పోయామని, అలాగే కుల సమీకరణలో కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యామని, సభ్యులు అభిప్రాయ పడ్డారు. పోలిట్ బ్యూరో సమావేశం అనంతరం, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు, పార్టీ ప్రక్షాళన పై చర్చించామని చెప్పారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై కూడా చర్చించామని అన్నారు. ఈ రెండు నెలలు కింద స్థాయి కార్యకర్త నుంచి, ప్రభుత్వంలో పెద్దలు దాకా, మా పై కక్ష తీర్చుకోవటంతోనే కాలం గడిపెసరని అన్నారు.

ఉత్తర కొరియా కార్ల కంపెనీ దిగ్గజం కియా కంపెనీ, ఎంత పెద్ద కంపనీ అనేది అందరికీ తెలిసిందే. అది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. అంతర్జాతీయ స్థాయిలో, గుర్తింపు ఉన్న కంపెనీ. అలాంటి కంపెనీ మన దేశంలో పెట్టుబడి పెట్టటానికి సిద్ధమైంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లాంటి దిగ్గజ రాష్ట్రాలు తమ రాష్ట్రానికి తీసుకు రావటానికి పోటీ పడ్డాయి. చంద్రబాబు ఏమి మాయ చేసారో కాని, అంత పోటీని తట్టుకుని మరీ, ఆ కంపెనీని మన రాష్ట్రానికి తీసుకు రావటంలో సక్సెస్ అయ్యారు. ఈ కంపెనీ ఏకంగా 13 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. నిన్న కియా ఉత్పత్తి చేసిన మొదటి కారు మార్కెట్ లోకి వదిలారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డిని పిలిచినా ఆయన వెళ్ళలేదు.

madhav 09082019 2

పార్టీ ప్రతినిధులుని పంపించారు. అయితే ఈ సందర్భంలో, వైసిపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రవర్తనకు, అక్కడ ఉన్న కియా ప్రతినిధులు అవాక్కయ్యారు. ఒక విధంగా చెప్పాలి అంటే బెదిరిపోయారు. ఒక అంతర్జాతీయ స్థాయి కంపెనీనే వీళ్ళు ఇలా బెదిరిస్తున్నారు అంటే, ఇక లోకల్ పెట్టుబడిదారుల సంగతి చెప్పనవసరం లేదు. నిన్న గోరంట్ల మాధవ్ స్టేజ్ పైనే కియా ప్రతినిధుల పై ఆగ్రహం వ్యక్తం చెయ్యటం కనిపించింది. అలాగే కియా మొదటి కార్ పై సంతకం చెయ్యండి అని ప్రతినిధులు కోరగా, ‘కియ కార్‌ రోల్‌ అవుట్‌.. బట్‌ అవర్‌ యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ ఈజ్‌ రూల్డ్‌ అవుట్‌’ అని రాసారు. అంతే కాదు, మీరు ఇంకా చంద్రబాబు మత్తులోనే ఉన్నారు అంటూ, కియా ప్రతినిధుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

madhav 09082019 3

కియా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఎక్కడా జగన్ మోహన్ రెడ్డి గారి పేరు లేదని, ఎందుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. 75 శాతం ఉద్యోగాలు ఇక్కడ వారికి ఇవ్వాలని మా ప్రభుత్వం రూల్ పెట్టిన విషయం తెలియదా అని కియా పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కియా మీద జగన్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. అయితే ఇక్కడ కియా అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. వారు ఒప్పందం కుదుర్చుకునే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది, ఇప్పుడు జగన్ వచ్చి నేను కొత్త రూల్ పెట్టాను అంటే, 13 వేల కోట్లు పెట్టుబడి పెట్టిన వాడు వీళ్ళ మాట వింటాడా ? ఈయన జగన్ కి కంప్లైంట్ చేస్తాను అంటున్నారు, కియా వాళ్ళకు వీళ్ళ చెష్టలకు మండి, మోడీకి కంప్లైంట్ ఇస్తే, జగన్ పరిస్థితి ఏంటి ? వీళ్ళ పులివెందుల పంచాయతీకి, కియా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతే, పరిస్థితి ఏంటి ? వీళ్ళ ఇగో కోసం, రాష్ట్రం బలి అవ్వాలా ?

More Articles ...

Advertisements

Latest Articles

Most Read