పోలవరం ప్రాజెక్ట్ విషయం పై రోజు రోజుకీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. 2014 వరకు, పోలవరం ప్రాజెక్ట్ సైట్ లో, కనీసం 5 శాతం పనులు కూడా జరగలేదు. కాలువలు మాత్రం తవ్వుకుని, మట్టి అమ్ముకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ కాలువలు కూడా ఎక్కడ వీలు ఉంటే అక్కడ తవ్వారు. రైతులు భూములు ఇవ్వని చోట వదిలేసారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత, ఈ కాలువల తవ్వకంలో ఉన్న లిటిగేషన్లు అన్నీ సరి చేసారు. రైతులను ఒప్పించి భూములు తీసుకున్నారు. దీని ఫలితమే, ఈ రోజు పట్టిసీమ. చంద్రబాబు వచ్చిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ సైట్ పనులు కూడా పరుగులు పెట్టాయి. చంద్రబాబు దిగిపోయే టైంకి, 5 శాతం ఉన్న పనులు, 73 శాతం అయ్యాయి. ప్రాజెక్ట్ విషయంలో అన్ని పనులు పరుగులు పెట్టించారు చంద్రబాబు.
అయితే కొత్త ప్రభుత్వం రావటంతోనే, పోలవరం పనులు ఆపేసింది. దీంతో ఇప్పటికి పనులు ఆపి, మూడు నెలలు అవుతుంది. అంతే కాదు, పోలవరం పనులను పరుగులు పెట్టించిన నవయుగ కంపెనీకి నోటీసులు ఇచ్చి, వారిని వెళ్ళిపోమని, కొత్త టెండర్ పిలవటానికి రెడీ అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త టెండర్ పిలిస్తే, ఇప్పుడు ఉన్న రేట్ కంటే ఎక్కువే కోట్ చేస్తుంది. ఎక్కువ రేట్ అయితే కేంద్రం ఒప్పుకునే పరిస్థితి ఉండదు. మరి రాష్ట్రం ఎందుకు టెండర్ క్యాన్సిల్ చేసినట్టు ? ఈ వివాదం గురించి జగన్ ఢిల్లీ వెళ్లి, అందరికీ వివరించి రాగానే, కేంద్రం మరో షాక్ ఇస్తూ, 2005 లో జరిగిన విషయం పై నోటీసులు పంపించింది. 2005 అంటే, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి.
2005లో పొలవరంతో పాటు, దాని అనుబంధ ప్రాజెక్టుల పై, అప్పట్లో కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన చెన్నై అధికారులు పోలవరం ప్రాజెక్ట్ తో పాటు దాని అనుబంధ ప్రాజెక్ట్ ల పై సమీక్ష జరిపారు. అయితే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, పోలవరం విషయంలో, పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని కేంద్రానికి రిపోర్ట్ చేసారు. పర్యావరణ శాఖ ఇచ్చినే నివేదిక ఆధారంగా కేంద్రం పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది. ఇది కనుక రద్దు చేస్తే, ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కుదరదు. అయితే ఆ కమిటీ పరిశీలన జరిపిన 14 ఏళ్ల తర్వాత, ఇప్పుడు ఎందుకు కేంద్రం షోకాజ్ నోటీసులు ఇచ్చింది అనేది మాత్రం అర్ధం కావటం లేదు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేసింది, అని ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై దాని ప్రభావం పడేలా చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. చూద్దాం ఏమి అవుతుంది.