సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారయణ, సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉండగా ఎంత సెన్సేషనల్ అయ్యారో, రాజకీయాల్లోకి వచ్చి అంత పేరు సంపాదించలేదు అనే చెప్పాలి. జగన్ కేసుల్లో కాని, గాలి జనార్ధన్ రెడ్డి కేసుల్లో కాని, ఆయన చూపించిన తెగువకి, దేశ వ్యాప్తంగా మంచి ఆఫీసర్ అని పేరు వచ్చింది. అప్పట్లో మంత్రులుగా ఉన్న మహా మహా నాయకులను కూడా వదిలిపెట్టని లక్ష్మీనారయణ, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. తరువాత క్రమంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, గ్రామ స్వర్జ్యం పేరిట, ఆంధ్రప్రదేశ్ లో అన్ని గ్రామాలు తిరిగారు. రైతులకు సేవ చెయ్యాలనే ఉద్దేశంతో, ఆయన ప్రయాణం మొదలయ్యింది. తన పర్యటన తరువాత, రాజకీయాల్లోకి వస్తేనే, రైతులకు తాను చెయ్యల్సింది ఇంకా తొందరగా చెయ్యగలను అని నిర్ణయం తీసుకున్నారు.

jdl 08082019 1

మొదట్లో లోక్ సత్తా పార్టీలోకి వెళ్తారని, బీజేపీ అని, తెలుగుదేశం పార్టీ అని, ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయితే జేడీ మాత్రం, చివరకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరారు. పోయిన ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం నుంచి జనసేన తరుపున ఎంపీగా పోటీ చేసారు. అయితే ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత, ఆయన జనసేనలో ఉన్నట్టే అనిపించినా, తరువాత తరువాత దూరం అవుతూ వచ్చారు. మొన్న ప్రకటించిన జనసేన కమిటీల్లో, లక్ష్మీనారాయణకు కనీసం ఎక్కడా చోటు లేకపోవటంతో, అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ కు, జేడీకి మధ్య బాగా గ్యాప్ పెరిగిపోయిందని, ఈ సంఘటనతో అర్ధమైపోయింది. దీంతో, అసలు ఎందుకు వీరి మధ్య గ్యాప్ వచ్చింది అనే డిస్కషన్ మొదలైంది.

jdl 08082019 1

ఆయన పార్టీ కార్యక్రమాల్లో కంటే, తన సొంత కార్యక్రమాల్లో, ఇమేజ్ పెంచుకునే కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారని, అందుకు తెలివిగా జనసేన కార్యకర్తలని వాడుకుంటున్నారని, అది పవన్ కళ్యాణ్ కు నచ్చటం లేదని, అందుకే వీరి మధ్య అలా గ్యాప్ వచ్చిందని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల తరువాత నుంచి, లక్ష్మీనారాయణ, ఆయన ఫౌండేషన్ కు సంబందించిన కార్యక్రమాలు చేసుకుంటూ, దానికి జనసేన కార్యకర్తలను వాడుకుంటున్నారు, ఇదే పవన్ కు కోపం తెప్పించింది అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే పవన్ ఆయనకు ఏ కమిటీలోనూ చోటు ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే ఆ చర్య తరువాత, లక్ష్మీనారయణ కూడా పవన్ ను కలవటానికి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నా, లక్ష్మీనారాయణ కాని, అటు జనసేన వర్గాలు కాని, ఎవరు అధికారికంగా స్పందించలేదు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ కూడా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవటం ఒక వింతగా చెప్పాలి. మన రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, సోలార్, విండ్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ రేట్ తగ్గించాలని, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఆదేశాలు జరీ చేసిన సంగాతి తెలిసిందే. అయితే ఇప్పటికే 42 విద్యత్ ఉత్పత్తి కంపెనీలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్ట్ కు వెళ్లారు. దీంతో కోర్ట్ ప్రభుత్వ ఉత్తర్వులను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో కేంద్ర సంస్థలు అయిన, ఎన్‌టీపీసీ, ఎస్‌ఈసీఐలు ఇప్పటికే, రాష్ట్ర ప్రభుత్వానికి మేము విద్యుత్ రేట్లు తగ్గించే ప్రసక్తే లేదు, ఒప్పందం రద్దు చేసుకుంటే, ఫైన్ కట్టాలి అని ఏపి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాయి.

apgovt 08082019 2

అయితే ప్రైవేటు సంస్థలు, కేంద్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి అంటే అర్ధం ఉంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కూడా, ఇప్పుడు ఏపి రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన, జెన్కో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. సోలార్ రేట్లు తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సోలార్ విద్యుత్, ఒక యూనిట్ ధరను రూ.2.50 కు తగ్గించాలని, ప్రభుత్వం, అన్ని విద్యుత్ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు ఒప్పుకోమని అన్ని విద్యుత్ సంస్థలతో పాటు, ఇప్పుడు రాష్ట్రం ఆధీనంలో ఉండే జెన్కో కూడా, మేము ఆ ధరకు విద్యుత్ ఇవ్వలేము అంటూ తేల్చి చెప్పాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో బోర్డు సమావేశంలో తీర్మానం చేసారు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి షాక్ అనే చెప్పాలి. సొంత సంస్థలు కూడా ప్రభుత్వాన్ని తప్పు బడుతున్నాయి.

apgovt 08082019 3

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కో అనంతపురం జిల్లాలోని సోలార్‌ పార్క్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసింది. విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ఆదేశాలు ప్రకారం, ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఒక్కో యూనిట్ ను, రూ.3.50 కు అమ్మే విధంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం తక్కువకు ఇవ్వమనటంతో, జెన్కో అధికారులు మాత్రం కుదరదు అని చెప్తున్నారు. ఇక్కడ ప్లాంట్ పెట్టటానికి, అయిన ఖర్చుకు, ఒక్కో యూనిట్ ను, రూ.4 కు అమ్మాలని, అయినా మాకు విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ రూ.3.50 రేట్ మాత్రమే నిర్ణయించిందని, ఇప్పటికే నష్టాల్లో ఉన్న మాకు, మరింత తగ్గించాలి అంటే, మా వల్ల కాదని, ఏపి జెన్కో, ఏపి ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మరి జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్నయం తీసుకుంటారో.

ఈ రోజు అనంతపురం జిల్లాలో, దక్షిణ కొరియా కార్ల కంపెనీ కియ పరిశ్రమ నుంచి మేడిన్‌ ఆంధ్రాగా తయారు చేసిన తొలి కారు మార్కెట్ లోకి విడుదల అయ్యింది. ఈ రోజు కియా కార్లు రోడ్ల పై సందడి చేయ్యనున్నాయి. అయితే ఈ రోజు కియా మొదటి కారు లాంచ్ చెయ్యటం పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కియా కంపెనీ ఏపిలో రావటం కోసం మొదటి నుంచి చివరి దాకా పని చేసిన చంద్రబాబు, ఈ రోజు కియా మొదటి కారుని వైసీపీ నేతలు ఓపెన్ చెయ్యటం పై ఎలా స్పందిస్తారా అనే అందరూ అనుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం, ఎంతో హుందాగా ఒక స్టేట్స్-మెన్ లాగా స్పందించారు. కియా మొదటి కార్ ఇవాళ రోడ్డు పైకి వస్తున్న సందర్భంగా మనస్ఫూర్తిగా కియా కంపెనీని అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

kia 08082019 2

దేశ ఆటో మొబైల్ రంగంలో కియా ఒక కొత్త ఒరవడి సృష్టించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కియా కంపెనీని ఆంధ్రప్రదేశ్ తీసుకురావటానికి ఎంతో కష్టపడిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. కియా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని, దానికి సంతోష పడుతున్నాని ఆయనా న్నారు. కియా సంస్థ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉండగా అనంతపురం జిల్లాకు ఎదో ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకు వచ్చి, అక్కడ కరువుని జయించి, వలసలు తగ్గించాలని అనుకున్నారు. ఇందు కోసం అనేక ప్రయత్నాలు చేసి, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలని తట్టుకుని మరీ, కియా కంపెనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చారు.

kia 08082019 3

13 వేల కోట్ల పెట్టుబడితో, కియా దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి అయ్యింది. కియా ఒక్కదాంతో చంద్రబాబు ఆపలేదు. దాదపుగా 40 వరకు అనుబంధ సంస్థలు కూడా కియాతో పాటు వచ్చాయి. మొత్తంగా 15 వేల మంది దాకా ఉపాధి లభించనుంది. కియా తరువాత, హీరో హోండా, అశోక్ లేల్యాండ్, అపోలో టైర్స్ లాంటి ఆటోమొబైల్ కంపెనీలు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాయి. ఇలా అనేక కంపెనీలను చంద్రబాబు తీసుకువచ్చారు. అయితే, మొన్న అసెంబ్లీలో కియా కంపెనీని తీసుకువచ్చింది వైఎస్ఆర్ అని, 2007లో అప్పట్లో వైఎస్ఆర్, కియా కంపెనీతో మాట్లాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడికి ఒప్పించారని, దీంట్లో చంద్రబాబు గొప్పతనం ఏమి లేదని, అసెంబ్లీ సాక్షిగా జగన్ ప్రభుత్వం చెప్పటం గమనార్హం.

రాష్ట్రంలో గత రెండు నెలలుగా పరిస్థితి పూర్తిగా గాడి తప్పింది. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాని. పోలవరం ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది, ఇసుక లేక నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోవటంతో, 20 లక్షల మంది కూలి పని చేసుకునే వారికి పనులు లేవు. ఇక మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా నేమ్మదించాయి. పోయిన నెల తమ నాయన పుట్టిన రోజు అని చెప్పి, 8 వ తారీఖున పెన్షన్ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. ఈ నెల అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్రతి సారి ఫస్ట్ తారీఖున ఉద్యోగులకు జీతాలు పడేవి. ఈ సారి రెండు రోజులు ఆలస్యం అయ్యింది. ఎందుకు అని ఆరా తీస్తే, ఎదో సాంకేతిక సమస్య అని చెప్పింది ప్రభుత్వం. అలాగే ప్రతి నెలా పెన్షన్ లు తీసుకునే ముసలి వారికి, వికాలంగులుకు కూడా ఈ సారి పెన్షన్ లేట్ అయ్యింది.

pensions 08082019 2

8వ తారీఖు వచ్చినా ఇంకా పెన్షన్ రాని పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. ఇదే విషయం పై ఒక ప్రముఖ ఛానెల్ లో వచ్చిన వార్తాను చంద్రబాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆ వీడియో చూస్తూ ముసలి వారి పడే కష్టాలకు కన్నీళ్లు వస్తున్నాయి. మాకు ఇంకా పెన్షన్ ఇవ్వలేదు అయ్యా, తిండి కూడా తినట్లేదు అంటూ ఒక తాత ఏడుస్తూ చెప్తే, మరొక అవ్వ, కనీసం 10 రూపాయలు ఇవ్వండి అయ్యా, ఆకలి వేస్తుంది అని వేడుకునే పరిస్థితి వచ్చింది. మరి కొంత మంది, మమ్మల్ని రోజు తిప్పించుకుంటున్నారు. చార్జీలకు డబ్బులు అయిపోతున్నాయి అంటూ బాధ పడుతున్నారు. ఇలా తాము పడుతున్న కష్టాలు చెప్తూ, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, టైంకి పెన్షన్ ఇచ్చే వారని, రెండు నెలల నుంచి లేట్ అవుతుందని, బాధ పడుతున్నారు..

pensions 08082019 3

చంద్రబాబు ఈ వీడియో పోస్ట్ చేస్తూ, ఇలా స్పందించారు... "పనులు చేసుకోడానికి శక్తి చాలని వృద్ధులని తెలిసి కూడా పింఛను కోసం రోజుకు రెండు మూడుసార్లు చొప్పున వారం రోజులుగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం దారుణం. ఒకటో తారీఖునే అందాల్సిన పింఛన్లు ఇప్పటికీ ఇవ్వకపోవడం ఏమిటి? ఆకలికి అలమటిస్తున్న పేదల బాధ ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? అనవసర విషయాలపై కాకుండా ప్రజల గురించి ఆలోచించి ప్రణాళికా బద్దంగా పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? గతంలో ఎప్పుడూ లేని ఇబ్బందులు ఇప్పుడే వస్తున్నాయంటే నిర్లక్ష్యం కాదా? ఇప్పటికైనా మేలుకుని పెండింగ్ పింఛన్లను వెంటనే ఇచ్చే ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలి." https://www.facebook.com/tdp.ncbn.official/videos/484863779010975/

Advertisements

Latest Articles

Most Read