వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీ, అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా, పోలవరం టెండర్ గురించి చర్చ జరిగే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కావటంతో, జగన్ మోహన్ రెడ్డి ఏక పక్షంగా నవయుగని తప్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తరుణంలో, కేంద్రం ఆగ్రహం ఉందని తెలుసుకుని, ఏ పరిస్థితిలో అలా చెయ్యాల్సి వచ్చిందో జగన్, ప్రధానికి వివరించనున్నారు. అలాగే విద్యుత్ పీపీఏ ల పై జరుగుతున్న గొడవ, 75 శాతం లోకల్ రిజర్వేషన్ పై కూడా జగన్ మోహన్ రెడ్డి, ప్రధానికి వివరించనున్నారు. దీంతో పాటు, తాను ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ, ప్రధాని హోదా పై అడుగుతా అని చెప్పిన జగన్, ఈ సారి కూడా హోదా ఇవ్వండి, ప్లీజ్ సార్ ప్లీజ్ అనే అవకాసం కూడా ఉంది.

gvl 06082019 2

అయితే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపధ్యంలో, ఆయన ఢిల్లీకి వెళ్ళే ముందే బీజేపీ తన అజెండాని కూడా రాజకీయంగా సెట్ చేసి పెట్టినట్టు ఉంది. జగన్ ఢిల్లీ పర్యటన నేపధ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యెక హోదా అనేది ఎప్పుడో ముగిసిపోయింది అని, దాని గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నారు అంటే, ప్రజలను మభ్యపెట్టటమే అని అన్నారు. ప్రత్యెక హోదా గురించి, పనీ పాట లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడతారని అన్నారు. రాజకీయంగా ఏ పని లేకపోతే, వారికి ప్రత్యెక హోదా అనేది ఒక కాలక్షేపం సబ్జెక్ట్‌ అయిపోయిందన్నారు. జగన్ పర్యటనకు ముందు జీవీఎల్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయంసం అయ్యాయి.

 

gvl 06082019 3

జగన్ ఢిల్లీ టూర్ రెండు రోజుల పాటు ఇలా సాగనుంది. మంగళవారం ఉదయం 9.30కి తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ ఢిల్లీకి బయలుదేరతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం అవుతారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అలాగే మరుసటి రోజు అంటే రేపు బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, 11.30 గంటలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో జగన్ భేటీ అవుతారు. రేపు మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్‌ సమావేశం అయ్యి, రాష్ట్రానికి పెండింగ్ లో ఉన్న అంశాల పై చర్చిస్తారు. తరువాత తిరిగి రేపు సాయంత్రం 6 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి మూడు తెలుగు ఛానెల్స్ ని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. విజయవాడలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన తమ్మినేని, ఈ విషయం పై స్పందిస్తూ, అసెంబ్లీ నియమావళి, నిబంధనలు విషయంలో ,అసలు రాజీ పడే సమస్యే లేదని చెప్పారు. అసెంబ్లీ నియమాకలకు వ్యతిరేకంగా పని చేసినందుకే ఆ మూడు ఛానెల్స్ పై నిషధం విధించామని చెప్పారు. వారికి నోటీసులు పంపించామని, ఎవరైనా సరే, అసెంబ్లీ ఆవరణలో నిబంధనలు పాటించల్సిందే అని తమ్మినేని అన్నారు. పెద్ద పెద్ద చానల్స్ అయ్యి ఉండి కూడా, అసెంబ్లీ నిబంధనలు అన్నీ తెలుసి కూడా, వారు తెలియనట్టు వ్యవహరిస్తే ఎలా అంటూ స్పీకర్ తమ్మినేని, ఆ మూడు ఛానెల్స్ ని నిలదీశారు.

tammineni 05082019 2

నిద్రపోయే వారిని లేపచ్చు, కాని నిద్ర నటించే వారిని ఏమి చేయలేం, వారికి తగిన విధంగా సమాధానం చెప్పాల్సిందే అంటూ తమ్మినేని అన్నారు. అయితే, ఈ విషయం పై ఇప్పటికే ఆ ఛానెల్స్, స్పీకర్ కు వివరణ ఇచ్చాయి. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో, అక్కడ ప్రెస్ మీట్ వెయ్యటం తప్పే అని, తప్పు తెలుసుకుని రెండు నిమషాల్లోనే లైవ్ ఆపేసామని, మరొక్కసారి ఇలా జరగకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చాయి. అంతే కాదు వివధ జరనలిస్ట్ సంఘాలు వెళ్లి స్పీకర్ ను కలిసి, బ్యాన్ ఎత్తేయమని కూడా చెప్పాయి. అయితే అప్పటి వరకు ఐ & పీఆర్ నుంచి లైవ్ ఫీడ్ ఇస్తున్న ఒక ఛానెల్ ని, అది కూడా ఇవ్వటానికి వీలు లేదు అంటూ మరిన్ని ఆంక్షలు పెట్టారు. దీంతో ఆ ఛానెల్స్ అవాక్కయ్యాయి. వివరణ ఇచ్చినా స్పీకర్ కనికరించాలేదని వాపోయాయి.

tammineni 05082019 3

ఈటీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానెల్స్‌ను అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశం లేకుండా స్పీకెర్ నోటీసులు ఇచ్చారు. 45 ఏళ్ళకే, 2 వేలు పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నారు అని అడిగినందుకు, ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసారు. అయితే, వారు సస్పెండ్ అయిన తరువాత, బయటకు వచ్చి ప్రెస్ తో మాట్లాడారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడిన దానిని, రెండు నిమషాలు ఈ మూడు ఛానెల్స్ లైవ్ ఇచ్చాయి. అవి నిబంధనలకు వ్యతిరేకం అంటూ, ఆ మూడు ఛానెల్స్ ని బ్యాన్ చేసారు. అయితే గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన సందర్భాలు లేవని అంటున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఈ రూల్ పెట్టారని, తరువాత వచ్చిన ప్రభుత్వం, మొన్న చంద్రబాబు ప్రభుత్వం కాని, ఎప్పుడు ఇలా చెయ్యలేదని, అలా అయితే సాక్షి ఛానెల్ కి అసలు అసెంబ్లీ ఎంట్రీ కూడా ఉండేది కాదని గుర్తు చేస్తున్నారు. ఏదైనా స్పీకర్ నిర్ణయం ఫైనల్ కాబట్టి, ఆయన మీద గౌరవంతో ఏమి మాట్లాడలేం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తాను అంటూ జగన్ మోహన్ రెడ్డి విధానం పై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మద్య నిషేధం చాలా కష్టమైన పని చెప్తూ, తెలంగాణా ఉద్యమం నాటి సమయంలో జరిగిన కొన్ని అంశాలకు ఉదాహరణగా చెపారు. అయితే దీని పై టీఆర్ఎస్ అభ్యంతరం చెప్పింది. తెలంగాణా సాయుధ పోరాటాన్ని పవన్ కళ్యాణ్ కించ పరుస్తూన్నరు అంటూ, హైదరాబాద్ లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం ముందు నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేసారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవలాని కోరారు. అలాగే పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని అని చెప్తూ, జూబ్లీహిల్స్ పోలీసులకు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

pk 05082019 2

అయితే ఈ అంశం పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఇది చాలా చిన్న అంశం అని, దాన్ని కావాలని టీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. తాను ఒక మాట అంటే, తాను అనని మాటలకు వక్రభాష్యం చెప్పి, తన ఇంటిమీద, కార్యాలయాల మీద దాడులు చెయ్యటం ఏంటని టీఆర్ఎస్ ని ప్రశ్నించారు. ఏమి లేని దానికి తన ఇంటి మీద దాడులు చెయ్యటానికి వస్తే, చూస్తూ కూర్చోను అని, తాట తీస్తానని హెచ్చరించారు. తాను ఏ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యలేదని, ఎవరినీ కించపరచలేదని, అలా చెప్తే తాను వెంటనే క్షమాపణ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని పవన్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఇలాగే అయిన దానికి కాని దానికి రాద్ధాంతం చేస్తే, పరిణామాలు వేరే లాగా ఉంటాయని పవన్ కళ్యాణ్ అన్నారు.

pk 05082019 3

తన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని, మీ ఇష్టం వచ్చినట్టు నా ఇంటి ముందు చేస్తే, చూస్తూ కూర్చోను అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇళ్ళ మీదకు వస్తాం, ఆఫీసుల మీదకు వస్తాం అంటూ, మేమేమి ముడుచుకు కుర్చోలేదని పవన్ అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనలో ఉన్నారు. అక్కడ ఈ అంశం పై స్పందించారు. తాను నిన్న రాజమండ్రిలో దిగగానే, ఫోన్ వచ్చిందని, తన ఇంటి ముందు టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారని అన్నారు. ఎందుకు అని అరా తీస్తే, నేను తెలంగాణా పోరాటాన్ని కించ పరిచేలా మాట్లాడానని, అందుకని అని అన్నారని పవన్ అన్నారు. ఎప్పుడో ఐదు రోజుల క్రిందట నేను ఎదో మాట్లాడితే, వీళ్ళు ఏదో ఆపాదించుకు హడావిడి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. నా భీమవరం పర్యటన హైలైట్ కాకుండా, ఇలా చేసారని అన్నారు.

370 ఆర్టికల్‌ రద్దు పై ఉదయం నుంచి రాజ్యసభలో చర్చ జరిగింది. దీని పై చివర్లో అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్, ఇది హడావిడిగా పెట్టిన బిల ని, కనీసం టైం కూడా ఇవ్వకుండా, ఇంత హడావిడిగా చెయ్యాల్సిన అవసరం ఏంటి, మంద బలంతో బుల్ డోజ్ చేస్తారా అంటూ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. అయితే, దీని పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విభజన సమయంలో, అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలా ప్రవర్తించిందో వివరించారు. అప్పట్లో కాంగ్రెస్ కూడా ఇలాగే చేసిందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడకుండా, బిల్ పెట్టి, రెండు రాష్ట్రాలుగా విడగొట్టారని అమిత్ షా విమర్శలు గుప్పించారు.

rs 05082019 2

అయితే దీని పై గులాం నబీ ఆజాద్ అభ్యంతరం చెప్పారు. దీనికి సమాధానం చెప్పాలి అంటూ, అమిత్ షా స్పీచ్ ని ఆపి, తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అమిత్ షా మాటలకు సమాధానం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విభజన ఇలా జరగలేదు అని చెప్పారు. అంతకు ముందే అందరితో మాట్లాడామని, ఆ ప్రక్రియ అంతా సంవత్సరం పాటు నడిచిందని చెప్పారు. ఇరు ప్రాంతాల వారిని పిలిచి దాదపుగా 20 మీటింగ్స్ పెట్టామని, దానికి నేనే సాక్ష్యం అంటూ ఆజాద్ చెప్పుకొచ్చారు. అఖిల పక్షం పెట్టం, ప్రజా సంఘాలని పిలిచాం, అన్నీ చేసి పార్లమెంట్ కు వస్తే, ఇక్కడ ఎంపీలు గొడవ చేసారని, అప్పుడు మీరు కూడా మద్దతు ఇచ్చారు కదా అని ఆజాద్ అన్నారు. మేమేమి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదని, అందరితో చర్చించామని అన్నారు.

rs 05082019 3

ఈ రోజు ఏమి జరుగుతుందో దేశానికి చెప్పకుండా, ఇప్పటికిప్పుడు రాజ్యసభలో మీరు ప్రకటన చేసారని, ఇది ఏకపక్షం కాక, ఇంకా ఏమిటని ప్రశ్నించారు. కాశ్మీర్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా, రాష్ట్రాన్ని ఎలా విడగోడతారని అన్నారు. అయితే దీని పై అమిత్ షా కూడా అదే రేంజ్ లో సమాధానం చెప్పారు. మేము ఈ బిల్ పై ఏమి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తాము మున్సిపాలిటీల్లో గెలవక ముందు కూడా ఈ అంశం పై చర్చించామని అన్నారు. 370 ఆర్టికల్‌ రద్దు అంశం మా మేనిఫెస్టోలో కూడా ఉందనే విషయం మర్చిపోకూడదు అని అన్నారు. అయితే ఇరువురి వాదనలు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల విభజన పై జరుగుతూ ఉండటంతో, వెంకయ్య నాయుడు, ఇద్దరినీ వాదించారు. ఇక్కడ ఏపి, తెలంగాణా చర్చ కాదని, ఆర్టికల్ 360 పై మాట్లాడాలని అన్నారు. మరో పక్క, జమ్మూకశ్మీర్‌ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

Advertisements

Latest Articles

Most Read