మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఎన్నో పనులు చేసినా, డబ్బులు లేకపోయినా, అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టించినా, ఆయన ఎప్పుడూ చూడని ఓటమి చూడాల్సి వచ్చింది. దీని పై అనేక వాదనలు కూడా నడుస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం, అవేమి కాకుండా, నిజంగా తప్పు ఎక్కడ జరిగింది అనేదాని పై సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు గుంటూరు పార్టీ ఆఫీస్ లో, వేమూరు నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ప్రస్తుతం వారు ఎదుర్కుంటున్న సమస్యలు, వైసీపీ బెదిరింపులు, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టటం, సంక్షేమ కార్యక్రమాలు ఆపెయ్యటం, ఇలా అన్ని సమస్యలు కార్యకర్తలు చంద్రబాబుతో చెప్పుకున్నారు.

cbn 07802019 2

తరువాత చంద్రబాబు ప్రసంగిస్తూ, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రెండు నెలల్లోనే మొత్తం అస్తవ్యస్తం చేసిందని చంద్రబాబు అన్నారు. మన హయంలో ఇసుక దోపిడీ చేసాం అంటూ, ఊరు ఊరు తిరిగి విష ప్రచారం చేసారని, అయితే ఇప్పుడు ఇసుక ఎలా ఉందొ చూసారు కదా, మన హయంలో ఇసుక ఎంత ఉంది, ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగింది ? ఎవరిదీ దోపిడీ అని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే రైతు రుణ మాఫీ సగంలో ఉందని, మనం డబ్బులు బ్యాంక్ లు వేసి, వెయ్యమంటే, ఎలక్షన్ కమిషన్ చేత ఆపించారని, అవి విడుదల చెయ్యాలని కోరారు. అవి విడుదల చెయ్యకపోతే ఉద్యమం చేస్తామని, కోర్ట్ కు వెళ్తామని చంద్రబాబు అన్నారు. అప్పట్లో ప్రభుత్వం తరుపున రైతులకు ఇచ్చిన బాండ్లను చంద్రబాబు ప్రస్తావించారు.

cbn 07802019 3

అయితే ఈ సందర్భంలో ఒక కార్యకర్త మాట్లాడుతూ, "సార్.. మీరు రాష్ట్రం కోసం గత 5 ఏళ్ళలో ఎంతో చేసారు, అయినా ప్రజలు మిమ్మల్ని ఓడించారు. ఇంకా ఎందుకు సార్ వాళ్ళ కోసం తాపత్రయం, పార్టీని చూసుకోండి చాలు" అని అనగా, చంద్రబాబు ఆ వ్యాఖ్యలకు సమాధానం చెప్పారు. నేను అలా ఎప్పుడూ అనుకోను, ప్రజల కోసం మనం పని చేస్తూనే ఉండాలి. వాళ్ళు నా కష్టాన్ని కూడా గుర్తుంచుకోకుండా, నన్ను ఓడించారని బాధ లేదు, వాళ్ళ కోసం ప్రతిపక్షంలో ఉండి పోరాడే తత్త్వం నాది అని అన్నారు. వైసిపీ నేతలు ఎన్ని అవమానాలు చేసినా, ప్రజల కోసమే భారిస్తున్నాని అన్నారు. అలాగే పార్టీ శ్రేణులు కూడా ఇంకా ఆ ఓటమి నుంచి బయటకు రావాలని, ప్రజలకు అండగా ఉండే కార్యక్రమాలు చెయ్యాలని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు, ప్రజల కోసం నిరనతరం పని చెయ్యాలని చంద్రబాబు అన్నారు.

బీజేపీ సీనియర్ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి, సుష్మా స్వారాజ్ నిన్న రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆమె వయసు 67 ఏళ్ళు. అయితే ఆమె హటాత్తుగా చనిపోవటంతో, అందరూ షాక్ లో ఉన్నారు. నిన్న రాత్రి తొమ్మిది గంటల సమయంలో, ఆమె నలతగా ఉందని చెప్పటంతో, కుటుంబ సభ్యులు ఆమెను ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆమెను ఎమర్జెన్సీ వార్డ్ కు తీసుకు వచ్చే లోపే, ఆమె చనిపోయారని డాక్టర్లు చెప్పారు. సుష్మాస్వరాజ్‌కు భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సూరి ఉన్నారు. సుష్మా చాలా కాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు. ఆమె కిడ్నీలుకు కూడా దెబ్బ తినటంతో, ఆమె కోనేళ్ళుగా డయాలసిస్‌ చేయించుకున్నారు. 2016లో ఆమెకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

sushma 07082019 2

మరో పక్క ఆరోగ్యం బాగోకపోవటంతో, ఆమె మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చెయ్యలేదు. మంత్రిగా ఉండగా కూడా ఆమె ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉండేవారు. ప్రతి ఒక్కరికీ ఓపికగా సమాధానం చెప్పే వారు. ట్విట్టర్ లో ఆమె మార్కు సెటైర్ లు కూడా పడుతూ ఉండేవి. అయితే, ఇదే క్రమంలో నిన్న ఆమె చనిపోయే ముందు కూడా, ఆమె చివరి ట్వీట్లో ప్రధాని మోడీకి థాంక్స్ చెప్తూ ట్వీట్ చేసారు. ఆర్టికల్ 370 రద్దు పై ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ, రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ట్వీట్ చేసారు. ఇది చూడడం కోసమే తాను జీవితకాలం ఎదురుచూశానని ఆ ట్వీట్‌లో పేర్కుంటూ మోడీకి థాంక్స్ చెప్పారు. ఆమె తరువాత భోజనం చేస్తూ కూడా టీవీ చూస్తూ గడిపారని కుటుంబ సభ్యులు చెప్పారు.

sushma 07082019 3

సుష్మాస్వరాజ్‌ మరణ వార్తా పై చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. అలాగే ప్రధాని మోడీ, సుష్మాస్వరాజ్‌ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అలాగే వెంకయ్య నాయుడు, అద్వానీ కూడా ఆమె పార్ధివదేహాన్ని చూసి, కన్నీళ్లు ఆపుకోలేక పోయారు. సుష్మ స్వరాజ్ కు మన తెలుగు రాష్ట్రాలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. విభజన సమయంలో, సోనియా గాంధీని పెద్దమ్మ అని తెలంగాణా వాదులు అనుకున్న వేళ, నన్ను కూడా మీ చిన్నమ్మని అనుకోండి అంటూ సుష్మా తెలంగాణా ప్రజలను కోరారు.

బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రెండు రోజుల క్రిందట, పోలవరం ప్రాజెక్ట్ టెండర్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చెయ్యటం పై, ప్రెస్ మీట్ పెట్టి స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై వైసీపీ నేతలు వెంటనే సుజనాకి కౌంటర్ ఇచ్చారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి పార్లమెంట్ లో, జగన్ ప్రభుత్వాన్ని తిట్టినా పట్టించుకోని వైసీపీ నేతలు, రాష్ట్రంలో బీజేపీ నేతలు తిడుతుంటే పట్టించుకోని వైసీపీ నేతలు, సుజనా విమర్శ చెయ్యగానే అందరూ ఆక్టివ్ అయిపోయారు. అయితే సుజనా తెలుగుదేశం పార్టీ మారి రెండు నెలలు అవుతుంది. ప్రస్తుతం ఆయన బీజేపీ ఎంపీ అయిపోయారు. అయితే సుజనా విమర్శల పై విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ, సుజనా చౌదరి బీజేపీలో చేరిపోయినా ఇంకా తెలుగుదేశం అధికార ప్రతినిధి లాగా మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు.

sujana 06082019 2

పోలవరం ప్రాజెక్ట్ టెండర్ రద్దు చెయ్యటం, విద్యుత్ పీపీఏలను సమీక్షించటం పై, కేంద్రం తప్పుబట్టింది అంట, ప్రజాధనం లూటి చేసిన దాన్ని సమర్ధించటం చూస్తే, ఇంకా సుజనా చౌదరి లోపల పచ్చ చొక్కా వేసుకుని తిరుగుతున్నారు అనిపిస్తుంది అంటూ, సుజనా పై విమర్శలు చేసారు. అయితే ఇలాంటి వారిని అసలు పెద్దగా పట్టించుకోని సుజనా, అనూహ్యంగా విజయసాయి రెడ్డికి రియాక్ట్ అయ్యారు. విజయసాయి రెడ్డి పై విమర్శలు ఎక్కు పెడుతూ, "పోలవరం ఆపెయ్యడం, పీపీఏలను రద్దుచెయ్యాలనుకోవడం రాష్ట్రప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని @VSReddy_MP గారికి తెలుసు. ఇలాంటి చర్యలను అడ్డుకోకపోతే రాష్ట్రానికి నష్టమని తెలుసు. కాని ఆయన అసలు అభిప్రాయం చెప్పలేని నిస్సహాయునిగా ఉన్నట్టున్నారు. అది కప్పిపుచ్చుకోడానికే ఇలాంటి ట్వీట్లు." అంటూ సమాధానం చెప్పారు.

sujana 06082019 3

రెండు రోజుల క్రిందట సుజనా చౌదరి మాట్లాడుతూ, పోలవరం టెండర్ ను రద్దు చెయ్యటం పై, కేంద్రంలోని పెద్దలు అందరూ అవాక్కయ్యారని అన్నారు. ఇదే విషయం పై కేంద్ర మంత్రితో చర్చించామని, పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం ప్రాజెక్ట్ అని, దీని పై సమీక్ష జరుపుతాం అని చెప్పారని సుజనా చెప్పారు. అలాగే విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన మోహన్ రెడ్డి దూకూడుగా వెళ్తున్నారని, ఇంత మంది వారిస్తున్నా, ఆయన మాత్రం ఆయన పంధాలోనే వెళ్తున్నారని, దీని వల్ల విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు రాష్ట్రానికి రాకుండా పోతాయని అన్నారు. అలాగే స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ పై కూడా, అభ్యంతరం చెప్తూ, మన రాజ్యంగం ప్రకారం ఇది చెల్లదని, దేశంలో ఎవరు ఎక్కడైనా పని చెయ్యొచ్చని అని అన్నారు. దీని పై విజయసాయి అభ్యంతరం చెప్పటం, దానికి సుజనా కౌంటర్ ఇవ్వటం జరిగింది.

అమరావతి అంటేనే మొన్నటి వరకు ఒక ఎమోషన్. ఆంధ్రుడి సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నాం, ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీని కడుతున్నాం అంటూ గర్వంగా చెప్పుకున్న క్షణాలు. అందుకు అనుగుణంగానే, అక్కడ రైతన్నల త్యాగాలు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 33 వేల ఎకరాలు, ప్రభుత్వానికి ఇచ్చారు అక్కడ రైతులు. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా, ఇది ఎలా సాధ్యం అని ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఒక ఎకరా బూమి సమీకరించాలి అంటే, ప్రభుత్వాలకు మామూలు తల నొప్పులు కాదు. అలాంటిది కేవలం చంద్రబాబు మీద నమ్మకంతో అక్కడ ప్రజలు, ఒక్క మాటకు విలువచ్చి, 33 వేల ఎకరాలు ఇచ్చేసారు. పనులు మొదలయ్యాయి. కాని ఈ లోపే ఎన్నికలు రావటం, చంద్రబాబు ఓడిపోవటం జరిగిపోయింది.

amaravati 07082019 2

జగన్ మోహన్ రెడ్డికి అధికారం వచ్చింది. అయితే మొదటి నుంచి అమరావతి అంటే వ్యక్తిరేకత చూపించే జగన్, సహజంగానే అమరావతిని పట్టించుకోవటం ఆపేశారు. 40 వేల మంది కార్మికులతో సందడిగా ఉండే రాజధాని ప్రాంతం, ఇప్పుడు బోసి పోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ప్రభుత్వం రాజధాని కట్టక మానుతుందా అనుకునే ప్రజలకు, నిన్నటితో పూర్తీ క్లారిటీ వచ్చేసింది. నిన్న జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోడీని కలిసారు. ఈ సందర్భంగా, మాకు అసలు ఇప్పుడే అమరావతి వద్దు అని తేల్చి చెప్పేశారు. అమరావతికి మేము మీ నుంచి రూపాయి కూడా అడగం అని చెప్పి, ఆ డబ్బులు నవరత్నాలకు ఇవ్వండి అని ప్రధానికి తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కు గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన 5 వేల కోట్లు ఇవ్వమని అడిగారు.

amaravati 07082019 3

అయితే అమరావతి ఇప్పుడే వద్దు అని కారణం చెప్తూ, అక్కడ పెద్ద స్కాం జరిగింది అనే అనుమానం మాకు ఉంది. విచారణ జరిపిస్తున్నాం. విచారణ పూర్తీ అయిన తరువాత, మిమ్మల్ని రాజధానికి డబ్బులు అడుగుతాం అని జగన చెప్పారు. ఇలా అనుమానం వచ్చి, విచారణ అయ్యే దాకా ఆగాలి అంటే అసలు అయ్యే పనేనా ? ఇలా అనుకుంటే, జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు విచారణ అయ్యే దాకా, ఆయన సియంగా తప్పుకోవచ్చు కదా ? అసలు అమరావతి నిర్మాణానికి, విచారణకు సంబంధం ఏముంది ? నిర్మాణం చేస్తూనే, విచారణ జరుపుకోవచ్చు కదా ? ఎవరైనా రూపాయి ఇవ్వండి అని అడుగుతారు కాని, కేంద్రం దగ్గరకు వెళ్లి, మాకు ఆ ప్రాజెక్ట్ కు డబ్బులు ఇవ్వద్దు అంటే ఎలా ? అసలకే కేంద్రం గీసి గీసి డబ్బులు ఇస్తుంది. అలాంటిది, మనం ముందే వద్దు అంటే, ఎలా ? ఇలా అయితే అమరావతి సంగతి ఏంటి ? 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పరిస్థితి ఏంటి ? ప్రభుత్వాలు శాస్వతం, జగన్, చంద్రబాబు శాస్వతం కాదు. చంద్రబాబు చేసారు కాబట్టి నేను చెయ్యను అనే జగన్ ధోరణి, రాబోయే ప్రభుత్వాలు తీసుకుంటే, ప్రజలు ఎంతో నష్టపోతారు.

Advertisements

Latest Articles

Most Read