వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, మన రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలు చూస్తున్నాం. చంపటం, కొట్టటం, ఇళ్ళకు అడ్డుగా గోడలు కట్టటం, ఇలా అనేక విధాలుగా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారిని ఇబ్బంది పెడుతున్నారు. అయితే తెలంగాణా రాష్ట్రం కూడా మాదే, మా నాయకుడుకి, కేసీఆర్ స్నేహితుడు, మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నారో ఏమో కాని, వీరి దౌర్జన్యం తెలంగాణాకు కూడా పాకింది. కాని అక్కడ పోలీసులు మాత్రం, వీరి ఆటలు సాగనివ్వలేదు. నిన్న హైదరాబాద్ లో, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే కొడుకు, తనను అడ్డుకున్నందుకు, మాదాపూర్ లో, ఒక ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ను కాలుతో తన్ని, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. దీంతో అతని పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తా పై పూర్తీ వివరాలను, మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కృష్ణ అనే వ్యక్తి, నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఖానామెట్ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్ వద్ద డ్యూటీలో ఉన్నారు. విధి నిర్వహణలో భగంగా, ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ, హైటెక్స్ కమాన్ వైపు నుంచి వస్తున్న ట్రాఫిక్ ను కొద్ది సేపు ఆపారు. అయితే అటుగా వచ్చిన ఒక కారు మాత్రం నిబంధనలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండటంతో, కానిస్టేబుల్ కృష్ణ వారిని వారించి, కార్ ఆపారు. నా కారే ఆపుతావా, నీకు ఎంత ధైర్యం అంటూ, కారులోంచి దిగిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్‌భాను కుమారుడు సామినేని ప్రసాద్ కానిస్టేబుల్‌తో గొడవకు దిగారు.
కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకునే నువ్వు, నన్ను, నువ్వు నువ్వు అంటూ మర్యాద లేకుండా సంభోదిస్తావా అంటూ, కానిస్టేబుల్‌ను ప్రసాద్ పై బూతులు వర్షం కురిపించారు. ఈ గొడవ అంతా గమనిస్తూ, పక్కనే ఉన్న ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్‌రెడ్డి అక్కడి చేరుకొని ట్రాఫిక్ లో ఉన్నాం అని, ఇలా గొడవ చెయ్యద్దు అంటూ అతన్ని వారించాడు. అయినా సరే అతను వినకుండా, నేను అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకుని, నన్నే అవమానిస్తారా అంటూ వీరగం చేస్తూ ఉండటంతో, ఇక్కడ గొడవ వద్దని, స్టేషన్‌కు రావాల్సిందిగా ఇన్‌స్పెక్టర్ కోరారు. వైసిపీ ఎమ్మెల్యే కొడుకుని, నన్నే సేష్టన్‌కు రమ్మంటావా అంటూ విచక్షణ మరిచిపోయి, అధికార మదంతో, ఇన్‌స్పెక్టర్‌ను ఒక్క తోపు తోస్తూ, కాలుతో తన్ని అతన్ని కూడా బూతులు తిట్టాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు, వైసిపీ ఎమ్మెల్యే ఉదయభాను కొడుకుని అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతని పై, 332, 353, 506 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదుచేసి అరెస్ట్ చేసారు.