చంద్రబాబు ఎన్నికల చివరి రోజు, ఒక మాట చెప్పారు.. అది గుండెల లోతుల్లో నుంచి వచ్చిన మాట.. నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం, భవిషత్తు తరాల కలల రాజధాని అమరావతి శాశ్వతం, నిర్మాణం అవుతున్న పోలవరం శాశ్వతం, సీమలో పారే కృష్ణా నీళ్ళు శాశ్వతం, అలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అని. అయితే ప్రజలు మాత్రం, ఆయన మాటలు విశ్వసించకుండా, వేరే నిర్ణయం తీసుకున్నారు. అమరావతి, పోలవరం సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతం చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోవాలి. నిజంగానే చంద్రబాబు చెప్పినట్టు ఆయన శాశ్వతం కాదు కాని, ఆయన హయంలో నిర్మించినవి మాత్రం శాశ్వతం. అవే మన రాష్ట్రానికి పేరు తీసుకు వస్తాయి. ఈ రోజు చంద్రబాబు లేకపోయినా, ఆయన నిర్మించిన వ్యవస్థ పై, అటు కేంద్ర మంత్రులు, ఇటు క్రికెటర్లు కూడా మాట్లాడుతున్నారు.

sehwag 31072019 2

విషయం ఏమిటి అంటే, వారం రోజుల క్రిందట, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ లో, వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు, మేము మీ రాష్ట్రానికి ప్రత్యేకంగా, ఏమి పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేం, కాని మీ వైజాగ్ లో, ఉన్న ఏపి మెడ్ టెక్ జోన్ మాత్రం, అద్భుతంగా పని చేస్తుంది, దానికి ఏమైనా ప్రతిపాదనలతో రండి, మీకు సహకరిస్తాం అంటూ, చంద్రబాబు కష్టపడి కట్టిన ఏపి మెడ్ టెక్ జోన్ పై ప్రశంసలు కురిపించారు. అయితే, అదే విషయం పై, నిన్న, టీం ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేసారు. "Thank you Gadkari ji for this acknowledgement. Yes, with ecosystem like A.P. Med Tech Zone and health champions like Dr Jitendar Sharma, this dream of making India - a health superpower is possible" అంటూ ట్వీట్ చేసారు.

sehwag 31072019 3

ఇప్పుడు చంద్రబాబు అధికారంలో లేరు, కాని ఆయన స్థాపించిన వ్యవస్థల పై మాత్రం, అందరూ మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక రాజధానిగా పేరున్న విశాఖను, దేశంలోనే ఓకే మెడికల్‌ హబ్‌గా తీర్చి దిద్దాలనే, లక్ష్యంతో ఏపి మెడ్‌టెక్ జోన్‌ను, డిసెంబర్ నెలలో చంద్రబాబు ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వైద్య పరికరాల తయారీ పార్క్‌కు సాగర తీరం కేంద్రం కావడం విశేషం. పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇంజక్షన్ ల దగ్గర నుంచి, ఆస్పత్రులలో వినియోగించే అన్ని రకాల పరికరాలు ఇక్కడ తయారు చేస్తారు. ఇలా అన్నీ ఒకేచోట ఉండటం ఈ పార్కు ప్రత్యేకత. చంద్రబాబు అది ప్రారంభించిన టైంలో, దాదపుగా 80 కంపెనీలు అక్కడ ఉత్పత్తి ప్రారంభించాయి. ఇప్పుడు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు, దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళి, రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని ఆశిద్దాం.

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, జగన్ ప్రభుత్వం పై తీవ్రంగా స్పందించింది. మేము ఆదేశాలు ఇచ్చినా, మీరు పాటించటం లేదు అంటే, దాన్ని కోర్ట్ ధిక్కరణ కింద తీసుకోవాలా అని ప్రశ్నించింది. విద్యుత్ ఒప్పందాల పై సమీక్ష కేసులో, హైకోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది. పోయిన వారం, 40 కంపెనీలు , ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్ట్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. సోలార్, విండ్ ఉత్పత్తి చేసే విద్యుత్ ఒప్పందాలు సమీక్ష చేసేందుకు, ప్రభుత్వం ఒక హై పవర్ కమిటిని నియమించిన సంగతి తెలిసిందే. దీని పై, జీఓ నెంబర్ 63ని రిలీజ్ చేసారు. అయితే, ఈ 40 కంపెనీలు కోర్ట్ కి వెళ్ళటంతో, పోయిన వారం హైకోర్ట్, జీఓ నెంబర్ 63ని నాలుగు వారల పాటు సస్పెండ్ చేసింది. అంతే కాదు, ప్రభుత్వం ఈ కంపెనీలకు ఇచ్చిన నోటీసులు కూడా సస్పెండ్ చేసింది.

court 31072019 2

అయితే కోర్ట్ ఈ తీర్పు ఇచ్చిన తరువాత కూడా, ప్రభుత్వం, ఆ కంపెనీలను వేధిస్తుంది. దీంతో వారు మళ్ళీ కోర్ట్ కు వెళ్లారు. ఈ నేపధ్యంలోనే కోర్ట్, ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మేము నాలుగు వారాల పాటు, మీ నిర్ణయాన్ని సస్పెండ్ చేసాం, అయినా కూడా విద్యుత్‌ కొనుగోలు చేయబోమంటూ కొన్ని సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడమేంటని హై కోర్ట్, నిలదీసింది. ‘మీ ప్రభుత్వం చేస్తున్న చర్యలు మంచి ఉద్దేశంతో కూడినవేనా? విద్యుత్‌ ను మీ దగ్గర నుంచి కొనుగోలు చెయ్యం అని మీరు చెప్పడం కూడా మంచి ఉద్దేశంతో తీసుకున్న చర్యేనా? మేం ఉత్తర్వులు ఇచ్చిన తరువాత కూడా మీరు విద్యుత్‌ కొనుగోలు చేయబోమని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెప్పారు అంటే, ప్రాథమికంగా కోర్ట్ ఆదేశాల ఉల్లంఘనే’ అంటూ హై కోర్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

court 31072019 3

గతంలో ఎప్పుడైనా ఇలా విద్యుత కొనుగులు చెయ్యటం ఆపేశారు, చేస్తే ఎందుకు చేసారు, తదితర వివరాలు అన్నీ తమకు ఇవ్వాలని, సమగ్ర నివేదికలు తమకు సమర్పించాలని, న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావ్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, ఈ కేసు తీర్పును గురువారానికి వాయిదా వేసారు. మొన్న 40 కంపెనీలతో పాటు, ప్రభుత్వం తమను కూడా వేధిస్తుంది అంటూ, మిత్రా వాయు ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ, మంగళవారం కోర్ట్ లో కేసు వేసింది. దీంతో, ఆ జీఓ రాద్దు, నాలుగు వారాలు పాటు చేసింది, ఈ కంపెనీకి కూడా వర్తిస్తుంది అంటూ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. చంద్రబాబుని ఎలా అయినా ఇరికించాలి అనే ఉద్దేశంతో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే, ఆ ఒప్పందాల పై సమీక్ష మొదలు పెట్టారు. కేంద్రం వద్దు అంటున్నా, చివరకు కోర్ట్ కూడా అలా చెయ్యకూడదు అంటున్నా ప్రభుత్వం వినటం లేదు.

సోమవారం రాత్రి, హైదరాబాద్ లో, డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ పై, జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కొడుకు వెంకటకృష్ణ ప్రసాద్‌ దాడి చేసిన సంగతి తెలిసిందే. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ పై, కాలుతో తన్నారు అనే అభియోగాల పై, అతన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే ఆ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియోలో, వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను భార్య , ఆ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ ను, "కేసీఆర్ తో చెప్పి, నిన్ను సస్పెండ్ చేపిస్తా" అనే మాట మాట్లాడుతూ ఉండటం కనిపించింది. ఆ వీడియోలో , మరో మహిళ కూడా ఉన్నారు. నా చేయి పట్టుకున్నావ్ నువ్వు అంటూ, ఆ మహిళ అనటంతో, నేను మీ చేయి పట్టుకోలేదు అంటూ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ సమాధానం ఇస్తున్నారు.

udayabhanu 30072019 1 2

ఇదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను భార్య, ఆడవాళ్ళ చెయ్య పట్టుకున్నావ్ అని చెప్పి, "కేసీఆర్ తో చెప్పి, నిన్ను సస్పెండ్ చేపిస్తా" అంటూ వార్నింగ్ ఇప్పించారు. దానికి ఆ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ సమాధానం ఇస్తూ, చెప్పుకోండి మ్యాడం, నేనేమి తప్పు చెయ్యలా, చెప్పుకోండి అనే మాటలు వినిపించాయి. పూర్తీ వివరాల్లోకి వెళ్తే, హైదరాబద్ మాదాపూర్‌లోని ఖానామేట్‌ మీనాక్షి టవర్స్‌ దగ్గర, సోమవారం రాత్రి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో, నోవాటెల్‌ హోటల్‌ నుంచి మీనాక్షి టవర్స్‌ వైపు రాంగ్‌ రూట్‌లో వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కొడుకు, వెంకటకృష్ణప్రసాద్‌ వేగంగా కార్ నడుపుకుంటూ వచ్చారు. దీనిని గమనించిన కానిస్టేబుల్‌, ట్రాఫ్ఫిక్ ఇన్‌స్పెక్టర్‌ కారును ఆపారు.

udayabhanu 30072019 1 3

దీంతో ఆగ్రహానికి గురైన వెంకటకృష్ణప్రసాద్‌, నన్నే ఆపుతావా అంటూ, ట్రాఫిక్‌ పోలీసులను దుర్భషలాడుతూ ఇన్‌స్పెక్టర్‌ కాలుపై తన్నాడని, పోలీసులు తెలిపారు. అయితే అప్పటికే అక్కడ గుమికూడిన ప్రజలు, రాంగ్ రూట్ లో వచ్చింది కాక, మళ్ళీ ఎదురు పోలీసులనే కొడతారా అంటూ, రివర్స్ అయ్యారు. పోలీసులకు క్షమాపణ చెప్పాలని కృష్ణ ప్రసాద్ ను కోరారు. అయితే, తాను తాను వైసీపీ ఎమ్మెల్యే కొడుకునని బెదిరించారు. దీంతో ఎంత చెప్పినా తాను మాట వినకపోవటంతో, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, కృష్ణప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 304, 337, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. పోలీసులు వాదన ఇలా ఉంటే, ఈ రోజు బయటకు వచ్చిన వీడియోలో, మళ్ళీ పోలీసులనే ఎమ్మెల్యే భార్య బెదిరించటం, ఉద్యోగం పీకిస్తా అని చెప్పటంతో అందరూ అవాక్కయ్యారు. పూర్తీ వీడియో ఇక్కడ చూడవచ్చు https://www.facebook.com/TeluguRising.Tr/videos/437689783625790/

జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు, వాన్ పిక్ కేసులో A3గా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్ట్ వార్త కలకలం రేపుతుంది. యూరోప్ పర్యటనలో విహార యాత్రకు వెళ్ళిన నిమ్మగడ్డ, సెర్బియా దేశం వెళ్లారు. అయితే ఆయన్ను అక్కడ స్థానిక బెల్‌గ్రేడ్‌ పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ విషయంలో ఏమి జరిగింది అని ఆరా తీస్తే, సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన పై రస్‌ అల్‌ ఖైమా దేశంలో ఇప్పటికే కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాలోని వాన్‌పిక్‌ పోర్టు వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు అయ్యింది. దీంతో ఆ దేశం నిమ్మగడ్డ పై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. నిమ్మగడ్డను అరెస్ట్ చెయ్యాలి అన్నా, విచారణ చెయ్యాలి అన్నా, ఇక్కడ భారత దేశం అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం జగన్ హవా నడుస్తూ ఉండటంతో, ఇక్కడ పర్మిషన్ వచ్చే అవకాశం లేదు.

nimmagadda 31072019 2

అదీ కాక ఆయన పై, సీబీఐ, ఈడీలలో కేసులు ఉన్నాయి కాబట్టి, టెక్నికల్ గా కూడా, మన దేశం నిమ్మగడ్డను అప్పచెప్పే అవకాసం లేదు. అందుకే నిమ్మగడ్డను దేశం దాటితే అరెస్ట్ చేసే ప్లాన్ వేసారు. ఇందులో భాగంగానే, ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. అయితే రస్‌ అల్‌ ఖైమా పోలీసులు చాకచక్యంగా వ్యవహించారు. ఇక్కడ ఇంటర్‌పోల్‌ ద్వారా ముందుగానే రెడ్‌కార్నర్‌ నోటీసు బయటకు వస్తే నిమ్మగడ్డ అప్రమత్తమై విదేశీ పర్యటనలకు వచ్చే అవకాసం లేదు. అందుకే రస్‌ అల్‌ ఖైమా పోలీసులు చాలాకాలంగా నిమ్మగడ్డ పై, ఆయన విదేశీ పర్యటనల పై కన్నేసి ఉంచారు. ఆయన ఎప్పుడైతే యూరోప్ పర్యటనకు వస్తున్నారని తెలిసిందే, అప్పుడు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించి రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయించటంతో, నిమ్మగడ్డ బెల్‌గ్రేడ్‌ విమానాశ్రయంలో దిగీదిగగానే అక్కడి పోలీసులు అరెస్ట్ చేసారు.

nimmagadda 31072019 3

అయితే, నిమ్మగడ్డ అరెస్ట్ వార్త తెలియటంతో, వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. నిమ్మగడ్డ ప్రసాద్ ను వెంటనే విడుదల చెయ్యాలని, ఏకంగా 22 మంది ఎంపీలు లేఖ రాసి, సంతకాలు చేసి, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు అందించటం సంచలనంగా మారింది. ఆయన మీద మన దేశంలో కేసులు ఏమి లేవని చెప్పారు. అయితే నిన్న సాయంత్రమే, నిమ్మగడ్డకు ఈడీ రిలీఫ్ ఇచ్చింది. ఇది యాద్రుచికంగా జరిగిందా, లేక నిమ్మగడ్డకు మన దేశంలో ఏ కేసు లేదు అని, సెర్బియా పోలీసులతో వాదించటానికి ఇలా చేసారా అనేది తెలియాలి. మొత్తానికి విదేశీ పోలీసులు, మనోళ్ళు చేసిన ఘనకార్యానికి ట్రాప్ వేసి పట్టుకుంటుంటే, మన దేశంలో మాత్రం, అదే రోజు సాయంత్రానికి, అదే కేసు పై అభియోగాలు అన్నీ తప్పు అనే విధంగా తీర్పులు వస్తున్నాయి. నిజం ఏమిటో సెర్బియా పోలీసులే చెప్పాలి.

Advertisements

Latest Articles

Most Read