జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నంత వరకు, చంద్రబాబు పై లేని కుల పక్షపాతి ఇమేజ్ ను సృష్టించారు. నిజానికి చంద్రబాబు దగ్గరకు ఎవరైనా నా కులం, మీ కులం ఒక్కటే అంటే, నాకు ఈ పని చేసి పెట్టండి అని అంటే, వాళ్ళని ఆమడ దూరం కూర్చో పెడతారు. ఈ భయం వల్లే, ఎంతో మందికి సమర్ధత ఉన్నా వారిని పక్కన పడేసారు. అయినా సరే చంద్రబాబు కుల పక్షపాతి అని ప్రచారం చెయ్యటంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఒకానొక సందర్భంలో 38 డీఎస్పీలు తన సొంత కులం వారికే ఇచ్చారని జగన్ ప్రచారం చేసారు. ఇప్పటికీ ఆ పేర్లు ఏంటి అంటే మాత్రం చెప్పలేదు. కాని ప్రచారం చేసి, ప్రజలను నమ్మించటంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మాత్రం, నిజంగానే ఒకే కులానికి అధిక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
మొదట్లో అయుదుగురు డిప్యూటీ సియంలు అంటూ చెప్పి, వేరే వేరే కులాలకు ఇచ్చి, మంచి పని చేసారు అని అనిపించుకున్నారు. కాని తరువాత నుంచి అసలు సినిమా మొదలైంది. నిజానికి ఇది ఒక, డేంజర్ డ్యామేజింగ్ గేమ్. జగన్ మోహన్ రెడ్డి ఈ గేమ్ తెలిసి ఆడుతున్నారా లేక ఎవరూ గమనించటం లేదులే అనుకుంటున్నారా ఏమో కాని, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఒకే కులానికి అధిక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ప్రజలలో అభిప్రాయం ఏర్పడితే మాత్రం, ఇక ఆ పార్టీ అవుట్ అయినట్టే లెక్క. చంద్రబాబుకి ఫేక్ ప్రచారం చేస్తేనే టిడిపి పరిస్థితి ఇలా ఉంది, అలాంటిది జగన్ మోహన్ రెడ్డి, అందరూ చూస్తూ ఉండగా, ఒకే కులానికి పదవులు ఇస్తుంటే, ఇది నిజంగా డేంజర్ డ్యామేజింగ్ గేమ్ అనే చెప్పాలి. ఇది ఎలా సమర్ధించాలో తెలియని స్థితిలో వైసిపీ శ్రేణులు ఉన్నాయి. ఏదైతే తప్పు అని ప్రచారం చేసామో, అదే ఇప్పుడు జగన్ చేస్తున్నారని అంటున్నారు.
మచ్చుకు కొన్ని చూడండి , ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి గా కె. ధనుంజయ రెడ్డి ,ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి గా పి. కృష్ణ మోహన్ రెడ్డి ,ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి గా నాగేశ్వర రెడ్డి ,ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు గా అజేయకల్లం రెడ్డి ,తూడా ఛైర్మెన్ గా చెవిరెడ్డి. బాస్కర్ రెడ్డి ,టిటిడి ఎక్స్ ఆఫిసియో సభ్యులు గా చెవిరెడ్డి. బాస్కర్ రెడ్డి ,టిటిడి ఛైర్మెన్ గా వై. వి. సుబ్బారెడ్డి ,APIIC ఛైర్మెన్ గా రోజా రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సహాదారు గా సజ్జల రామక్రిష్ణా రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల సలహాదారు శైలజా. రామకృష్ణారెడ్డి , ఎపి భవన్ ప్రత్యేక ప్రతినిధి గా వి. విజయసాయి రెడ్డి , రాజ్యసభ పక్ష నేత గా వి. విజయసాయి రెడ్డి ,వైకాపా పార్లమెంటరి పార్టీ నేత గా వి. విజయసాయి రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గా వి. విజయసాయి రెడ్డి , ప్రభుత్వ క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సభ్యులు గా వి. విజయసాయి రెడ్డి , ఎయిమ్స్, మంగళగిరి డైరెక్టర్ గా వి. విజయసాయి రెడ్డి. , లోక్ సభ పక్ష నేత గా పెద్దిరెడ్డి. మిధున్ రెడ్డి ,లోక్ సభ ప్యానల్ స్పీకర్ గా పెద్దిరెడ్డి. మిధున్ రెడ్డి , రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సభ్యులు గా పెద్దిరెడ్డి. మిధున్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ గా గడికొట. శ్రీకాంత్ రెడ్డి , ప్రభుత్వ విప్ గా కాపు. రామచంద్రా రెడ్డి ,ప్రభుత్వ విప్ గా పిన్నేల్లి. రామక్రిష్ణా రెడ్డి ,ప్రభుత్వ విప్ గా గంగుల. ప్రభాకర్ రెడ్డి , రైతు సాధికార సంస్థ ఛైర్మెన్ గా వై. మదుసుదున్ రెడ్డి ,రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా చల్లా. మదుసుదున్ రెడ్డి , PKM అర్బన్ డెవలప్ మెంట్ ఆధారిటి ఛైర్మెన్ గా యం. సుబ్రమణ్యం రెడ్డి ,
రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పొన్నవొలు. సుధాకర్ రెడ్డి , రాష్ట్ర ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సలహాదారు గా వి. యన్. భరత్ రెడ్డి ,ఉన్నత విద్యా మండలి ఛైర్మెన్ గా కె. హేమచంద్రా రెడ్డి ,CRDA ఛైర్మెన్ గా అళ్ల రామకృష్ణా రెడ్డి , వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ యం. వి. ఎన్. నాగిరెడ్డి ,వ్యవసాయ మిషన్ సభ్యులు గా పి. రాఘవ రెడ్డి ,వ్యవసాయ మిషన్ సభ్యులు గా చంద్రశేఖర రెడ్డి ,నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ ఛైర్మెన్ కోటంరెడ్డి. శ్రీనివాసులు రెడ్డి ,రాష్ట్ర ఐటి సలహాదారు గా కె. రాజశేఖర రెడ్డి ,రాష్ట్ర ఐటి సలహాదారు గా శ్రీనాధ్ దేవి రెడ్డి ,ఆంధ్రా యూనివర్సిటీ విసి గా ప్రసాద్ రెడ్డి ,ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా బైరాగి రెడ్డి ,ఆంధ్రా యూనివర్సిటీ, సీటిసీ డీన్ గా పాండురంగా రెడ్డి ,రాజీవ్ గాంధీ యునివర్సిటి విసి గా కె. సి. రెడ్డి ,విండ్ & సోలార్ పవర్ సంప్రదింపుల కమిటీ సభ్యులు గా బి. రాజేంద్రనాధ్ రెడ్డి ,విండ్ & సోలార్ పవర్ సంప్రదింపుల కమిటీ సభ్యులు గా బి. శ్రీనివాసులు రెడ్డి ,విండ్ & సోలార్ పవన్ సంప్రదింపుల కమిటీ సభ్యులు గా డి. కృష్ణ గోపాల్ రెడ్డి , క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు గా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ,క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సభ్యులు గా వేమిరెడ్డి. ప్రభాకర్ రెడ్డి ,క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు గా మేకపాటి. గౌతమ్ రెడ్డి ,రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ సలహాదారు గా జె. విద్యాసాగర్ రెడ్డి. , రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది గా కాసా. జగన్ మోహన్ రెడ్డి. ,రాష్ట్ర వైద్య సంస్కరణల కమిటీ సభ్యులు భూమిరెడ్డి. చంద్రశేఖర రెడ్డి. ,రాష్ట్ర వైద్య సంస్కరణల కమిటీ సభ్యులు బి. సాంబశివా రెడ్డి. ,రాష్ట్ర వైద్య సంస్కరణల కమిటీ సభ్యులు కసిరెడ్డి. సతీష్ కుమార్ రెడ్డి. ,రాయలసీమ యూనివర్సిటీ విసి సివీ కృష్ణా రెడ్డి. ,శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మళ్లికార్జున రెడ్డి. ,శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీధర్ రెడ్డి. , SVBC ఛైర్మెన్ పృథ్వీరాజ్ బాలి రెడ్డి. , ఏవియేషన్ ఆడ్వజైర్ వి. యన్. భరత్ రెడ్డి.