ఒక పక్క రాష్ట్రంలో చంద్రబాబు హయంలో చేసిన విద్యుత్ పీపీఏల పై జగన్ హడావిడి చేస్తూ, తన సొంత కంపెనీ సండుర్ పవర్ లో మాత్రం, ఎలా లాభాలో చేసుకుంటున్నారో, ఈ రోజు ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్ని ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టారు. ఒక పక్క విద్యుత్ రంగంలో ఒప్పందాలు అన్నీ పధ్ధతి ప్రకారమే జరిగాయని, ఎక్కడా అవినీతి లేదని కేంద్రం ఒకటికి రెండు సార్లు, అన్ని వివరాలతో లేఖ రాసినా, ఎక్కడ ప్రజల్లో పరువు పోతుందో అని, జగన్ మోహన్ రెడ్డి ఏకంగా అధికారులతో, ప్రెస్ మీట్ పెట్టించి, మా పై బురద చల్లి, అబద్ధాలు ఆడించారని చంద్రబాబు అన్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు, విద్యుత్ శాఖా మంత్రి కాని, తదితరులు క్లారిటీ ఇస్తారు కాని, ఇక్కడ ఏకంగా అధికారుల చేతే ప్రెస్ మీట్ పెట్టి, రాజకీయ విమర్శలు చేపించారని చంద్రబాబు అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి కర్ణాటకలో రెండు పవర్ ప్లాంట్ లు ఉన్నాయని, సండుర్ పవర్ కి సంబంధించి, అక్కడ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో, పవన విద్యుత్, యూనిట్ రూ.4.50 చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. కర్ణాటకతో పోలిస్తే మనకు ఇక్కడ పవన్ విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబాట్టి, రెగులేటరీ కమిషన్, యూనిట్ ధర రూ.4.83గా నిర్ణయించింది అన్నారు. దీంతో అవినీతి ఏంటో జగన్ మోహన్ రెడ్డికే తెలియాలని చంద్రబాబు అన్నారు. ధరలను నిర్ణయించటంలో ప్రభుత్వం ప్రమేయం చాలా తక్కువుగా ఉంటుందన్న విషయం పవర్ ప్లాంట్ ఉన్న జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. 2004లో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సియంగా అవ్వగానే ఇలాగే విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయాని హడావిడి చేసి, ఏమి నిరూపించలేదని స్పష్టం చేసారు.
సంప్రదాయేతర ఇంధనాన్ని 5 శాతానికి మించి తీసుకోకూడదు అంటూ నిన్న రాష్ట్ర అధికారుల చేత తప్పుడు సమాచారం ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టించారని, ఆ అధికారులే దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. వాళ్ళు ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. కర్ణాటకలో తన కంపెనీకి ఎక్కువ కొనుక్కుని, లాభం చేసుకుని, ఇక్కడ మాత్రం అవినీతి అంటున్నారని, మరి మీ కంపెనీ అదే తక్కువ రేట్ కు ఎందుకు చెయ్యటం లేదని ప్రశ్నించారు. ఇక్కడ అవినీతి అనే ప్రశ్నే ఉండదని, అంతా కేంద్రం చేతులలో ఉంటుందని, వాళ్ళు రెండు సార్లు ఉత్తరం రాసినా, మా పై ఎదో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, మీ అబద్ధాలను ఎప్పటికప్పుడు తిప్పికొడతామని చంద్రబాబు స్పష్టం చేసారు.