పింఛను మూడు వేలు చేస్తామని మూడు విడతల్లో పెంచిన 250 పింఛను అందినంత సేపు సంతోషం నిలవలేదు. దొంగవో, మంచివో నోట్లు పోల్చలేని వృద్ధులు, నిర‌క్ష‌రాస్యులు, దివ్యాంగుల‌ను మోస‌గించిన ఉదంతం క‌ల‌క‌లం రేపుతోంది. జ‌న‌వ‌రి 1వ తేదీ ఉద‌యాన్నే పింఛ‌న్లు ప్ర‌కాశం జిల్లా య‌ర్ర‌గొండ‌పాలెం మండ‌లం నరసాయపాలెంలో పంపిణీ ఆరంభించారు. 2750 పింఛ‌నులో మూడు 500 నోట్లు దొంగ నోట్లు కావ‌డంతో ల‌బ్దిదారులు ల‌బోదిబోమంటున్నారు. పింఛ‌ను అందిన ముస‌లోళ్లు, విక‌లాంగులు ఆ నోట్ల‌ను షాపుల‌లో కొనుగోలు చేయ‌డానికి, బాకీలు తీర్చ‌డానికి ఉప‌యోగిస్తే దొంగ‌నోట్లు అంటూ వారు తిర‌స్క‌రించారు. దీంతో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. దాదాపు 24 మందికి ఈ దొంగ‌నోట్లు ఇచ్చార‌ని తేలింది. ఒక్క ఈ ఊర్లోనే ఇలా పింఛ‌నులో దొంగ‌నోట్లు ఇచ్చారా? ఇంకెక్క‌డికైనా ఇలాంటి పునరావృతం అయ్యాయా అనేది తేలాల్సి ఉంది. కొత్త సంవ‌త్స‌రం పింఛ‌ను అందింద‌న్న సంతోషం, అవి దొంగ‌నోట్లు అని  తేల‌డంతో పెన్ష‌న‌ర్లు  తీవ్ర ఆందోళ‌న చెందారు.

గుంటూరు ఘటనకు జగన్ ప్రభుత్వ వైఫల్యమే కారణం అని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసుల అనుమతితో ఉయ్యూరు ఫౌండేషన్ సభ ఏర్పాటు చేసిందని, వేలాది మంది జనం వచ్చే ప్రాంతంలో వంద మంది పోలీసులు కూడా లేరని ఆయన అన్నారు. తోపులాట సమయంలో పోలీసులు సరిగా స్పందించ లేదని, ఘటన జరిగిన వెంటనే మంత్రులు క్యూ కట్టడం అనుమానాలకు తావిస్తోందని, బ్లేమ్ గేమ్ కు వైసీపీ ప్రయత్నిస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. గుంటూరు వ‌స్త్రాల పంపిణీలో తోపులాట‌లో ముగ్గురు మృతి వెనుక భారీ కుట్ర‌కోణం ఉంద‌నే అనుమానాలు టిడిపి వ్యక్తం చేస్తుంది. టిడిపి అధినేత ఎక్క‌డికెళితే అక్క‌డ జ‌న‌సంద్ర‌మ‌వుతోంది. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌భ‌ల‌కు ప‌థ‌కాలు ర‌ద్దు చేస్తామ‌ని బెదిరిస్తే వ‌స్తున్న జ‌నం బారికేడ్లు దూకి పారిపోతున్నారు. చంద్ర‌బాబుపై దా-డికి నందిగామ‌లో ప్ర‌య‌త్నించారు. సీఎస్వోకి గాయ‌మైంది. అయినా భ‌ద్ర‌తా ఏర్పాట్లు మార‌లేదు. రాయ‌ల‌సీమ‌లో చంద్ర‌బాబు కాన్వాయ్‌కి అడ్డంగా వైసీపీ పేటీఎం బ్యాచ్ ప‌డింది. అయినా పోలీసులు తీరుమార‌లేదు. కందుకూరు ఘ‌ట‌న డ్రోన్ షాట్ల కోస‌మంటూ వైఎస్ జ‌గ‌న్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు గుంటూరు వికాస్ న‌గ‌ర్లో భారీ బ‌హిరంగ ప్ర‌దేశంలో ఎటువంటి తొక్కిస‌లాటకి ఆస్కార‌మే లేని చోట తోపులాట మెరుపువేగంతో ఎలా మొద‌లైంది? అని టిడిపి ప్రశ్నిస్తుంది. కందుకూరు ఘ‌ట‌న త‌రువాత పోలీసులు చంద్ర‌బాబు స‌భ‌కు అద‌నంగా తీసుకున్న భ‌ద్ర‌తా చ‌ర్య‌లు లేక‌పోవ‌డ‌మే కార‌ణం అని ఆరోపిస్తుంది. కందుకూరు ఘ‌ట‌న‌పై రెండు రోజుల త‌రువాత స్పందించారు సీఎం జ‌గ‌న్‌రెడ్డి. గుంటూరు ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు క్ష‌ణాల్లో స్పందించారు.

ఘ‌ట‌నా స్థ‌లానికి, జీజీహెచ్‌కి క్యూ క‌ట్టేశారు. ఈ తొక్కిస‌లాట జ‌రుగుతుంద‌ని వీరికి ముందే తెలుసా? అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉయ్యూరు ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ అనే స్వ‌చ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకున్న కొత్త దుస్తులు, నిత్యావ‌స‌రాల పంపిణీ కార్య‌క్ర‌మం ఇది. దీనికి చంద్ర‌బాబుని ముఖ్యఅతిథిగా పిలిచారు. తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధంలేనిది ఈ కార్య‌క్ర‌మం. దీనిని టిడిపి ముడిపెడుతూ వైసీపీ ఆరోప‌ణ‌లు చేయ‌డం వెనుక కుట్ర‌కోణం ఉంద‌నే అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. చంద్ర‌బాబు సాయంత్రం 5.10 గంట‌ల‌కు వికాస్ న‌గ‌ర్ స‌భాప్రాంగ‌ణానికి చేరుకున్నారు. ఈ సువిశాల‌మైన స్థ‌లంలో ఎటువంటి తోపులాట లేదు. 6.10 చంద్ర‌బాబు తిరిగి వెళ్లారు. అప్ప‌టివ‌ర‌కూ ఎటువంటి అల‌జ‌డీ లేదు. 6.45కి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే బ్లూ మీడియా క్ష‌ణాల్లో చంద్ర‌బాబు స‌భ‌లో తొక్కిస‌లాట అంటూ స్క్రోలింగ్ వేశాయి. చంద్ర‌బాబు వెళ్లిన దాదాపు 40 నిమిషాల త‌రువాత ఘ‌ట‌న జ‌రిగినా..చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడే అన్న‌ట్టు స్క్రోలింగ్/బ్రేకింగ్ ఊద‌ర‌గొట్టాయి.. తోపులాట 6.45కి జ‌రిగితే...వైసీపీ సోష‌ల్మీడియాలో సంఘ‌ట‌న బాధితుల బైట్లు క్ష‌ణాల్లో ఎలా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి అనేది కూడా టిడిపి అనుమానంగా ఉంది. వైసీపీ సోష‌ల్మీడియా మొత్తం గుంటూరులో ముగ్గురు మ‌హిళ‌ల మృతి చెందిన నిమిషాల్లో యూనిఫాంగా ఒకే కంటెంట్ షేర్ చేస్తోంది.. అంటే వైసీపీలో అన్ని విభాగాల‌కు గుంటూరులో తోపులాట జ‌ర‌గుతుంద‌ని ముందే తెలుసు అని టిడిపి ప్రశ్నిస్తుంది.

నెల్లూరు జిల్లాలో టిడిపి జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు ప‌ర్య‌ట‌న ముగిసింది. వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో ఎంతో ఘ‌నంగా ప‌ర్య‌ట‌న కందుకూరుతో ఆరంభం అయ్యింది. ఆ స‌భలో నెల‌కొన్న విషాదం టిడిపికి ఒక్క‌సారిగా కుదుపులా తాకింది. ట్ర‌బుల్ షూట‌ర్‌, అప‌ర‌చాణ‌క్యుడుగా పేరుగాంచిన చంద్ర‌బాబు, తెలుగుదేశం కుటుంబ‌స‌భ్యుల మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌పోయారు. స‌భ ప్రారంభంలో అంద‌రినీ అలెర్ట్ చేసినా ఆప‌ద వ‌చ్చింది. ఇప్పుడు ఏం ఆలోచించినా లాభంలేద‌ని, ఎనిమిది మంది ప్రాణాలు పోయాయ‌ని, ఆ కుటుంబాల‌ను ఆదుకోవ‌డం ఒక్క‌టే త‌న ముందున్న ల‌క్ష్యంగా చంద్ర‌బాబు ముందుకు క‌దిలారు. సంఘ‌ట‌న స‌మాచారం తెలిసిన వెంటనే మీటింగ్ ఆపేశారు. హుటాహుటిన‌ హాస్పిటల్ లు వెళ్లారు. బాధితుల‌కు అందుతున్న వైద్యం, కావాల్సిన స‌హాయం స‌మ‌కూర్చారు. పార్టీ నుంచి, టిడిపి నేత‌ల నుంచి ఒక్కో మృతుని కుటుంబానికి దాదాపు 30 ల‌క్ష‌ల వ‌ర‌కూ సాయం ప్ర‌క‌టించారు. మృతుల అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు మ‌నుషుల్ని తీసుకురాలేను కానీ, వారు చేయాల్సిన బాధ్య‌త‌ల‌న్నీ ఇంటి పెద్ద‌గా నెర‌వేరుస్తాన‌ని హామీ ఇచ్చారు. ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌లోనే బాధితుల అంద‌రి ఇళ్ల‌కీ వెళ్లి ఓదార్చి వ‌చ్చారు. వైసీపీ చిల్ల‌ర ఆరోప‌ణ‌లు ప‌ట్టించుకోకుండా బాధితుల‌ని ఆదుకోవ‌డంపైనే దృష్టి పెట్టారు. త‌న‌కు తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు కుటుంబ‌స‌భ్యులే అనే సందేశం పంపారు. జిల్లాలో ఒక్క టిడిపి ప్ర‌జాప్ర‌తినిధీ లేరు. ఓ వైపు ప్ర‌భుత్వం, మ‌రోవైపు స‌ర్కారు పోలీసులు కుతంత్రాలు ప‌న్నుతున్నా..స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌తో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించారు.

 

తెలుగుదేశం పార్టీ అధినేత, నారా చంద్ర‌బాబు నాయుడు, రాష్ట్రంలో ఎక్కడకి వెళ్ళినా, ఆ స‌భ‌ల‌కు జ‌నం పోటెత్తుతున్నారు. రాయలసీమ అయినా, ఉత్తరాంధ్ర అయినా, దక్షిణ కోస్తా అయినా, ఎటు వెళ్ళినా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చంద్రబాబు సభలకు, ఈ ట్రెండ్ గతంలో లేదు. ఇప్పుడు మాత్రం, ఎందుకు ప్రజలు ఇంతలా ఆదరిస్తున్నారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న విశ్లేషణ. చంద్రబాబుని 40 ఏళ్ళకు పైగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. మరి ఎప్పుడూ లేనిది, ఇప్పుడు ఇలా ఎందుకు వస్తున్నారు ? చంద్రబాబుకి పొలిటికల్ ఇమేజ్ తప్ప గ్లామర్ లేదు. మంచి వక్త కూడా కాదు. కానీ, ప్రజలు ఇప్పుడు కొత్తగా ఇంతలా ఆదరిస్తున్నారు అంటే, తాము తప్పు చేసాం అని భావిస్తున్నారా ? జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న విధ్వంసం ఇప్పుడిప్పుడే ప్రజలు అర్ధం చేసుకుంటున్నారా ? ఈ విధ్వంసం నుంచి బయట పడేసిది చంద్రబాబు మాత్రమే అనే అంచనాకు వచ్చారా ? అందుకేనా చంద్రబాబు సభలకు ఈ జన ప్రభంజనం ? నిజానికి ప్రజలు గత 3.5 ఏళ్ళ నుంచి జగన్ పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా రెండేళ్ళు పాటు రావటం, ఆ తరువాత ప్రతిపక్షం కూడా ప్రజల్లో లేకపోవటంతో, ప్రజలు తమ బాధలు చెప్పుకునే నాయకుడి కోసం ఎదురు చూసారు. సొంతగా ఉద్యమాలు చేసి, గొంతెత్తితే, ఎత్తి లోపల వేస్తున్న విధానం చూసి, ప్రజలు వెనకడుగు వేసిన సమయంలో, చంద్రబాబు బయటకు రావటం మొదలు పెట్టారు. చంద్రబాబు కూడా తన స్టైల్ మార్చి ప్రసంగాలు చేస్తున్నారు. కర్నూల్ లో మొదలైన ఈ ప్రజా ఉప్పెన, గోదారి నుంచి గుంటూరు వరకు చేరి, ఉత్తరాంధ్రని ఊపేసింది. మరో పక్క జగన్ మోహన్ రెడ్డి పెట్టిన భయం ప్రజల్లో పోతుంది. పోలీసులు మీద భయం కూడా పోతుంది. చంద్రబాబు మళ్ళీ వచ్చేస్తున్నాడు అనే వాతావరణం ప్రజల్లో రావటంతో, చంద్రబాబు సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. అందుకే 50 ఏళ్ళుగా ప్రజల మధ్య ఉన్నా, చంద్రబాబు అంటే ఇప్పటికే ఆ క్రేజ్.

చంద్రబాబు విజన్, చంద్రబాబు సమర్ధత, చంద్రబాబు కష్టపడే తత్త్వం, ఇవన్నీ ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు. చేసిన తప్పు దిద్దుకుంటాం అనే అభిప్రాయంతో ఉన్నారు కనుకే, చంద్రబాబుకు ఆ ఆదరణ. గత 10 ఏళ్ళుగా చంద్రబాబు ఇమేజ్ పై, వైసీపీ చెప్పిన విషం కూడా, నెమ్మదిగా తొలగి పోతుంది. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఇమేజ్ ప్రజల్లో రోజు రోజుకీ బల పడుతుంది. దీంతో ప్రజల్లో భరోసా పెరిగింది. మరో పక్క, చంద్రబాబు సభలకు వస్తున్న స్పందన చూసి, జగన్ కూడా అక్కడ ఇంచార్జ్ లను మార్చే పరిస్థితి వచ్చింది అంటే, చంద్రబాబు ఇంపాక్ట్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికలకు మరో ఏడాది పైగా సమయం మిగిలి ఉండగానే, చంద్రబాబు సృష్టిస్తున్న ఈ సునామీ, వైసీపీని ఎలా ముంచేయ బోతుందో మరి. 2022లో చంద్రబాబు చూపించింది ట్రైలర్ మాత్రమే అని, 2023లో పిక్చర్ అభీ బాకీ హై అంటున్నారు టిడిపి నేతలు.

Advertisements

Latest Articles

Most Read