జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు నుంచి తాడేపల్లిలోని తన నివాసంలో, ప్రతి రోజు ఉదయం ప్రజా దర్భార్ నిర్వహిస్తారని చెప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయం పై గత వారం రోజులుగా, అన్ని వార్తా పత్రికల్లో, ఛానెల్స్ లో అతి ప్రచారం చేసారు. అన్ని జిల్లాల్లో కూడా, జగన్ మోహన్ రెడ్డి, ప్రతి రోజు వినతులు స్వీకరిస్తారాని, సమస్యలు ఆయనతోనే డైరెక్ట్ గా చెప్పుకోవచ్చు అంటూ ప్రచారం చేసారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున వివధ జిల్లాల నుంచి తాడేపల్లి బాట పట్టారు. కాని నిన్న సడన్ గా, ప్రజా దర్భార్ కార్యక్రమం నెల రోజులు పాటు వాయిదా వేస్తున్నాం అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ సమాచారం మాత్రం ప్రజలకు చేరలేదు. దీంతో వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు, ప్రజా దర్బార్ కార్యక్రమం ఉందేమో అనే అంచనాలతోనే తాడేపల్లి వచ్చారు. కాని ఇక్కడకు వచ్చిన తరువాత విషయం తెలుసుకున్నారు. ఎక్కడో రాష్ట్రం మూల అటు అనంతపురం నుంచి, ఇటు శ్రీకాకుళం దాకా ప్రజలు తాడేపల్లి చేరుకున్నారు.

ఈ నేపధ్యంలో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రజా దర్బార్ వాయిదా పడిందని చెప్పారు. అయితే పెద్ద ఎత్తున ప్రజలు రావటంతో, జగన్ కొంత మందిని అయినా కలవాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే ప్రజలు ఎక్కువ అవ్వటం, పోలీసులు బ్యారికేడ్ లు పెట్టటంతో, ప్రజలు కిక్కిరిసి పోయి ఉన్నారు. అయితే, జగన్ వద్దకు కొంత మందినే అనుమతిస్తారని సమాచారం రావటంతో, ఒక్కసారిగా గేటు దగ్గర ప్రజలు లోపలకి వెళ్ళే ప్రయత్నం చెయ్యటంతో, తోపులాట జరిగింది. ఈ తోక్కిసాలాటలో, అనంతపురం జిల్లాకు చెందిన మహిళ విశ్రాంతమ్మ స్పృహ తప్పిపడి పోయింది. వెంటనే ఆమెకు ప్రాధమిక చికిత్స చేసారు. అయితే ఇంకా రేకులు వెయ్యటం, బిల్డింగ్ లు రెడీ కాకపోవటంతోనే ప్రజా దర్బార్ వాయిదా పడినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరి ఏకంగా నెల రోజులు వాయిదా వేసేంత పని ఉంటే, ముందుగానే ప్రభుత్వం ఎందుకు హడావిడి చేసిందని, ఎక్కడెక్కడ నుంచో వచ్చిన ప్రజలను ఇబ్బంది పెట్టటం ఎందుకని ప్రజలు వాపోతున్నారు.

ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయిన తరువాత, ఆయన పై కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కూడా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు, చంద్రబాబుని ఎలా అయినా 2 ఏళ్ళలో జైలుకు పంపిస్తాం అంటున్నారు. ఇంకా చంద్రబాబే అధికారంలో ఉన్నారన్నట్టు, ప్రతి రోజు చంద్రబాబు పైనే విమర్శలు చేస్తున్నారు. ఆటు కేంద్రం సంగతి అలా ఉంటే, ఇటు జగన్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. కాకపోతే వాళ్ళు 2 ఏళ్ళు అంటుంటే, జగన్ మాత్రం, 45 రోజుల్లో తేలి పోవాలి అంటున్నారు. చంద్రబాబుని జైలుకు పంపటం కోసం, ఏకంగా ఒక క్యాబినెట్ సబ్-కమిటీని వేసారు. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ చంద్రబాబుని ఏ ఏ విషయాలో ఇరికించాలి, ఎలా ఇరికించాలి అనే విషయం పై మాట్లాడటానికి నిన్న జగన్ ను కలిసారు. 45 రోజుల్లోనే అన్ని విషయాలు లోతుగా చూసి, చంద్రబాబు అవినీతి చేసారనే ఆధారాలు బయట పెట్టాలని జగన్ ఆదేశించారు.

చంద్రబాబు ప్రభుత్వం చేసిన 30 అంశాల పై గట్టిగా ఫోకస్ పెట్టాలని, క్యాబినెట్ సబ్ కమిటీకి జగన్ ఆదేశించారు. పోలవరం, సీఆర్‌డీఏ, మైనింగ్ లీజులు, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రారంభించిన వివధ పధకాలు, అన్నీ సమీక్ష చెయ్యాలని, దీని కోసం అధికారులను కూడా కలిసి, అన్ని వివరాలు తీసుకోవాలని జగన్ కోరారు. ప్రతి 5 రోజులుకు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయ్యి, చంద్రబాబుని ఎలా ఇరికించాలి అనే విషయం పై చర్చిస్తారు. అయితే ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 40 రోజులు అవుతున్నా, చంద్రబాబు పై ఒక్క అవినీతి ఆరోపణ కూడా ప్రూవ్ చెయ్యక పోవటం పై జగన్ అసహనంగా ఉన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు కూడా ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి బయట పడితే సన్మానిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు, ఎవరూ సరైన ఆధారాలు బయట పెట్టలేదు. ఇది ఇలా ఉంటే, తెలుగుదేశం నేతలు మాత్రం, చంద్రబాబుని ఏమి చెయ్యాలేరని, అంటున్నారు. సాక్షాత్తు నరేంద్ర మోడీ, స్పెషల్ టీం లు పెట్టి, చంద్రబాబు పై గత ఏడాదిగా ఫోకస్ పెట్టారని, ఎక్కడా వాళ్ళకు అవినీతి దొరకలేదని, ఇక్కడ జగన్ కూడా చేసేది ఏమి ఉండదని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో, విజయనిర్మల కుటుంబసభ్యులను పరామర్శించారు. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ కలిసి, సూపర్ స్టార్ కృష్ణ నివాసానికి వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయనిర్మలకు నివాళులు అర్పించారు. చంద్రబాబు వచ్చే సరికి, అక్కడే ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. కృష్ణ కుమారుడు నరేష్, వీరిని వెంట పెట్టుకుని, కృష్ణ దగ్గరకు తీసుకువెళ్ళారు. అక్కడే హీరో మహేష్ బాబు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. కృష్ణ ని పరామర్శించి, ధైర్యం చెప్పారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, విజయనిర్మల గారు ఒక ఆశయం కోసం జీవించిన మహిళ అని, ఆమె ఆశయాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

విజయనిర్మల గారు, ఏదైనా పని అనుకుంటే, దాని కోసం ఎంత కష్టపడైనా సాధించే వారని అన్నారు. విజయ నిర్మలకు తెలుగుదేశం పార్టీతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తుకున్నారు. 1999 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా కైకలూరు నుంచి పోటీచేశారని గుర్తు చేసారు. తరువాత రాజకీయాలకు దూరం అయినా, కులుస్తూనే ఉండేవారని, ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని చంద్రబాబు గుర్తు చేసారు. ఒక చిన్న గాయం కారణంగా, విజయనిర్మల గారు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, కృష్ణ గారు చెప్పారని, ఇది విధిరాత కాక మరేమిటి? అంటూ నిర్వేదం ప్రదర్శించారు చంద్రబాబు. కృష్ణ గారికి విజయనిర్మల గారు, పెద్ద బలం అని, ఆయనకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ వచ్చారని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని చెప్పారు. కష్టకాలంలో కృష్ణ గారు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా అని అన్నారు.

మన రాష్ట్రంలో "ఆ రెండు పత్రికలు" అంటూ వైఎస్ఆర్, జగన్ హయంలో పాపులర్ అయిన మాటలు తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధాని మోడీ కూడా, ఆ మూడు పత్రికలు అంటూ, వాటి పై కక్ష పెంచుకున్నారని, జాతీయ మీడియాలో కధనాలు వచ్చాయి. ఇప్పటికే అన్ని వ్యవస్థలు మోడీ, అమిత్ షా చెప్పినట్టు ఆడుతున్నాయనే విమర్శలు నడుమ, మోడీ ప్రశ్నిస్తున్న అతి కొద్ది మంది మీడియాను కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక కధనాలు రాసినా, ప్రసారం చేసినా ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరికలు వస్తున్నాయి. రెండో సారి అధికారంలోకి వచ్చిన మోడీ, రావటంతోనే మూడు పెద్ద పత్రికల పై కక్ష సాధింపు మొదలు పెట్టారు. దేశంలో బాగా పేరు ఉన్న పత్రికలైన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో, ది హిందూ, ది టెలిగ్రాఫ్‌ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ ఇచ్చే ప్రకటనలను మోడీ నిలిపేశారు. పత్రికలకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉండే ప్రకటనలను నిలిపివేసి, ఆ సంస్థలు ఆర్దికంగా ఇబ్బంది పడేలా చేస్తున్నారు.

నెలకు 2.60 లక్షల సర్క్యులేషన్‌ ఉంటున్న టైమ్స్‌ గ్రూపుకు ప్రకటనలను పూర్తిగా నిలుపుదల చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ది టెలిగ్రాఫ్‌తోపాటు, ది హిందూ పత్రికకు కూడా ఆరు నెలలపాటు ప్రకటనలు ఆపమని ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ది హిందూ పత్రిక రాఫెల్ పై తన పత్రికలో పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం ప్రభుత్వం మాత్రం, ఈ వార్తలను ఖండిస్తుంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఎకనామిక్స్‌ టైమ్స్‌ పత్రికలలో వచ్చిన కొన్ని వార్తల పై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని, అందుకే యాడ్స్‌ను నిలిపివేసినట్లు కోల్‌మన్‌ అండ్‌ కో ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీరు పై మాత్రం, ఆ పత్రికలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇలా కక్ష పూరిత విధానాలు అవలంభిస్తే, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆరోపిస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read