చంద్రబాబు మీద కక్షతో, ఆయన తన కార్యక్రమాలకు ప్రజావేదిక ఇవ్వాలి అని కోరాటంతో, రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని ప్రజా వేదిక కూల్చేసిన సంగతి తెలిసిందే. అయితే, తరువాత చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూడా కూల్చేయటానికి పధకం రచించారు. దీని కోసం, కరకట్ట పై ఉన్న నివాసాలు అన్నిటికీ నోటీసులు ఇచ్చారు. అయితే ఇవన్నీ దాదాపుగా రాజశేఖర్ రెడ్డి సియంగా ఉండగా అనుమతులు ఇచ్చినవే. అప్పటికి నదికి 100 మీటర్ల దాక ఏ కట్టడం కట్టకూడదు అనే చట్టం లేదు. అయితే ఇవన్నీ పక్కన పెట్టి, చంద్రబాబుని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే, కరకట్ట పై ఉన్న బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ కి కూడా నోటీసులు పంపించారు. అయితే గోకరాజు మాత్రం, నోటీస్ లను లైట్ తీసుకున్నారు. ఆయనకు ఎక్కడ స్విచ్ వేస్తె, ఎక్కడ లైట్ వేలుగుతుందో తెలిసు కాబట్టి, ప్రభుత్వం తనని ఏమి చెయ్యలేదు అనే ధీమాతో ఉన్నారు. అంతే కాదు, ఆయన ఈ నోటీసుల పై స్పందించిన తీరు మరీ వెరైటీగా ఉంది.

ఆయన స్పందన చూసి ప్రజలు కూడా అవాక్కయ్యారు. గోకరాజు గంగరాజు స్పందిస్తూ, కరకట్ట పై తాము ఏమి ఆక్రమించుకోలేదని, కృష్ణా నదే మా భూములను ఆక్రమించిందని వెరైటీగా స్పందించారు. కరకట్ట పై ఉన్న భూములను కృష్ణా నదే కబ్జా చేసిందని గోకరాజు చేసిన వ్యాఖ్యలతో ప్రజలు అవాక్కయ్యారు. అయితే తన గెస్ట్‌హౌస్‌లో కొంత భూమి అక్రమమేనని గోకరాజు అంగీకరించారు. తన గెస్ట్ హౌస్ లో ఉన్న ఒక భవనానికి ఉడా అనుమనుతులు ఉన్నాయ అన్నారు. కొద్ది కాలం క్రితం నిర్మించిన భవనానికి అనుమతులు లేవని, అనుమతి కోరినా మంజూరు కాలేదని అన్నారు. తనకు కృష్ణా నది లోపల కూడా భూమి ఉందని, వరదలు వచ్చిన ప్రతీ సారి కొంత భూమి పోతూ వచ్చిందని చెప్పారు. ప్రజా వేదికను కూల్చినట్టు, అన్నీ కుల్చాలంటే, రాష్ట్రంలో నదుల వెంట కొన్ని వేలు బిల్డింగ్స్ ఉంటాయని, అవన్నీ కూల్చిన తరువాత తన పై కూడా ఇష్టం వచ్చిన చర్యలు తీసుకోవచ్చని అన్నారు. తాను మామూలు గెస్ట్ హౌస్ కట్టుకున్నాని, అదేమీ విలాసవంతమైన భవనం కాదని అన్నారు. చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేస్తారాని, దానికి ఎదో ఒకటి చెయ్యాలి కాని, కూల్చేస్తాం అంటే ఎలా అని అన్నారు. తనకు వచ్చిన నోటీస్ పై, వారంలో సీఆర్డీఏకి సమాధానం చెప్తానని గోకరాజు అన్నారు.

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు, జగన్ పై మొదటి పోరాటం ప్రారంభించనున్నారు. తన హయంలో అదుపులో ఉన్న శాంతి భద్రతలు, ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉండటం, తద్వారా పెట్టుబడుల పై ఆ ప్రభావం ఉండటంతో, రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల ప్రాణాలు కాపాడటం కోసం, మొదటి పోరాటం ఎంచుకున్నారు. మరో పది రోజుల్లో అసెంబ్లి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ విషయాలు అన్నీ అసెంబ్లీలో లేవనెత్తటానికి, ఆయన క్షేత్ర స్థాయి పర్యటన చెయ్యనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, గడిచిన 40 రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై దాడి చేసి, ఆరుగురుని చంపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, మరణించిన కార్య కర్తల కుటుంబాలను ఆదుకునేందుకు, వారికి పార్టీ అండగా ఉంటుంది అనే భరోసా ఇచ్చేందుకు, చంద్రబాబు భరోసా యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. జగన్ ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇచ్చి, అప్పుడు స్పందించాలని మొదట చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కాని రోజు రోజుకీ దాడులు పెరిగిపోతూ ఉండటంతో, ఇక ఉపేక్షించేది లేదని, చంద్రబాబు నిర్ణయం తీసుకుని, శాంతి భద్రతల విషయంలో, జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి చంద్రబాబు రానున్నారు.

ఇందులో భాగంగా ఎన్నికల తరువాత తమ పార్టీ కార్యకర్తల పై జరిగిన 140 దాడులను, 6 మంది కార్యకర్తల హత్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళనున్నారు. జగన్ ఫాక్షన్ మనస్తత్వాన్ని ప్రజలకు వివరించనున్నారు. గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనే విషయం ప్రజలకు చెప్పనున్నారు. ఈ యాత్ర గురించి సోమవారం గుంటూరు పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో దీని పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. జగన్ ప్రభుత్వం తన పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, దీని కోసం ప్రజా వేదిక లాంటి ప్రభుత్వ కట్టడాలు కూడా కూల్చేస్తుంది అనే విషయాన్ని చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. వైసీపీ దాడుల వల్ల మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడమే కాకుండా, ఒక్కో కుటుంబానికి పార్టీ తరుపున రూ.5 లక్షలు అందించనున్నారు. ఇది ఇలా ఉంటే, కార్యకర్తల రక్షణ కోసం ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను కూడా త్వరలో ఏర్పాటు చెయ్యనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు తనను గెలిపించిన కుప్పం ప్రజలకు కృతజ్ఞత చెప్పటానికి, ఈ రోజు కుప్పంలో పర్యటించారు. ఈ నేపధ్యంలో, స్థానిక నేతలు, కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబుకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భావోద్వేగానికి గురయ్యారు. కుప్పం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, ప్రచారానికి రాకపోయినా, ఏడు సార్లు తనను గెలిపించారని, ఇందుకు ఇక్కడ ప్రజలకు కృతజ్ఞత తెలుపుతున్నాని అన్నారు. గత 5 ఏళ్ళ కాలంలో, కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే పనిచేశానని చెప్పారు. తాను ఎక్కడా తప్పులు చేయలేదని, ప్రభుత్వంలో నీతివంతమైన పాలన అందించానని అన్నారు. ఎమ్మెల్యేగా చేసినా, ముఖ్యమంత్రిగా చేసినా, కుప్పం నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని పెంచడానికే అనునిత్యం పని చేశానని చంద్రబాబు అన్నారు.

రాష్ట్ర విభజన జరిగిన తరువాతా, కట్టుబట్టలతో అమరావతికి వచ్చిన సమయంలో, అక్కడ కూర్చోడానికి కూడా స్థలంలేకపోయినా, ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిపాలన చేసామని చంద్రబాబు అన్నారు. మన రాష్ట్రానికి, లోటు బడ్జెట్‌ ఉన్నా, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా, సంక్షేమ కార్యక్రమాల అమలు చేసామని చెప్పారు. కుప్పం నియోజకవర్గానికి నీళ్లు వచ్చేంతవరకు నేను ప్రయత్నం చేస్తానని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ఫలితాల పై సమీక్షలు చేస్తున్నామని, ఏ కారణాల వల్ల ఓడిపోయాం, మనం చేసిన తప్పులు పై విశ్లేషించుకుంటూన్నామని అన్నారు. కొన్ని బూత్‌లలో అర్థం కాకుండా ఫలితాలు వచ్చాయన్నారు. కార్యకర్తల పై దాడులు పెరిగిపోయాయి, వారిని ఆడుకోవాల్సిన బాధ్యత నా పై ఉంది, అందరినీ కాపాడుకుంటా అని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల కోసం పెట్టిన పార్టీ అని, తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ అని, ఈ పార్టీని కాపాడుకుని, మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ముందకు తీసుకువెళ్లాలని చంద్రబాబు అన్నారు.

ఎన్నికల ఫలితాలు తరువాత, రాష్ట్ర ప్రభుత్వం, తనకు భద్రత తగ్గించటం పై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న హైకోర్ట్ లో పిటీషన్ ధాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ పై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు తరుపున న్యాయవాది సుబ్బారావు కోర్టులో వాదించారు. మావోయిస్టుల నుంచి, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి చంద్రబాబుకు, ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినా, రాష్ట్ర ప్రభుత్వం కావాలనే రాజకీయ కోణంలో భద్రతని తగ్గించారని న్యాయవాది సుబ్బారావు కోర్టులో వాదించారు. గతంలో చంద్రబాబు పై అలిపిరిలో జరిగిన దాడి గురించి ఈ సందర్భంగా కోర్ట్ కు విన్నవించారు. తెలుగుదేశం అధినేతతో పాటు ఆయన కుటుంబానికీ భద్రత తగ్గించారన్న విషయాన్ని హైకోర్ట్ దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిగా ఉండగా ఎర్ర చందనం స్మగ్లర్ల పై ఉక్కుపాదం మోపారని, అప్పటి నుంచి వారు చంద్రబాబు పై కక్షకట్టి ఉన్నారని,ఆ స్మగ్లర్ల నుంచి కూడా చంద్రబాబుకు ప్రాణ హాని ఉండనే విషయాన్ని గుర్తు చేసారు.

దీని పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబుకు మేము ఎక్కడ భద్రత తగ్గించలేదని, ప్రభుత్వం తరుపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్ హైకోర్ట్ కు వివరణ ఇచ్చారు. చంద్రబాబుకు ఇవ్వాల్సిన దాని కంటే, చాలా ఎక్కువ భద్రత ఇస్తున్నమంటూ, సమాధానం చెప్పారు. చంద్రబాబుకి మాజీ ముఖ్యమంత్రి హోదాలో, కేవలం 58 మందితోనే భద్రత ఇవ్వాల్సి ఉన్నా, మా ప్రభుత్వం 74 మందిని ఇచ్చిందని కోర్ట్ కు చెప్పారు. అయితే చంద్రబాబుకు ఇతర మాజీలకు ఇచ్చే భద్రత కంటే ఎక్కువ ఇవ్వాల్సి ఉందని, ఆయన జెడ్ + భద్రతలో ఉన్నారని, 2014కి ముందు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఏ భద్రత అయితే ఉండేదో, అదే భద్రత ఇవ్వాలని చంద్రబాబు తరుపున న్యాయవాది కోరారు. దీని పై కోర్ట్ స్పందిస్తూ, ప్రభుత్వనికి అన్ని వివరాలు ఇవ్వాలని కోరింది. చంద్రబాబుకు ఎంతమందిని, ఎక్కడెక్కడ, ఏయే స్థానాల్లో భద్రత కల్పిస్తున్నారో అఫిడవిట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్ట్ కోరింది. ఈ కేసు పై తీర్పును, ఈ నెల 9వ తేదికి వాయిదా వేసింది.

Advertisements

Latest Articles

Most Read