పోలీస్‌ వాహనంలో అడిగిన వెంటనే డీజిల్‌ అప్పుపై పోయలేదని పెట్రోలు బంకులో పనిచేసే కార్మికుణ్ని గుంటూరు జిల్లా నిజాంపట్నం ఎస్సై ఎం.రాంబాబు చితకబాదారు. బాధితుని కథనం ప్రకారం..శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఎస్సై రాంబాబు తన వాహనాన్ని డ్రైవరుకిచ్చి డీజిల్‌ పోయించుకు రమ్మని స్థానిక ఓంనమశివాయ పెట్రోలు బంకుకు పంపారు. డ్రైవరు వచ్చి డీజిల్‌ పోయమని అడగ్గా.. తన యజమాని చెబితేనే పోస్తానని కార్మికుడు హుమాయూన్‌ చెప్పాడు. అదే విషయాన్ని డ్రైవరు ఎస్సైకు ఫోన్ లో వివరించాడు. ఆగ్రహించిన ఎస్సై వాహనాన్ని వెనక్కి పిలిపించి అదే వాహనంలో బంకుకు వచ్చి కార్మికుడిని కొట్టారు. అనంతరం స్టేషన్‌కి తీసుకెళ్లి కూడా కొట్టారని.. అదేమని అడిగితే అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని బాధితుడు వాపోయాడు.

guntur 09062019 3

ఈ ఘటనను నిరసిస్తూ ఎస్సైకు వ్యతిరేకంగా బంకు కార్మికులు స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. దీనిపై ఎస్సై రాంబాబును వివరణ కోరగా తాము నెలనెలా బిల్లు చెల్లిస్తామని, డీజిల్‌ కోసం వాహనం పంపితే కార్మికుడు డ్రైవరుతో దురుసుగా మాట్లాడాడని అన్నారు. వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సంఘటన విషయాన్ని యజమానుల దృష్టికి తీసుకెళ్లామని కార్మికులు తెలిపారు.

చిత్తూరు సమీపంలోని హెరిటేజ్‌ ప్లాంటుపై శనివారం రాత్రి దాడి జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గంగాధర నెల్లూరు మండలంలోని ఎన్టీఆర్‌ కాలనీ సమీపంలో ఉన్న హెరిటేజ్‌ ప్లాంటు వద్దకు రాత్రి 7.30 గంటలకు చిత్తూరు కట్టమంచికి చెందిన మనోజ్‌ అనే వ్యక్తి పెరుగు కోసం వచ్చాడు. పాల పదార్థాల విక్రయ కేంద్రం మూసేసి ఉండటంతో సెక్యూరిటీ ఆఫీస్‌ వద్దకెళ్లాడు. కేంద్రం మూసేశామని.. ఆదివారం వచ్చి పెరుగు తీసుకోవాలని వారు సూచించారు. ఆదివారం కట్టమంచిలో కర్మక్రియలు నిర్వహిస్తున్నామని.. ఇప్పుడే పెరుగు కావాలని వాగ్వాదానికి దిగాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మనోజ్‌ ఈ విషయాన్ని కట్టమంచివాసులకు తెలియజేశాడు. కొంతసేపటికి దాదాపు 20 మంది కట్టమంచివాసులు వచ్చి సెక్యూరిటీ కార్యాలయ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం ప్లాంటు లోపలకు వెళ్లి వర్కర్లను బెదిరించారు.

heritage 0906 2019 1

హెరిటేజ్‌ సిబ్బంది వెంటనే జీడీ నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నాగసౌజన్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన కారులను బయటికి పంపించారు. సెక్యూరిటీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దాడికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆమె పేర్కొన్నారు.

జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు ఊహించని షాకిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సమీక్షలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రావెల హఠాత్తుగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జనసేనకు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తున్నారంటూ చర్చలు జరుగుతున్న తరుణంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై ఆయనతో చర్చించారు. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రావెల కిషోర్ బాబు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ సాయంత్రం ప్రధాని తిరుమలకు రానున్నారు.

pk 09062019

అయితే ఈ పర్యటనలో భాగంగా మోదీ సమక్షంలో రావెలతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు కమలం గూటికి చేరనున్నారు. పార్టీలో చేరే నేతలకు ప్రధాని మోదీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించనున్నారు. కాగా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దిగులు పడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్దామంటూ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పిలుపిచ్చిన రెండోరోజే ఆ పార్టీకి షాక్‌ తగిలింది. జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న రావెల కిషోర్‌ బాబు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే రావెల.. బీజేపీలో చేరితే ముచ్చటగా మూడోపార్టీ తీర్థం పుచ్చుకున్నట్లవుతుంది. రావెల కిశోర్ బాబు జనసేన పార్టీకి రాజీనామా చేసి, ఈ మేరకు ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

pk 09062019

వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఐఆర్‌ఎస్‌ అధికారిగా పనిచేసిన రావెల కిశోర్ బాబు 2014 ఎన్నికలకు ముందు ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేసి తెదేపాలో చేరారు. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన చంద్రబాబు హయాంలో కొన్నాళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. మంత్రి పదవి కోల్పోవడంతో తెదేపాకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. 2018లో తెదేపాకు రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇటీవల ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి ఆయన జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం జనసేనకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు పవన్‌కు లేఖ పంపారు. రావెల ఈ సాయంత్రం భాజపాలో చేరనున్నారు.

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం అనంత‌రం సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీకి ఊహించ‌ని షాకులు త‌గులుతున్నాయి. ముఖ్య‌నేత‌లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్ప‌టికే మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా చేయ‌గా..తాజాగా మాజీ సభాపతి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌ ఆ పార్టీని వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన గుంటూరు జిల్లా సమీక్షకు నాదెండ్ల హాజరుకాలేదు. దీంతో ఆయన పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈనేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది. నాదెండ్ల మనోహర్‌ అమెరికా పర్యటనలో ఉన్నందువల్లే సమావేశానికి హాజరు కాలేకపోయారని, కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపింది.

nadendla 09062019

ఆయన పార్టీని వీడే ప్రసక్తి లేదని వెల్లడించింది. నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రత్తిపాడు జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన రావెల కిశోర్‌బాబు జనసేన పార్టీకి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండు పర్యాయాలు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తొలుత డిప్యూటీ స్పీకర్‌గా, ఆ తర్వాత స్పీకర్‌గా వ్యవహరించారు. గ‌త ఎన్నిక‌ల ముందు జ‌న‌సేన పార్టీలో మ‌నోహ‌ర్ చేరారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపెట్టిన సమయంలోను ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి, తిరిగి పుంజుకుంటున్న సమయంలో ఆయ‌న జ‌న‌సేన వెళ్ల‌డంపై చ‌ర్చ జ‌రిగింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లోనూ తిరిగి తెనాలి నుంచి జనసేన తరఫున అసెంబ్లీకి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు.

Advertisements

Latest Articles

Most Read