అమరావతి... దుర్గమ్మ ఆశీస్సులు.. కృష్ణమ్మ పరవళ్లతో..అద్భుతమైన అమరావతిని నిర్మించుకుంటున్న మనం, అమరావతిలో వేసిన తొలి అడుగు, వెలగపూడిలోని సచివాలయం.. ఈ సచివాలయం, ప్రతి ఆంధ్రుడి దేవాలయం.... అమరావతి ఆంధ్రుల రాజధాని అని ప్రకటించిన దగ్గర నుంచి, మొదలైన పాజిటివ్ వైబ్రేషన్స్, 5 కోట్ల మంది ఆంధ్రులని ముందుకు నడిపిస్తుంది… “అమరావతి”, అంటే మరణం లేనిది…క్షీణించడం, జీర్ణించడం, బాధపడటం అనేవి మచ్చుక కూడా కనిపించని ప్రాంతంగా అమరావతి విలసిల్లుతుంది. బాల్యం, కౌమారం, యవ్వనం మాత్రమే అమరత్వంలో ఉంటుంది, మరణించడం అనేదే ఉండదు... అందువల్ల ఎల్లప్పుడూ అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉంటుంది. శాతవాహనుల రాజధానిగా ఘనచరిత్ర వహించిన ఈ ప్రాంతానికి, మళ్లీ పూర్వ వైభవం తీసుకురావటానికి చంద్రబాబు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే..

amaravati 09062019

హైదరాబాద్ లో ఏపి ఉద్యోగులని, ప్రతి రోజు తెలంగాణా ఉద్యోగులు అడ్డుకుంటున్నారని, వారి ఆత్మగౌరవం దెబ్బ తిన కూడదని, మన గడ్డ నుంచే మన పాలన సాగాలని, 180 రోజుల్లోనే అమరావతిలో కట్టిన ఇంద్ర భవనాలు, వెలగపూడిలో కట్టిన సచివాలయం... కానీ అనూహ్యంగా, ఈ ఆధునిక అమరావతి సృష్టికర్త ఎన్నికల సమరంలో ఓడిపోయారు... మరి ఆయన ఓడిపోతే, అమరావతి గెలిచిందని చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా ? భ్రమరావతి అని ప్రతి రోజు విమర్శించిన వారు, ఈ రోజు అది భ్రమరావతి కాదు, అమరావతి అని చెప్పటం "అమరావతి విజయం" కాదా ? ఎక్కడైతే భూకంపాలు వస్తాయని బెదిరించారో, ఏదైతే బురద నేల అన్నారో, ఏ బిల్డింగ్ లను అయితే తాత్కాలికం అని హేళన చేసారో, ఎక్కడైతే ఒక్క ఇటుక కూడా పడలేదు అన్నారో, అమరావతి నిర్మాణం ఆగిపోవాలి అని ప్రతి రోజు కేసులు పెట్టిన వారు, అక్కడికే వచ్చి వారు కూర్చున్నారు. అమరావతిని కూడా ఒక ఎన్నికల ఎజెండాగా తీసుకుని, వేరే ప్రాంతాల్లో, అమరావతి పై ఎలా ద్వేషం నింపారో చూసాం. మొన్నటికి మొన్న, వైయస్. షర్మిలా గారు పాదయాత్ర లో ప్రజలతో మాట్లాడుతూ..... అమరావతి అంట.... మనరాజధాని అంట.... దాని మోహం మీరు ఎప్పుడైనా చూశారా..... ఎక్కడైనా మీకు కనపడిందా..... ..అని ప్రచారం చేశారు..!!

amaravati 09062019

ఇప్పుడు, చంద్రబాబు సృష్టించిన చోట, చంద్రబాబు కూర్చున్న చోట, ఏ భవనాల మీద అయితే ప్రతి రోజు విషం చిమ్మారో, అక్కడే చంద్రబాబు స్థానంలో వాళ్ళు కూర్చుంటున్నారు అంటే... చంద్రబాబు ఓడినా, అమరావతి గెలిచింది అనే కదా అర్ధం. భ్రమరావతి అని చెప్పిన నోళ్లె, అమరావతి అని చెప్పటం చూస్తుంటే, నిజంగా అమరావతి అంటే మరణం లేనిదే అని అర్ధమవుతుంది. మన తరంలో ఒక మహానగర నిర్మాణం జరగటం, అది చూసే భాగ్యం దక్కటం మన అదృష్టం. ఆ నిర్మాణ ప్రక్రియకు పురుడు పోసిన వ్యక్తి, ఎన్నికల సమరంలో ఓడిపోయినా, అమరావతి గెలుస్తుంది అనే నమ్మకంతో ముందుకు పోవటమే. కొత్తగా బాధ్యతలు తీసుకున్న జగన్ గారు, అమరావతి పై, మీ భ్రమలు ఇప్పటికే తొలగి ఉంటాయి. చంద్రబాబు ఎక్కడైతే ఆపారో, మీరు అక్కడ నుంచి ముందుకు తీసుకు వెళ్ళండి. ఆయన ప్రణాళికలు నచ్చకపోతే, మీరు కొత్త ప్రణాళికలతో రండి. అమరావతిని మాత్రం నెంబర్ వన్ డెష్టినేషన్ చెయ్యండి చాలు. కాని చంద్రబాబు మీద కోపంతో, అమరావతిని ఎగతాళి చెయ్యకండి. మీ మందికి, మీ కర పత్రికకు, ఇకనైనా అమరావతిని భ్రమరావతి అని పిలవద్దు అని చెప్పండి... జై ఆంధ్రప్రదేశ్... జై అమరావతి...

ప్రధాని గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనం తరం నరేంద్ర మోదీ తొలిసారిగా తిరుమల రానున్నారు. ఆదివారం సాయంత్రం స్వామివారిని దర్శించుకుని తిరుగుప్రయాణమవుతారు. ఆయనకు స్వాగతం పలికేందుకు గవర్నర్‌ నరసింహన్‌, సీఎం జగన్‌ శనివారం సాయంత్రమే తిరుమలకు రానున్నారు. అమరావతిలో మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం, తేనీటి విందు ముగిశాక వీరిద్దరూ తిరుమలకు బయల్దేరనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం.. ప్రధాని ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం 4.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.40నుంచి 5.10 మధ్య అక్కడికి సమీపంలోనే ఉన్న కార్బన్‌ సెల్‌ఫోన్‌ కంపెనీ మైదానంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు చేరుకుంటారు.

jagan 08062019 1

పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. వెంటనే బయల్దేరి మహద్వారం గుండా ఆలయంలోకి వెళ్లి స్వామివారి సేవలో పాల్గొంటారు. రాత్రి 8.15కి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ బయల్దేరతారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల సందర్శనపై ఆసక్తి చూపుతూ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ నుంచి కేరళలోని గురువాయూర్‌ ఆలయ దర్శనానికి బయలుదేరారని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ శ్రీకృష్ణుణ్ణి దర్శనం చేసుకుని ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు. ఈ మధ్యలో ప్రధాని మోదీ మాల్దీవుల్లో జరిగే విదేశాంగ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా రేణిగుంట చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

jagan 08062019 1

కొలంబో నుంచి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రధాని రాకను పురస్కరించుకుని విమానాశ్రయానికి అతి సమీపంలోనే బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు విజయోత్సవ సభగా నామకరణం చేస్తున్నట్టు తెలిపారు. సభ అనంతరం ప్రధాని స్వామివారి దర్శనానికి తిరుమలకు వెళ్లి తిరిగి అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారని చెప్పారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, రేణిగుంట నుంచి అలిపిరి వరకు, ఇరు వైపులా మానవహారంలాగా ప్రజలను నుంచో పెట్టి ప్రధాని కాన్వాయ్ పై పువ్వులు చల్లే కార్యక్రమం చేస్తున్నారని తెలుస్తుంది. మొన్న కేసిఆర్ తిరుమల పర్యటనలో కూడా ఇలాగే గ్రాండ్ వెల్కం పలికారు. మొన్నటి దాక మన హక్కులు విషయంలో మోడీ అన్యాయం చేసారని, ప్రజలు నిరసనలతో స్వగతం పలికారు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, జగన్ గారు, ప్రధాని మోడీకి, పువ్వులతో స్వాగతం పలకనున్నారు. కనీసం ఇప్పుడైనా ప్రధాని కనికరించి, మన హామీలు నెరవేరుస్తారాని ఆశిద్దాం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో 25 మంది మంత్రులతో ఈరోజు ఏపీ కేబినెట్ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. ధర్మాన కృష్ణ ప్రసాద్, బొత్స సత్యనారాయణ, పాముల పుష్పవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ), పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, , చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఈరోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వీరికి కొత్తగా ఇన్నోవా కార్లను కేటాయించింది. ఒకేసారి ఏడుగురు సభ్యులు ప్రయాణించగల టయోటా ఇన్నోవా కార్ల ప్రారంభ ధర మార్కెట్ లో రూ.14.93 లక్షల నుంచి రూ.23.24 లక్షల వరకూ ఉంటుంది. ఈ కారు పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో మార్కెట్ లో లభ్యమవుతోంది.

innova 08062019 1

ఈ 25 మంది మంత్రులకు జగన్ ఏయే బాధ్యతలు అప్పగించబోతున్నారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈరోజు సాయంత్రం నాటికి సీఎం జగన్ మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెులిపాయి. మొత్తం 25 మంది మంత్రులతో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రులుగా వరుస క్రమంలో మొదట శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ ప్రమాణం చేశారు. ఆతర్వాత మిగిలిన మంత్రులు ప్రమాణం చేసి జగన్‌, గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌, నెల్లూరు జిల్లాకు చెందిన గౌతంరెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు.

జగన్ ప్రభుత్వానికి, కేంద్రం మొట్టమొదటి షాక్ ఇచ్చింది. అంత దూకుడు వద్దు, తగ్గండి అన్నట్టుగా, ఘాటుగానే బదులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పున పరిశీలన పారిశ్రామికాభివృద్ధికి మంచి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ తో చేసుకున్న వివిధ ఒప్పందాలు పారదర్శకంగా జరిగాయని, అలాంటి వాటిపై పునపరిశీలన దేశ పారిశ్రామికాభివృద్ధిని దెబ్బతీస్తుందన్నారు. ఒప్పందాల పునపరిశీలన పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తుందని, వారు పెట్టుబడులు పెట్టేందుకు భయపడేలా చేస్తుందనన్నారు. రాష్ట్ర-దేశ భవిష్యత్తుకి ఇది మంచిది కాదని లేఖలో ఆనంద్ కుమార్ కొత్త ముఖ్యమంత్రికి ఈ వాస్తవాలు అర్థమయ్యేలా వివరించాలని సీఎస్ కు సూచించారు.

letter 08062019 2

రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ తేడాగా ఉన్నాయని, వాటిల్లో అవినీతి జరిగిందని, చంద్రబాబుని ఇరికిద్దామని కొత్త ప్రభుత్వం అనుకుంది. దీనికి తగ్గట్టే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పున పరిశీలన చెయ్యాలని జగన్ భావించారు. అయితే, కేంద్రం మాత్రం, ఈ విషయం పై ఒప్పుకోలేదు. రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ నిబంధనలకు లోబడి పారదర్శకంగానే జరిగాయి, ఇలాంటి పనులు చెయ్యకండి, మీ కొత్త సియంకు చెప్పండి అంటూ, చీఫ్ సెక్రటరీకి ఘాటు లేఖ పంపింది కేంద్రం. ఇలా పీపీఏలను సమీక్షించడం మొదలుపెడితే అది దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకం, ఇన్వెస్టర్ల విశ్వాసం పోయిందంటే కష్టం, మనం 2022కల్లా 175 గిగావాట్ల సంప్రదాయేతర కరెంటు టార్గెట్ పెట్టుకున్నాం, ఒప్పందాలు అన్నీ చూసుకునే చేసాం అంటూ కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

Advertisements

Latest Articles

Most Read