ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం రోజే జనసేన అధినేతకు ఊహించని షాక్ తగిలింది. జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. టీడీపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు రావెల లేఖలో పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి రావెల ఓడిపోయారు.ఈ స్థానం నుంచి విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన రావెల కిషోర్ బాబు...బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

raela 08062019

ఆయన బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని, త్వరలోనే ఆ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన రావెల 2014 ఎన్నికల్లో ప్రతిప్తాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొంది, మంత్రివర్గంలో చోటు దక్కించుకుని, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అయితే పార్టీలో అంతర్గత విబేధాలు, వివాదాలతో పాటు కేబినెట్‌ విస్తరణ సందర్భంగా ఆయన మంత్రి పదవి కోల్పోయారు. ఆ తర్వాత నుంచి టీడీపీకి దూరంగా ఉన్న ఆయన...ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు సీటుతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.

అక్రమ ఆస్తుల కేసుల్లో జగన్, విజయసాయి రెడ్డి, ప్రతి శుక్రవారం కోర్ట్ విచారణకు వెళ్ళాల్సిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు కోర్ట్ సెలవులు కావటంతో, విచారణ జరగలేదు. అయితే ఇప్పుడు కోర్ట్ కి సెలవలు అయిపోవటంతో, ఇకనుంచి మళ్ళీ ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి. అయితే, ఎన్నికల్లో గెలుపొంది ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, విధి నిర్వహణలో నిమగ్నమైన నేపథ్యంలో కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ మేరకు నేర న్యాయ స్మృతి (సీఆర్‌పీసీ)లోని సెక్షన్‌ 317కింద ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదేకేసులో రెండో నిందితుడిగా ఉన్న వి.విజయసాయిరెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, విజయవాడ/తాడేపల్లిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం ఉన్నందున కోర్టు విచారణకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది నివేదించారు.

cbi 08062019

వీరిద్దరి పిటిషన్లను న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదన్‌రావు అనుమతించారు. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు. ఆ ఆరు చార్జిషీట్లనూ కలిపి విచారించండి... సీబీఐ 11చార్జిషీట్లు దాఖలు చేసిందని, ఇందులో మొదటి 5 చార్జిషీట్లలో దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్లను కలిపి విచారించేందుకు ఈ కోర్టు అనుమతిస్తూ గతంలో ఉత్తర్వులు జారీచేసిందని జగన్‌ తరఫు న్యాయవాది నివేదించారు. అన్ని చార్జిషీట్లలో పేర్కొన్న ఆరోపణలు ఒకేవిధంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో మిగిలిన 6 చార్జిషీట్లకు సంబంధించిన డిశ్చార్జ్‌ పిటిషన్లను కలిపి విచారించాలని తాము దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. దీనిపై పూర్తిగా విచారించాక నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా, ఈడీ దాఖలుచేసిన కేసులో ఇండియా సిమెంట్స్‌ అధినేత, బీసీసీఐ మాజీ చైర్మన్‌ శ్రీనివాసన్‌తోపాటు ఇతర నిందితులు ఈడీ కోర్టుకు హాజరయ్యారు.

మంత్రివర్గ ఏర్పాటుపై వైయస్‌ జగన్‌ మాహన్‌ రెడ్డి ఏకంగా ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయనున్న ట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో వైయస్సార్‌ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. దేశ రాజకీయాల్లో ఏపీ రాజకీయాలు ప్రత్యేకంగా నిలవాలని తన ఆకాంక్షగా ఆయన స్పష్టంచేశారు. రాజకీయాలను మునుపెన్నడూ లేని విధంగా ప్రక్షా ళన చేస్తానని మరోమారు పునరుద్ఘాటించారు. అయితే, ఈ క్రమం లో కొందరికి మోదం, కొందరికి ఖేదం కలిగే అవకాశముందని, తనతోపాటు ప్రయాణం చేసేప్పుడు ఇవన్నీ సర్వసాధారణమని భావించాలని కోరారు. అయితే, తనను, పార్టీని నమ్ముకుని ఉన్నవా రికి న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుందని స్పష్టంచేశారు.

jagan 08062019

కాకపోతే ఒకరికి ముందు..మరొకరికి తరువాత అన్న రీతిలో అది ఉటుందని, దీనికి అందరూ సహకరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో కూడా తాను 175 అసెంబ్లి, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్ధులను ఒకేమారు ప్రకటించానని, ఇప్పుడు కూడా మంత్రి వర్గాన్ని ఒకేసారి విస్తరించనున్నట్లు చెప్పారు. వీరందరికీ మీ అంద రూ ఆమోదం తెలియజేయాలని సభ్యులను కోరారు. మరో పక్క, జగన్ కేబినెట్ కూర్పులో తమకు కచ్చితంగా మంత్రి పదవి దొరుకుతుందని చివరి వరకూ ఆశించిన వారికి చోటు దక్కక పోవడంతో వారూ, వారి అనుచరులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ముఖ్యంగా ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడ్డ ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మరో కీలక నేత, జగన్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైన భూమన కరుణాకర రెడ్డికి సైతం చోటు దక్కకపోవడం గమనార్హం. జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని ఆశించి భంగపడ్డ నేతల లిస్ట్....

jagan 08062019

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు(కాపు), కర్నూలు జిల్లా- శిల్పా కుటుంబం, ,పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు , కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, కడప జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, మంగళగిరి ఎమ్మెల్యే-ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా- మర్రి రాజశేఖర్(చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నేత..అయితే విడదల రజనీకి టికెట్ కేటాయించడంతో మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇస్తానని రోడ్ షోలో ప్రజల ముందు బహిరంగంగా చెప్పిన జగన్.. కానీ ఇప్పుడు కూడా మర్రికి చుక్కెదురైంది.

ఎప్పుడు వార్తల్లో ఉండే వైసీపీ నేత రోజాకు దక్కే పదవి ఏంటి? సీఎం జగన్ ఆలోచన ఏంటి? జగన్ ఇచ్చిన ఆఫర్‌ను రోజా కాదన్నారా. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి కేబినెట్ బెర్తు ఖాయమైంది. అదే సామాజిక వర్గం... అదే జిల్లాకు చెందిన రోజాకు అవకాశం లేనట్లేనా? రోజాకు జగన్ ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండగలరా. నిజానికి కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్న టైంలో సీఎం జగన్ తన పార్టీ కీలక నేత రోజాకు ఒక ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో రోజా జుగుబ్సాకరమైన ప్రవర్తనకు ఏడాది పాటు సస్పెండ్ చేశారు. సభలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటంతో రోజాని సస్పండ్ చేసారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అందువల్ల అదే చంద్రబాబు ద్వారా అధ్యక్షా అని పిలిపించుకునేందుకు రోజాకు స్వీకర్ పదవి ఇస్తున్నారనే చర్చ సాగింది. చంద్రబాబుని మరింత బాధపడాలి అంటే, రోజాకు స్పీకర్ పదవి ఇవ్వాలని భావించి ఆ విషయమై ఆమెతో చర్చించారు. అయితే రోజా మాత్రం, తనకు స్పీకర్ పదవి వద్దని, మంత్రి పదవి కావాలని, జగన్ కు చెప్పి వచ్చినట్టు సమాచారం,

roja 08062019

చిత్తూరు జిల్లా నుంచీ సీనియర్ ఎమ్మెల్యే... తొలి నుంచీ వైసీపీకి ఆర్థికంగా... రాజకీయంగా అండగా నిలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవితో పాటూ... కీలక శాఖ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. అదే చిత్తూరు జిల్లాకు... అదే సామాజిక వర్గానికి చెందిన రోజాకు మంత్రి పదవి ఇవ్వటానికి ఈ సమీకరణలు అడ్డుగా మారాయి. దీనికి తోడు జిల్లాలో తన ప్రాధాన్యం ఉండాలని పెద్దిరెడ్డి కోరుకుంటున్నారు. జగన్ సైతం పెద్దిరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో రోజాకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందేనని నిర్ణయించారు. దీంతో... ఆమెకు గుర్తింపు ఇస్తూ నే కొత్త ఫార్ములా తెర మీదకు తెచ్చారు. అదే సమయంలో చిత్తూరు నుంచీ ఎస్సీ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రోజా విషయంలో మాత్రం జగన్ సానుకూలంగా ఉన్నారు.

roja 08062019

జగన్ రాజీ ఫార్ములా ఏంటి? : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి... ఆయన కొడుకు మిధున్ రెడ్డికి లోకసభలో వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా అవకావం ఇవ్వడం ద్వారా వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చిందీ స్పష్టం చేసారు. ఇదే సమయంలో మంత్రి పదవి కావాలని ఇంతవరకూ తాను అడగలేదనీ... పార్టీ కోసం తాను ఎంతగా కష్టపడ్డానో జగన్‌కి తెలుసని రోజా అన్నారు. జగన్ సైతం రోజాకు కీలక పదవి అప్పగించే అవకాశం ఉందని తాజా సమాచారం. ఇందులో భాగంగానే.. ఈ రోజు రోజాకు ఇవ్వబోయే పదవి గురించి జగన్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారు.

Advertisements

Latest Articles

Most Read