తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పుట్టిన రోజు నేడు(28 మే 2019). ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు లక్ష్మీ పార్వతి కూడా ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి.. ఘాట్‌లో ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక్క బ్యానర్ కూడా కట్టకపోవడం దురదృష్టమని అన్నారు. ఎన్టీఆర్ ఘాట్‌ను టీడీపీ కార్యకర్తలు పవిత్ర ప్రదేశంగా భావించాలని.. దీనిని అలంకరించవలసిన బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు.

lp 28052019 1

చంద్రబాబు చేసిన అన్యాయాలు, కుట్రల వల్ల తగిన శాస్తి జరిగిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ జగన్‌ సరిదిద్దుతారనే నమ్మకం ఉందన్నారు. అయితే చంద్రబాబుని పదే పదే తిడుతూ, కావాలని అక్కడ రచ్చ చేసే ప్రయత్నం చేసారు. అక్కడే ఉన్న తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘాట్‌ వద్ద రాజకీయాలు మాట్లాడవద్దని లక్ష్మీపార్వతి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా ... చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్‌ ఘాట్‌, తెలంగాణా ప్రభుత్వం ఆధీనంలో ఉందని, ఎప్పుడూ జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసేదని, మేము ఏర్పాట్లు చెయ్యటం లేదు అని, మాకు ముందు చెప్తే మేమే ఏర్పాట్లు చేసే వాళ్ళం కదా అని తెదేపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు దంపతులతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, గల్లా జయదేవ్‌, కోడెల శివప్రసాదరావు, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. పార్టీ కార్యాలంలో తెదేపా జెండా ఎగురవేసిన చంద్రబాబు నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపై ప్రతిరోజు గుంటూరు కార్యాలయానికి వస్తానని చెప్పారు. రోజూ 3గంటల పాటు నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు.

cbn 28052019

ఏపీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ అంతటి నాయకుడికి కూడా ఓటమి తప్పలేదన్నారు. కానీ ఎన్టీఆర్ ఏనాడు అధైర్యపడలేదన్నారు. మనం కూడా అదే ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు సాగాలని నేతలు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. సంక్షేమ పధకాల సృష్టికర్త ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా బాబు చెప్పుకొచ్చారు. ప్రతి తెలుగువాడు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించాలన్నారు. మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా సంక్షేమం-అభివృద్ధిని మాత్రం నిర్లక్ష్యం చేయలేదన్నారు. నాలుగు రోజులుగా ఎంతో మంది తన దగ్గరికొచ్చి బాధపడ్డారన్నారు. మూడున్నర దశాబ్దాలుగా మీకు అండగా ఉన్నా.. ఇప్పడు కూడా మీతోనే ఉంటానని నేతలు, కార్యకర్తలకు, అభిమానులు బాబు అభయమిచ్చారు.

cbn 28052019

"నా కుటుంబం కంటే నాకు పార్టీనే ముఖ్యం. మళ్లీ మునుపటిలాగే పోరాటం చేద్దాం. ఎన్నికల ఫలితాలపై సమీక్షలు చేసుకుందాం. కార్యకర్తలు చెప్పే వాటిని విని ముందుకు సాగుదాం. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి బాధ్యతగల ప్రతి పక్షంగా పని చేద్దాం. ఎవరి స్దాయిలో వారు సమీక్ష చేసుకోని పార్టీ పటిష్టతకు కృషి చేయాలి. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోని టీడీపీకి పూర్వ వైభవం కోసం కృషి చేద్దాం. ఎవ్వరూ అదైరపడవద్దు. కార్యకర్తలను నేను కాపాడుకుంటాను. మీకు అన్ని విధాలా అండగా ఉంటాను. మార్పు తేవాలనే ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారు. ఎదురుదెబ్బలు తిన్నా ఎన్టీఆర్‌ మనోధైర్యం కోల్పోలేదు. అదే స్ఫూర్తితో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం" అని చంద్రబాబు కార్యకర్తలు, నేతల్లో నూతనోత్సాహం నింపారు.

 

 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికైన నూతన ఎమ్మెల్యేలలో 55 శాతం మంది నేరచరితులు ఉన్నట్లు ఎన్నికల నిఘావేదిక రాష్ట్రసమన్వయకర్త డాక్టర్‌ పీసీ.సాయిబాబు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వారిలో 32 శాతం మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. పార్టీల వారీగా చూస్తే వైసీపీలో 86 శాతం మంది, టీడీపీలో 39 శాతం మంది నేరచరితులుగా ఉన్నారన్నారు. జనసేన నుంచి ఎన్నికైన ఒక శాసనసభ్యుడు కూడా నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. నూతన శాసనసభ్యులలో 94 శాతం మంది కోటీశ్వర్లుగా ఉన్నారన్నారు. వైసీపీ శాసనసభ్యులలో 93 శాతం మంది, టీడీపీలో 96శాతం మంది కోటీశ్వర్లు కాగా జనసేన ఎమ్మెల్యే కూడా కోటీశ్వరుడే అన్నారు. శాసనసభ్యుల సగటు ఆస్తి రూ.27.87 కోట్లు కాగా వారిలో వైసీపీ వారి సగటు రూ.22.41 కోట్లు, టీడీపీ వారి సగటు రూ.66.41 కోట్లుగా ఉందన్నారు.

నూతన ఎమ్మెల్యేలలో 64 శాతం మంది గ్రాడుయేట్‌లు కాగా 34 శాతం మంది 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నవారు ఉన్నారన్నారు. ఇక లోక్‌ సభ విషయానికి వస్తే, లోక్‌సభ కు ఎన్నికైన ఎంపీల్లో సుమారు 50% మందికి నేర చరిత్ర ఉన్నట్లు వారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం తెలుస్తోంది. ఎన్నికల నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో వారు తెలిపిన వివరాల ప్రకారం వీటిని విశ్లేషించారు. కొత్తగా ఎన్నికైన 539 మంది ఎంపీల్లో 233 మందిపై వివిధ సెక్షన్ల ప్రకారం కేసులున్నాయి. 2009 లోక్‌ సభ కంటే ఇది 44% ఎక్కువ కావడం గమనార్హం. కేరళలోని ఇడుక్కి నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీ డీన్‌ కురియాకోసేపై 204 కేసులున్నట్లు ఆయన తన నామినేషన్‌లో పేర్కొన్నారు.

 

2014 ఎన్నికల్లో గెలిచిన ఎంపీల్లో 185 మందిపై కేసులున్నట్లు వెల్లడి కాగా.. ఇక 2009లో 162 మందిపై క్రిమినల్‌ కేసులున్నట్లు వెల్లడైంది. కొత్త ఎంపీల్లో 159 మంది(29శాతం)పై తీవ్ర నేర కేసులున్నాయి. వీటిలో అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, మహిళా వేధింపులు తదితరాలున్నాయి. 2014లో 112(21%)మందిపై తీవ్ర నేర కేసులున్నాయి. 2009లో 76(14%) మంది ఎంపీలపై తీవ్ర నేర కేసులున్నాయి. ఇక ఈ ఎంపీల్లో 10మంది దోషులుగాతేలిన వాళ్లున్నారు. 11మంది ఎంపీలు హత్య కేసుల్లో దోషులుగా ఉన్నారు. మరో 30 మంది విజేతలు హత్యా ప్రయత్నం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఎన్డీయేకి చెందిన ఎంపీల్లో నేర చరిత్ర కలిగిన వాళ్లు అత్యధికంగా ఉన్నారు. భాజపా తరఫున గెలిచిన 303 మంది ఎంపీల్లో 116 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన 29 మందిపై, డీఎంకేకి చెందిన 10 మంది ఎంపీలపై క్రిమినల్‌ కేసులున్నాయి.

ఈ నెల 30న జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఆ రోజు జ‌గ‌న్ ఒక్క‌రే ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. పూర్తి కేబినెట్ ఏర్పాటు మ‌రో వారం ప‌డుతుంద‌ని జ‌గ‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అయితే, మంత్రుల‌కు సంబంధించి ర‌క‌ర‌కాలుగా పేర్లు..వారి శాఖ‌లు ప్ర‌చారంలో ఉన్నా..ఔత్సాహికుల్లో మాత్రం టెన్ష‌న్ పెరిగిపోతోంది. దీంతో.. జ‌గ‌న్‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌టానికి కొంద‌రు కేసీఆర్ ద్వారా ప్ర‌య‌త్నాలు చేస్తుంటే..మ‌రి కొంద‌రు జ‌గ‌న్ ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా న‌మ్ముతున్న ఇద్ద‌రు ప్ర‌ముఖులతో సిఫార్సు ప్ర‌య‌త్నాలు చేయిస్తున్నారు. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలుగా గెల‌వ‌టం ద్వారా కేబినెట్ లో స్థానం కోసం ఆశావాహులు ఎక్కువ‌గానే ఉన్నారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో ఎవ‌రుండాల‌నే విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసారు.

jagan minister 27052019

అయినా..జ‌గ‌న్‌కు స‌న్నిహితంగా ఒక మాట చెప్ప‌గలిగిన వారితో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద్వారా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఈ సారి పోటీ ఎక్కువ‌గా ఉంది. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు పేరు సైతం ప్రచారంలో ఉంది. వెలమ సామాజికవర్గానికి చెందిన ప్రతాప్‌ అప్పారావుకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ సామాజిక వర్గం నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ద్వారా జగన్‌కు సిఫారసు చేయిస్తున్నట్లు సమాచారం. వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం.. మచ్చలేని రాజకీయ నేపథ్యం ప్రతాప్‌ అప్పారావుకు కలిసివచ్చే అంశాలని..మీరు చెబితే ఖ‌చ్చితంగా జ‌గ‌న్ ఒప్పుకుంటార‌ని అభ్య‌ర్దిస్తున్నారు.

jagan minister 27052019

కొంత కాలంగా జ‌గ‌న్ ఇద్ద‌రి సూచ‌న‌లు..స‌ల‌హాల‌కు ప్రాధాన్య‌తఇస్తున్నారు. పాద‌యాత్ర ముహూర్తం మొద‌లు.. అభ్య‌ర్దుల ప్ర‌క‌ట‌న‌..సంఖ్య‌..ప్రాంతం..ప్ర‌మాణ స్వీకారం వంటి ప్ర‌తీ విష‌యంలోనూ ఆ ఇద్ద‌రి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలోనే ప‌ని చేస్తున్నారు. అందులో ఒక‌రు విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి కాగా..మ‌రొక‌రు చిన జీయ‌ర్ స్వామి. ఉత్త‌రాంధ్రకు చెందిన అనేక మంది నేత‌లు ఎప్ప‌టి నుండో విశాఖ శార‌దా పీఠంలో భ‌క్తులుగా ఉన్నారు. స్వ‌రూపానంద స్వామితో వ్య‌క్తిగ‌తంగా స‌న్నిహిత సంబంధాలు ఉన్న నేత‌లు జ‌గ‌న్ మూడ్‌కు అనుగుణంగా అక్క‌డి నుండి సిఫార్సు చేయించుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. చిన‌జీయ‌ర్ స్వామి అటువంటి సిఫార్సులు చేయ‌ర‌ని ఆయ‌న భ‌క్తులు స్ప‌ష్టం చేస్తున్నారు. దీంతో..ఎమ్మెల్యేలు నేరుగా ఈ ఇద్ద‌రితో సంబంధాలు ఉన్న‌వారి వారి ద్వారా మ‌రి కొంత మంది వారి ప్ర‌ధాన శిష్య‌గ‌ణం ద్వారా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read