తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ పరిస్థితికి రావడానికి గల కారణాలను ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని టీడీపీ మహిళా కార్యకర్త అన్నారు. మంగళవారం గుంటూరులో జరిగిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ చంద్రబాబు, గల్లా జయదేవ్ గెలిచారని, వాళ్లు ఎందువల్ల గెలిచారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఆమె అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించారని, తను కుమారుడు భవిష్యత్ కోసం ఆలోచించలేదని ఆమె అన్నారు. ప్రజల కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని, తన కుటుంబం కోసం ఆలోచించకుండా.. అమరావతి, పోలవరం, ప్రజల భవిష్యత్ కోసమే ఆలోచించారన్నారు. పోటీ చేసిన నేతలు ఎందుకు ఓడిపోయారో ఒకసారి ప్రశ్నించుకోవాలని ఆమె అన్నారు.

game 27032019

నేతలు చేసిన అన్యాయం వల్లే చంద్రబాబు నష్టపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ దుస్థితికి రావడానికి కారణం కార్యకర్తలు కాదని, నాయకులే అని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యేలు సక్రమంగా ఉంటే.. చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చేదికాదని ఆమె అన్నారు. నాయకులు సక్రమంగా పనిచేసి ఉంటే పార్టీకి ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాక ఆయనపై ఓ పుకారు షికారు చేసింది. పలువురు వైసీపీ అభిమానులు కూడా ఆ ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్‌లో విస్తృతంగా షేర్ చేశారు. అయితే.. అది కేవలం పుకారు మాత్రమేనని స్పష్టమైంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. వైఎస్ జగన్ పార్టీ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సోషల్ మీడియాలో ఓ సరికొత్త ప్రచారం సాగింది. క్రైస్తవ మతాన్ని అనుసరించే జగన్ హిందూ మతంలోకి మారారని, కావాలంటే ఈ వీడియో చూడండి అంటూ ఓ వీడియోను కొందరు విస్తృతంగా ప్రచారం చేశారు.

game 27032019

అయితే.. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని, అది పూర్తిగా తప్పుడు ప్రచారం అని తేలింది. ఆ వీడియో 2016లో స్వరూపానంద సరస్వతితో కలిసి జగన్ పూజలు చేసిన సందర్భంలో రికార్డ్ చేసిందని స్పష్టమైంది. 2016, ఆగస్ట్ 10న రిషికేష్‌లో జగన్ గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించి, స్వరూపానంద సరస్వతి సమక్షంలో పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న పండితులకు, మునులకు అన్నదానం చేశారు. ఆ సందర్భంలో జగన్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని, ప్రజలు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పూజలు చేసినట్లు చెప్పారు. అప్పటి వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు తేలింది. తాజాగా ఆయన ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కాంగ్రెస్ పార్టీతో గతానుబంధం గురించి అడిగిన సందర్భంలో తాను ప్రార్థన చేస్తానని, బైబిల్ చదువుతానని చెప్పారు. ఆ దేవుడే నిర్ణయిస్తాడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన మతం మారలేదన్న విషయం స్పష్టమైంది.

 

ఎల్లుండి జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని వైఎస్ జగన్ స్వయంగా ఆహ్వానించారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసిన జగన్, మీరు వస్తే తనకు ఆనందమని చెప్పారు. ఓ సీనియర్ నేతగా, రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాలు సీఎంగా పని చేసిన అనుభవమున్న తమ ఆశీస్సులు కావాలని జగన్ కోరినట్టు తెలుస్తోంది. తన తండ్రి దివంగత వైఎస్ కు మీరు సమకాలీకులని గుర్తు చేసిన జగన్, ప్రమాణ స్వీకారానికి వస్తే తాను ఆనందిస్తానని చెప్పినట్టు సమాచారం. దీనిపై చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబు వస్తారా? లేదా? అన్న విషయమై టీడీపీ అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

phone 28052019

తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఇప్పటికే పలువురు నేతలకు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానం పలుకుతున్న జగన్‌.. ఇవాళ చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. ఈనెల 30న జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధికి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని జగన్‌ ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈనెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో జగన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈకార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాగా, డీజీపీ ఆర్పీ ఠాకుర్, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావులు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను సోమవారం స్వయంగా పరిశీలించారు. పలు అంశాలపై డీజీపీ కొన్ని సూచనలు చేశారు.

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. గెలిచిన మూడు స్థానాలకే పీసీసీ చీఫ్ ఉత్తమ్ జబ్బలు చరుచుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది ఆ పార్టీలో ఉన్నారో లెక్కలు చెప్పాలన్నారు. ఇప్పుడు గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉంటారో ఉత్తమ్ చెప్పగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో గెలిచిన నేతలు టీఆర్ఎస్‌లో చేరి పునీతులు అవుతున్నారని విమర్శించారు.

nagababu 28052019

ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై పోరాడకుండా పార్టీ మారుతున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని ఘాటైర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గెలిచిన మూడు స్థానాల్లో.. ఏదో గెలావాలి కాబట్టి గెలిచాం అన్నట్లుగా గెలిచారని ఎద్దేవా చేశారు. కానీ బీజేపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు ఉద్దండులపై భారీ మెజారిటీతో గెలిచారని పేర్కొన్నారు. కేసీఆర్ బిడ్డను సైతం ఓడించామని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నచ్చకనే టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరుతున్నారని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఇక తమ టార్గెట్ తెలంగాణ అని, తమ యుద్ధం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కమల వికాసం తథ్యం అన్నారు.

nagababu 28052019

బీజేపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు మోదీ హవా వల్లే గెలిచారని ఇప్పుడంటున్న కేటీఆర్.. ఎన్నికల ముందు మోదీ హవా లేదని, దేశ భద్రత సమస్యలో పడిందని అన్నారని గుర్తుచేశారు. కేటీఆర్ మాటలు ఆడలేక మద్దెలఓడులా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పును కేటీఆర్ అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో కూడా టీఆర్ఎస్‌కు ఆశాభంగమే ఎదురైందన్నారు. తెలంగాణ వస్తే బీజేపీ బలపడుతుందని బ్రహ్మం గారిలా అసదుద్దీన్ ఒవైసీ ఎప్పుడో అన్నారని, ఇప్పుడు అది జరుగుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ గురించి ఒవైసీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.

Advertisements

Latest Articles

Most Read