వాళ్ళ ఇద్దరూ స్టార్ హీరోలు, ఇద్దరూ వేరే వేరే పార్టీలో రాజకీయాల్లో ఉన్నారు. ఇద్దరి మధ్య ఏ బేధాబిప్రాయం లేకపోయినా, వారి వారి అభిమానుల్లో, మాత్రం డివిజన్ ఉంది. వారే నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇద్దరు నేతలు ఒకే వేదిక పైన వన్ టు వన్ కూర్చుంటే, అదీ బాలయ్య ఓపెన్ గా నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్ షో అయితే ? ఇరువురి అభిమానులకే కాదు, తెలుగు ప్రజలకు కూడా ఇది ఒక కనువిందు. ఇప్పుడు తెలుగు ప్రజలు ఇదే ఆస్వాదించబోతున్నారు. బాలయ్య నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్ షోకు, గెస్ట్ గా పవన్ కల్యాణ్ వస్తున్నారు. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది. ఇప్పటికే బాలయ్య రాగా, మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ రానున్నారు. బాలయ్య పవన్ ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, రాజకీయంగా ఎలాంటి ప్రశ్నలు ఉండబోతున్నాయి, వాటికి పవన్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు ? ఇవన్నీ తెర మీద చూడాల్సిందే. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. బాలయ్య, పవన్ అభిమానుల కోలాహలం నెలకొంది. ఎపిసోడ్ సంక్రాంతి పండుగకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్టు ఉండి ఢిల్లీ వెళ్తున్నారు అనే వార్త నిన్న చక్కర్లు కొట్టింది. సాయంత్రానికి నిజమే అంటూ అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యింది. రేపు జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో కలుస్తారని, ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్తారని, విభజన హామీలు, ప్రత్యేక హోదా పై మేడలు వంచేస్తారని వైసీపీ ఇస్తున్న బిల్డ్ అప్. కానీ నిజానికి లోపల ఏమి జరుగుతుందో ఏపి మొత్తం తెలుసు. అయితే జగన్ చేస్తున్న ఈ ఆకస్మిక ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయం ఉందా ? అప్పు కోసం వెళ్తున్నారా ? ఇలా అనేక వార్తలు వస్తున్నాయి. అప్పు పుట్టక, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండటంతో, మరింత అప్పు కోసం అనుమతి ఇవ్వాలని జగన్ వెళ్తున్నారని చెప్తున్నారు. అయితే, మరో విషయం కూడా ప్రచారంలో ఉంది, అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, అందుకు ప్రణాళికలు సెట్ చేసుకోటానికి ఢిల్లీ వెళ్తున్నారని చెప్తున్నారు. ఇదే సందర్భంలో తెలుగుదేశం, బీజేపీకి దగ్గర అవుతున్నారనే వార్తలు వస్తూ ఉండటంతో, దానిని చెడగొట్టే ప్లాన్ కూడా జగన్ వేసారని, అవసరం అయితే బీజేపీకి ఎంపీ స్థానాలు వదిలేసే విషయం పై కూడా జగన్, మోడీ ముందు ఒక ప్రపోజల్ పెట్టే అవకాసం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. మొత్తానికి జగన్ ఢిల్లీ వెళ్తుంది మాత్రం రాజకీయ యాత్రకే.

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఏదైనా చెప్పాడంటే చెయ్య‌డంతే అని నిర్దారించుకోవ‌చ్చు అనేలా జ‌నం ఫిక్స్ అయిపోయారు. దీనికి మ‌ద్య‌నిషేధం, సీపీఎస్ ర‌ద్దు, అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని వంటివ‌న్నీ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌లు. ఈ జాబితాలో తాజాగా క‌ర్నూలులో న్యాయ‌రాజ‌ధాని కూడా చేరింది. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించిన వైఎస్ జగ‌న్ మూడు ప్రాంతాల్లో మూడు రాజ‌ధానులు నినాదం అందుకున్నారు. విశాఖ‌కి రాజ‌ధాని త‌ర‌లించేందుకు ఈ ఎత్తుగ‌డ వేసినా, మిగిలిన ప్రాంతాల్లో అసంతృప్తి చెల‌రేగ‌కుండా అమ‌రావ‌తిలో శాస‌న  రాజ‌ధాని, విశాఖ‌లో ప‌రిపాల‌నా రాజ‌ధాని,  క‌ర్నూలులో న్యాయ‌రాజ‌ధాని అంటూ భారీ ప్ర‌చారం చేశాఆరు. క‌ర్నూలులో న్యాయ‌రాజ‌ధాని కోసం వైసీపీ చాలా పెద్ద ఎత్తున గ‌ర్జించింది. హైకోర్టుని క‌ర్నూలులో పెట్టి న్యాయ‌రాజ‌ధాని చేసేందుకు చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నార‌ని గ‌ర్జిస్తూనే, సుప్రీంకోర్టులో అమ‌రావ‌తి నుంచి హైకోర్టుని త‌ర‌లించేది లేద‌ని వైసీపీ స‌ర్కారు లాయ‌ర్ స్ప‌ష్టం చేశారు. న్యాయ‌రాజ‌ధాని పేరుతో వైసీపీ రాజ‌కీయాలు చేస్తోంద‌ని సామాన్య ప్ర‌జ‌ల‌కీ అర్థ‌మైపోయింది. విశాఖ ఏకైక రాజ‌ధాని అనేది వైఎస్ జ‌గ‌న్ అజెండా అని, క‌ర్నూలుకి కంటితుడుపుగా ఏర్పాటు చేస్తామ‌న్న జ్యుడీషియ‌ల్ అకాడ‌మీ కూడా ఉత్తుత్తిదేన‌ని జ‌గ‌న్ స‌ర్కారు జీవో 152 ర‌ద్దుతో క్లారిటీ ఇచ్చేసింది. క‌ర్నూలులో జ్యుడీషియ‌ల్ అకాడ‌మీ ఏర్పాటుకి ఇచ్చినదే ఈ జీవో 152ని ర‌ద్దు చేసి మంగ‌ళ‌గిరిలోనే జ్యుడీషియ‌ల్ అకాడ‌మీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వైఎస్ జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంతో క‌ల‌క‌లం రేగుతోంది. జ‌గ‌న్ న్యాయ‌రాజ‌ధాని పేరుతో క‌ర్నూలు ప్రాంతంతోపాటు రాయ‌ల‌సీమ‌ని మోసం చేశారు జ‌నం ఆగ్ర‌హంతో ఉన్నారు.

చాలా స‌డెన్ గా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ టూర్ ఫిక్స్ అయ్యింది. దీనిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. వివేకా హ‌త్య‌కేసులో జ‌న‌వ‌రి3న సంచ‌ల‌నాలు జ‌రుగుతాయ‌ని మాజీ మంత్రి, వైసీపీ నేత డీఎల్ ర‌వీంద్రారెడ్డి ప్ర‌క‌టించ‌డంతో రాష్ట్రంలో క‌ల‌క‌లం రేగుతోంది. ఒక కీల‌క వ్య‌క్తి ఈ కేసులో అరెస్టు అవుతారంటూ డీఎల్ హింట్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఢిల్లీ వెళుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. జ‌గ‌న్ రెడ్డి ఇటీవ‌లే ఢిల్లీలో జీ20 స‌మావేశాల‌లో మోదీని క‌లిశారు. అంత‌కుముందు విశాఖ‌లో మోదీతో వేదిక పంచుకున్నారు. వ‌ర‌స నెల‌ల్లో ప్ర‌ధానిని క‌లిసిన సీఎం జ‌గ‌న్ ఇంత అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్ల‌నుండ‌టం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. బుధ‌వారం సాయంత్రం ఢిల్లీకి సీఎం జగన్ చేరుకుంటార‌ని. అదే రోజు ప్రధానితో భేటీ అవుతార‌ని స‌మాచారం.

Advertisements

Latest Articles

Most Read