ప్రజల పై అభిమానం ఉంటే జగన్ ముసుగు నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ పై టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మండిపడ్డారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద బుధవారం మీడియా సమావేశంలో రామారావు మాట్లాడుతూ విశాఖలో విగ్రహాల తొలగింపునకు టీడీపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని టీడీపీకి అంటగట్టాలని కొందరు మేధావుల ముసుగులో చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. విశాఖ ఆర్కే బీచ్‌లో అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి హరికృష్ణ, దాసరి నారాయణరావు విగ్రహాల ఏర్పాటులో యార్లగడ్డ పాత్ర అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. జీవీఎంసీ నుంచి అనుమతి లేకుండా విగ్రహాలను ఏర్పాటు చేశారన్న కారణంగా అధికారులు వాటిని తొలగించారనే విషయాన్ని ఆ మేధావులు గుర్తించాలని కోరారు.

game 27032019

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, ఇటువంటి అంశాల్లో ముఖ్యమంత్రి పాత్ర ఏ మేరకు ఉంటుందో అన్న ఆలోచన లేకుండా దుర్బుద్ధితో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటి గురించి యార్గగడ్డకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ, సంబంధం లేని అంశాలను పార్టీకి, ముఖ్యమంత్రికి ఆపాదించడం ఆయన స్థాయికి తగదని హితవుపలికారు. సమాజంపై అంతటి అభిమానం ఉంటే వైకాపా ముసుగు తొలగించుకుని ముందుకు రావాలని వ్యాఖ్యానించారు.

ఈ నెల 23న ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో..రాష్ట్రపతి నిర్ణయమే ఫైనల్ కానుంది. దేశాధ్యక్షుని ముందు అందుబాటులో ఉండే కొన్ని అవకాశా ల్ని రాజ్యాంగ నిపుణులు ఈ విధంగా విశ్లేషిస్తున్నారు… ఎన్నికైన సభ్యుందరితో తాత్కాలిక స్పీకర్‌ అధ్యక్షతన ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించడం. ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీ నాయకున్ని ఆహ్వానించడం. అందుకు విముఖత ఎదురైతే ఎన్నికలకు ముందు ఏర్పడ్డ కూటమి నాయకుడికి అవకాశం కల్పించడం. అదీ సానుకూలం కాని పక్షంలో సర్కారియా కమిషన్‌ సిఫార్సుల మేరకు ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమి నాయకుడిని ఆహ్వానించడం. ఈ విషయంలో దేశాధ్యక్షుడికే సర్వాధికా రాలుంటాయి. తన విచక్షణాధికారం మేరకే ఆయన ఎవర్నైనా ఆహ్వానించొచ్చని రాజ్యాంగం చెబుతోంది.

game 27032019

ఎవరూ ముందుకు రాని పక్షంలో ప్రస్తుత ప్రధానినే కొంతకాలం ఆపద్దర్మ ప్రధానిగా వ్యవహరించమని కోరడం. ఇలాంటి సందర్భంలో పేరుకు పార్లమెంట్‌ ఉన్న ప్పటికీ అది సుషుప్త చేతనావస్థలో ఉంటుంది. పరోక్షంగా దేశాధ్యక్షుని పాలనే సాగుతుంది. ప్రతి నిర్ణయాన్ని దేశాధ్యక్షుడు ఆమోదించాల్సుంటుంది. ఇప్పటికే ఏప్రిల్‌ నుంచి మూడు మాసాలకు అమలయ్యే విధంగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జూలై 1నుంచి ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర బిల్లుల చెల్లింపున కు ప్రభుత్వానికి అధికారముండదు. దీంతో ఈలోగా ఆపద్దర్మ ప్రధాని నాయకత్వంలోనే మరో మూడుమా సాలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టి దేశాధ్యక్షుని అనుమతి తో దాన్ని అమల్లోకి తీసుకురావాల్సుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆరుమాసాలకు మించి పార్ల మెంట్‌ సుషుప్త చేతనావస్తలో ఉంచడాన్ని రాజ్యాంగం ఆమోదించదు. ఈలోగా ఒక పార్టీ లేదా పార్టీల కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురావాలి. లేనిపక్షంలో లోక్‌సభను రద్దు చేసే అధికారం దేశాధ్యక్షునికి దఖలౌతుం ది. రద్దు చేసి కొత్తగా ఎన్నికలు జరపమని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించొచ్చు. లేదా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకురాని పక్షంలో దేశంలో అధ్యక్ష పాలన విధించే అధి కారం కూడా దేశాధ్యక్షునికుంది. ఎన్నికైన సభ్యుల్తో సంబంధంలేకుం డా తిరిగి ఎన్నికల నిర్వహణకు ఆదేశాలిచ్చే అధికారమూ ఆయన సొంతం.

game 27032019

దేశంలో 9వ లోక్‌సభ నుంచి హంగ్‌ ప్రభుత్వాల ఏర్పాటు మొదలైంది. అయితే అవన్నీ పలు ఆటుపోట్లకు గురయ్యా యి. అంతకుముందు ఏదొక పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించేది. 1989ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 197సీట్లొస్తే జనతాదళ్‌ 143, బిజెపి 85సీట్లలో గెలిచాయి. బిజెపి మద్దతుతో విపి సింగ్‌ నాయకత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అయితే అదే పార్టీ 1990లో చీలిపోయింది. చంద్రశేఖర్‌ సమాజ్‌వాదీ జనతా పార్టీ తరపున మరో పార్టీ పెట్టుకున్నారు. విపి సింగ్‌కు ఆయన వర్గం మద్దతు ఉపసంహరించింది. కాంగ్రెస్‌ మద్ద తుతో చంద్రశేఖర్‌ ప్రధాని అయ్యారు. అయితే ఆయన ఏడుమాసాలు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. 10వ లోక్‌సభలో కాంగ్రెస్‌ 232సీట్లు పొంది ఏకైక పెద్దపార్టీగా అవతరించింది. పివి నరసింహరావు మైనార్టీ ప్రభుత్వా నికి నాయకుడయ్యారు. వివిధ ప్రాంతీయ పార్టీల్ని చీల్చి ఐదేళ్ళు తన మెజార్టీని కొనసాగించగలిగారు. తిరిగి 1996లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బిజెపి 161సీట్లు పొందితే కాంగ్రెస్‌కు 140, జనతాదళ్‌కు 46సీట్లు వచ్చా యి. బిజెపి తరపున వాజ్‌పేయి మైనార్టీ ప్రభుత్వాన్ని నెల కొల్పారు. కానీ అది సాగలేదు. జనతాదళ్‌ నాయకత్వంలో ఏర్పడ్డ యునైటెడ్‌ ఫ్రంట్‌ దేవగౌడ ప్రధానిగా మరో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇది కూడా 18మాసాలే అధికారంలో ఉంది. ఆ తర్వాత ఐకె గుజ్రాల్‌ ఈ బాధ్యతలోకొచ్చారు.

రాష్ట్రంలో బీజేపీ సర్వనాశనం కావడానికి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణయే ప్రధాన కారకుడని, వైసీపీ నేతలతో కుమ్ముక్కై రాజంపేట ఎంపీ టికెట్టు అమ్ముకున్నారని, ఆఖరి క్షణంలో అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నాడని బీజేపీ నాయకులు పలువురు ధ్వజమెత్తారు. బుధవారం రాజంపేటలోని ఓ కల్యాణ మండపంలో రాజంపేట ఎంపీ పరిధిలోని కడప జిల్లాకు చెందిన రాయచోటి, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మధుకర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురే్‌షరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్‌రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనాధ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కడప జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి పిండిబోయిన కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేష్‌, గిరిజన మోర్చ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్‌, కోడూరు బీజేపీ అభ్యర్థి పొనతల సురేష్‌ తదితర నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ కన్నాపై విరుచుకుపడ్డారు.

kanna 16052019

‘‘రేపు పార్టీలో ఉంటారో.. ఉండరో కానీ బీజేపీని సర్వనాశనం చేశారు’’ అని నిప్పులు చెరిగారు. పార్టీ టికెట్ల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. రాజంపేట ఎంపీ టికెట్టును వైసీపీ నాయకుడు మహేశ్వర్‌ రెడ్డికి ఇచ్చారని, ఆఖరి నిమిషంలో అతను తప్పుకున్నాడని, దీనిలో బీజేపీ నాయకుల హస్తం ఉందని, వాయిస్‌ రికార్డ్‌ కూడా తమవద్ద ఉందని రాజేష్‌ అన్నారు. వైసీపీకి అమ్ముడుపోయిన ఆ నాయకులను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు స్థానిక నాయకత్వానికి, కోర్‌ కమిటీకి తెలియకుండా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.

kanna 16052019

నిధులు మింగేశారు... ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి ఖర్చుకోసం ఎంత ఇచ్చారన్న విషయంపై స్పష్టత లేదని, దీనిలో కూడా భారీ ఎత్తున గోల్‌మాల్‌ జరిగిందని రాజేష్‌ సహా పలువురు ధ్వజమెత్తారు. పార్టీకి పంపిన ఎన్నికల నిధులను కూడా గోల్‌మాల్‌ చేశారన్నారు. వాటిపై కూడా విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. టికెట్ల విషయంలో పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వద్దకు ఆయా నియోజకవర్గాల బీజేపీ నాయకులు వెళ్లి అడిగితే మీరు చెబితే నేను టికెట్టు ఇవ్వాలా.. ఆఫీసు నుంచి వెళ్లిపోండి.. అని హెచ్చరించారన్నారు.

 

 

ఎన్నికల కమిషన్‌ ఆగ్రహానికి మరో ఐఏఎస్‌ అధికారి బలి కాబోతున్నారా.? చిత్తూరు జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్నపై ఈసీ వేటు వేస్తుందా? తాజా పరిణామాలు పరిశీలిస్తే ఆ దిశగా చకచకా పావులు కదులుతున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 5 పోలింగ్‌ బూత్‌లలో రీపోల్‌ జరపాలని ఈసీ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో తెరవెనుక మరో వ్యవహారం కూడా నడిచినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరిగిన తర్వాత వివిధ జిల్లాల కలెక్టర్ల నుంచి రీపోల్‌కు ప్రతిపాదనలు వచ్చాయి. ఈవీఎంలు పనిచేయని చోట మాత్రమే రీపోల్‌కు ఆదేశాలిచ్చారు. సాధారణంగా ఇలాంటి ప్రతిపాదనలపై కలెక్టర్‌ నుంచి నివేదిక తెప్పించుకోవడం ఆనవాయితీ.

maharshi 16052019

అయితే, ఈ వ్యవహారంలో కలెక్టర్‌తో సంబంధం లేకుండానే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి ఈసీకి 10, 11 తేదీల్లో ప్రతిపాదనలు వెళ్లడం... 15వ తేదీ కల్లా రీపోల్‌కు ఉత్తర్వులు రావడం చకచకా జరిగిపోయింది. ఇక్కడే అంతర్గతంగా మరో వ్యవహారం నడుస్తున్నట్లు తెలిసింది. ఒక పార్టీ కార్యకర్తలు బూత్‌లలోకి అక్రమంగా పరిశీలిస్తే తమ దృష్టికి ఎందుకు తేలేదని ఎన్నికల కమిషన్‌ చిత్తూరు కలెక్టర్‌ ప్రద్యుమ్నను వివరణ కోరినట్లు తెలిసింది. ప్రద్యుమ్న ఎలాంటి వివరణ ఇచ్చినా దానితో సంబంధం లేకుండా ఆయనపై బదిలీ వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

maharshi 16052019

ఎన్నికల ప్రక్రియకు ముందే శ్రీకాకుళం కలెక్టరును, సీఈవోను బదిలీ చేసిన ఈసీ ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని బదిలీ చేసింది. ఆ తర్వాత మూడు జిల్లాల ఎస్పీలు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఎన్నికల కమిషన్‌ తప్పించేసింది. ఆ కోవలో ప్రద్యుమ్న కూడా చేరబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే చంద్రగిరిలో 35 రోజుల తరువాత రీపోలింగ్ పై విమర్శలు వస్తున్న టైంలో, ఇప్పుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ ను కూడా తప్పించే ప్రయత్నం జరుగుతున్న విషయం తెలుసుకుని, వైసీపీ స్కెచ్ తెలుసుకుని, టిడిపి నేతలు మండి పడుతున్నారు. మరో వారం రోజులు, వీళ్ళ పెత్తనం అంటూ పెదవి విరుస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read