ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాసిన లేఖపై స్పందించిన ఈసీఐ ఈ నెల 19న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆయా బూత్‌ల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10, 11 తేదీల్లో చంద్రగిరి నియోజవకర్గంలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞాపనలు అందాయి. జిల్లాలోని ఎన్నికల అధికారులతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు అనుమతివ్వాలని ఈసీఐకి నివేదించింది.

repolling 15052019

దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.ఆర్‌ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామపురంలో రీపోలింగ్‌కు అనుమతులు జారీచేసింది. రీపోలింగ్‌ను సజావుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. చంద్రగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇటీవల కలిసి.. తన నియోజకవర్గంలో ఒక వర్గానికి సంబంధించిన వారి ఓట్లు వేయనీయకుండా చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పాటు మరికొన్ని ఫిర్యాదులు రావడంతో అక్కడి పరిస్థితులపై నివేదిక తెప్పించుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ఈసీఐకి లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన ఈసీఐ ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు అనుమతిచ్చింది.

repolling 15052019

కొత్త కండ్రిగ (బూత్ నెం.316), వెంకట్రామపురం (బూత్ నెం.313), కమ్మపల్లి (బూత్ నెం.318), కమ్మపల్లి (బూత్ నెం.321), పులివర్తిపల్లి (బూత్ నెం.104)లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీచేసింది ఈసీ. ఇప్పటికే ఈనెల 6న రాష్ట్రంలో ఐదు స్థానాల్లో రీపోలింగ్ నిర్వహించారు. అయితే చంద్రగిరి స్థానంలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఈసీకి టీడీపీ, వైసీపీ పరస్పర ఫిర్యాదులు చేశారు. ఇవాళ కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు.. అడిషనల్ సీఈవోను కలిసి రీపోలింగ్ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్రంలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19న ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.

కేసీఆర్‌, స్టాలిన్‌ మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘ఏపీలో మీరు అనుకొంటున్నట్లు చంద్రబాబు గెలవడం లేదు. జగన్‌ గెలుస్తున్నారు. ఆయనకు ఎంపీ సీట్లు 18 నుంచి 21 వరకూ వస్తాయి’’ అని కేసీఆర్‌ చెప్పారు. ‘అది మీ అభిప్రాయం కావచ్చు’ అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నీ మంగళవారం చంద్రబాబుకు దొరై మురుగన్‌ వివరించారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితిని, ఇటీవల జరిగిన ఎన్నికల సరళిని చంద్రబాబు ఆయనను అడిగి తెలుసుకొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఫలితాల సరళి ఎలా ఉందో తన అంచనాలను ఆయనకు వివరించారు. వివిధ పార్టీల అధినేతల ఆలోచనలు ఎలా ఉన్నాయో కూడా చంద్రబాబు ఆయనకు చెప్పినట్లు సమాచారం.

stalin 15052019

‘‘23వ తేదీ ఫలితాల వెల్లడి తర్వాత అందరం అప్రమత్తంగా ఉండాలి. ఎంపీలకు ఎర వేయడానికి... పార్టీల్లో చీలికలు తేవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. అన్నీ చూసుకోండి. బీజేపీ వచ్చే అవకాశం లేదని తెలిస్తే మెజారిటీ పార్టీలు మన వైపు తిరుగుతాయి. రకరకాల ప్రతిపాదనల పేరుతో వాటిని చీల్చడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కొత్త కొత్త ఫ్రంట్లను తెరపైకి తెస్తారు. తాను నేరుగా అధికారంలోకి రాకపోయినా తన ప్రభావం ఉండే ప్రభుత్వం ఏర్పడాలని అయినా బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇవన్నీ చూసుకోవాలి. మనం టచ్‌లో ఉందాం’’ అని ఆయనతో చంద్రబాబు చెప్పారు. ఈ భేటీ తర్వాత దొరై మురుగన్‌ తన సతీమణితో కలిసి విజయవాడలో కనకదుర్గ దేవాలయాన్ని సందర్శించి అనంతరం చెన్నై వెళ్లిపోయారు.

stalin 15052019

ఏదేమైనా జాతీయ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో చంద్రబాబు గతంలో చేసిన ప్రయత్నాలు సఫలం అయిన సందర్భాలున్నాయి. కేసీఆర్ తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. 16కు 16 స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో తాము చెప్పిన వ్యక్తే ప్రధాని అవుతారనే ప్రచారాన్ని టీఆర్‌ఎస్ జోరుగా చేస్తోంది. బీజేపీ వ్యతిరేక కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. ఆ కూటమిలో తమ పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి ఎన్డీయే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే వైసీపీ అధినేత జగన్ బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీతో పాటు తమిళనాడులో అన్నాడీఎంకే కూడా బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశాలు లేకపోలేదు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు హైదరాబాద్ పర్యటనకు వెళ్లారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యేందుకు వెళ్లారు. చంద్రబాబునాయుడు, నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుని, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుతో ఏకాంతంగా సమావేశం అయ్యారు. ఫిల్మ్ సిటీలోనే జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన రామోజీరావును కలిశారు. వీరిద్దరి మధ్యా చర్చల సారాంశం బయటకు వెల్లడికానప్పటికీ, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై చర్చలు జరిగినట్టు సమాచారం. మధ్యాహ్నం తరువాత చంద్రబాబు తిరిగి అమరావతి బయలుదేరనున్నారు. ఇదే కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పాల్గుంటారనే సమాచారం ఉన్నా, ఇప్పటికీ క్లారిటీ రాలేదు.

ramoji 15052019

ఎన్నికల ఫలితాల వెల్లడి తేదీ సమీపిస్తున్న కొద్దీ దేశ రాజకీయాల్లో చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2014 ఎన్నికల్లో వచ్చిన విధంగా బీజేపీకి స్వతహాగా, ఏ పార్టీ అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లు రావని కాంగ్రెస్, బీజేపీ మిత్ర పక్షాలు అంచనా వేస్తున్నాయి. ఎన్డీయే ఈసారి అధికారం చేజిక్కించుకోవాలంటే మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి కావచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ కూడా తమతో కలిసొచ్చే పార్టీల మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉంది. ఏపీలో టీడీపీ కూడా యూపీఏ ఫ్రంట్‌కు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకుంది.

 

ramoji 15052019

ఇక టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌తో కలిసొచ్చే పార్టీలను కలుపుకుపోయేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఈ ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్‌కు స్టాలిన్ ఆదిలోనే షాకిచ్చారు. కేసీఆర్ తనతో కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యారని, థర్డ్ ఫ్రంట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదని.. తమ మద్దతు యూపీఏకే ఉంటుందని స్టాలిన్ స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్‌ ఫ్రంట్ ప్రయత్నాలకు స్టాలిన్ ఆదిలోనే షాకిచ్చినట్టయింది. స్టాలిన్ తన ప్రతినిధిని అమరావతికి పంపి.. కేసీఆర్‌తో జరిగిన భేటీ గురించి చంద్రబాబుకు వివరణ ఇవ్వడంతో ఈ ఎపిసోడ్‌కు తెరపడింది. ఇప్పుడు చంద్రబాబు రామోజీతో భేటీ కావటం, రాజకీయ వర్గాల్లో చర్చనీయంసం అయ్యింది.

 

మే 10వ తేదీన టీవీ9 కార్యాలయంలోకి రోజూ మాదిరిగానే వెళుతున్న రవిప్రకాష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోపల వాటాదారుల సమావేశం జరుగుతోందని, బలవంతంగా కార్యాలయంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే కస్టడీలోకి తీసుకుంటామని రవిప్రకాష్‌కు పోలీసులు బదులిచ్చారు. అనంతరం టీవీ9 సీఈవో బాధ్యతల నుంచి రవిప్రకాష్‌ను కొత్త యాజమాన్యం తొలగించడం, కొత్త సీఈవోను ప్రకటించడంతో టీవీ9తో రవిప్రకాష్‌కు ఉన్న అనుబంధం దాదాపుగా తెగిపోయింది. అప్పటి నుంచి రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపినా స్పందిచలేదు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. నేడు విచారణకు హాజరుకాని పక్షంలో అరెస్ట్ తప్పదనే ప్రచారం కూడా జరుగుతోంది.

revanth 15052019

ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు రవిప్రకాష్ అజ్ఞాతం నుంచే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఎక్కడున్నారో తెలియదు గానీ ఆయన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను బయటపెట్టారు. మై హోం రామేశ్వరరావు 2016లోనే టీవీ9ను దక్కించుకోవాలన్న ఉద్దేశంతో తమను సంప్రదించినట్లు రవిప్రకాష్ చెప్పారు. అయితే.. అందుకు తాను అందుకు అంగీకరించలేదని ఆయన తెలిపారు. రామేశ్వరరావు ఆలోచన వెనుక రాజకీయ అజెండా ఉందని, పైగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, ఆయన చినజీయర్ స్వామి అనుచరుడని తెలిపారు. తన రాజకీయ, సైద్ధాంతిక సిద్ధాంతాలను జొప్పించే ఉద్దేశంతో టీవీ9ను టేకోవర్ చేసుకోవాలని భావించారని, అందుకే తాను ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని రవిప్రకాష్ చెప్పారు.

revanth 15052019

2018 సెప్టెంబర్‌లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ రైడ్స్ జరిగినప్పుడు తాను అమెరికాలో ఉన్నానని, ఆ సమయంలో తనకు న్యూస్‌రూమ్ నుంచి కాల్ వచ్చిందని రవిప్రకాష్ చెప్పారు. రేవంత్ రెడ్డి వార్తను ఎలా కవర్ చేయాలో రామేశ్వరరావు కుమారుడు, సోదరుడు డిక్టేట్ చేస్తున్నారని ఫోన్‌ చేసి తన స్టాఫ్ చెప్పినట్లు రవిప్రకాష్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రేవంత్ రెడ్డి వారికి రాజకీయ శత్రువు కావడంతో, ఆయనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వారు ప్రయత్నించారని రవిప్రకాష్ చెప్పారు. ఏప్రిల్ 18, 2019న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయని, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలను ప్రశ్నిస్తూ తాను కథనాన్ని ప్రసారం చేశానని రవిప్రకాష్ చెప్పారు. ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదని, అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. https://www.thenewsminute.com/article/battle-tv9-founder-ravi-prakash-says-businessman-staged-coup-wants-editorial-control-101798

 

 

Advertisements

Latest Articles

Most Read