కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు- టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ మధ్య వివాదానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడేట్లు లేదు. ఇప్పటికే యార్లగడ్డకు లేఖ రాసి.. పలు ఇంటర్వ్యూల్లో ఈ వ్యవహారం వల్లభనేని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు వైసీపీ అభ్యర్థి సైతం మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదం గురించి మాట్లాడారు. అయితే తాజాగా వంశీ మరోసారి యార్లగడ్డకు లేఖ రాశారు. ఈ లేఖతో గన్నవరంలో మరోసారి వైసీపీ వర్సెస్ టీడీపీ అయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు.. వంశీపై పెట్టిన మీడియా సమావేశానికి ప్రతిస్పందనగా ఈ లేఖ రాశారు.

vamsi 16052019

వంశీ లేఖ యథావిథిగా... "ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేందుకు మీ ఇంటికొస్తానన్న ఇన్ని రోజుల నుంచి నేను నగరంలో లేకపోవడం వల్లే నేను నువ్వు పెట్టిన విలేకర్ల సమావేశంపై స్పందించలేకపోయాను. గన్నవరాన్ని అమెరికాలోని డల్లాస్ నగరంలో పోల్చడం చాలా అభినందనీయం. అందుకే నిన్ను అభినందించడానికే మీ ఇంటికొద్దామని అనుకున్నా. ఓదార్పు యాత్ర చేస్తోన్న సమయంలో ప్రజలను ముద్దాడుతూ వారి ఆశీస్సులు కోరుతూ చేసిన యాత్ర భారతదేశంలో ఎవ్వరు చేయలేదు. గవర్నమెంట్ జీవో ద్వారానే బ్రహ్మలింగం చెరువును పూడిక తీశాం. గన్నవరంలోని బ్రహ్మలింగం చెరువు పూడికతీయడానికి రూ150 కోట్ల నిధులు అవసరం.. చెరువులో పూడికతీసిన మట్టిని రవాణా చేసేందుకు ఖర్చు చాలా అవుతుంది. దీనిపై మీకేమైన అభ్యంతరాలుంటే ఎఫ్.ఐ.ఏ ద్వారా లేదా సీ.బీ.ఐ ద్వారా దర్యాప్తుచేయించుకోవచ్చు. ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడకుండా బ్రహ్మలింగం చెరువులో పూడిక తీసిన మట్టిని జాతీయ రహదారుల నిర్మాణానికి, ఎయిర్ పోర్ట్‌లో రన్‌వే విస్తరణ కోసం ఉపయోగించాము. దీనివల్ల సర్కార్‌కు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ప్రభుత్వానికి అనుకున్నదాని కంటే ఆదాయం సమకూరింది. నువ్వ అన్నమాటలకు కట్టుబడి ఉంటావని నేను నమ్ముతున్నాను. నువ్వు అన్న మాటలను ఎప్పుడూ యూటర్న్ తీసుకోవద్దు" అని వంశీ లేఖలో పేర్కొన్నారు.

vamsi 16052019

"ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని కుమారుడిగా నా వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కించపరుచుకోలేదు. నాపై తప్పుడు కేసులు బనాయించి నన్ను ఇరుకునపెట్టి అరెస్ట్ చేయించాలని చూస్తున్నావ్. పోలీసులు ఈ పని చేస్తారని నువ్వు అనుకుంటున్నావా..?. నువ్వు ఒకటి స్పష్టం చేయాలి.. వరకట్న వేధింపుల కేసు నీపై నమోదైందా లేదా..? నీ సతీమణి నా మాటలు విని నీపై కేసు పెట్టిందని నువ్వు నమ్ముతున్నావా..? అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నావ్..? ఏదన్న మాట్లాడే ముందు ఒక్కసారి క్రెడిబులిటినీ సరిచూసుకో. నీకు సంబంధించిన వ్యక్తిగత అంశాలు, కేసులపై మరోసారి మాట్లాడాలని నేననుకోవడం లేదు. నేను నా భార్యను కలిసి వైఎస్ జగన్‌ను బెంగళూరులో కలిశానని నువ్వు చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికైనా గన్నవరంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుతావని నేను ఆశిస్తున్నా. విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసే ముందు నీవు నాకు ఒకసారి ఫోన్ కాల్ చేసి ఉంటే బాగుండేది" అని వంశీ లేఖలో పేర్కొన్నారు. కాగా.. ఈ లేఖపై వైసీపీ నేతలు.. యార్లగడ్డ వెంకట్రావు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

 

 

అఖిలపక్షం నేతలు ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం టీడీపీనేత సీఎం రమేశ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్ ఈసీ తీరుపై ఆగ్రహంతో రగిలిపోతూ మాట్లాడుతుండగా, ఓ విలేకరి అడిగిన ప్రశ్నతో ఆయనలో కోపం కట్టలు తెంచుకుంది. నీకేమైనా బుద్ధి ఉందా? తెలిసే మాట్లాడుతున్నావా? అంటూ మండిపడ్డారు. ఏదైనా ప్రశ్న అడిగే ముందు అన్నీ విషయాలు సరిచూసుకుని మాట్లాడాలని హితవు పలికారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎన్ని సార్లు పోలింగ్ పెట్టినా ఓట్లేస్తారని, కానీ ఎన్నికల సంఘానికి ఇలా రీపోలింగ్ లు పెట్టుకుంటూ పోవడమేనా పని? అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ramesh 16052019

తాము పోలింగ్ జరిగిన 11వ తేదీనే కొన్నిచోట్ల రీపోలింగ్ కోరామని, అయితే ఈసీ పట్టించుకోలేదని అన్నారు. ఏపీలో చంద్రగిరి అంశంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదు చీఫ్ సెక్రటరీకి వెళ్లిందని తెలిపారు. వాస్తవానికి సీఎస్ కు ఈ వ్యవహారంలో సంబంధం లేదని అన్నారు. కానీ చెవిరెడ్డి నేరుగా ఈసీకి ఫిర్యాదు చేయకపోయినా, ఆయన సీఎస్ కు చెప్పినదాన్ని ఫిర్యాదుగా తీసుకున్నారని మండిపడ్డారు.

ramesh 16052019

అయితే ఈసీ దీనిపై ఎలాంటి విచారణ లేకుండానే రీపోలింగ్ జరపాలని ఎలా నిర్ణయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఐదు పోలింగ్ కేంద్రాలు ఎప్పట్నించో టీడీపీకి అనుకూలంగా ఉన్న బూత్ లని, ఇక్కడ టీడీపీకి ఏకపక్షంగా ఓట్లు పడే అవకాశాలున్నాయని అన్నారు. ఈసీ తమకందిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ జరపకుండా రీపోలింగ్ కు ప్రకటన చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా బీజేపీ అదుపాజ్ఞల్లోనే నడుస్తుందని సీఎం రమేశ్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ విషయంలో ఈసీఐ అడ్డంగా దొరికిపోయిందని, ఫలితాల అనంతరం ఈసీఐ పనిబడతామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఈసారి పెట్టినంత వ్యయం గతంలో ఎన్నడూ పెట్టలేదని సీనియర్‌ నాయకులే చెబుతున్నారు. ఇలా ఖర్చు చేయాలంటే తమ వల్ల కాదని కొందరు చేతులెత్తేశారు. ఏం చేస్తే తిరిగి అన్ని కోట్ల రూపాయలు వెనక్కి వస్తాయని మరికొందరు లబోదిబోమన్నారు. అయితే ఎన్నికల కమిషన్‌కు మాత్రం పెద్దగా ఖర్చు కాలేదు అంటూ లెక్కలు చూపించారు. ఎన్నికల సంఘం అభ్యర్థుల వ్యయానికి సంబంధించిన ఒక పరిమితి విధించింది. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులైతే రూ.28 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులైతే రూ.70 లక్షల వరకు ఖర్చు చేయవచ్చునని పేర్కొంది. అంతకు మించి ఖర్చు చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించింది. బ్యాంకు ఖాతా తెరిచి, అందులో సొమ్ము డిపాజిట్‌ చేసి, దేనికైనా అందులో నుంచే చెల్లింపులు జరపాలని సూచించింది.

pk 16052019

ఏ రోజు ఖర్చు ఆ రోజే చూపించాలని ఆదేశించింది. అభ్యర్థులు సమర్పించే లెక్కలు సరైనవా? కావా? వారు ఎక్కువ ఖర్చు చేసి, తక్కువ చూపిస్తున్నారా? అనే విషయం తెలుసుకోవడానికి నిఘా బృందాలను ఏర్పాటుచేసింది. ఇలా 18 బృందాలు రంగంలో దిగి అభ్యర్థులు ఎలాంటి ఖర్చు చేస్తున్నారో ఏ రోజుకారోజు లెక్కలు రాసుకున్నాయి. ప్రచారం ముగిసిన తరువాత అభ్యర్థులు కూడా తమ లెక్కలు సమర్పించారు. వాటిని చూసి అధికారులు బిత్తరపోయారు. కొందరు నిర్దేశించిన వ్యయంలో సగం కూడా ఖర్చు చేయలేదని లెక్కలు సమర్పించారు. విశాఖపట్నం జిల్లాలో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి అధమంగా రూ.10 కోట్ల నుంచి అత్యధికంగా రూ.40 కోట్ల వరకు వెచ్చించారు. ఇందులో ఓటర్లకు పంచిన డబ్బు సంగతి పక్కన పెట్టినా క్షేత్రస్థాయిలో చేసిన ఖర్చు రూ.5 కోట్లకు తక్కువ లేదు. అయితే అభ్యర్థులు అందులో పదో వంతు కూడా లెక్క చూపించలేదు.

pk 16052019

అలాగే పార్లమెంటుకు పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.40 కోట్లు చొప్పున ఖర్చు చేశారని ప్రచారం జరుగుతోంది. వారు కూడా రూ.50 లక్షలకు మించి వ్యయం కాలేదని నివేదికలు సమర్పించారు. వాటన్నింటినీ పరిశీలిస్తున్న బృందం తేదీల వారీగా ఎక్కడ ఎంత ఖర్చు చేసిందీ విశ్లేషించి, ప్రత్యేకంగా మరో నివేదిక రూపొందిస్తోంది. ఆ మేరకు లెక్కల్లో తేడాలున్నాయని, వాటికి సమాధానాలు ఇవ్వాలని నోటీసులు జారీచేస్తోంది. వీటిపై కౌంటింగ్‌ ముగిసిన తరువాత విచారణ జరుగుతుందని జిల్లా అధికారి ఒకరు తెలిపారు. పవన్ కళ్యాణ్ గాజువాకలో, రూ.8,39,790/- ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపించారు. మంత్రి గంటా ఖర్చు రూ.23,19,325, కేకే రాజు రూ.2,43,711, ముత్తంశెట్టి శ్రీనివాసరావు రూ.12,88,392 ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపించారు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఒక్కమాటలో సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే 2వారాల రెండు రోజుల్లో ఏపీలో అధికార పీఠం ఏ పార్టీదనే విషయం తేలిపోనుంది. అయితే.. వైసీపీలో కొందరి భవితవ్యంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అలాంటి వారిలో నగరి వైసీపీ అభ్యర్థి ఆర్‌కే రోజా ముందువరుసలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటి పరిస్థితులు వేరు, ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేసిన సమయానికి ఉన్న పరిస్థితులు వేరు. 2014 ఎన్నికల్లో నగరి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రోజా టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై 858 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. గెలిచిన విషయం తెలుసుకున్న ఆమె కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

game 27032019

కానీ.. 2019 ఎన్నికల్లో పోటీ చేసే నాటికి ఆమెపై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. నియోజకవర్గ సమస్యలను గాలికొదిలేసి కామెడీ షోలో కాలక్షేపం చేశారని రోజాపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు, వ్యవహార శైలి, హావభావాలతో ఆమె అభాసుపాలయ్యారు. అయితే.. ఎన్ని విమర్శలొచ్చినా పార్టీపరంగా జగన్ రోజాకు ప్రాధాన్యం ఇవ్వడంతో వైసీపీ అధికారంలోకి వచ్చి, నగరి ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందితే మంత్రి పదవి ఖాయమని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అయితే.. నగరిలో రోజా గెలుపు అంత సునాయాసం కాదనే ప్రచారం జరుగుతోంది. 2014 నాటి పరిస్థితులు ప్రస్తుతం లేవని, అప్పట్లో రెండు సార్లు ఓడిపోయారన్న సానుభూతి కూడా రోజాకు కలిసి రావడంతో గత ఎన్నికల్లో ఆమె స్వల్ప ఆధిక్యంతో గెలిచారనేది టీడీపీ వాదన.

 

game 27032019

నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యేగా రోజా విఫలమయ్యారని.. టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ గెలుపు ఖాయమని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అదే జరిగి.. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి, రోజా ఓడిపోతే ఆమె రాజకీయ భవిష్యత్ ఏంటనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇక గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై ఇదే తరహా ప్రచారం జరుగుతోంది. ఈ అభ్యర్థులకు పార్టీ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని కరాఖండిగా చెబుతున్న వైసీపీ శ్రేణులు పార్టీ ఓడి, ఈ అభ్యర్థులు కూడా ఓడితే పరిస్థితి ఏంటనే ప్రశ్నకు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేక నీళ్లునములుతున్నారు.

గతంలో ఎంపీగా పనిచేసిన ఆ అభ్యర్థి మళ్లీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికలకు ముందు తన బంధువులతో సహా వెళ్లి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. తాను పోటీచేయబోయే పార్లమెంట్‌ స్థానం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు అయ్యే ఖర్చంతా కూడా తానే పెట్టుకుంటానని గట్టిగా నమ్మబలికారు. తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి.. నామినేషన్లు పూర్తయ్యాక అయ్యగారు అసలు విషయం చల్లగా చెప్పారు. తనవద్ద పెద్దగా డబ్బులు లేవనీ, తననుంచి ఏమీ ఆశించవద్దనీ అసెంబ్లీ అభ్యర్థులకు స్పష్టంచేశారు. దీంతో ఆ ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు ఎవరి తిప్పలు వారు పడ్డారు. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

ycp 16052019

తనకు పరిచయం ఎక్కువగా ఉన్న రెండు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఒకరోజు ఉదయం ఆయన తన వద్దకు పిలిపించుకున్నారట. బ్రేక్‌ఫాస్ట్ పెట్టి వారిని బాగా దువ్వారట. "మీరు పోటీచేసే రెండు అసెంబ్లీ స్థానాల్లో నాకు విస్తృతంగా అనుచరగణం ఉంది. పైగా ఒక అసెంబ్లీ స్థానం నా సొంత నియోజకవర్గం'' అని వారికి చెప్పుకొచ్చారట. "ఆ రెండు స్థానాల్లో మీరు పంచాలనుకుంటున్న డబ్బులు నాకే ఇవ్వండి. నా డబ్బులతోపాటు మీ డబ్బులు కూడా కలిపి ఓటర్లకు పంపిణీ చేస్తాను'' అని వారిని నమ్మించారట. పాపం! రాజకీయాలకు కొత్తయిన ఆ అమాయక అభ్యర్థులు ఇరువురూ ఎంపీ అభ్యర్థి మాటలకు బుట్టలో పడ్డారట. ఓటర్లకు తాము పంచాలనుకున్న డబ్బును పెద్ద మొత్తంలోనే ఆయనకు సమర్పించుకున్నారట.

ycp 16052019

పోలింగ్‌కు అయిదు రోజుల సమయం ఉన్న తరుణంలో ఓటర్లకు డబ్బు పంపిణీ జరగలేదని అసెంబ్లీ అభ్యర్థులకు తెలిసింది. వెంటనే వారు సదరు ఎంపీ అభ్యర్థి దగ్గరకు వెళ్లి సంగతేమిటని నిలదీశారు. దీంతో ఆయన డబ్బు పంపిణీ చేసినంటూ బుకాయించారట. పోలింగ్‌కు రెండ్రోజుల ముందు పార్టీ శ్రేణులు తమకు డబ్బులు అందలేదనీ, ఓటర్లకు పంచలేదనీ ఆ ఇద్దరు అసెంబ్లీ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చారట. దీనిపై పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వెంటనే వైసీపీ కేంద్ర కార్యాలయం ఈ విషయంపై ఆరాతీసింది. అప్పుడు తెలిసిందట అయ్యగారి అసలు నిర్వాకం. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తాను డబ్బులు పంపిణీ చేశానంటూ మరోసారి బుకాయించారట. ఆయనదంతా బుకాయింపేనని పార్టీ పెద్దలు గ్రహించారట. అప్పటికే సమయం మించిపోవడంతో కొంత మొత్తాన్ని ఆ అభ్యర్థులు ఇద్దరికీ సర్దుబాటు చేశారట. ఈ డబ్బు కూడా పూర్తిస్థాయిలో ఓటర్లకు చేరకపోవడంతో అసెంబ్లీ అభ్యర్థులు డీలాపడ్డారు. ఆ ఎంపీ అభ్యర్థి తమకు సహాయం చేయకపోగా, నిండా ముంచేశారని ఇప్పుడు వారు బోరుమంటున్నారు. వైసీపీ అధినేత జగన్‌కు కూడా సదరు ఎంపీ అభ్యర్థిపై ఫిర్యాదు చేశారు.

 

More Articles ...

Advertisements

Latest Articles

Most Read