సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు 2002లో గోద్రా అల్లర్లు చెల రేగిన విషయం తెలిసిందే. భోపాల్‌లో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. గోద్రా అల్లర్ల తరువాత బీజేపీలో జరి గిన పరిణామాలు గురించి ప్రస్తావించారు. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వెనక్కి తగ్గకపోయి ఉంటే మోడీ కథ అప్పుడే ముగిసేదని యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. దేశాన్ని కుదిపేసిన గోద్రా అల్లర్ల కేసులో నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీతో రాజీ నామా చేయించాలని వాజ్‌పేయి భావించారని గుర్తు చేశారు. మోడీ గనుక రాజీనామాను తిరస్కరిస్తే ఏకం గా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయానికి వాజ్‌పే యి వచ్చినట్టు సిన్హా తెలిపారు.
అయితే మోడీకి అప్పటి కేంద్ర హోంమంత్రి అద్వానీ రూపంలో పెద్ద అండ దొరి కిందని అన్నారు. మోడీని పదవి నుంచి తప్పిస్తే తాను కేంద్ర మం త్రి పదవికి రాజీనామా చేస్తానని అద్వానీ బెదిరించడంతో వాజ్‌పే యి వెనక్కి తగ్గారని సిన్హా చెప్పు కొచ్చారు. ఆ రోజు కనుక వాజ్‌పేయి వెనక్కి తగ్గకుం టే మోడీ కథ అప్పుడే ముగిసుండెెదని యశ్వం త్ సిన్హా తెలిపారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్‌ను దుర్వినియోగానికి పాల్పడ్డారని మోడీ చేస్తున్న ఆరొపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ విషయంలో నౌకా దళ మాజీ అధికారులు వివ రణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ప్రధాన మంత్రి స్థా యికి తగదని హితవు పలికారు.
లోక్ సభ ఎన్నికలు ప్రధాని మోడీ ప్రభు త్వ పనితీరుకు మాత్రమే జరుగు తున్నాయని అన్నారు. కానీ దేశ చరిత్రకు కాదని యశ్వంత్ పేర్కొ న్నారు. పాకిస్తాన్ సమస్యను ఎన్నికల్లో ప్రస్తావించడం దురదృ ష్టకరమని, పాక్ ఏమైనా మన దేశం లో అంత ర్భాగమా..? అని ప్రశ్నించారు. పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్నారు కానీ చైనా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎందు కంటే చైనా వీటిని పట్టించుకోదని అన్నారు. మోడీ తన ఎన్నికల ప్రచారంలో మాటిమాటికీ పాకి స్తాన్ గురించి ప్రస్తావిస్తున్నారని, పాక్‌తో మనకు పోటీయా..? అని ప్రశ్నించారు.