సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రచారంలో కాంగ్రెస్ పార్టీతోపాటు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ప్రతాప్‌గఢ్ సభలో మోదీ మాట్లాడుతూ.. రాజీవ్ జీవితం అవినీతి నెం.1గా ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. గురువారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్‌పై విమర్శలు గుప్పించడమే కాదు, దళితుడైన ఉమ్మడి ఏపీ ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్యను రాజీవ్ ఘోరంగా అవమానించారని విమర్శించారు. మోదీ వ్యాఖ్యలపై అంజయ్య మనవడు, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ సెక్రెటరీ అభిషేక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అంజయ్యను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదేపదే ‘దళితుడు’ అని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అభిషేక్‌రెడ్డి తెలిపారు.

anjayyamodi 12052019

దళితుడు అయినందుకే అంజయ్యను నాటి ప్రధాని రాజీవ్‌ విమానాశ్రయంలో అవమానించారని పార్లమెంటు సాక్షిగా మోదీ వ్యాఖ్యానించారని, తాజాగా గురువారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ప్రస్తావించారని తెలిపారు. న్నికల్లో దళితుల ఓట్లు పొందడానికే మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వాస్తవానికి అంజయ్య అసలు పేరు రామకృష్ణారెడ్డి అని, దళితుడు కాదని పలుమార్లు వివరణ ఇచ్చినా..ప్రధాని ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. అంజయ్యను రాజీవ్‌గాంధీ ఎయిర్‌ పోర్టులో అవమానించలేదని, ప్రధాని పదవిలో ఉండి ప్రజలకు తప్పుడు సమాచారం అందజేస్తున్నారని విమర్శించారు. దీనిపై అన్ని వివరాలతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని అభిషేక్‌రెడ్డి వివరించారు.

anjayyamodi 12052019

అంజయ్య అసలు పేరు రామకృష్ణారెడ్డి అని, ఆయన ఓసీ అని అంజయ్య మనుమడు అభిషేక్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు గాను పూర్తి వివరాలతో కూడిన ఒక నోట్‌ను త్వరలోనే ప్రధాని మోదీకి పంపుతామని ఆయన తెలిపారు. ఆయన ఓసీ అయినప్పటికీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డారని, పేదల పక్షపాతిగా ఉన్నందుకే అంజయ్యను అందరూ దళితడనుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఒక్క వర్గానికీ చెందిన వారు కాదని, అన్ని వర్గాల నాయకుడని తెలిపారు. అంజయ్య కులం విషయంలో తాము ఇప్పటికే బీజేపీ నాయకులకు వివరణ ఇచ్చామని అయినా వారు అలాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని మోదీ తన వైఖరికి మార్చుకోకపోతే కేసు వేస్తామని ఆయన హెచ్చరించారు. మరోవైపు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అంజయ్యను అవమానపరిచారనడం పూర్తి అవాస్తవమని అభిషేక్ కొట్టిపారేశారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని అభిషేక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై, మరోసారి తమ ద్వేష వైఖరిని బయట పెట్టింది తెలంగాణా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం.. కృష్ణా బోర్డుకు తెలిపింది. వేసవిలో తాగునీటి అవసరాల కోసం 3 టీఎంసీల నీటిని కేటాయించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌, బోర్డును కోరింది. రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, పై నుంచి నీరు రాకపోవటంతో, ప్రతి ఏడాదికి ఏపి తీవ్ర ఇబ్బందులు పడుతుందని, లేఖలో ప్రస్తావించారు. దీనిపై అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి బోర్డు సూచించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు శుక్రవారం బోర్డుకు లేఖ రాశారు.

telangana 12052019

‘ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తనకు కేటాయించిన దానికంటే ఎక్కువ నీటిని ఉపయోగించింది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లలో ఉపయోగించుకోవడానికి 10.383 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో నీటి ఆవిరి రూపంలో పోనూ, మిగిలే నీరు తెలంగాణకే చెందుతుంది. వేసవిలో మిషన్‌ భగీరథ, తాగునీటి అవసరాల కోసం ఈ నీరు తెలంగాణకు కావాల్సి ఉంటుంది. రిజర్వాయర్లలో మిగిలిన నీరు తెలంగాణకు కేటాయించిన కోటాలోనే ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీకి ఎలాంటి నీటి కేటాయింపుల్ని చేయవద్దు’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌ 423.428టీఎంసీలను ఉపయోగించుకుంటే.. తెలంగాణ 204.150టీఎంసీలను వాడుకుందని చెప్పారు. కాగా, తెలంగాణ లేఖను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వానికి బోర్డు శుక్రవారం లేఖ రాసింది.

telangana 12052019

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ఉండవలిసిన జగన్ మాత్రం, హైదరబాద్ లోటస్ పాండ్ లో ఎంజాయ్ చేస్తూ, ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కుంటున్న నీటి ఎద్దడి పై మాత్రం కనీసం స్పందించలేదు. చంద్రబాబు సియం హోదాలో, ఈ నీటి ఎద్దడి పై సమీక్ష చేస్తే, దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ కు చెప్పి, జగన్ మోహన్ రెడ్డి అడ్డుకున్న విధానం ప్రజలు చూసారు. చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగితే, ఎదో ఒక పరిష్కారం లభిస్తుందని తెలిసినా, జగన్ మాత్రం ఆయన్ను అడ్డుకున్నారు. పోనీ, జగన్ మోహన్ రెడ్డి ఏమైనా ప్రజల తరుపున మాట్లాడుతున్నారా అంటే అదీ లేదు. తనకు స్నేహితుడు అయిన కేసీఆర్ తో మాట్లాడి, అలా లేఖ రాయకండి, మా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, అని కేసీఆర్ తో మాట్లాడవచ్చుగా ? అలా కాకుండా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, ఈయన మాత్రం అదే హైదరాబాద్ లో సినిమాలు, షికార్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఐకానిక్‌ భవనాలుగా నిలవనున్న సచివాలయ టవర్ల నిర్మాణం వేగం పుంజుకుంది. నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికుల్లో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఎన్నికల్లో ఓటేయడానికి సొంతూళ్లకు వెళ్లారు. దీంతో పనులు కొద్దివారాలపాటు నెమ్మదించాయి. అలా సొంతూళ్లకు వెళ్లిన కార్మికులు అమరావతికి తిరిగొస్తుండటంతో నిర్మాణాలు పూర్వపు వేగం అందుకున్నాయి. వర్షాలు ప్రారంభమయ్యేనాటికి చుట్టూ నీరు చేరకుండా రిటైనింగ్‌ వాల్స్‌ను కట్టనున్నారు. ఇందుకోసం సాధ్యమైనంత ఎక్కువ పని చేయాలన్న లక్ష్యంతో కాంట్రాక్ట్‌ సంస్థలతో ఏపీసీఆర్డీయే వేగంగా పని చేయిస్తోంది. ఇప్పటికే టవర్‌-2కు సంబంధించిన రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం ప్రారంభమైంది. మిగిలిన 4 టవర్లకు చెందిన వాటిని కూడా త్వరలోనే మొదలు పెట్టేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. మరొకపక్క.. బ్యాంకులు, రెస్టారెంట్లు, తపాలా కార్యాలయాల్లాంటి ప్రజా వసతుల కోసం నిర్మించనున్న ‘నాన్‌ కోర్‌ ఏరియా’ పనులూ వేగంగా జరుగుతున్నాయి.

amaravati 12052019 1

సుమారు రూ.3,500 కోట్ల అంచనా వ్యయంతో, 69లక్షల చ.అ. భారీ విస్తీర్ణంతో, 5టవర్లుగా శాశ్వత సెక్రటేరియట్‌ నిర్మాణం కానున్న సంగతి తెలిసిందే. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ సముదాయం విస్తీర్ణం 6లక్షల చదరపు అడుగులే. దీనినిబట్టి శాశ్వత సచివాలయం ఎంతటి భారీదో ఊహించుకోవచ్చు. వచ్చే ఏడాది అక్టోబరుకల్లా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెక్రటేరియట్‌ టవర్లలో సచివాలయంతోపాటు సుమారు 145 విభాగాధిపతుల కార్యాలయాలుంటాయి. దేశంలో ఇదే మొదటిది. మొత్తం ఐదు టవర్లలో సీఎం, సీఎస్‌ ఉంటే జీఏడీ టవర్‌ 50 అంతస్తులతో, మిగతా నాలుగూ 40 టవర్లతో ఉంటాయి. పైన హెలిప్యాడ్‌ ఉండే జీఏడీ టవర్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (225 మీటర్లు) సచివాలయ భవనంగా నిలవబోతోంది.

amaravati 12052019 1

కోర్‌ వాల్‌ చుట్టూరా ఉండే ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేదికగా డయాగ్రిడ్‌ స్టీల్‌ కాలమ్స్‌ ఏర్పాటు చేసే పని కూడా వేగంగా సాగుతోంది. 15 నుంచి 18 టన్నుల బరువుండే ఈ భారీ కాలమ్స్‌ తయారీని భారత్‌కు చెందిన జేఎ్‌సడబ్ల్యూ సంస్థ, గల్ఫ్‌కు చెందిన ఎవర్‌ సెండాయ్‌ కంపెనీ చేపట్టాయి. 1, 2, 3, 4 టవర్లలో ఒక్కొక్కదానిలో అమర్చే కాలమ్స్‌లో వినియోగించే అత్యంత పటిష్ఠమై ఈ350బీఆర్‌ రకం స్టీల్‌ బరువు 10,000 టన్నుల నుంచి 12,000 టన్నుల వరకు, 50 అంతస్తులుండే 5వ టవర్‌లో 15,000 టన్నుల వరకు ఉండనుంది. 1, 2 టవర్లకు అవసరమైన స్టీల్‌ కాలమ్స్‌ను జేఎ్‌సడబ్ల్యూ బళ్లారిలో ఉన్న తమ కర్మాగారంలో తయారు చేసి, అమరావతికి చేర్చుతోంది. ఈ సంస్థలు స్టీల్‌ కాలమ్స్‌తోపాటు డయాగ్రిడ్‌ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన ఇతర స్టీల్‌ ఉత్పత్తులను కూడా రూపొందిస్తున్నాయి. కాగా, టవర్ల నిర్మాణం పూర్తి ప్రణాళికాబద్ధంగా, లోపరహితంగా, సంపూర్ణ నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా చూసేందుకు సీఆర్డీయే ఇంజినీర్లు, ఉన్నతాధికారులు ప్రతినిత్యం ప్రాజెక్ట్‌ సైట్‌లోనే నిపుణులతో వర్క్‌ షాపులు నిర్వహిస్తున్నారు.

అమెరికాకు చెందిన ప్రముఖ వీక్లీ ‘టైమ్‌’ మ్యాగజైన్‌ భారత ఎన్నికలపై ప్రత్యేకంగా అంతర్జాతీయ ఎడిషన్‌ను ప్రచురించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోను కవర్‌ పేజీగా ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ (భారత దేశాన్ని విభజించేవాడు) అనే శీర్షికతో యూరప్‌, ఆసియా, మధ్య ప్రాశ్చ్యం, దక్షిణ పసిఫిక్‌ అంతర్జాతీయ ఎడిషన్‌లలో స్టోరీ ప్రచురించింది. ఈ కథనాన్ని అతిష్‌ తసీర్‌ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాయగా తనపై బీజేపీ ప్రతీకార చర్యలకు దిగింది. తసీర్ వికీపీడియాలో ఆతిష్ తసీర్ పేరిట ఉన్న పేజీలో సమాచారాన్ని మార్చివేసి తసీర్ టైమ్ మ్యాగజైన్ తో పాటు పలు అంతర్జాతీయ పత్రిలకు ఫ్రీలాన్స్ పాత్రికేయుడిగా పనిచేస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పీఆర్ మేనేజర్ గా కూడా వ్యహరిస్తున్నారంటూ సెటైర్ వేస్తూ తప్పుడు సమాచారం జోడించారు. టైమ్ మ్యాగజైన్ పైనా బీజేపీ నేతలు మండిపడుతుండగా సోషల్ మీడియాలో కాషాయదళాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

time author 12052019

కాగా తసీర్ ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ స్టోరీలో ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యం మరో ఐదేళ్లు మోడీ ప్రభుత్వాన్ని భరించగలదా..? అన్న హెడ్‌లైన్‌తో నెహ్రూ, మోడీకి మధ్య వ్యత్యాసం గురించి, మోడీ హయాంలో హిందు-ముస్లిం సంబంధాలు, మోడీని తిట్టడం ద్వారా హిందూ అనుకూలమైన వ్యక్తులుగా నిరూపించుకోవడం, మోడీ ప్రభుత్వ హయాంలో వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, క్రిస్టియన్లు అవమానాలు ఎదుర్కొన్నారని, 2014 ఎన్నికల సందర్భంగా ఆర్థికపరమైన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యారని, మోడీ ప్రధాని అయ్యాక ఆర్థికంగా ఎలాంటి అద్భుతాలు జరగలేదని, భారత దేశంలో నేషనలిజం అనే అంశం పెరిగిందే తప్పా, ఎలాంటి అభివృద్ధి జరగలేదని, మాజీ ప్రధాని నెహ్రు లౌకికవాదాన్ని, మోడీ హయాంలో ప్రబలుతున్న సామాజిక ఉద్రిక్తతతో పోల్చుతూ తసీర్‌ కథనం సాగింది.

time author 12052019

ఇదే టైం మ్యాగజైన్ మోదీ ముఖచిత్రంతో ‘వై మోదీ మ్యాటర్స్’ అంటూ గొప్పదనాన్ని కీర్తిస్తూ 2015లో స్టోరీ రాసుకొచ్చింది. అప్పుడు ఇదే బీజేపీ నేతలు కూడా ఇలాంటి మ్యాగజైన్ ప్రపంచంలోనే లేదంటూ ఆకాశానికి ఎత్తేశాయి. అదే మ్యాగజైన్ ఇప్పుడు నాలుగేళ్ళలో మోడీ వైఫల్యాలను ఎండగడితే తిట్లదండకాన్ని అందుకోవడం విశేషం. స్టోరీ రాసిన జర్నలిస్టుకు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా విమర్శలు గుప్పించడంతో పాటు ఆయనకు సంబంధించిన అంశాలను వక్రీకరించి పబ్లిసిటీ చేస్తున్నారు. కాగా నాలుగేళ్ళలో మోడీ పరిస్థితి ఏంటో ఉదాహరణే ఈ మ్యాగజైన్ అని, ఇప్పుడు మోడీ నిజస్వరూపం బయటపడుతుందని ప్రతిపక్షాలు బీజేపీ-మోడీలపై సెటైర్లు వేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read